మనోజ్‌ కూతురి అన్నప్రాసన.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మంచు లక్ష్మి | Manchu Manoj, Mounika Bhuma Daughter Devasena Annaprasana | Sakshi
Sakshi News home page

మనోజ్‌-మౌనిక కూతురి అన్నప్రాసన.. మనసు సంతోషంతో నిండిపోయిందన్న మంచు లక్ష్మి

Published Thu, Sep 12 2024 8:42 PM | Last Updated on Fri, Sep 13 2024 9:40 AM

Manchu Manoj, Mounika Bhuma Daughter Devasena Annaprasana

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్‌ఎమ్‌ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్‌ఎమ్‌ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? 

సడన్‌ సర్‌ప్రైజ్‌
అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్‌ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.

మనోజ్‌ షర్ట్‌పై పులి బొమ్మ
ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్‌ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.

అన్నప్రాసన వేడుక
'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్‌ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాం. 

ఆ సంతోషం వెలకట్టలేనిది
నిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్‌ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.

భగవంతుడికి థ్యాంక్స్‌
ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్‌. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement