Manchu lakshmi prasanna
-
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? -
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్‌పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్‌బాబు), మోహన్‌లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
రేవ్ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్
హారర్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలలో నటించిన 'యక్షిణి' వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అయితే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది.తాను ముంబైకి షిఫ్ట్ కావడంతో అందరూ బాలీవుడ్‌కు వెళ్లానని భావించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. నేను ముంబై మాత్రమే వెళ్లాను. హైదరబాద్ నా ఇల్లుతో సమానం. నేను ఏ భాషలో అయినా నటిస్తాను. హాలీవుడ్లో నటించిన తర్వాత టాలీవుడ్,కోలీవుడ్‌లో చేశాను. అందులో తప్పేముంది. నా కూతురుతో పాటు నా భవిష్యత్ కోసమే ముంబై వెళ్లాను. అని మంచు లక్ష్మీ చెప్పింది.బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని మంచు లక్ష్మీ తెలిపింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పింది. పార్టీకి వెళ్లిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులది మాత్రమేనని ఆమె తెలిపింది. దానిలో అందరికీ ఏం సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించింది. -
కన్నప్ప మూవీలో ఛాన్స్? మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!
మంచు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మోహన్‌బాబు నిర్మాతగా విష్ణు 'కన్నప్ప' చిత్రం చేస్తుండగా, మనోజ్ 'మిరాయ్' మూవీ చేస్తున్నాడు. మంచు లక్ష్మీ 'యక్షిణి' అనే హారర్ సిరీస్‌లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లక్ష్మికి కొన్ని ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.నాతో నటించాలంటే భయంమీ సోదరుడు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో దాదాపు అన్ని భాషల స్టార్స్ నటిస్తున్నారు. మరి మీరు అందులో ఉన్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు మంచు లక్ష్మి స్పందిస్తూ.. 'మా ఇంట్లో ఉన్న అబ్బాయిలు నాతో కలిసి నటించాలంటే భయపడుతున్నారు. అందుకే నేను వారి సినిమాలు చేయడం లేదు. అందువల్లే ఇవ్వలేదేమోనేను నటిస్తే వాళ్లెక్కడ కనిపించరోనని వారి సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. ఇది సరదాగా అంటున్నానులే కానీ.. నాకు సరిపోయే క్యారెక్టర్ అందులో లేకపోవడం వల్లే విష్ణు నాకు సినిమా ఇవ్వలేదేమో! కన్నప్ప చాలా పెద్ద సినిమా.. నాతో పాటు మనోజ్‌కు కూడా ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. అయినా అందరం కలిసి చేస్తే అది ఫ్యామిలీ సినిమా అయిపోతుంది' అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తానన్న జాన్వీ కపూర్ -
'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. అది కూడా హారర్ బ్యాక్‌డ్రాప్ కావడం ఆసక్తి పెంచుతోంది. కొన్నిరోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సిరీస్ గురించి చెబుతూ వచ్చారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలానే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది కూడా అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?తెలుగులోనూ హారర్ కథలతో వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇప్పుడు అలా 'యక్షిణి' పేరుతో తీసిన సిరీస్‌లో మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 'బాహుబలి' నిర్మాతలు తీసిన ఈ సిరీస్.. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ట్రైలర్ బట్టి చూస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా పుడుతుంది. అలానే 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే శాపవిముక్తి జరుగుతుంది. దీంతో విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి తాను అనుకున్నది నెరవేర్చుకుందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.కాన్సెప్ట్ పరంగా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ట్రైలర్లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ పాత్రలే మెయిన్. మరి ఈ హారర్ సిరీస్.. తెలుగు ఓటీటీ ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
ఐదు భాషల్లో మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ ఫిలీం 'ఆదిపర్వం'. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... ‘ఆదిపర్వం’ ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన... ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్" అన్నారు. ఈ చిత్రంలో మంచులక్ష్మీతో పాటు శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, అవకాశాల కోసమే!
యాంకర్, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. అయితే టాలీవుడ్లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్‌కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్ అయినట్లు పేర్కొంది. ఆఫీసుకు రమ్మన్నా వస్తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. నాన్న అలాగే భయపడ్డాడు కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇచ్చింది. చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా -
Adiparvam: మంచు లక్ష్మి లుక్ అదిరిందిగా!
మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ... ‘మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి’ అన్నారు. ‘రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రమిది’అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ అన్నారు. ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
తమన్నా వయ్యారాలు, మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో చూశారా?
► బ్లూ కలర్లో ఉన్న బార్బీని అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ► మందు తాగుతూ చిల్ అవుతున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ► మెరిసిపోతున్న కృతీ శెట్టి ► శ్రద్ధాదాస్ కొత్త సెల్ఫీ ► పరికిణీలో శ్రీసత్య వయ్యారాలు ► తన అందంతో కుర్రకారును ఖైదీ చేస్తున్న తమన్నా ► పేరెంట్స్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మంచు లక్ష్మి View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
పెళ్లి వేడుకల్లో మనోజ్- మౌనిక.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహాం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో వేడుక జరిగింది. అయితే తాజాగా ఈ జంట సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ( ఇది చదవండి: పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్) అయితే ఈ పెళ్లికి సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్ - భూమా మౌనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా భూమా మౌనిక సినీతారల మధ్య చాలా ఫ్యాషన్‌గా కనిపించారు. ఎప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన మౌనికను అలా సినీ తారల మధ్య చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. గ్రాండ్‌గా జరిగిన మ్యారేజ్ పార్టీలో కొత్త జంటతో కలిసి స్టార్ హీరోలు సందడి చేశారు. ( ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రెడ్ డ్రెస్‌లో ప్రగ్యా మెరుపులు ..ఐఫాలో రాశీఖన్నా తళుకులు
► దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో లక్ష్మీ మంచు, రాశీ ఖన్నా మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. ► గౌనులో టీనేట్ పిల్లలా మారిపోయింది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేం అవికా గోర్ ► రెడ్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ వయ్యారాలు View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!
ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్ బాబు బర్త్‌డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. -
పెళ్లి వేడుకకు ముస్తాబైన మంచు లక్ష్మి నివాసం, ఫోటోలు వైరల్
మంచు వారింట పెళ్లి పనులు షురూ అయ్యాయి. మంచు మనోజ్, భూమా మౌనిక మరికొద్ది గంటల్లో ఏడడుగులు వేయనున్నారు. మంచు లక్ష్మీ నివాసం ఈ శుభకార్యానికి వేదికగా మారింది. దగ్గరుండి మరీ తమ్ముడి పెళ్లి జరిపించనుంది మంచు లక్ష్మి. ఇక ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మనోజ్ తాను మూడు ముళ్ల వేయబోయే మౌనిక ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ కొత్త పెళ్లికూతురు అని రాసుకురాగా అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ పెళ్లి కోసం ఫిలిం నగర్లో ఉన్న మంచు లక్ష్మి నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు. రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు మండపానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఇదే -
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం గ్లింప్స్..
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న నిర్మించారు. మంగళవారం ఈ సినిమా గ్లింప్స్‌ని హీరో రానా రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో లక్ష్మీప్రసన్న పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘అగ్ని నక్షత్రం’. రానా విడుదల చేసిన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి. -
సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులతో ట్రైలర్ అదిరిపోయింది. శాకుంతలగా సమంత మేకోవర్, మణిశర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , దుర్వాస మహర్షి పాత్రలో మంచు మోహన్ బాబు, భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది. (చదవండి: ఓపిక లేకపోయినా వచ్చాను.. సమంత ఎమోషనల్) తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో నిన్ను చూడడం మంత్రముగ్ధులను చేసింది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు’అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. . @Samanthaprabhu2, you nailed it with grace in #Shaakuntalam. 🙌🏻🤗 Nanna watching you as Durvasa Maharshi, has left me spellbound. 😍😍 Last and the cutest #Arha papa as #Bharathudu is a spectacle to watch out for!! ♥️https://t.co/iED4KfGNEm — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 9, 2023 -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై కొద్ది రోజులు పుకార్లు షికారు చేస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్-మౌనికరెడ్డి కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లి ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమెకు మనోజ్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం ‘మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే. ఈరోజుల్లో నిజాయితీ గల ప్రేమ పొందడం చాలా కష్టం. ఇప్పుడు మనోజ్ అలాంటి ప్రేమనే పొందుతున్నాడు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా ఆశీర్వాదం మనోజ్‌కు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యానించింది. చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
50 స్కూళ్లు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
