టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
సంతోషంలో మంచు లక్ష్మి
పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీలా ఉండాలి..
ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్.
చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..!
Comments
Please login to add a commentAdd a comment