థర్డ్‌ హ్యాండ్‌ కారు.. వర్షం వస్తే కారులో వాటర్‌ లీకేజీ.. | Kartik Aaryan Bought Third Hand Car During Struggle Days | Sakshi
Sakshi News home page

థర్డ్‌ హ్యాండ్‌ కారుతో హీరో కష్టాలు.. డోర్‌ తెరుచుకోకపోవడంతో..

Published Sun, Jun 23 2024 5:45 PM | Last Updated on Sun, Jun 23 2024 6:15 PM

Kartik Aaryan Bought Third Hand Car During Struggle Days

ఆ కారు నన్ను చాలా సతాయించేది. డ్రైవర్‌ సీటు దగ్గర ఉండే డోర్‌ ఓపెన్‌ అయ్యేది కాదు. అవతలి డోర్‌ తెరుచుకుని బయటకు వచ్చేవాడిని. వర్షాలు పడ్డప్పుడయితే

మార్కెట్‌లోకి కొత్తగా ఫోన్లు, కార్లు వస్తున్నాయంటే చాలు వాటిని కొనేందుకు సిద్ధమయ్యేవారు చాలామందే ఉన్నారు. అలా సినిమా హీరోల గ్యారేజీలో ఎప్పటికప్పుడు కొత్త కార్లు చేరుతూనే ఉంటాయి. అయితే బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ మాత్రం ఒకప్పుడు కొత్త కారు కొనే స్థోమత లేక థర్డ్‌ హ్యాండ్‌ కారు వాడాడు.

థర్డ్‌ హ్యాండ్‌ కారు
ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైన కార్తీక్‌ ఆర్యన్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను ఓ వ్యక్తి వాడిన కారు కొన్నాను. కానీ అది అతడికే సెకండ్‌ హ్యాండ్‌ కారు. అలా నేను థర్డ్‌ హ్యాండ్‌ కారు వాడాను. అవార్డుల కార్యక్రమానికి, ప్రత్యేక ఈవెంట్లకు వెళ్లేందుకు ఆ కారు ఉపయోగించేవాడిని. ఆ కారు నన్ను చాలా సతాయించేది. డ్రైవర్‌ సీటు దగ్గర ఉండే డోర్‌ ఓపెన్‌ అయ్యేది కాదు. అవతలి డోర్‌ తెరుచుకుని బయటకు వచ్చేవాడిని. వర్షాలు పడ్డప్పుడయితే పరిస్థితి దారుణంగా ఉండేది. నీళ్లు లోపలకు వచ్చేవి. డ్రైవింగ్‌ చేస్తుండగా ఆ నీళ్లు నెమ్మదిగా లీకై నా నెత్తిన పడేవి అని చెప్పుకొచ్చాడు.

కార్లు
కాగా కార్తీక్‌ ఆర్యన్‌.. ఇద్దరు వాడిన కారును యూజ్‌ చేసే స్థాయి నుంచి లగ్జరీ కారు కొనే రేంజ్‌కు ఎదిగాడు. ప్రస్తుతం ఇతడి దగ్గర మూడున్నర కోట్లు విలువ చేసే మెక్‌లారెన్‌ జీటీ, రూ.4.17 కోట్లు విలువ చేసే రేంజ్‌ రోవర్‌ అలాగే ఓ లంబోర్గిని ఉన్నాయి. 2011లో ప్యార్‌ కా పంచనామా సినిమాతో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన ఇతడు ప్రస్తుతం టాప్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవలే భూల్‌ భులయా 2, సోను కీ టిటు కి స్వీటి, చందు ఛాంపియన్‌ సినిమాలతో సక్సెస్‌ అందుకున్నాడు.

చదవండి: అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్‌? నటి కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement