'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్‌లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.
చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?
ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్‌లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
లుక్ మార్చిన రైతు బిడ్డ
తాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment