ఓటీటీకి పుష్ప-2.. కీలక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్ | Pushpa 2 the Rule Ott Announcement by Mythri Movie Makers | Sakshi
Sakshi News home page

Pushpa 2 the Rule Ott: ఓటీటీకి పుష్ప-2.. నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన

Published Fri, Dec 20 2024 8:01 PM | Last Updated on Fri, Dec 20 2024 9:26 PM

Pushpa 2 the Rule Ott Announcement by Mythri Movie Makers

బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్‌ హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్‌ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మొదటి రోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

అయితే ఇటీవల పుష్ప-2 ఓటీటీకి త్వరగానే వచ్చేస్తోందంటూ పలువురు కథనాలు రాసుకొచ్చారు. దీంతో పుష్ప టీమ్ అప్రమత్తమైంది. ఓటీటీకి వస్తుందన్న వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. పుష్పరాజ్ ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో బిగ్‌ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పుష్ప-2 ముందుగానే ఓటీటీకి వస్తోందన్న రూమర్స్‌కు చెక్‌ పెట్టింది మూవీ టీమ్.

హిందీలో అరుదైన రికార్డ్

బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్‌  చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement