తన నటనతో బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్‌సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్‌లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment