పుష్ప 2 ఓటీటీ ప్రకటన.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Allu Arjun Starrer Pushpa 2 Movie Gets OTT Release Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలో పుష్ప 2.. రీలోడెడ్‌ వర్షన్‌తో సహా.. ఎప్పటినుంచంటే?

Published Mon, Jan 27 2025 1:38 PM | Last Updated on Mon, Jan 27 2025 3:27 PM

Allu Arjun Starrer Pushpa 2 Movie Gets OTT Release Date Out

'పుష్ప 2' మూవీ (Pushpa 2: The Rule)తో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరాచకం సృష్టించాడు. రికార్డులన్నీ రప్పారప్పా కొట్టుకుంటూ పోయాడు. గతేడాది డిసెంబర్‌ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాలకు పైనే అవుతుండటంతో అభిమానులు ఓటీటీలో పుష్పరాజ్‌ రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ వారమే ఓటీటీలో రిలీజ్‌
ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్‌ బయటకు వచ్చింది. పుష్ప 2 ఈ గురువారం (జనవరి 30న) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. పుష్ప 2 రీలోడెడ్‌ వర్షన్‌ గురువారం రిలీజ్‌ కానున్నట్లు యాప్‌లో చూపిస్తోంది. అందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు రాసుంది. రీలోడెడ్‌ వర్షన్‌ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.

సినిమా
పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.

చదవండి: ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్‌..: మంచు లక్ష్మి ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement