వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో పుష్పరాజ్ హవా మొదలైంది. ఈ రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్‌పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీకి రానుందనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తాజా సమాచారం. భారీ ధరకు పుష్ప-2ను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి మెప్పించింది. అంతేకాకుండా కిస్సిక్ అనే ఐటమ్‌సాంగ్‌లో శ్రీలీల మెరిసింది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment