
'పవన్ కల్యాణ్ ఆల్ ది బెస్ట్'
నేడు రాజకీయా పార్టీ జనసేన పేరు ప్రకటించనున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె నటీ మంచు లక్ష్మీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్కు ఆమె మద్దతు ప్రకటించారు.ప్రజల కోసం మంచి చేసే వారికి తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని వెల్లడించారు.ఓ వేళ పోటీ చేస్తే చెబుతానని తెలిపారు.పవన్ పార్టీ తరపున ఎన్నికల్లో ఆమె కుటుంబ సభ్యులు ఎవరన్నా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు లక్ష్మీ ప్రసన్నపై విధంగా సమాధానమిచ్చారు.