సినీ నటి మంచు లక్ష్మి గొప్ప నిర్ణయం తీసుకుంది. 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని తెలిపింది. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మంచు లక్ష్మి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ఈ ముందడుగు తప్పకుండా విజయవంతం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ నోరు విప్పింది. దీంతో విలక్షణ నటుడు మోహన్ బాబు కూతరు సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా మంగళవారం(మార్చి 8) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం మంచు లక్ష్మి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్ కౌచ్, బాడి షేమింగ్‌పై స్పందిందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అవును ఇవన్ని నేను ఫేస్ చేశాను. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటివి ఎదురవ్వవు అనుకున్నాను. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాను. మోహన్ బాబు కూతురిని అయిన నేను సైతం కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. అంతేకాదు బాడీ షేమింగ్ ట్రోల్స్ బారిన కూడా పడ్డాను. నా శరీరాకృతి కర్వ్డ్గా ఉండటం వల్ల కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది కదా తనకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు. ఏ రంగంలో అయిన ప్రతీ మహిళా ఇవన్నీ ఫేస్ చేస్తుంది. మహిళలు పని చేసే ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ ఇలా అన్ని చోట్ల ఉంది. నా స్నేహితుల్లో కొంతమంది ఇలాంటి వాటి గురించి నాకు చెబుతుంటారు. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? ట్రోల్స్, బాడీ షేమింగ్స్ కూడా కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్నిచోట్లా ఉన్నాయి’ అని పేర్కొంది. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మహిళలు ముందుకు సాగాలని, మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంది. అలాగే ఈ జీవితం చాలా చిన్నదని, దాంట్లో వీటికి స్థానం ఇవ్వకుడదని చెప్పింది. ఇవేవి పట్టించుకోకుండా సంతోషంగా ఉండాలంది. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్.. ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదని, మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ సందేశం ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె మళయాళం, తమిళ సినిమాల్లో చేస్తోంది. మోహన్ లాల్ మానస్టర్ చిత్రంలో మంచు లక్ష్మి కీ రోల్ పోషిస్తుండగా.. ఇక తమిళంలోని ఓ సినిమాలో లేడి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. -
అవి డిలీట్ చేయండి.. లేదంటే రూ.10 కోట్ల దావా: మంచు ఫ్యామిలీ వార్నింగ్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల అనంతరం మంచు కుటుంబంపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ ట్రోల్స్ మరింత శృతి మించాయి. సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసిన విష్ణు మంచు, లక్ష్మి ప్రసన్నలపై ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. చదవండి: భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు! నిన్న(ఫిబ్రవరి 18) విడుదలైన సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సినిమాలోని మోహన్ బాబు నటన, డైలాగ్స్‌పై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నలతో పాటు మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వదలడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు ట్రోల్స్‌పై స్పందించి గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన ట్రోల్స్ ఆగకపోవడం తాజాగా మంచు ఫ్యామిలీ స్పందించింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇకనైన ట్రోల్స్ ఆపకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు మంచు ఫ్యామిలీ టీం తరపున శేషు కుమార్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తక్షణమే టోల్స్‌కు సంబంధించిన వీడియోలు, మీమ్స్ పోస్ట్‌లు డిలిట్ చేయాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. -
మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే వర్మ ఎవరీ పోస్ట్‌పై ఎలా స్పందిస్తాడో చెప్పడం కష్టమే. సామాజీక అంశాలతో పాటు సినీ సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు వర్మ. ఈ క్రమంలో ఆర్జీవీ చేసే పోస్ట్‌లు, ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. చదవండి: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు తాజాగా ఆయన మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నను టార్గెట్ చేశాడు. మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేస్తూ ఆమెపై షాకింగ్ కామంట్స్ చేశాడు. ‘హే మంచు లక్ష్మి.. నువ్వు చేయలేనిదంటూ ఏం లేదా? దీనికి ముగింపు ఉండదా? ఇది నువ్వేనా ఇప్పటికి నమ్మలేకపోతున్నా’ అంటూ మంచు లక్ష్మిని ప్రశంసించాడు. ఇక వర్మ తన ఫొటోపై సానుకూలంగా స్పందించడంతో మంచు లక్ష్మి తెగ మురిసిపోయింది. ఆర్జీవీ కామెంట్స్‌పై స్పందిస్తూ ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ‘వావ్ మీరు నన్ను పొగిడేశారు.. నా జీవితానికి ఇది చాలు. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. నటిగా నేను ఏదైనా చేయగలను. ఎప్పుడూ చెప్పేదే నేను ఆర్టిస్టిక్ కిల్లర్ ని’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపట్టు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ వస్తోంది మంచు లక్ష్మి. Awwwwww you made my whole life! Yes, your right there is NOTHING I cannot do as an artist. As I say, I call myself an artistic killer 💪🙌🏼💕 https://t.co/xpqFd6QOIR — Lakshmi Manchu (@LakshmiManchu) December 9, 2021 -
బాలయ్య టాక్ షో: చిరంజీవిపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ఇటీవల లాంచ్ చేసిన ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ షో ఎపిసోడ్ గురువారం విడుదలైంది. ఇందులో మోహన్ బాబు, బాలయ్య ఫుల్ సందడి చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచారు. ఈ క్రమంలో మోహన్ బాబు, బాలయ్య ఒకరిపై ఒకరూ ప్రశ్నల సంధించుకున్నారు. దీంతో ఈ టాక్ షో మరింత ఆసక్తిగా సాగింది. ఇలా ఆసక్తిగా సాగుతున్న షో మధ్యలోకి మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది, బాలయ్య, మోహన్ బాబు ఏమేం చర్చించుకన్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. చదవండి: మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్ చేసిన బన్నీ ఈ సందర్భంగా మోహన్ బాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకరోజు ఎన్టీఆర్‌తో నేను ‘అన్నయ్యా.. మీతో నేను ఓ సినిమా చేస్తా’మ అని అడిగాను. దానికి ఆయన రాజకీయాల్లో ఫేయిల్ అయ్యాను. ఇక సినిమాలు ఎవరు చూస్తారు అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దు’ అంటూ బదులిచ్చారు. అలా నాకు సలహా ఇచ్చి మరోసారి తన గొప్పతనాన్ని పంచుకున్నారు’’ అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. సినిమా కేరీర్ తాను వ్యక్తిగతం చాలా ఇబ్బందులు పడ్డానని, తన బ్యానర్లో వరస సినిమాలు ప్లాప్ అయితే భూములు అమ్మి డబ్బులు చెల్లించానంటూ కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత ఆ తర్వాత ‘అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, పెదరాయుడు, బ్రహ్మ’ చిత్రాల విజయాలతో మళ్లీ నిలదొక్కుకున్నానని చెప్పారు. అనంతరం షోలో భాగంగా చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటని బాలయ్య అడగ్గా.. ‘వ్యక్తిగతంగా చిరంజీవిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఆయన మంచి నటుడు. అంతకుమించి అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. అల్లు రామలింగయ్యగారి కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు.. కాబట్టే అతను బాగున్నాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. కర్ణాటకలో హైఅలర్ట్
-
పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ
Puneeth Rajkumar Dies: Celebrities, Fans pay Condolences: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. OMG!!!!!!!! Nooooooo. This can’t be true! How can this be? My deepest condolences to the family. May your soul rest in eternal peace. Gone too soon 💔 #PuneethRajkumar — Lakshmi Manchu (@LakshmiManchu) October 29, 2021 I just can’t process this!! Such a passionate ,warm and humble human being !! this is so tragic . Deepest condolence to his family .may his soul rest in peace 💔 #PuneethRajkumar — Hansika (@ihansika) October 29, 2021 పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని శాండల్‌వుడ్ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేగాక భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. Heartbroken 💔 Will always miss you my brother. #PuneethRajkumar — sonu sood (@SonuSood) October 29, 2021 The nicest person I've had the honor of crossing paths with... My Raajakumara 💔 — Priya Anand (@PriyaAnand) October 29, 2021 May your soul rest in peace. Gone too soon 💔 #PuneethRajkumar. When i did my first Kannada film always wanted to work with him… — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 29, 2021 Deeply shocked to know of the sudden demise of @PuneethRajkumar A powerful actor who won the hearts of people with his incredible body of work. Condolences to the family #RIP #Gonetoosoon #PuneethRajkumar pic.twitter.com/YuP08U2t8E — Boney Kapoor (@BoneyKapoor) October 29, 2021 GONE- one of our KINDEST, NICEST AND NOBLE soul. I don’ know what I am feeling . I am feeling so devastated. Brother you have left us very confused and heartbroken. The heavens are brighter today. I am still hoping this is not true . 🙏🙏🙏🙏🙏💔💔💔 pic.twitter.com/7wjXZzk0ND — Ranganathan Madhavan (@ActorMadhavan) October 29, 2021 Shocked and deeply heartbroken to hear this terrible news! We will all miss you dear Appu. You will live in our hearts forever! My condolences and prayers for the family to deal with this deep pain. #rip #PuneethRajkumar — Vivek Anand Oberoi (@vivekoberoi) October 29, 2021 I cannot process this. Cannot believe you've left us Puneeth. Kind, gifted, fearless...so much to give to the world. This is not fair brother. Heartbroken. — Siddharth (@Actor_Siddharth) October 29, 2021 💔💔💔 One of the kindest and warmest Actors/gentlemen. Praying to the almighty to give Puneeth Sirs family, friends and his ocean of fans the strength to cope with this irreplaceable loss. #RIP #PuneethRajKumar #Gentleman #actor #loss #cannotunderstand #soyoung pic.twitter.com/U8RyOJdFMu — dulquer salmaan (@dulQuer) October 29, 2021 Apart from the shocking tragedy that @PuneethRajkumar ‘s sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021 Ahh Noooo .. Gone too soon my dear Appu. I’m shattered .. Heart broken .. not fair #BlackFriday #PuneethRajkumar — Prakash Raj (@prakashraaj) October 29, 2021 One of the most humble and down to earth actors I’ve come across..Rest in Peace brother. #PuneethRajkumar — RAm POthineni (@ramsayz) October 29, 2021 Sometimes we don’t value the moment, till it’s gone 😭😭😭#Appu #Puneethrajkumar #kannadafilmindustry cannot comprehend this at all. pic.twitter.com/Zasg5px1Vl — Radikaa Sarathkumar (@realradikaa) October 29, 2021 Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar's demise. One of the most humble people I've met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021 Heartbroken! Can’t believe you have gone so soon. pic.twitter.com/55lt4r62d1 — Jr NTR (@tarak9999) October 29, 2021 My heartfelt condolences to Puneeth’s family. Such a young and humble child. I don’t understand God’s way of things sometimes. Sad day for the entire film fraternity. Praying for strength to his family. — Mohan Babu M (@themohanbabu) October 29, 2021 -
‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె నెటిజన్లపై మండిపడుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె తమ్ముడు మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచు లక్ష్మి ఓ ట్వీట్ చేసింది. చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్ దీంతో ఆమె ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్రోల్స్‌పై స్పందించిన లక్ష్మి నెటిజన్లకు క్లాస్ పీకుతూ మరో ట్వీట్ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ.. ‘ఈ రోజు అత్యంత శుభదినం. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా తమ్ముడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో చూస్తుంటాను’ అంటూ రాసుకొచ్చింది. Big Day Today! ❤️🤞🏼 @iVishnuManchu's swearing in ceremony as the President of the Movie Artist Association. All the very best and all my blessings as you commence your new journey to change the world. I'm so proud of you and cannot wait to see what's about to unfold! — Lakshmi Manchu (@LakshmiManchu) October 16, 2021 చదవండి: వివాదంలో పెళ్లి సందD హీరోయిన్.. ఆమె నా కూతురు కాదంటూ.. దీంతో ఆమె ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేయడం ప్రారంభించారు. ‘ఓ ‘మా’ అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎలా మార్చగలడు’ అంటూ కామెంట్స్ చేశారు. తన ట్వీట్‌పై వస్తున్న కామెంట్స్‌కు మంచు లక్ష్మి స్పందిస్తూ నెటిజన్లపై అసహనం వ్యక్తం చేసింది. ‘ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవరిని ఎప్పుడు, ఎలా కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీ నటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. Calm down people! Shooot... always ready to jump. Maybe I should have said change the world of our Association — Lakshmi Manchu (@LakshmiManchu) October 16, 2021 -
శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి
Manchu Lakshmi Comments On Shriya Saran Pregnancy: హీరోయిన్ శ్రియ సరన్ గతేడాది తనకు బిడ్డ పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన పేరు రాధ అని శ్రియ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రియ తల్లైన విషయం తెలిసి అందరూ సంతోషించినప్పటికి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్ కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కూడా స్పందించింది. చదవండి: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్ శ్రియా సరన్ శ్రియ పోస్ట్‌కు ఆమె రీట్వీట్ చేస్తూ.. ఇది ఎప్పటికి గొప్ప శుభవార్త అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ‘శుభవార్త చెప్పావు శ్రియ. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించడంలో నువ్వు తీసుకున్న సమయం విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం’ అని పేర్కొంది. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. @shriya1109 💕 pic.twitter.com/RUfFsxqb1N — Lakshmi Manchu (@LakshmiManchu) October 12, 2021 -
‘సాయి అలాంటి వాడు కాదు, వదంతులు పుట్టించకండి’
Manchu Lakshmi Tweet About Sai Dharam Tej: యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. అంతేకాదు యాక్సిడెంట్ విషయం తెలిసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి సాయి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ కూడా మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయి తేజ్‌ను చూసి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి తెలుసుకుంది. ఆనంతరం తిరిగి వెళ్లిన మంచు లక్ష్మీసాయికి జరిగిన ప్రమాదం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలపై స్పందించింది. చదవండి: Sai Dharam Tej Accident: ‘ఈ సమయంలో రాజకీయాలు చేయకండి’ ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘తేజ్ బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు తెలిసినంతవరకూ తేజ్ ఎంతో బాధ్యతాయుతమైన పౌరుడు. అతను ఏక్షణంలోనూ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే అతనికి ఈ ప్రమాదం జరిగిందని అక్కడ క్లియర్‌గా తెలుస్తోంది. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడు అతను క్షేమంగానే ఉన్నాడు. సాయి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం’ అంటూ రాసుకొచ్చింది. Tej is one of the most responsible citizens that I know. It is very clear that he wasn’t speeding at any given moment. There was mud on the road that led to the accident. I request all of you to stop spreading rumours. — Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021 అలాగే ఆమె తమ్ముడు, హీరో మంచు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఆయన లాంటి మంచి వ్యక్తి దొరకరు సచ్ స్వీట్ హాట్ అని పేర్కొన్నాడు. అంతేగాక ఆయనపై దయచేసి ఎవరూ చెడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇక సాయి ధరమ్‌కు జరిగిన ప్రమాదం స్పాట్‌కు వెళ్లి చూశానని, తరచూ మేము వెళ్లే స్పాట్ అన్నాడు. సాయి ప్రమాదం జరగానే వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించిన వారికి మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ ఇదిలా ఉండగా సాయి ప్రమాదంపై సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. హీరో శ్రీకాంత్ నరేశ్ వ్యాఖ్యలు తనకు ఇబ్బందిగా అనిపించాయంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా నరేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అంతేగాక వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే వేగం విషయంలో యువత కంట్రోల్లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాటే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ -
శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మి
హీరో మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్నలు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండుగ సందర్భంగా వారిద్దరూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్భంగా తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. అంతేగాక లక్ష్మీ, తాను అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నారు. చదవండి: MAA Elections: త్వరలోనే ఆ కల నెరవేరబోతుంది: మంచు విష్ణు ఇద్దరూ వేరువేరుగా ప్లాన్ చేసుకుని అనుకోకుండా ఇక్కడ కలిశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన సినిమాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే దీనిపై అప్డేట్ ఇవ్వనున్నట్లు కూడా తెలిపాడు. ఇక తాను కొత్తగా ఓ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు కూడా వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కొత్త ఓ వెంచర్‌ను మొదలు పెట్టబోతున్నానని పేర్కొన్నారు. చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్ -
‘మంచు’ వారి ఇంట్లో మోహన్‌లాల్ సందడి, ఫోటోలు వైరల్
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబుకు మలయాళ, తమిళ సీనియర్ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికి మోహన్‌బాబుతో టచ్‌లో ఉంటారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా మోహన్‌బాబుని కలిసి వెళ్తుంటారు. తాజాగా మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. మంచువారి ఇంట్లో సందడి చేశాడు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. మోహన్‌లాల్ నటిస్తున్న ‘బ్రో డాడీ’మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
‘కార్తీకదీపం’ పై మంచు లక్ష్మీ ట్వీట్.. రిప్లై ఇచ్చిన ‘డాక్టరు బాబు’
Karthika Deepam : బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ చూస్తామా? అని తహతహలాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్‌కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచీ పాజిటివ్ టాక్‌తో టాప్ రేటింగ్ రాబడుతూ దేశంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మొదటి సీరియల్‌గా నిలిచింది. ఈ సూపర్ హిట్ సీరియల్‌కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. Karthik from #karthikadeepam cried for the first time anta. My mom is finally happy.. — Lakshmi Manchu (@LakshmiManchu) May 22, 2021 ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. ‘కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీగారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ట్వీట్‌ని డాక్టరు బాబు(నిరుపమ్ ) షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు. We too are happy for this tweet!! ❤ https://t.co/XUlxvIGWGX — starmaa (@StarMaa) May 22, 2021 చదండి: కారీక దీపం.. దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్ -
హ్యట్, క్రికెట్ బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి
-
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్‌డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్‌కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
అప్పుడే మా బాధ మీకు తెలుస్తుంది!
సాక్షి, హైదరాబాద్: నగర రోడ్లపై ప్రయాణం రోజురోజుకు నరకప్రాయంగా మారుతోంది. ఇందుకు ప్రకృతి సంబంధ కారణాలు కొన్నయితే, మానవ సంబంధిత అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు వెళ్లే సమయంలో ఆయా మార్గాల్లో ప్రొటోకాల్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో తాను ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయానంటూ టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు సామాన్య వ్యక్తులుగా నగరంలో ప్రయాణిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. నగరంలోని హైటెక్స్ ఏరియాలో నటి మంచు లక్ష్మీ గంటన్నర సమయం పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో 'గంటన్నర సమయం హైటెక్స్ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతోందంటూ' ఆమె ట్వీట్ ద్వారా సమస్యను షేర్ చేసుకున్నారు. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్ధతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు. I've been stuck around hitex for 11/2hr. Grrrrrrrr. Politicians here should drive like us without protocol to see what we go thru.😤 — Lakshmi Manchu (@LakshmiManchu) 5 October 2017 -
నాన్నకు నేను విలన్ అయినా.. ఆయన నాకు విలన్ అయినా ఓకే!
‘‘సినిమా పరిశ్రమలోకి ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ పక్కా భవిష్యత్ ప్రణాళికతో వస్తున్నారు. ఐదేళ్లు, పదేళ్లు ఇండస్ట్రీలో ఉండి తర్వాత పెళ్లి చేసుకుని సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ, నేనలా అనుకోవడం లేదు. జీవితాంతం యాక్టర్‌గా కొనసాగాలనుకుంటున్నా’’ అని మంచు లక్ష్మీప్రసన్న తన మనసులోని మాట చెప్పారు. నేడు (శనివారం) లక్ష్మీ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారామె. ఈ పుట్టినరోజుకు ప్రత్యేకించి ఎటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ పెట్టుకోలేదు. అమ్మ, నాన్న, భర్త, కూతురు, సోదరులు, మేనకోడళ్లతో ఈ రోజు ఒక్కపూటైనా కలిసి భోజనం చేయాలనుకుంటున్నా. నేను బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు చేసినా ‘మేము సైతం’ చాలా సంతృప్తినిస్తోంది. ఎంతో మందికి చేయూతనిస్తోన్న ప్రోగ్రామ్ ఇది. ఈ షోకి చాలామంది సెలబ్రిటీలను పిలిచినా ప్రభాస్‌ను మాత్రం పిలవలేదు. ‘బాహుబలి’ షూటింగ్లో తను బిజీగా ఉన్నందున పిలిస్తే దర్శకుడు రాజమౌళికి కోపం వస్తుందని ఆగా. నా క్లోజ్ ఫ్రెండ్ రానా మాత్రం షూటింగ్లో ఉన్నా వచ్చాడు. ఇటువంటి షో చేయడానికి రీజన్ ఏమీ లేదు. ‘అందరూ చేసింది నేను చేయలేను.. నేను చేసింది ఎవరూ చేయలేరు’ అని ఆలోచిస్తూ ముందుకెళతా. మంచి కథ లొస్తే నిర్మాతగానూ కొనసాగుతా. నాన్నగారితో కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలనుంది. కానీ, నాకు సవాల్‌గా అనిపించే పాత్ర కుదరడం లేదు. ఆయనకు నేను విలన్‌గా అయినా.. ఆయన నాకు విలనైనా ఓకే. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో నేను లీడ్ రోల్ చేసిన ‘లక్ష్మీబాంబ్’ దీపావళికి ముందు కానీ, తర్వాత కానీ విడుదలవుతుంది. దర్శక-నిర్మాతలు ఈ చిత్రం టైటిల్ చెప్పినప్పుడు నాకు సిగ్గేసింది. కానీ, అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్ టైటిల్ పెట్టారంటూ చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘లక్ష్మీబాంబ్’ తర్వాత ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయబోతున్నాను. అడవి శేష్‌ని హీరోగా అనుకుంటున్నాం. తను డేట్స్ ఇవ్వడం లేదు. మా అమ్మాయి విద్యానిర్వాణ ఆనంద్ యాక్టర్ కావాలని కోరుకుంటున్నా. ఆ విషయంలో నేను బలవంతం చేయను. తన ఇష్టం. తను డాక్టర్ అయితే డా.విద్య అనీ, యాక్టర్ అయితే నిర్వాణ మంచు అని ఫిక్స్ అయిపోతా (నవ్వుతూ). -
పానీపూరీ అమ్మిన హీరో..
-
పానీపూరీ అమ్మిన హీరో మంచు విష్ణు
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు శుక్రవారం కూకట్‌పల్లిలో పానీపూరీ అమ్మాడు. విష్ణు ఏంటీ పానీపూరీ అమ్మడం ఏంటానుకుంటున్నారా?. అసలు విషయానికి వస్తే విష్ణు సోదరి లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం విష్ణు పానీపూరీ అమ్మాల్సి వచ్చింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, దగ్గుబాటి రానా, మోహన్ బాబు, అఖిల్ అక్కినేని, నానీ, రవితేజ, యాంకర్ సుమ తదితరులు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే. -
శివకాశి లక్ష్మీబాంబ్!
దీపావళి పండగంటే మనకు గుర్తొచ్చేది శివకాశీ టపాసులు. ఆ టపాసుల్లో లక్ష్మీబాంబ్ చాలా పవర్ఫుల్. అటువంటి ‘లక్ష్మీబాంబ్’ పేరుతో మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభమైంది. ఉపశీర్షిక- ‘ఫ్రమ్ శివకాశి’. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు మనోజ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, మరో హీరో మంచు విష్ణు క్లాప్ కొట్టారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ- ‘‘ఈ కథ విని, చాలా ఎగ్జయిట్ అయ్యా. ఇప్పటి వరకూ నేనెన్నో పాత్రలు చేశా. వాటన్నింటికీ భిన్నంగా తొలిసారి జడ్జి పాత్రలో కనిపించనున్నా’’ అని తెలిపారు. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కథ కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఈ చిత్రంలో లక్ష్మిది పవర్ఫుల్ రోల్’’ అని కథ-మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్, కెమేరా: అంజి. -
టమాటే.. ఆలూయే.. గోబీయె!
కూరగాయలు అమ్మడం చిన్న విషయం కాదు. టమాటే.. ఆలూయే.. గోబీయె.. అంటూ కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకోవడం కోసం పెట్టే కేకలకు చాలా ఎనర్జీ ఉండాలి. ఇది అలవాటు లేని పనే అయినా రకుల్ ప్రీత్‌సింగ్ చాలా ఓపికగా, ఎనర్జిటిక్‌గా కూరగాయలు అమ్మేశారు. దీనికో కారణం ఉంది. ఓ ప్రముఖ టీవీ చానల్ ‘మేము సైతం’ పేరుతో ఓ షో చేయనుంది. దీనికి మంచు లక్ష్మీప్రసన్న హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ మాల్ ఎదురుగా రకుల్ ప్రీత్ కూరగాయలు అమ్మారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘లక్ష్మీ మంచు షో కోసం కూరగాయలు అమ్మబోతున్నా. అందరూ వచ్చి కూరలు కొనుక్కోవచ్చు’’ అని ముందుగానే రకుల్ ప్రకటించారు. ఈ బ్యూటీ కూరగాయలు అమ్మడాన్ని కొంతమంది విచిత్రంగా చూస్తే, కుర్రకారు మాత్రం మురిపెంగా చూశారు. -
స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. -
’ర్యాగింగ్ బాద్యులపై చర్యలేవి ?'
-
ఒళ్లు విల్లు మది హరివిల్లు!
యోగా అదృష్టవశాత్తూ భారతభూమి యోగాకు పుట్టినిల్లు. కాలం అత్యాధునికమైనకొద్దీ సంభవిస్తున్న జీవనశైలి రుగ్మతలకు విరుగుడు ఆ అతి ప్రాచీన విధానంలో దొరకడం ఒక విచిత్రం! ఆనందం కూడా! యోగా మనదగ్గరే ఉంది కాబట్టి. జగ్గీ వాసుదేవ్ వాణి, మంచు లక్ష్మీప్రసన్న బాణి.... ఇవీ ఇకముందు ఈ పేజీల్లో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ అరుదైన కాంబినేషన్లో యోగా తరగతులు ఫన్డే పాఠకులకు ప్రత్యేకం... యోగా అనేది మన దేశం మనకిచ్చిన వరం. గత పదేళ్లుగా నేను యోగా చేస్తున్నాను. యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. మనసుకి చెందింది. ముందుగా యోగా ప్రభావం మన మానసిక స్థితిపై ఉంటుంది. మనసుకి, శరీరానికి మధ్య ఒక వంతెన వేసేదే యోగా. నన్ను చూసి మరో పదిమంది యోగా నేర్చుకోడానికి ముందుకి వస్తారని ఆశిస్తున్నాను. - మంచు లక్ష్మి అసలు యోగా అంటే ఏమిటి? యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లో తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తల్లకిందులుగా ఉంచడం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరేవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. మీరు అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు? ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అనీ, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అనీ చెబుతోంది. ప్రపంచ మతాలు కూడా ‘దేవుడు అంతటా ఉన్నాడు’ అని చెబుతున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్తపరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాన్ని నమ్ముతాడు. కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠయోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. కేవలం భౌతిక అంశానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే ‘టెన్నిస్ ఆడండి లేదా నడవండి’ అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు. దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలామంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు. కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినైనా మూర్ఖంగా చేస్తే దాని వల్ల మీకు హాని కలుగుతుంది. హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. హఠయోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగైపోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి. ప్రేమాశీస్సులతో సద్గురు రిపోర్టింగ్: భువనేశ్వరి -
'పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్'
నేడు రాజకీయా పార్టీ జనసేన పేరు ప్రకటించనున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె నటీ మంచు లక్ష్మీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌కు ఆమె మద్దతు ప్రకటించారు.ప్రజల కోసం మంచి చేసే వారికి తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని వెల్లడించారు.ఓ వేళ పోటీ చేస్తే చెబుతానని తెలిపారు.పవన్ పార్టీ తరపున ఎన్నికల్లో ఆమె కుటుంబ సభ్యులు ఎవరన్నా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు లక్ష్మీ ప్రసన్నపై విధంగా సమాధానమిచ్చారు.