ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్‌..: మంచు లక్ష్మి ఆగ్రహం | Manchu Lakshmi Prasanna Fires On Indigo Airlines Over Luggage Bag Tag, Shares Tweets And Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఇండిగో సిబ్బందిపై మంచు లక్ష్మి ఆగ్రహం.. ఎయిర్‌లైన్స్‌ ఎలా నడుపుతున్నారంటూ..

Published Mon, Jan 27 2025 12:13 PM | Last Updated on Mon, Jan 27 2025 12:57 PM

Manchu Lakshmi Prasanna Fires on Indigo over Baggage Bag Tag

ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్‌ చేసింది. నా లగేజ్‌ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్‌ ఓపెన్‌ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.

ఇండిగో సిబ్బంది వేధింపులు
ఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్‌ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్‌ వేయలేదు, ట్యాగ్‌ కూడా వేయలేదని వీడియో సైతం షేర్‌ చేసింది.

 

 

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
కన్నడ బిగ్‌బాస్‌ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement