south indian film industry
-
సౌత్ ఇండస్ట్రీపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన నటనతో బాలీవుడ్లో ప్రత్యేక ముద్ర వేసుకుంది రిచా చద్దా. 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్లో కూడా నటించి అలరించింది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. అక్కడితో ఆగకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియా సినిమా కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఆ మాత్రం ఖర్చు చేసేందుకు అభిమానులు వెనుకాడరు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. వారంతా ఆ ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. అందుకే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ధరలు అలాగే ఉంటాయి. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా హిట్ అయినా, కాకున్నా టికెట్ ధర రూ. 400కు పైనే ఉంటుంది. దీంతో అంత ధర పెట్టేందుకు ప్రేక్షకులు ధైర్యం చేయరు. ఆ డబ్బుతో నిత్యవసరాలు వస్తాయని సగటు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందటే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది.' అని రిచా చద్దా పేర్కొంది. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోలీవుడ్‌కు మరో శాండిల్‌వుడ్ బ్యూటీ
తమిళసినిమా: శాండిల్‌వుడ్ వర్ధమాన నటి రాధిక ప్రీతి కోలీవుడ్‌లో పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతోంది. ఈమె తండ్రి కన్నడిగుడైనా, తల్లి మాత్రం తమిళనాడుకు చెందినవారేనట. కర్ణాటకలోని కోలార్‌లో పుట్టి పెరిగిన రాధికప్రీతి తమిళభాషను సరళంగా మాట్లాడగలదట. అంతేకాదు తమిళ భాష అన్నా, తమిళ చిత్రాలు అన్నా చాలా ఇష్టం అంటోంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన కన్నడ చిత్రం రాజా లవ్స్ రాధే చిత్రం విడుదలై మూడవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందట. తాజా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ నటించిన ఎంబిరాన్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. నినైత్తది యారో చిత్రం ఫేమ్ రెజీత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కృష్ణన్ పాండి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మహిళ్ తిరుమేని శిష్యుడన్నది గమనార్హం. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ థ్రిల్లర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఎంబిరాన్ చిత్రం ఉంటుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, జూలైలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పంజవర్ణం ఫిలింస్ పతాకంపై పంజవర్ణం నిర్మిస్తున్న ఈ చిత్రంపై నటి రాధిక ప్రీతి చాలా ఆశలు పెట్టుకుందట. దీని గురించి ఆమె తెలుపూ ఎంబిరాన్ చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని, తమిళంలో పలు చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నట్లు అంటోంది. మోడ్రన్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టమేనని, అయితే ఆ పేరుతో అందాలారబోతకు మాత్రం అంగీకరించనని అంది. మంచి కథలతో వచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తున్నట్లు రాధికా ప్రీతి చెప్పింది. ఎంబిరాన్ చిత్రానికి ప్రసన్ బాలా సంగీతాన్ని అందించారు. ఈయన ఇంతకు ముందు యాగవరాయినుం నా కాక్క చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. పుహళేంది ఛాయాగ్రహణం అందించారు. -
లైఫ్ ఇచ్చింది దక్షిణాది సినిమానే!
తమిళసినిమా: సినీ జీవితాన్ని ప్రసాదించింది దక్షిణాది సినిమానేనని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అంటోంది. టాలివుడ్, కోలివుడ్ అంటూ మార్చిమార్చి అవకాశాలను అందుకుంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కోలివుడ్‌కు దిగుమతి అయినా, పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో టాలివుడ్లో పాగావేసింది. అక్కడ టైమ్ కలిసి రావడంతో వరుసగా స్టార్ హీరోలతో నటించింది. కాగా ఎంత వేగంగా అక్కడ ఎదిగిందో అంతే వేగంగా గ్రాఫ్ పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఖాతా ఖాళీ అయింది. అయితే కోలీవుడ్ ఆదుకోవడంతో ఇంకా దక్షిణాదిలో పేరు వినిపిస్తోంది. ఇక్కడ కార్తీకి జంటగా నటించిన ‘ధీరన్ అధికారం ఒండ్రు’చిత్రం మంచి విజయం సాధించి రకుల్ ప్రీత్‌సింగ్‌ను కాపాడింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యకు జంటగా ‘ఎన్జీకే’చిత్రంలో నటిస్తోంది. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత మరోసారి కార్తీతో ‘దేవ్’చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నటుడు శివకార్తీకేయన్‌తో కూడా రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. మొత్తం మీద కోలీవుడ్‌లో బాగానే నటిగా గ్రోత్‌ను పెంచుకుంటోంది. అయితే పనిలో పనిగా బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది రకుల్. ఈమె ఇంతకు ముందు హిందిలో నటించిన చిత్రం అయ్యారి ప్లాప్ అయ్యింది. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా ఒక చిత్రం చేస్తోంది. దీంతో అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదని, అయ్యారి చిత్రం విజయం సాధించకపోవడంతో చాలా బాధ పడ్డానంది. అలాంటిది ఆ చిత్రంలో తన నటనే అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం హిట్ అయి తనకు మంచి మార్కెట్‌ను తెచ్చి పెట్టినా తాను దక్షిణాది చిత్ర పరిశ్రమను మర్చిపోనని చెప్పుకొచ్చింది. ఒకవేళ హింది చిత్రాలతో బిజీ అయినా తెలుగు, తమిళం చిత్రాల్లోనూ నటిస్తానంది. తనకు మంచి జీవితాన్నిచ్చింది దక్షిణాది చిత్రపరిశ్రమనేనని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. -
టాలీవుడ్లో ముదురుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. వీపీఎఫ్ ఫీజులు రద్దు చేయాలనే డిమాండ్‌తో నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన నిర్మాతలు.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ సంస్థలకు కంటెంట్ నిలిపివేశారు. దీంతో సాధారణ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్స్ల్లోను నేడు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని 1700 థియేటర్లతోపాటు హైదరాబాద్ లోని 250కిపైగా థియేటర్ల యాజమానులు... నిర్మాతల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. థియేటర్ల ముందు పోస్టర్లు అంటించి ప్రేక్షకులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయి. వర్చువల్ ఫీజు రద్దు చేయడంతో పాటు ప్రకటన నిడివి తగ్గించడం, ప్రతి ఆటకు రెండు కొత్త సినిమాల ప్రచార చిత్రాలను ఉచితంగా ప్రదర్శించాలనే డిమాండ్లతో నిర్మాతలు బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగిరాకపోవడంతో నిరవధికంగా థియేటర్లు బంద్ చేయాలని నిర్మాతతలు భావిస్తున్నారు. ఈ మేరకు థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సినిమాల ప్రదర్శన నిలిపివేత కారణంగా ఒక్కో థియేటర్ కనిష్టంగా రూ. 50 వేల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. నిర్మాతలు, డిజిటల్ సర్వీసుల మధ్య నెలకొన్న సమస్యను సతర్వమే పరిష్కరించేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ పాక్షికంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల డిమాండ్లపై డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
రేపటి నుంచి సినిమాల ప్రదర్శన బంద్
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు(క్యూబ్, యూఎఫ్ఓ) వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించనందుకు నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రాందాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్లోకి మారుతూ వచ్చింది. వీపీఎఫ్ నామమాత్రమే చెల్లించండి.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పిన క్యూబ్, యూఎఫ్ఓ యాజమాన్యాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్నూ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ చిత్రవర్గాలు నిర్మాత డి.సురేశ్‌బాబు చైర్మన్‌గా, నిర్మాత కిరణ్ కన్వీనర్‌గా ‘దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అధ్యక్షతన ఫిబ్రవరి 16న చెన్నైలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించాం. ప్రస్తుతం వసూలు చేస్తున్న వీపీఎఫ్‌ని 25శాతానికి తగ్గించి.. ఏడాది తర్వాత ఆ ఫీజు మొత్తం వసూలు చేయకూడదనీ.. రెండు సినిమా యాడ్స్ మాకు ఇవ్వాలనీ.. వాణిజ్య ప్రకటనలు 8 నిమిషాలకు మించి ప్రదర్శించరాదని చెప్పాం. ఫీజును 10 శాతం తగ్గిస్తామని వారు అంటే ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 23న బెంగళూరులో మరో సమావేశం నిర్వహించగా, 9శాతం మాత్రమే తగ్గిస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే ఓ వ్యక్తి ‘ఆల్ ది బెస్ట్ టు ఇండస్ట్రీ’ అని వ్యంగ్యంగా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయాడు. మా డిమాండ్లకు ఒప్పుకోకుంటే మార్చి 2నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని వారికి స్పష్టం చేశాం. మా నిర్ణయానికి సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా క్యూబ్, యూఎఫ్ఓ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు మా డిమాండ్లు ఒప్పుకుంటే సినిమాల ప్రదర్శన ఉంటుంది. వారు ఒప్పుకున్నా కొత్త డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వెనకడుగు వేయం’’ అన్నారు. -
మార్చి 2 నుంచి థియేటర్లు బంద్
సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేటర్లలో షోలు నిలిపివేస్తున్నట్లు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు, మార్చి 2 నుంచి బంద్‌కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమా అభిమానులు, ప్రేక్షకులు, సహకరించాలని కోరారు. గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 2నుంచి సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడే అవకాశం ఉంది. -
సింగపూర్‌లో సైమా అవార్డుల హంగామా
చెన్నై : ఈ సారి సైమా అవార్డుల హంగామా సింగపూర్‌లో జరగనుంది. ప్రతి ఏటా జరుగుతున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన దక్షిణాది భాషలకు చెందిన ఉత్తమ కళాకారులకు అందించే సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 30, జూలై ఒకటో తేదీన సింగపూర్‌లో బ్రహ్మాండంగా జరుగనుంది. సినిమా రంగానికి చెందిన 19 విభాగాల్లోని కళాకారులకు ఈ అవార్డులను అందించనున్నారు. 2015లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక మౌంట్‌రోడ్డులో గల ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో నటి కుష్బు, నటుడు జయం రవి, రానా దగ్గుబాటి, దేవీశ్రీప్రసాద్, వేదిక, నిక్కీగల్రాణి పాల్గొన్నారు. కుష్బు మాట్లాడుతూ... దక్షిణ భారతీయ సినిమా చాలా గౌరవంగా భావించే అవార్డులు ఈ సైమా అవార్డులన్నారు. ఉత్తమ చిత్రాలను,కళాకారులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందిస్తున్నారని నిర్వహాకులను ప్రశంసించారు. అలాగే జయం రవి ఈ సారి సైమా అవార్డు అందుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడు జయం రవిని ఈ వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సైమా అవార్టులను గెలుచుకునే కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ తెలిపారు. ఈ సారి సైమా అవార్డులను గతంలో కంటే బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు బృందాప్రసాద్ పేర్కొన్నారు. పలువురు సినీ కళాకారులు ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆటాపాటా అంటూ ఈ కార్యక్రమం సింగపూర్ సినీ అభిమానులను అలరించనుందని ఆయన అన్నారు.