సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేటర్లలో షోలు నిలిపివేస్తున్నట్లు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు, మార్చి 2 నుంచి బంద్‌కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమా అభిమానులు, ప్రేక్షకులు, సహకరించాలని కోరారు.
గతవారం సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 2నుంచి సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment