Richa Chadha
-
'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్ ఫైర్
బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్‌క్లబ్‌లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్ తాగి.. నైట్ క్లబ్ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్‌గా రాశారు. అంతేకాదు క్లబ్‌ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!
బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ మధ్యనే జూలై లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి, ఏడాది క్రితం వరకు ఆమె – పిల్లల్ని అస్సలు కనకూడదనే అనుకున్నారు! ఆమెలోని ఎకో యాంగ్జైటీనే అందుకు కారణం. ‘ఇంతటి విపరీతమైన వాతావరణ మార్పుల్లో పిల్లల్ని భూమి మీదకు తెచ్చిపడేయటం ఎలారా దేవుడా.. ‘అని ఆకాశం వైపు దీనంగా చూసేవారట రిచా. ఉదయ లేస్తూనే భూతాపం గురించి ఆలోచించటం, లేచాక కిటికీ లోంచి పొల్యూషన్ లోని తీవ్రతను అంచనా వేయటం రిచాకు అలవాటైపోయింది. ‘మొన్నటి వరకు అతి వేడి. ఇప్పుడు అతి చలి. ఈ మార్పులు నా బిడ్డపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాను. తనకు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ వే. అలాంటి కొన్ని బేబీ ఐటమ్స్ ని నా స్నేహితురాళ్లు దియా మీర్జా, సోహా అలీ ఖాన్, ఇంకా నా పేరెంటల్ యోగా ఇన్స్ట్రక్టర్ నాకు కానుకగా ఇచ్చారు. నా చుట్టూ వాళ్లంతా నా ఆందోళనను కనిపెట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా పాప పెంపకంలో నాకు తోడ్పడుతున్నారు. టిప్స్ ఇస్తున్నారు’ అని ‘ఓగ్స్ ఇండియా‘కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు రిచా. ఇక ఆమె భర్త అలీ ఫజల్ గురించి చెప్పే పనే లేదు. ఈ ’మీర్జాపుర్ ’ యాక్టర్.. సింగిల్ యూస్ లాస్టిక్కి ఎప్పట్నుంచో వ్యతిరేకి. భార్యాభర్తలు షాపింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ యాకేజీల్లో ఏ రూపంలోనూ ప్లాస్టిక్ అన్నదే ఉండదు. బిడ్డ పుట్టాకయితే వాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. పిల్లలు పుట్టక ముందు నుంచే, పుట్టబోయేవారి సంరక్షణ గురించి, వారి కోసం భూతాపాన్ని తమ వంతుగా తగ్గించటం గురించి ఆలోచించే ఇటువంటి తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. భూమి తల్లి వారిని చల్లగా చూస్తుంది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి నటి!
బాలీవుడ్ నటి రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో గుడ్ న్యూస్ చెప్పిన నటి జూలై 16న కుమార్తె జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయంపై సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. మా పట్ల మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అభినందనలు చెబుతున్నారు.కాగా.. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. అయితే రిచా చద్దా, అలీ ఫజల్ మొదట 2021లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2023లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి గ్రాండ్‌గా మరోసారి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 9 ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. వీరిద్దరు 2012లో జంటగా నటించిన ఫక్రే మూవీ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు. View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా మాతృత్వపు మధురిమల కోసం ఎదురుచూస్తోంది. తాను గర్భం దాల్చిన విషయాన్ని ఫిబ్రవరిలో వెల్లడించిన ఈమె తాజాగా మెటర్నటీ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రిచా, ఆమె భర్త బేబీ బంప్ వైపు ఆత్మీయంగా చూస్తున్నారు.'మా స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా ఓ వెలుగు మా జీవితంలోకి రాబోతోంది. నాకు తోడుగా నిలబడి నా జీవితాన్ని కాంతిమయం చేసిన భాగస్వామి అలీ ఫజల్‌కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. 'ఈ సారి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది' అని పేర్కొంది.కాగా రిచా చద్దా, అలీ ఫజల్.. ఫర్కీ సినిమా సెట్లో ఒకరినొకరు కలుసుకున్నారు. కొంతకాలానికే మంచి స్నేహితులుగా తర్వాత ప్రేమికులుగా మారారు. 2022 అక్టోబర్‌లో ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1+1=3 అంటూ తమ కుటుంబంలోకి ఓ బుజ్జి పాపాయి రానుందని ప్రకటించారు. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌లో మెప్పించిన రిచా చద్దా.. 'అభి తో పార్టీ షురూ హు హై' సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.చదవండి: సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే -
రిలీజ్‌కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత!
కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. -
అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్? నటి కౌంటర్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ అందంగా కనిపించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు.. ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు. అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో బాలీవుడ్ నటి రిచా చద్దాను విమర్శించినట్లున్నారు.అక్కా.. నాకు చెప్పకుఇంకేముంది సోషల్ మీడియా వేదికగా మండిపడింది. 'మరేం లేదు.. కొందరికి ఒంటినిండా విషమే! వయసు పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి. అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అదితి గురించేనా?ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది. కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ఆన్‌స్క్రీన్.. ఆఫ్‌స్క్రీన్.. అదే డ్రామా'హీరామండి వెబ్ సిరీస్‌లో ఎంత డ్రామా జరిగిందో ఆఫ్ స్క్రీన్‌లో అంతే డ్రామా నడుస్తోంది. రిచా చద్దా.. షర్మిన్ సెగల్‌ను ట్రోల్ చేసింది. షర్మిన్.. సంజీదా షైఖ్‌ను అవుట్‌సైడర్ అని మాట్లాడింది. ఇప్పుడు రిచా.. అదితిరావు మీద సెటైర్లు వేస్తోంది' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 'అదితినే అంటోందని క్లియర్‌గా తెలుస్తోంది.. అయినా రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్‌లా మారుతోంది' అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం గర్భిణి అయిన రిచా చద్దా జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.చదవండి: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు! -
సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
'హీరామండి: ద డైమండ్ బజార్' వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఇందులో నటించిన హీరోయిన్లలో రిచా చద్దా ఒకరు. లజ్జో అనే పవర్ఫుల్ పాత్ర పోషించిన ఆమె స్క్రీన్‌పై చాలా తక్కువ సేపు మాత్రమే కనిపించింది. కానీ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. తన యాక్టింగ్ స్కిల్స్ మెచ్చిన జనాలు ఆమెను మాధురీ దీక్షిత్‌తో పోల్చారు.దీనిపై ఆమె భిన్నంగా స్పందించింది. ఇలాంటి పొగడ్తలు నాకంత మేలు చేస్తాయని అనుకోను. ఎందుకంటే గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు నన్ను వదిలిపెట్టడం లేదు. సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్తే నాలుగు రౌండ్లలో సెలక్ట్ అయ్యేదాన్ని. చివరకు ఓ సెలబ్రిటీ కూతురినో లేదంటే ఫలానా హీరో ప్రేయసినో ఎంపిక చేసి నన్ను పక్కనపెట్టేవారు అని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే రిచా చద్దా త్వరలో తల్లి కాబోతోంది. తను గర్భం ధరించిన విషయాన్ని ఫిబ్రవరి 9న వెల్లడించింది. 1+1=3 అంటూ తన భర్త అలీ ఫైజల్‌తో కలిసున్న ఫోటో షేర్ చేసి ఈ గుడ్‌న్యూస్ చెప్పింది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) చదవండి: హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు -
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్‌కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. -
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
-
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
నటుడితో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న హీరోయిన్!
బాలీవుడ్ భామ రిచా చద్దా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించింది. పంజాబ్‌కు చెందిన ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(37) 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. 2013లో ఫర్కీ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక సినిమాల విషయాకొనిస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్లో నటించారు. అంతే కాకుండా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రంతో నిర్మాతలుగా మారారు. ఈ సినిమా సన్డాన్స్లో రెండు అవార్డులను గెలుచుకుంది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) -
ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్
బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్బంగా ఒక ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రిచా. "1 + 1= 3" అంటూ శుక్రవారం ఇన్‌స్టాలో వెల్లడించింది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) రిచా పోస్ట్‌కు భర్త అలీ ఫజల్ స్పందిస్తూ ‘ఆ చిన్న గుండె సడి తమకు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సవ్వడి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో సన్నిహితులు, అభిమానులు ఈ జంటకు విషెస్ అందిస్తున్నారు. కాగా 2012లో ఫక్రే సెట్స్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత అలీ 2019లో రిచా చద్దాకు ప్రపోజ్ చేశాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రెండేళ్ల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2022 అక్టోబర్ 6 న ప్రీ వెడ్డింగ్ వేడుకలతోపాటు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
మీకంటే ఆమెనే ఎక్కువ.. అక్షయ్ కుమార్‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమె ట్వీట్‌ను తప్పబట్టారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఆమె రిప్లై ఇవ్వడమే వివాదానికి ప్రధాన కారణం. 2020లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో మన సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. (చదవంండి: బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్ ఆగ్రహం.. ఎందుకంటే?) అయితే తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమెను తప్పుపట్టడాన్ని ప్రకాశ్ రాజ్ ఖండించారు. ట్వీట్లో ఆయన రాస్తూ.. 'మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మా దేశానికి సంబంధించినది. ఊరికేనే అడుగుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. Didn’t expect this from you @akshaykumar ..having said that @RichaChadha is more relevant to our country than you sir. #justasking https://t.co/jAo5Sg6rQF — Prakash Raj (@prakashraaj) November 25, 2022 -
బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ నటి చేసిన ట్వీట్‌పై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఆమెపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా యంగ్ నిఖిల్ సైతం మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీని కించపరుస్తూ.. 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ రిచా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్వీట్‌ని తప్పుబడుతూ మంచు విష్ణు, అక్షయ్‌కుమార్‌తోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఖిల్ ట్వీట్లో రాస్తూ.. ' 20 మంది భారత సైనికులు గాల్వాన్ వద్ద తమ ప్రాణాలను అర్పించారు. దేశాన్ని, మన ప్రాణాలను రక్షించారు. వారి త్యాగం గురించి వింటే ఇప్పటికీ మనకు కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను మరచి.. మన సైన్యం, సాయుధ దళాలను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానించకూడదు. రిచా దయచేసి దేశం తర్వాతే ఏదైనా తెలుసుకోండి.' అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు సైతం ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు బుద్ధి లేదంటూ మండిపడుతున్నారు అసలు వివాదం ఎందుకంటే..: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని(పీవోకే) కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి సరైన సమాధానం ఇస్తాం’ అంటూ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె క్షమాణపలు కూడా చెప్పింది. 20 Brave Indian soldiers gave up their lives at Galwan protecting our country and us. Reading about their Ultimate Sacrifice still brings tears to our eyes. FORGET POLITICS. Our Army and the Armed forces should always be respected and never insulted. @RichaChadha plz #IndiaFirst pic.twitter.com/SZvaOtKMEv — Nikhil Siddhartha (@actor_Nikhil) November 24, 2022 What is wrong with this woman???? How can you even imagine such a horrid line? Everyone in the armed forces should be worshipped if not anything else’s for their service to our great country. Just hurts to see such ungrateful Indians. pic.twitter.com/zOD5w9QZi7 — Vishnu Manchu (@iVishnuManchu) November 24, 2022 Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH — Akshay Kumar (@akshaykumar) November 24, 2022 -
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్‌ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్‌ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్
బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడిదంటూ నటిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలు సైతం ఆమె తీరును ఎండగడుతున్నారు. ఫిలిం మేకర్ అశోక్ పండిట్ అయితే ఓఅడుగు ముందుకేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి? అసలేం జరిగిందో చూద్దాం.. 'పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి మన స్వాధీనంలోకి తీసుకొచ్చేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. మీరు సరే అంటే వెంటనే ఆపరేషన్ పూర్తి చేస్తాం. కానీ ఈలోపు పాకిస్తాన్ కాల్పులు ఉల్లంఘనకు దిగితే మా సమాధానం ఇంకోలా ఉంటుంది. దాన్ని వారు కలలో కూడా ఊహించలేరు!' అని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి రిచా చద్ధా స్పందిస్తూ 'గల్వాన్ సేస్ హాయ్' అని రిప్లై ఇచ్చింది. ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటో తెలీదు కానీ గల్వాన్ ఘటనను గుర్తు చేయడం మాత్రం నెటిజన్లకు కోపం తెప్పించింది. సైన్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిందంటూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిచా చద్ధా తన ట్వీట్‌ను తొలగించి అందరినీ క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది. 'నా వల్ల బాధపడ్డ అందరికీ క్షమాపణలు చెప్తున్నా. కానీ నా ఉద్దేశం అది కానే కాదు. నా అన్నయ్య ఆర్మీలోనే పని చేస్తాడు. మామయ్య పారాట్రూపర్. దేశాన్ని కాపాడే క్రమంలో సైనికుడు గాయపడ్డా, అమరుడైనా అతడి కుటుంబమంతా ఎంతో మనోవేదనకు గురి అవుతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా సొంత నానాజీ లెఫ్టినెంట్ కల్నల్‌గా భారత ఆర్మీకి సేవలందించారు. 1960లో జరిగిన ఇండో - చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ తగిలింది. ఆర్మీపై గౌరవం నా రక్తంలోనే ఉంది' అని రిచా రాసుకొచ్చింది. @BediSaveena pic.twitter.com/EYHeS75AjS — RichaChadha (@RichaChadha) November 24, 2022 ఇకపోతే 2020లో గల్వాన్ నది లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులవగా చైనా 38 మంది సైనికులను కోల్పోయినట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. I filed a police complaint against actress #RichaChadha at #JuhuPolicestation (Mumbai ) . Nobody has a right to mock our soldiers . I hope @MumbaiPolice will act against her as per the law of the land . @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/In0HD9LuJa — Ashoke Pandit (@ashokepandit) November 24, 2022 Just received a 'call', had muted replies so had no idea... bye all — RichaChadha (@RichaChadha) November 24, 2022 చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్, కీర్తి కోసం ఎవరు వచ్చారంటే? ఆస్పత్రిలో కమల్ హాసన్, హెల్త్ బులెటిన్ విడుదల -
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్!
బాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యింది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది మార్చిలో పెళ్లికి ప్లాన్ చేసుకోగా ఇద్దరు షూటింగ్‌లతో బిజీ ఉండగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఎలాగైన పెళ్లి పీటలు ఎక్కాలని ఈ జంట గట్టిగా నిర్ణయించుకుందట. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ముంబైతో పాటు ఢిల్లీలో వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహనికి హాజరవుతారని సమాచారం. సౌత్ ముంబై హోటల్లో గ్రాండ్ రాయల్ జరుగనుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2012 ఫక్రీ మూవీ సెట్లో కలుసుకున్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఏడేళ్ల డేటింగ్ అనంతరం అలీ ఫజల్, రిచాలు 2019లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో 2020లో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. అయితే కరోనా కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. ఇక 2022లో మార్చి పెళ్లి వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కాలనుకోగా సినిమా షూటింగ్‌లతో ఇద్దరు బిజీగా ఉండటంతో మరోసాని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల లేదా అక్టోబర్‌లో వివాహనికి ఈ జంట ముహుర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తుండగా.. రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. -
సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన నటనతో బాలీవుడ్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న బాలీవుడ్ జంట
Richa Chadha and Ali Fazal planning to tie the knot in March 2022: బాలీవుడ్లో వరుసగా లవ్‌బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా 2022 మార్చిలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముంబైతో పాటు ఢిల్లీలోనూ పెళ్లి సంబరాలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో సైతం నటిస్తున్నాడు. మరోవైపు రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. -
Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి
As Rahul Dravid Returns To Indian Dressing Room Richa Chadha On First Love: మిస్టర్ డిపెండబుల్, టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ‘పాత్ర’ పోషించినా సరే తనకంటూ ప్రత్యేకత గుర్తింపు దక్కించుకోవడం అతడికి అలవాటు. అందుకే అతడి కోసమే మ్యాచ్ చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇవ్వకుండా ‘అడ్డుగోడ’గా నిలబడి జట్టును అనేక సార్లు విజయపథంలో నిలిపిన ‘వాల్’ ద్రవిడ్.. ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్‌గానూ తన పాత్ర ఎలా ఉండబోతుందో తొలి సిరీస్ విజయంతో చెప్పకనే చెప్పాడు. ద్రవిడ్ మార్దనిర్దేశనంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి రిచా చద్దా ద్రవిడ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన రిచా.. ‘‘యవ్వన దశలో ఉన్నపుడు క్రికెట్ అంటే నాకు అభిమానం ఉండేది. ఇంకోరకంగా చెప్పాలంటే పిచ్చి అనవచ్చు. నా సోదరుడు క్రికెట్ ఆడేవాడు. మ్యాచ్ ఉందంటే టీవీకే అతుక్కుపోయేదాన్ని. రాహుల్ ద్రవిడ్ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే, తను రిటైర్మెంట్కు దగ్గరవుతున్న కొద్దీ క్రికెట్ చూడటం మానేశాను. నా ఫస్ట్‌లవ్ రాహుల్ ద్రవిడ్. అందుకే తను లేని ఆటను చూడలేకపోయాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు తను మరో రూపంలో డ్రెస్సింగ్‌రూంలో సందడి చేస్తున్నడు కాబట్టి.. మళ్లీ క్రికెట్ చూడటం ఆరంభిస్తానని రిచా పేర్కొన్నారు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 2011లో వీడ్కోలు పలికిన ద్రవిడ్.. ఆ మరుసటి ఏడాది టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు. చదవండి: SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి టైటిల్ సొంతం -
ఆ హీరోయిన్ నాలుక కోసేయండి : పొలిటీషియన్
బాలీవుడ్ నటి రీచా చద్దా మెయిన్‌లీడ్‌గా నటిస్తోన్న చిత్రం 'మేడమ్ చీఫ్ మినిస్టర్' విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. తాజాగా రిలీజైన ఈ సినిమా పోస్టర్ దళితులను అవమానించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటరానివారు అనే పదాన్ని ఈ చిత్రంలో ఉపయోగించారని, మెయిన్‌లీడ్ పోషించిన రీచా చీపురు పట్టుకున్నట్లు చూపించడం కూడా అభ్యంతరకంగా ఉందని, దీన్ని చిత్రం నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి రీచా పేర్కొన్నారు. ఆమె నాలుకను కోసేయండంటూ ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ..మేం ఎవరికీ భయపడం అంటూ రీచా ట్వీట్ చేశారు. (నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) మరోవైపు నటి స్వర భాస్కర్ సహా పలువురు రీచాకు మద్దతు తెలుపుతున్నారు. సినిమా పరంగా విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఇలా హింసకు ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి నేరపూరిత బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని తెలుపుతూ నాట్ ఓకే (not ok)అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఓ సాధారణ మహిళ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనే కథాంశంతో పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్గా నటించిన రీచా చద్దా పాత్ర మాయావతిలా కనిపిస్తుండం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈనెల 22న విడుదల కానున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ఒబేరాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. (ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను) -
నేనంటేనే ఇవ్వరు
‘‘షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా బయోగ్రఫీ అంటే ఎంత కష్టపడి సెన్సార్ తీసుకుని ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న విడుదలవుతున్న ‘షకీలా’ సినిమాని ఎంటర్టైన్మెంట్ మోటివ్లోనే చూడండి. ఈ సినిమా నా లైఫ్ గురించి అనే కాదు, కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం జరిగింది’’ అన్నారు షకీలా. నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షకీలా’. రీచా చద్దా, పంకజ్ త్రిపాఠి, ఎస్తర్లు కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లోకేష్ రచించి, దర్శకత్వం వహించారు. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వని, శరవణ ప్రసాద్ నిర్మించారు. ఎస్తర్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. షకీలా లైఫ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. యూఎఫ్ఓ ప్రతినిధి లక్ష్మణ్, రాజీవ్ పిళ్లై, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. -
‘షకీలా’ సినిమా టీజర్ విడుదల
ముంబై: దక్షిణాది ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్నారు. సామీ మ్యాజిక్ ప్రొడక్షన్లో ఇంద్రజీత్ లంఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ గురువారం విడుదలైంది. తెర వెనుక షకీలా ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇక టీజర్ విషయానికొస్తే.. 1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరు షకీలా. సంక్షోభ సమయంలో 90ల్లో సినిమా హాళ్లను ఆర్థికంగా ఆదుకున్న ఆమె సినిమాలకు అప్పుట్లో ఎక్కువ క్రేజ్ ఉండేది. అటువంటి నటి జీవితం ఆధారంగా సాగే ఈ సినిమా ఇప్పుడు 2020లో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు థియేటర్లలో వినిపించనుంది అంటూ ఈ టీజర్ సాగుతోంది. (చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ) అయితే 1990లో దక్షిణాది సినీ పరిశ్రమలో శృంగార తారగా రాణించిన షకీలా సంప్రదాయ ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. 16 ఏళ్ల వయసులోనే పరిశ్రమకు వచ్చిన ఆమె అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఇక షకీలా టీజర్ విడుదలైన సందర్భంగా నటి రిచా చద్దా స్పందిస్తూ.. ‘చివరికి ఈ సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా వంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రజల జీవితాల్లో నవ్వును, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్న. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన సినిమా హాళ్లను ఈ ఏడాది షకీలా సినిమాతో సంతోషంగా ముగుస్తుందని ఆశిస్తున్న. దక్షిణాదిన ప్రసిద్ది చెందిన ఆమె కథను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలుసుకోవడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. 1990లో సంక్షోభ సమయల్లో సినిమా హాళ్లకు స్థిరమైన వ్యాపారాన్ని అందించిన ఆమె సినిమాలు.. ఇప్పుడు 2020లో థియేటర్లను కూడా ఆర్థికంగా ఆదరిస్తుందో లేదో చూడాలి కూడా’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. (చదవండి: తనిష్క్ యాడ్‌లో నా జీవితం కనిపిస్తోంది: నటి) -
కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ
తండ్రి ఆమెను చిన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లి బతుకుతెరువుకు ఆమె దేహం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించింది. సొంత అక్క ఆమె సంపాదించినది అంతా తీసేసుకుంది. మగ ప్రపంచం ఆమెను నిండా మోసం చేసింది. నెల్లూరు నుంచి వెళ్లి కేరళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తయారైన సినిమా ‘షకీలా’ ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు షకీలా. షకీలా జీవితానుభవాలు, సినిమాలో అవి వస్తున్న విధం గురించి కథనం. సినిమాలలో సగటు ప్రేక్షకుల వినోదం కోసం ‘క్లబ్ డాన్సర్’ల పేరుతో స్త్రీల శరీర ప్రదర్శన ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అలాంటి పాటలను ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. వాటిని పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు కూడా. కాని గతంలో వాటి కోసంగా వేరే తారలు ఉండేవారు. వారికి సంప్రదాయ ప్రేక్షకుల దృష్టిలో తక్కువ చూపు ఉండేది. హిందీ సినిమాలలో తొలి క్లబ్ డాన్సర్‌గా హెలెన్ చరిత్ర సృష్టించారు. హెలెన్ స్ఫూర్తితో ఆ తర్వాత సౌత్‌లో కూడా చాలామంది తారలు కేవలం క్లబ్ డాన్సర్లుగా తమ కెరీర్లు మలుచుకున్నారు. దక్షిణాది సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, అనురాధ ఆ తర్వాతి కాలంలో సిల్క్ స్మిత చాలా పేరు సంపాదించారు. అయితే ఈ రంగంలో ఉన్న తారలు, ఘర్షణాయుతమైన జీవితం మిగిలిన వారి జీవితాలకు సంబంధించి వెలికి రాలేదు. కాని సిల్క్ స్మిత హటాన్మరణం పెద్ద న్యూస్‌గా మారింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శృంగార నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో సినిమా ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. కాని ఈమె డాన్సర్ కాదు. అది తేడా. నెల్లూరు నుంచి షకీలా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉండే కోట. దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి బంధువులంతా టైలరింగ్ వంటి చిన్న పనులే చేసేవారు. షకీలా తండ్రి చాంద్ బాషా బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. అక్కడే షకీలా జీవితం సినిమా ప్రపంచం వైపు మెల్లగా మళ్లింది. అయితే జీవితం గడవాలంటే అవసరమైన ‘రాజీ’ పడాల్సిందేనని తల్లి షకీలాను ఒప్పించి ఆమెను సినిమా పరిశ్రమలోకి పంపింది. తల్లికి గాని, షకీలాకు గాని చదువు లేదు. మిగిలిన సంతానం కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. 1995లో షకీలా తొలి శృంగార చిత్రం ‘ప్లేగర్ల్స్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన మలయాళ సినిమా ‘కిన్నరతుంబిగల్’ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. షకీలా మద్రాసులో ఉంటూ మలయాళ సినిమాలలో విస్తృతంగా నటించడం మొదలెట్టారు. 30–40 కేంద్రాలు పెద్ద హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తీయాలి. అన్ని సెంటర్లలో బాగా ఆడాలి. కాని షకీలా నటించిన సినిమాలు ముప్పై నలబై కేంద్రాలలో ఓ మోస్తరు ఆడినా డబ్బు వచ్చేసేది. సాధారణంగా షూటింగ్ అయ్యాక సదరు నటీనటులు ఇళ్లకు వచ్చి స్నానాలు చేస్తారు. కాని షకీల షూటింగ్లో ప్రధానమైన సీన్ల షూటింగ్ అయ్యాక దర్శకులు ‘ఒక ఫ్యాంటసీ సీన్’ అనో, ‘ఒక స్నానం సీన్’ అనో అడిగి చివరి గంటల్లో ఆ సీన్లు తీసేవారు. వాటి కోసం షకీల ప్రత్యేకంగా నటించాల్సి వచ్చేది. 1995–2000 మధ్య కాలంలో షకీలా సినిమాలు మలయాళ రంగాన్ని ఊపేశాయి. శృంగార చిత్రాలు ఎవరు నటించినా ‘షకీలా సినిమా’ అనేంతగా ఆమెకు ఇమేజ్ వచ్చింది. ఒక్క భాషలో ఆమె నటిస్తే అన్ని భాషల్లోనూ అవి డబ్ అయ్యేవి. ఇంకా నేపాల్, శ్రీలంకలలో కూడా రిలీజ్ అయ్యేవి. ‘రోజుకు మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి’ అని షకీలా చెప్పుకున్నారు. మలయాళ సూపర్స్టార్లు ఆమె సినిమా కలెక్షన్లు చూసి నామోషీ ఫీల్ అయ్యారని, ఆమె సినిమాలు విడుదల కాకుండా చూశారని ఒక వార్త ఉంది. 2002లో షకీల ఇక మీదట తాను అలాంటి సినిమాలలో నటించనని ప్రకటన చేసి వాటిని విరమించుకున్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆ కెరీర్ సజావుగా లేదు. ఆమె సంపాదించిన డబ్బులో ఏదీ ప్రస్తుతం ఆమె దగ్గర లేదు. ఆమె అతి సామాన్య జీవనం గడిపే స్థితికి చేరుకున్నారు. అయిన వారే ‘మా అమ్మ నన్ను బంగారు బాతులా చూసింది. నా ఆర్థిక లావాదేవీలన్ని నా పెద్దక్క చూసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలు నా డబ్బు ఆమె దగ్గర ఉండిపోయింది. అది నాకు ఇవ్వలేదు. మా అమ్మ నా పేరున ఏదైనా ఆస్తి ఉంటే నేను వేరుగా వెళ్లిపోయి స్థిరపడతానని అసలు ఏ ఆస్తీ నా పేరున కొననివ్వలేదు. నా వాళ్లు నా సంపాదనతో స్థిరపడి తమ వేడుకలకు నేను వస్తే నన్ను బంధువులకు పరిచయం చేయడానికి ఇబ్బంది పడే స్థితికి వచ్చారు. అందుకని ఇప్పుడు వాళ్లందరితో తెగదెంపులు చేసుకున్నాను. నాకు ఎవరూ లేరు’ అని షకీల చెప్పుకున్నారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. తమిళనాడులో ఉండే ట్రాన్స్జెండర్ల సమూహం ఆమెను తమ మనిషిగా స్వీకరించింది. వారే ఇప్పుడు షకీల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు. ‘నాతో రిలేషన్లో ఉన్న మగవారు కూడా నాకు దూరమైపోయారు’ అని ఆమె అన్నారు . ఆత్మకథ– సినిమా షకీలా ఆత్మకథ మలయాళంలో ‘షకీలా ఆత్మకథ’ పేరుతో విడుదలైంది. అది అక్కడ చర్చకు పాత్రమైంది. హిందీలో ఆమె కథ స్ఫూర్తిగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి రీచా చద్దా ముఖ్యపాత్రలో సినిమా తయారైంది. అది ఈ సంవత్సరం మొదలులోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతోంది. అదీ నేరుగా థియేటర్లలో. ‘సినిమా రంగంలోకి రావాలనుకున్న యువతులు ఇక్కడ గ్లామర్, పేరుతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందుకు ఈ సినిమా కథ ఉపయోగపడుతుంది’ అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ అన్నాడు. రిచా చద్దా ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘మసాన్’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందారు. ‘షకీలా’ సినిమా కచ్చితంగా విమర్శకులు మెచ్చే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి చేసిన ఒక వినూత్న ప్రయాణం ఈ కథ. ఇది సమాజంలో ఉండే నిచ్చెనలను, పాములను కూడా చూపిస్తుంది. ఇది నమ్మకాలను, నమ్మకద్రోహాలను కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో కూడా హెచ్చరిస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
తనిష్క్ యాడ్‌లో నా జీవితం కనిపిస్తోంది: నటి
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఈ బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌కు మాత్రం ఇంకా కళ్యాణ ఘడియలు దగ్గరపడలేదు. నటులు అలీ ఫజల్, రిచా చద్దా 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2017లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కోవిడ్ వల్ల వాయిదా వేసుకున్నారు. కొద్దిమందితో పెళ్లిని మమ అనిపించేకంటే అందరి సమక్షంలోనే ఈ వేడుకను వైభవంగా జరుపుకోవాలని ఈ జంట ఆశపడుతోంది. అందుకని వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకుంది. మతాంతర వివాహంపై రిచా స్పందన కాగా ఈ ఇద్దరూ ఒకే మతానికి చెందినవారు కాదు. అయినప్పటికీ ఇరు కుటుంబాలు పెద్ద మనసుతో వారి పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరించడం విశేషం. ఈ విషయంపై రిచా చద్దా మాట్లాడుతూ తనిష్క్ వివాదాస్పద యాడ్‌ను ప్రస్తావించారు. నిజానికి ఆ యాడ్ చాలా బాగుందని ప్రశంసించారు. అందులో తన జీవితం ప్రతిబింబిస్తోందన్నారు. అలీ నుంచి, అతడి కుటుంబం నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నానని పేర్కొన్నారు. కానీ పక్కవాళ్లు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారనేది కూడా పెద్ద సమస్యగా ఫీలవుతున్నవాళ్లను చూస్తే జాలేస్తోంది అని తెలిపారు. (చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్..) యాడ్‌ను తొలగించిన తనిష్క్ యాడ్ కాగా ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ ఏకత్వం పేరిట ఓ యాడ్ తీసుకొచ్చింది. ముస్లిం కుటుంబంలో అడుగు పెట్టిన హిందూ మహిళ కోడలిగా అడుగు పెడుతుంది. ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించిన ఆ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం సీమంతం నిర్వహిస్తుంది. ఇది రెండు వేర్వేరు మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక అని చెప్పుకొచ్చింది. కానీ ఇది లవ్ జిహాదీని ప్రోత్సహించే విధంగా ఉందంటూ వ్యతిరేకత రావడంతో సదరు కంపెనీ ఆ యాడ్‌ను తొలగించింది. (చదవండి: ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!) -
నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. క్షమాపణలు
ముంబై: లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి రిచా చద్ధాపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా ఆమెను క్షమాపణలు కోరుతున్నాని నటి పాయల్ ఘోష్ ముంబై హైకోర్టుతో పేర్కొన్నారు. రిచా కూడా క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా బాధపెట్టాడని ఇటీవల పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి రిచాపై పాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై పాయల్ నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందంటూ చద్ధా గత వారం ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాయల్ తన న్యాయవాది నితిన్ పాట్పుట్... హైకోర్టులో విచారణకు జస్టిస్ మీనన్ ఎదుట హాజరయ్యారు. రిచాపై చేసిన వ్యాఖ్యలకు పాయల్ చింతిస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఆమెను కించపరిచేందుకు చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. పాయల్, రిచా అభిమాని అని, ఆమెను గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ స్త్రీని కించపరచాలన్న ఉద్దేశం పాయల్‌కు లేదని నితిన్ పేర్కొన్నారు.(చదవండి: నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) తాము పాయల్ క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి నష్టపరిహారాన్ని పొందే ఆలోచన లేదని రిచా న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు కోర్టుకు వెల్లడించారు. అనంతరం రెండు పార్టీలు సమ్మతి నిబంధనలను అక్టోబర్ 12న కోర్టులో సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్ మీనన్ చెప్పారు. రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ఇకపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేశారు. అయితే ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ సబర్బన్ వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నటి రిచాతో పాటు మరో ఇద్దరూ మహిళా నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్) -
నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా
ముంబై : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు మోపిన నటి పాయల్ ఘోష్‌పై రూ.కోటి పది లక్షల పరువు నష్టం దావా వేశారు రిచా చద్ధా. 2013లో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు ఈ ఆరోపణలపై మరోనటి రిచా చద్దా స్పందించి పాయల్‌కు లీగల్ నోటీసులు పంపించారు. పాయల్ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు. చదవండి: దర్శకుడిపై అత్యాచారం కేసు దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్ కశ్యప్‌ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. -
నా పేరెందుకు వాడారు?: నటి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తన పేరు వాడిన మూడవ వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ శనివారం లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడారు. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయపరమైన పోరాటానికి తాను సిద్దంగా ఉన్నట్లు రిచా ప్రకటించారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) ‘అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడవ వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్ రిచా చద్దా పేరు తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు ఆయన అన్నారు. ‘‘నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో లేవనెత్తి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దేబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు) View this post on Instagram 💪🏼 A post shared by Richa Chadha (@therichachadha) on Sep 20, 2020 at 3:42pm PDT సినిమా చాన్స్‌లు కావాలంటే ప్రతి నటి తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని దర్శకుడు అనురాగ్ తనతో చెబుతూ లైంగిక దుష్పవర్తనకు పాల్పడినట్లు నటి పాయల్ ఓ ఇంటర్యూలో ఆరోపించింది. దీనికి తాను అనురాగ్‌తో ‘మీరు రిచా చద్దాకు అవకాశం ఇచ్చారు. మహీ గిల్, హుమా ఖురేషిలకు సినిమా ఛాన్స్‌లు ఇచ్చారు. వారు చాలా నార్మల్‌గా కనిపించే అమ్మాయిలే అయినప్పటికీ మీరు వారికి మీ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసలు దర్శకులేవరు అలాంటి అమ్మాయిలకు అవకాశం ఇవ్వరూ కానీ మీరు గొప్ప పని చేశారు అని చెప్పి మానసికంగా నేను దీనికి సిద్దంగా లేను’ అని కశ్యప్‌తో చెప్పానన్నారు. అనురాగ్ కశ్యప్ 2012లో తన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో రిచా చద్దా.. నాగ్మా ఖటూన్ పాత్రలో నటించారు. హుమా ఖురేషి కూడా అదే ప్రాజెక్ట్ ఓ పాత్రలో కనిపిచారు. 2009లో కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దేవ్ డి’లో మహీ గిల్ నటించారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) -
'ఐ లవ్ యూ చెప్పేందుకు 3 నెలలు'
బాలీవుడ్ ప్రేమజంట అలీ ఫజల్, రిచా చద్దా ఐదేళ్ల డేటింగ్‌కు ఫుల్స్టాప్ పెడుతూ ఏప్రిల్‌లో పెళ్లి నిర్ణయించుకున్నారు. కానీ వీరి పెళ్లికి కరోనా శనిలా అడ్డు తగిలింది. దీంతో ఏప్రిల్ 15న జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయాన్ని బ్రైబ్స్ ఇండియా మ్యాగజైన్‌తో చెప్పుకొచ్చారు. ముందుగా రిచా మాట్లాడుతూ.. "అలీ మాల్దీవుల్లోని ఐలాండ్‌లో రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేశాడు. బహుశా నా పుట్టినరోజు కోసమేమో అనుకున్నా. అంతకుమించి ఎక్కువగా ఊహించలేదు. ఇక ఆ రోజు మేము కలిసి తింటూ ఉన్నాం. సడన్‌గా అలీ ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. తర్వాత 10 నిమిషాల గ్యాప్ తీసుకున్నాడు. బహుశా ప్రపోజ్ చేసినందుకు తను లోలోపల భయపడుతూ, మథనపడినట్టున్నాడు. అయితే మోకాళ్లపై కూర్చుని, చేతిలో ఉంగరం పట్టుకుని మాత్రం ప్రపోజ్ చేయలేదు." (అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం: నటి) "నా విషయానికొస్తే నేను తొలిసారిగా నా ప్రేమను ఎప్పుడు వ్యక్తీకరించానంటే.. మా ఇంట్లో మేమిద్దరం కలిసి నాకెంతో ఇష్టమైన చాప్లిన్ సినిమా చూస్తున్నాం. ఆ సినిమాను అలీ బాగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు నా అభిరుచి ఉన్న వ్యక్తి దొరకటం అదృష్టం అనుకున్నా. వెంటనే ఐ లవ్ యూ చెప్పా. కానీ నాకు తిరిగి ఐ లవ్ యూ అని చెప్పడానికి అలీకి మూడు నెలలు పట్టింది" అని రిచా బుంబగమూతి పెట్టింది. "రిచా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. తనను ప్రేమించడానికి అది కూడా ఓ కారణం. ఆమె అన్నం తింటుంటే తన చుట్టూ ఆహారాన్ని కింద వెదజల్లినట్లే ఉంటుంది. గ్లాసులో ఉన్న నీళ్లు సగం కింద పడిపోయి కనిపిస్తుంది.. ఓ సారి డిన్నర్ చేస్తున్నప్పుడు అయితే ఏకంగా ఆమె ప్లేట్లోని వస్తువు గాల్లోకి లేచి ఇతరుల ప్లేట్లో పడింది" అంటూ అలీ నవ్వుతూ సెలవిచ్చాడు. (ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!) -
ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!
ముంబై: బాలీవుడ్ ప్రేమజంట రిచా చద్దా- అలీ ఫజల్ వచ్చే నెల జరగాల్సిన తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2020 చివరి నాటికి మరోసారి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పంజా విసురుతున్న నేపథ్యంలో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ‘‘అంటువ్యాధి కోవిడ్-19 ప్రబలుతున్న తరుణంలో అలీ ఫజల్, రిచా చద్దా తమ వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ చివరి వారంలో వివాహం చేసుకునేందుకు రిచా, అలీ కోర్టు నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇక ‘ఫక్రీ రిటర్న్స్’లో జంటగా నటించిన వీరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. రిచా పంజాబీ అమ్మాయి కాగా.. అలీది ఉత్తర్‌ప్రదేశ్.(హీరో నితిన్ పెళ్లి వాయిదా..!) ఇక కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా చిన్ననాటి స్నేహితురాలు నటాషాతో డేటింగ్ చేస్తున్న ఈ హీరో పెద్దలను ఒప్పించి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు అతడి సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. తొలుత థాయ్‌ల్యాండ్‌లోని ప్రైవేటు ద్వీపంలో పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేదికను జోధ్‌పూర్‌కు, ఆ తర్వాత ముంబైకి మార్చుకున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వాయిదా వేశారని పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి భారత్‌లో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: హీరో) ‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’ -
పెళ్లి కుదిరింది
ఐదేళ్ల డేటింగ్‌కి ఫుల్స్టాప్ పెట్టారు బాలీవుడ్ తారలు అలీ ఫజల్, రీచా చద్దా. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. 2012లో ‘ఫక్రీ’ సినిమాలో కలసి నటించిన ఈ ఇద్దరూ 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2017లో వీళ్ల రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే మాల్దీవుల్లో హాలిడేకి వెళ్లారు రీచా, అలీ. అక్కడ రీచాను అలీ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఏప్రిల్ 15న ఢిల్లీలో కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోవాలనుకుంటున్నారట. ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ∙అలీ ఫజల్, రీచా చద్దా -
చీఫ్ మినిస్టర్ చద్దా
బాలీవుడ్ నటి రీచా చద్దా చీఫ్ మినిస్టర్‌గా మారారు. తన లేటెస్ట్ సినిమా ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’లో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారామె. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి రీచా చద్దా మాట్లాడుతూ – ‘‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ సినిమా మా అందరి కష్టం. నా కెరీర్లోనే ఇదో చాలెంజింగ్ పాత్ర. ఈ అవకాశం ఇచ్చిన సుభాష్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమా జూలై 17న విడుదల కానుంది. -
అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం: నటి
బాలీవుడ్ నటి రిచా చద్దా తన వివాహ విషయంపై స్పందించారు. బాయ్‌ఫ్రెండ్ అలీ ఫజల్‌ను ఇప్పట్లో పెళ్లి చేసుకోలేనని ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా ఆమె తెలిపారు. నటుడు అలీ ఫజల్‌తో హాట్ బ్యూటీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంపై చర్చించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇందుకు వీరి ముందు ఉన్న బీజీ షెడ్యూల్లే కారణమని తెలిపారు. పెళ్లి చేసుకోడానికి ప్రస్తుతం తమ వద్ద సమయం లేదని అన్నారు. పెళ్లికి ఖచ్చితమైన తేది కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.‘‘మాకు టైం లేదు. మార్చిలో నాకు డేట్స్ లేవు. మేలో ఎండలు బాగా ఉంటాయి. జూన్‌లో ఇద్దరం సినిమా షూటింగ్ చేస్తున్నాం. జూలైలో వర్షాలు ఎక్కువగా పడతాయి. మేము ప్రస్తుతం సంతోషంగా ఉన్నాం. అలాగే పెళ్లి కోసం కూడా ఎదురు చూస్తున్నాం’’. అని వివరణ ఇచ్చారు.(అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం) ఇక తన రిలేషన్‌షిప్‌ను అద్భుతమైనదిగా రిచా వర్ణించారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే మనస్తత్వంగల వారు దొరకడం చాలా అరుదుగా ఉంటుందని ఆమె తెలిపారు. ఫక్రీ సినిమా షూటింగ్లో కలుసుకన్న ఈ జంట 2017 వెనిస్లోని ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో తమ ప్రేమ ప్రయాణాన్ని అధికారికంగా ప్రకటించారు. రిచా తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘పంగా’లో కనిపించనుంది. ఈ మూవీ రేపు( జనవరి 24) విడుదల కానుంది.అలాగే షకీలా బయోపిక్ మూవీలోనూ రిచా నటిస్తున్నారు. -
దక్షిణాదిలో గొప్ప సినిమాలొస్తున్నాయి
‘‘పంగా’ సినిమాలో ఓ మధ్య తరగతి మహిళగా, అందులోనూ తల్లిగా నటించా.. తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది’’ అని కంగనా రనౌత్ అన్నారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పంగా’. జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కంగనా, అశ్విని విలేకరులతో సమావేశమయ్యారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘అశ్విని మంచి డైరెక్టర్. పని పట్ల మంచి ఫోకస్, క్లారిటీ ఉంది. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్వినీలాంటి వారే సమాధానం చెబుతున్నారు. ‘పంగా’ చిత్రంలో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అప్పుడు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ హైదరాబాద్, చెన్నై తిరుగుతూ పూర్తిగా సౌత్ ఇండియన్‌గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది’’ అన్నారు. -
కలియుగాన్ని చూడాలంటే..
ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగంలో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నటి స్వర భాస్కర్ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్ చేశారు. మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్ రేప్ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్) -
యువరానర్...
కొంతకాలంగా కోర్టుకు వెళ్తున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. కోర్టుమెట్లు ఎక్కేంత తప్పు ఆమె ఏం చేశారనేగా మీ డౌట్. అయితే ఆమె కోర్టుకెళుతున్నది ‘సెక్షన్ 375’ అనే సినిమా కోసమని బాలీవుడ్ ఖబర్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 375 సెక్షన్ అనేది మానభంగానికి చెందిన సెక్షన్ అట. ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్నారు రిచా. పాత్రకు న్యాయం చేయడానికి కోర్టు విధివిధానాలను పరిశీలించాలని ఆమె కోర్టుకు వెళ్తున్నారు. ‘‘నా స్నేహితురాలు ఒకరు కార్పొరేట్ కేసులను పరిష్కరించడంలో లాయర్‌గా నిపుణురాలు. కానీ, మా సినిమా ఆ సెక్షన్‌కు సంబంధించింది కాదు. డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. కానీ, కోర్టులో నేను తెలుసుకునే కొత్త విషయాలు నేను చేయబోయే పాత్రకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీలైనప్పుడు లాయర్స్‌తో మాట్లాడుతున్నాను’’ అని పేర్కొన్నారు రిచా. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తారట. పది నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. మనీష్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. షకీల బయోపిక్ ‘షకీల’ చిత్రంలో నటించారు రిచా. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
నేనూ అలాగే ఉంటా!
బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్‌లు యాక్టింగ్‌ను ప్లాన్ ఏ గా భావించి ప్లాన్ బీగా నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఇప్పుడీ జాబితాలోకి మరో నటి రిచా చద్దా చేరారు. ఆమె కూడా ప్లాన్ బీగా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘‘ఒక్క యాక్టింగ్ పరంగానే కాదు వీలైనన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను భాగం అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా మారే అవకాశం వచ్చింది. న్యూయార్క్‌కి చెందిన నా క్లోజ్ ఫ్రెండ్ సుచంటి తలాటి ఓ టీనేజ్ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఆమె నన్ను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయమని అడిగినప్పుడు నిర్మాతగా నాకు ఇదొక అవకాశంగా కనిపించింది. ఈ రోజుల్లో అందరూ ఒక్క పనితోనే ఆగిపోవడం లేదు. మల్టిఫుల్ వర్క్స్ చేస్తున్నారు. నేనూ అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు. ప్రస్తుతం షకీల బయోపిక్ ‘షకీల’లో ఆమె æనటిస్తున్నారు. -
పోర్న్ స్టార్ కాదు!
సినిమా ప్రపంచంలో షకీలా పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1990లో వెండితెరపై ఓ వెలుగు వెలిగారామె. అప్పట్లో ఆమె నటించిన కొన్ని అడల్ట్ సినిమాలు విదేశీ భాషల్లోనూ డబ్ చేశారు. అనేక వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇన్ని ఆసక్తికర విషయాలు ఉన్న ఆమె జీవితం ఆధారంగా ‘షకీలా’ అనే బయోపిక్ రూపొందుతోంది. రీచా చద్దా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై ‘షకీలా.. పోర్న్ స్టార్ కాదు’ అని ఉంది. ‘‘షకీలాను అందరూ పోర్న్ స్టార్‌గానే ఆలోచిస్తారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ బయోపిక్‌లో షకీలా కూడా గెస్ట్ రోల్ చేశారు. వేసవిలో రిలీజŒ కానుంది. -
నాకు నేనే అతిథి...
... అంటున్నారు నటి షకీల. శృంగార తారగా ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితాన్ని మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్రబృందానికి తెలిపానని షకీల గతంలో చెప్పారు. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్ లంకేష్ కోరడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట ఆమె. -
‘క్యాస్టింగ్ కౌచ్‌కి అనుకూలంగా మాట్లాడలేదు’
ముంబై : శ్రీరెడ్డి అర్దనగ్న నిరసన తర్వాత కాస్టింగ్ కౌచ్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్ధించేలా సరోజ్ ఖాన్ మాట్లాడరనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందని సమర్ధిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యాలను ఆమె సమర్ధించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో కూడా దుష్ప్రవర్తనకు పాల్పడేవారున్నారు. ఇది అన్ని రంగాల్లోను ఉందని, బాలీవుడ్‌ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇదే అంశంపై ట్విటర్లో కూడా ఆమె స్పందించారు. ‘నేను కూడా సరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె క్యాస్టింగ్ కౌచ్‌కి మద్దతుగా మాట్లాడారని అనుకోవడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు అలా చూస్తారని ఆమె ప్రశ్నించారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రేప్ అనే పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది అసహ్యకరమైన చర్య, దీని నివారణకు చర్యలు తీసుకోవాల’ని రిచా చద్దా అన్నారు. -
ఏ వేధింపుల గురించి చెప్పాలి: నటి ఆగ్రహం
ముంబై: ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన అంశం కాస్టింగ్ కౌచ్. అదేనండీ.. అవకాశాల పేరిట యువతులు, మహిళలను లైంగికంగా వేధించడం. హాలీవుడ్లో ఇద్దరు ప్రముఖ దర్శకనిర్మాతలపై వరుసగా నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ హీరోయిన్లు సైతం కొందరు ఈ వివాదంపై స్పందించారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి రీచా చద్ధా వేధింపులపై మాట మార్చారు. తనపై ఎవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, అలాంటప్పుడు ఏ వేధింపుల గురించి చెప్పాలి. ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేశారు. వేధింపులకు పాల్పడిన వారి పేర్లు బహిర్గతం చేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని, కానీ తనకు రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తే ఆ పని చేస్తానన్నారు. దీనిపై పలువురు ఆమెను సంప్రదించడంతో విసిగిపోయిన రీచా చద్ధా యూటర్న్ తీసుకుంది. ‘నన్ను వ్యక్తిగతంగా ఎవరూ వేధించలేదు. నాపై లైంగిక వేధింపులు జరగలేదు. నాకు ఎలాంటి చేదు అనుభవాలు లేదు. సెక్యూరిటీ అవసరం లేదు. కేవలం కాస్టింగ్ కౌచ్ వివాదంపై చర్చ జరగాలని, దీనిపై అందరికీ అవగాహనా తెచ్చేందుకు మాత్రమే వ్యాఖ్యలు చేశానని’ వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు నటి జైరా వసీమ్ పై ఓ వ్యక్తి విమానంలోనే లైంగిక వేధింపులకు పాల్పడగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
'ఆ సీన్లు ఉంటే బాగుండేది'
న్యూఢిల్లీ: తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి. ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది. దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్జిత్' లో నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే. -
'రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను'
న్యూఢిల్లీ: వెండితెరపై సాహసోపేతమైన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటి రిచా చద్దా నిజజీవితంలోనూ తెగువ చూపించింది. తనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు మగాళ్లను చెడామడా తిట్టిపోసింది. రౌడీ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించింది. తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఇద్దరు పురుషులు ఆమె వెంట పడ్డారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లారు. అక్కడితో ఆగకుండా ఆమె వస్త్రధారణపై అసభ్యకర కామెంట్లు చేశారు. వీరిలో ఒకడు ఆమె ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అప్పటివరకు మౌనంగా భరించిన చద్దా ఇక ఊరుకోకుండా వారిపై తిరగబడింది. పిచ్చివేషాలు వేస్తే ఊరుకోబోనని హెచ్చరించింది. సెక్యురిటీ సిబ్బంది వచ్చి సర్దిచెప్పడంతో ఆమె శాంతించింది. ఈ ఘటనపై రిచా చద్దా స్పందిస్తూ... 'పబ్లిక్ పర్సనాలిటీ, పబ్లిక్ ప్రాపర్టీ మధ్య బేధాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దురుసు ప్రవర్తనను ఎవరూ సహించకూడదు. హద్దుమీరినప్పుడు గుణపాఠం చెప్పాలి' అని పేర్కొంది. -
అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు!
- రిచా చద్దా, హీరోయిన్ ‘ఒయ్ లక్కీ! లక్కీ ఒయ్’తో చిత్రసీమకు పరిచయమైన రిచా చద్దా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ మొదటి, రెండు భాగాలలో నటించారు. ఉత్తమనటిగా ‘ఫిలింఫేర్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఆమె మనసులో మాటలు...‘‘నేను హీరోయిన్ కావాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పినప్పుడు ‘‘అయ్యి ఏంచేస్తావమ్మా?’’ అని వ్యంగ్యంగా అన్నారే తప్ప నా తల్లిదండ్రులు ప్రోత్సాహకరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, ఆ మాటలతో నేనేమీ నిరాశ పడిపోలేదు. నా కలను నెరవేర్చుకోవడానికి ముంబాయికి వచ్చాను. నాకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు. ‘మనలోని ప్రతిభే మన గాడ్‌ఫాదర్’ అనుకొని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కేన్స్ ఫెస్టివల్లో ఎందరో ప్రముఖులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ‘‘మీరు బాలీవుడ్ హీరోయిన్ కదా!’’ అని అక్కడ ఎవరో పలకరింపుగా అడిగారు.‘‘కాదు’’ అన్నాను.‘‘అదేమిటి? మీరు ఫలానా సినిమాలో హీరోయిన్గా చేశారు కదా’’ అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన. ‘‘మీరన్నది నిజమేగానీ, నేను బాలీవుడ్ నటిని కాదు... భారతీయ నటిని’’ అన్నాను. ‘బాలీవుడ్ నటి’ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానిలో ‘దేశీయత’ ధ్వనించదు. ‘‘చేతి నిండా సినిమాలు ఉన్నాయి’’ అని చెప్పుకోవడానికి మూస పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. నమ్ముతారో లేదోగానీ కొన్ని పెద్ద సినిమాలను కూడా నేను తిరస్కరించాను. నచ్చిన పాత్రలు లభించక మొదటి సినిమాకు రెండో సినిమాకు మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో నాకు నచ్చిన నాటకాల్లో నటించాను.‘కెనడీ బ్రిడ్జి’ అనే నాటకం నాకు ఎంతో పేరు తెచ్చింది. కొందరైతే ‘‘నాటకాన్ని భుజాల మీద మోశావు’’ అన్నారు. ఎక్కువ సినిమాలు చేశామనే తృప్తి కంటే ఇలాంటి ప్రశంసల వల్ల లభించే తృప్తే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. -
ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ...
మ్యాచ్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయి... టీమిండియాలో ప్లేస్ కోల్పోయిన పేసర్ శ్రీశాంత్‌కు మాంచి ఆఫర్లే వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌కు ఇలా వచ్చి అలా ఓ ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ... ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అదికూడా... మహేష్‌భట్ కుమార్తె పూజాభట్ ‘కాబరెట్’ మూవీలో. డ్యాన్సర్ పాత్ర పోషిస్తున్న రిచా చద్దాకు మలయాళీ మెంటార్‌గా ఈ చిన్నోడు చేస్తున్నాడు. ‘మొదట కాస్త పెద్దగా కనిపించేవారు కావాలనుకున్నా... శ్రీని చూసిన తరువాత అతడే ఇందుకు పర్ఫెక్ట్ అని డిసైడయ్యా. కెమెరా ముందు శ్రీకి బెరుకు కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజాభట్. -
లవ్ ‘సీన్’ చాలా కష్టం
హీరోయిన్ రిచా చద్దా ముంబై: ‘సినిమాలోని ప్రేమ, రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం.. చుట్టూ వందలాది మంది ఉంటుండగా లవ్ సీన్ పండించడమంటే మామూలు విషయం కాదు’.. అని అంటోంది అందాల తార రిచా చద్దా. ఆమె నటించిన ‘తమంచే’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మాట్లాడింది. తమంచే మంచి రొమాన్స్ థ్రిల్లర్ కథ అని చెప్పింది. ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటించాడని, తమద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపింది. ‘ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చుట్టూ చాలామంది షూటింగ్ సిబ్బంది ఉంటారు.. ఒక సీన్ బాగా వచ్చిందని డెరైక్టర్ అనుకునేంతవరకు నటీనటులు అలా నటిస్తూనే ఉండాలి.. రొమాన్స్‌లోనూ డెరైక్టర్‌కు కావాల్సినట్లు భావాలను పలికించడం అంతమంది మధ్యలో చాలా కష్టసాధ్యమైనఫీట్..’ అని ఆమె అభిప్రాయపడింది. కాగా, రిచా అభిప్రాయంతో హీరో నిఖిల్ ఏకీభవించాడు. అతడు మాట్లాడుతూ.. సినిమాల్లో ఫైట్లు, పాటలు చేయడం చాలా సులభం. రొమాన్స్, ప్రేమ సన్నివేశాలు చేయడం చాలా కష్టమన్నాడు. తమంచేలో బాబు (రిచా చద్దా), మున్నా (నిఖిల్ ద్వివేది) ప్రేమికులు. వారి ప్రేమకు ఎన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.. వాటిని వారిద్దరూ ఎలా తట్టుకొని తమ ప్రేమను నిలబెట్టుకున్నారు అనేది సినిమా ఇతివృత్తం. గ్యాంగ్స్టర్లు, హింస నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగుతుంది. ఇంతకుముందు తాను నటించిన‘ఫక్రీ’లోని ‘భోలీ పంజాబన్’కు, తమంచేలోని ‘బాబు’కు వేషభాషల్లో ఎటువంటి పోలిక లేదని రిచా చెప్పింది. ‘బాబు’ది రఫ్ క్యారెక్టర్.. పక్కా ముంబై లోకల్ యాసలో మాట్లాడుతుందని రిచా వివరించింది. ‘ముంబైలో నేను ఐదారేళ్లుగా ఉంటున్నా.. రోడ్లపై తిరిగేటప్పుడే ఇక్కడ భాషపై పట్టు వచ్చింది..అదే ఇప్పుడు ఉపయోగపడింది’..అని వివరించింది. నవనీత్ బేహల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 19వ తేదీన సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. -
సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో!
సన్నీ లియోన్ సెక్స్ సింబలే కావచ్చు. కానీ ఆమెతో కూడా నటించను గాక నటించను అనేవాళ్లున్నారు. నటి రిచా ఛడ్ఢా ఇప్పటికి సన్నీ లియోన్ తో కలిసి స్క్రీనుపై అందాలు పంచబోనని మూడో 'సారీ' చెప్పేసింది. మొదటి సారి రాగిణి ఎం ఎం ఎస్ 2లో , టీనా అండ్ లోలో సినిమాలో అవకాశం వచ్చినా ఈ అందాల భామ నో చెప్పేసింది. ఇప్పుడు తాజాగా మస్తీజాదే సినిమాలోనూ వచ్చిన అవకాశాన్ని కూడా రిచా వద్దనుకుంది. తమాషా ఏమిటంటే మూడు సినిమాల్లోనూ ప్రధానపాత్ర పోర్న్ సుందరిదే. మూడు శృంగార రస ప్రధాన చిత్రాలే. అయితే "ఈ సినిమాలను వదులుకోవడం, వాటిలో సన్నీ లియోన్ ఉండటం కేవలం కాకతాళీయమే. ఆమె ఉన్నందుకు నేనీ సినిమాల్ని వదులుకోలేదు" అని రిచా సంజాయిషీ ఇస్తోంది. -
బాలీవుడ్ నటిని రెండు గంటలపాటు ...
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతాధికారులు, ఆధికారులు నిలిపివేసి ప్రశ్నించారు. రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు సోదా చేశారు. రిచా చద్దా చర్మ సౌందర్యానికి ఉపయోగించే వస్తువులలో ఓ పౌడర్ పై అధికారులకు అనుమానం కలిగింది. చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గత ఆరు నెలలుగా సాంప్రదాయ పద్దతిలో ఆయుర్వేద పౌడర్ ఉపయోగిస్తున్నట్టు రిచా చద్దా అధికారులకు వెల్లడించారు. ఆయుర్వేద పౌడర్ చెప్పినా అధికారులకు నమ్మకం కలగపోవడంతో తనను రెండు గంటలపాటు ప్రశ్నించారని రిచా చద్దా మీడియాకు వెల్లడించారు. ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. ఈసారి మాత్రమే సమస్యగా మారింది అని రిచా చద్దా అన్నారు. తన వెంట ఉన్న ఆయుర్వేద వస్తువులను ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదని.. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించానని.. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి శ్రమించినా.. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు. 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' అనే చిత్రాల్లో రిచా చద్దా నటించింది.