వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే వర్మ ఎవరీ పోస్ట్‌పై ఎలా స్పందిస్తాడో చెప్పడం కష్టమే. సామాజీక అంశాలతో పాటు సినీ సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు వర్మ. ఈ క్రమంలో ఆర్జీవీ చేసే పోస్ట్‌లు, ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
చదవండి: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
తాజాగా ఆయన మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నను టార్గెట్ చేశాడు. మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేస్తూ ఆమెపై షాకింగ్ కామంట్స్ చేశాడు. ‘హే మంచు లక్ష్మి.. నువ్వు చేయలేనిదంటూ ఏం లేదా? దీనికి ముగింపు ఉండదా? ఇది నువ్వేనా ఇప్పటికి నమ్మలేకపోతున్నా’ అంటూ మంచు లక్ష్మిని ప్రశంసించాడు. ఇక వర్మ తన ఫొటోపై సానుకూలంగా స్పందించడంతో మంచు లక్ష్మి తెగ మురిసిపోయింది. ఆర్జీవీ కామెంట్స్‌పై స్పందిస్తూ ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.
చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన
‘వావ్ మీరు నన్ను పొగిడేశారు.. నా జీవితానికి ఇది చాలు. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. నటిగా నేను ఏదైనా చేయగలను. ఎప్పుడూ చెప్పేదే నేను ఆర్టిస్టిక్ కిల్లర్ ని’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపట్టు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ వస్తోంది మంచు లక్ష్మి.
Awwwwww you made my whole life! Yes, your right there is NOTHING I cannot do as an artist. As I say, I call myself an artistic killer 💪🙌🏼💕 https://t.co/xpqFd6QOIR
— Lakshmi Manchu (@LakshmiManchu) December 9, 2021
Comments
Please login to add a commentAdd a comment