ఈ జీవితాన్ని అందంగా మార్చేశావ్‌.. థాంక్యూ: మౌనిక | Bhuma Mounika Best Birthday Wishes to Dhairav | Sakshi

నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ, ఎల్లప్పుడూ నీ వెంటే..: మౌనిక

Aug 1 2024 3:48 PM | Updated on Aug 1 2024 5:10 PM

Bhuma Mounika Best Birthday Wishes to Dhairav

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ భార్య మౌనిక సంతోషంలో తేలియాడుతోంది. ఎందుకంటే ఈరోజు తన మొదటి కుమారుడు ధైరవ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే.. నీ ప్రేమ, ఎనర్జీ, స్మైల్‌.. అన్నీ కూడా ప్రతి రోజు నన్ను మరింత బెటర్‌గా మారుస్తున్నాయి. 

నన్ను చూస్తూ ఉన్నప్పుడు..
నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ. నువ్వు ఇంకా మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలి. నువ్వు నా చీర్‌ లీడర్‌. నువ్వు నన్ను చూస్తూ ఉండిపోయినప్పుడు ఎంత ముద్దొస్తావో! అప్పుడు నేను కూడా పసిపాపనైపోతాను. ఈ జీవితాన్ని ఇంత అందంగా మలచడం నిజంగా గ్రేట్‌. అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మనోజ్‌, నేను నీ వెంటే నిలబడతాం. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. 

గతేడాది పెళ్లి
ఇది చూసిన మనోజ్‌ అభిమానులు.. పిల్లవాడికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. కాగా మౌనిక గతంలో వ్యాపారవేత్త గణేశ్‌ రెడ్డిని పెళ్లాడింది. వీరికి పుట్టిన బాబే ధైరవ్‌. అయితే దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్‌ కూడా గతంలో ప్రణతిని పెళ్లి చేసుకోగా ఇద్దరూ విడిపోయారు. మనోజ్‌- మౌనిక గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఆమెకు దేవసేన ఎమ్‌ఎమ్‌ పులి అని నామకరణం చేశారు.

 

 

చదవండి: విడాకుల రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్‌ హర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement