అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్‌? నటి కౌంటర్‌ Richa Chadha: Older Ladies Saying They are Natural After 10 Surgeries | Sakshi
Sakshi News home page

పది సర్జరీలు చేయించుకున్నావ్‌.. మళ్లీ నేచురల్‌ అని పోజులు.. అదితి గురించేనా?

Published Sun, Jun 23 2024 4:16 PM | Last Updated on Sun, Jun 23 2024 5:47 PM

Richa Chadha: Older Ladies Saying They are Natural After 10 Surgeries

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ అందంగా కనిపించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు.. ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు. అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో బాలీవుడ్‌ నటి రిచా చద్దాను విమర్శించినట్లున్నారు.

అక్కా.. నాకు చెప్పకు
ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. 'మరేం లేదు.. కొందరికి ఒంటినిండా విషమే! వయసు ‍పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి. అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

అదితి గురించేనా?
ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది. కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.

ఆన్‌స్క్రీన్‌.. ఆఫ్‌స్క్రీన్‌.. అదే డ్రామా
'హీరామండి వెబ్‌ సిరీస్‌లో ఎంత డ్రామా జరిగిందో ఆఫ్‌ స్క్రీన్‌లో అంతే డ్రామా నడుస్తోంది. రిచా చద్దా.. షర్మిన్‌ సెగల్‌ను ట్రోల్‌ చేసింది. షర్మిన్‌.. సంజీదా షైఖ్‌ను అవుట్‌సైడర్‌ అని మాట్లాడింది. ఇప్పుడు రిచా.. అదితిరావు మీద సెటైర్లు వేస్తోంది' అని ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. 'అదితినే అంటోందని క్లియర్‌గా తెలుస్తోంది.. అయినా రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్‌లా మారుతోంది' అని మరో యూజర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం గర్భిణి అయిన రిచా చద్దా జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

చదవండి: అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌.. బంగారం వడ్డించారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement