విడాకుల రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్‌ హర్ష | Harsha Chemudu Gives Clarity On Divorce Rumours | Sakshi
Sakshi News home page

జీవితమంటే ఇంతే.. ఎదురీదలేం.. ఒంటరిగానే పూర్తి చేయండి: హర్ష

Aug 1 2024 1:58 PM | Updated on Aug 1 2024 4:01 PM

Harsha Chemudu Gives Clarity On Divorce Rumours

కమెడియన్‌ హర్ష ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. జీవితం అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్‌మెంట్‌, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్‌ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్‌ చేయాల్సిందే!

విడాకుల రూమర్స్‌పై క్లారిటీ
అసలేదీ ఆశించకూడదు.. తర్వాత నిరాశ చెందకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు పోవడమే అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన జనాలు హర్షకు ఏమైందని కంగారుపడ్డారు. కొందరైతే అతడు విడాకులు తీసుకోబోతున్నాడంటూ పుకార్లు సృష్టించారు. దీంతో హర్ష తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం సాఫీగానే ఉందని, కెరీర్‌లోనే చిన్న ఆటంకాలని తెలిపాడు.

హ్యాపీగా ఉన్నా
ఈ మేరకు మరో పోస్ట్‌ షేర్‌ చేశాడు. మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకు సాగుతాం.. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు.. నా జీవితంలో యోగక్షేమాలను ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను. పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దానివల్లే ఇబ్బందులు పడుతున్నాను.

చెత్త రాజకీయాలు
అయినా ఇవన్నీ ప్రతిచోటా ఉండేవే..! ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరితోనో అనిపించుకునే స్థాయికి రాకండి.. ఒంటరిగా ఒక్కరే పూర్తి చేయండి. చేయగలను అన్న విశ్వాసం ఉంచండి. ఏదేమైనా నేను బాగానే ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు. కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు.

 

 

 

 

చదవండి: 12th ఫెయిల్‌.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement