Mounika Bhuma
-
రచ్చకెక్కిన ‘మంచు’ గొడవ.. అర్ధరాత్రి చొక్కాలు చించుకుని ఫైటింగ్ (ఫొటోలు)
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్‌పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో మంచు మనోజ్, మౌనిక కుమారుడు ధైరవ్ పుట్టినరోజు (ఫొటోలు)
-
ఈ జీవితాన్ని అందంగా మార్చేశావ్.. థాంక్యూ: మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక సంతోషంలో తేలియాడుతోంది. ఎందుకంటే ఈరోజు తన మొదటి కుమారుడు ధైరవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'హ్యాపీయెస్ట్ బర్త్‌డే.. నీ ప్రేమ, ఎనర్జీ, స్మైల్.. అన్నీ కూడా ప్రతి రోజు నన్ను మరింత బెటర్‌గా మారుస్తున్నాయి. నన్ను చూస్తూ ఉన్నప్పుడు..నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ. నువ్వు ఇంకా మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలి. నువ్వు నా చీర్ లీడర్. నువ్వు నన్ను చూస్తూ ఉండిపోయినప్పుడు ఎంత ముద్దొస్తావో! అప్పుడు నేను కూడా పసిపాపనైపోతాను. ఈ జీవితాన్ని ఇంత అందంగా మలచడం నిజంగా గ్రేట్. అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మనోజ్, నేను నీ వెంటే నిలబడతాం. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. గతేడాది పెళ్లిఇది చూసిన మనోజ్ అభిమానులు.. పిల్లవాడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా మౌనిక గతంలో వ్యాపారవేత్త గణేశ్ రెడ్డిని పెళ్లాడింది. వీరికి పుట్టిన బాబే ధైరవ్. అయితే దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్ కూడా గతంలో ప్రణతిని పెళ్లి చేసుకోగా ఇద్దరూ విడిపోయారు. మనోజ్- మౌనిక గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఆమెకు దేవసేన ఎమ్ఎమ్ పులి అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) చదవండి: విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ హర్ష -
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
ఎంతో సింపుల్‌గా మనోజ్ భార్య మౌనిక సీమంతం..
మంచు మనోజ్ దంపతుల సంతోషం త్వరలోనే రెట్టింపు కానుంది. వారి కుటుంబంలోకి త్వరలోనే మరో బుజ్జాయి రానుంది. మనోజ్ సతీమణి భూమా మౌనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే! తను గర్భం దాల్చిన విషయాన్ని మనోజ్ దంపతులు గతేడాది డిసెంబర్లోనే సోషల్ మీడియాకు వెల్లడించారు. కవలలు? ఈ క్రమంలో మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆమె కవలలకు జన్మనివ్వనుందని రాసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే సదరు వార్తలపై మనోజ్ స్పందిస్తూ.. ఏ ప్రచారాన్ని నమ్మవద్దని కోరాడు. ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భిణి అని.. మే నెలలో ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం వెయిటింగ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. సీమంతం తాజాగా మౌనిక సీమంతం నంద్యాలలో సింపుల్‌గా జరిగింది. ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పసుపు చీరలో మౌనిక ముఖం వెలిగిపోతుండగా ఆమె పక్కనే నిల్చున్నాడు మనోజ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మనోజ్- మౌనిక గతేడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్ పార్టీలో ఇతడే హైలైట్.. తేడా పోజులతోనే ఫేమస్.. -
నాకు, ధైరవ్‌కు చోటిచ్చినందుకు థ్యాంక్స్: మనోజ్ భార్య ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే గతేడాది ఈ పెళ్లి జరిగింది. ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రియురాలిని పెళ్లాడిన మనోజ్.. ధైరవ్ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. త్వరలోనే ధైరవ్తో ఆడుకునేందుకు బుజ్జి పాపాయి రానుంది. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే! మన మధ్య బోలెడు జ్ఞాపకాలు.. నేడు (మార్చి 3) మనోజ్- మౌనికల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తాము కలిసున్న ఫోటోలు షేర్ చేసింది మౌనిక. 'హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హజ్బెండ్.. ఈ జీవితం మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్‌కు నీ హృదయంలో చోటిచ్చినందుకు థ్యాంక్స్.. ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్, క్రేజీషిప్.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్‌కు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ లవ్యూ.. ఎందుకంటే, నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేశాయి. సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుకుందాం.. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్.. ఐ లవ్యూ.. నా మనసులో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది మౌనిక. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) చదవండి: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక
మంచు మనోజ్, భూమా మౌనిక గతేడాది పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి వీరికి అన్నీ కలిసొస్తున్నాయి. కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న మనోజ్ కొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అలాగే ప్రస్తుతం ఓ షో కూడా చేస్తున్నాడు. ఇక మౌనిక కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. పిల్లల కోసం ఆటవస్తువులు, బొమ్మలు తయారు చేసి అమ్మే కంపెనీ మొదలుపెట్టింది. ప్రెగ్నెన్సీ.. బాహుబలి, సలార్, ఆర్ఆర్ఆర్, రోబో... ఇలా సినిమాల్లోని పవర్ఫుల్ క్యారెక్టర్లను బొమ్మల రూపంలో తీసుకువచ్చేందుకు మనోజ్-మౌనిక దంపతులు ప్రయత్నిస్తున్నారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ వీళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఈ జంట ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ధైరవ్తో ఆడుకునేందుకు మరో బుజ్జాయి ఈ ప్రపంచంలోకి రానుందంటూ మౌనిక తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. తాజాగా ఆమె తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. నువ్వు నా ప్రాణం.. 'నా ఈ జీవితం.. నాతో పాటు ఎల్లప్పుడూ పక్కనే ఉన్నవాళ్లను ఆకర్షిస్తుంది. వారితో నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది' అంటూ మనోజ్‌ను, తన మొదటి కుమారుడు ధైరవ్‌ను ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌కు మనోజ్ స్పందిస్తూ.. 'పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం మౌనిక బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika)