viva Harsha
-
ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన ప్రమఖ హాస్య నటుడు వైవా హర్ష (ఫోటోలు)
-
విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ హర్ష
కమెడియన్ హర్ష ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్మెంట్, చికాకు, భయం, థ్రిల్.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్ చేయాల్సిందే!విడాకుల రూమర్స్‌పై క్లారిటీఅసలేదీ ఆశించకూడదు.. తర్వాత నిరాశ చెందకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు పోవడమే అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు హర్షకు ఏమైందని కంగారుపడ్డారు. కొందరైతే అతడు విడాకులు తీసుకోబోతున్నాడంటూ పుకార్లు సృష్టించారు. దీంతో హర్ష తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం సాఫీగానే ఉందని, కెరీర్లోనే చిన్న ఆటంకాలని తెలిపాడు.హ్యాపీగా ఉన్నాఈ మేరకు మరో పోస్ట్ షేర్ చేశాడు. మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకు సాగుతాం.. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు.. నా జీవితంలో యోగక్షేమాలను ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను. పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దానివల్లే ఇబ్బందులు పడుతున్నాను.చెత్త రాజకీయాలుఅయినా ఇవన్నీ ప్రతిచోటా ఉండేవే..! ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరితోనో అనిపించుకునే స్థాయికి రాకండి.. ఒంటరిగా ఒక్కరే పూర్తి చేయండి. చేయగలను అన్న విశ్వాసం ఉంచండి. ఏదేమైనా నేను బాగానే ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు. కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: 12th ఫెయిల్.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్ -
అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష
బాడీ షేమింగ్ అనేది సినిమాల్లో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మాట పడిన కమెడియన్స్.. బయటకు నవ్వుతూ కనిపించినా సరే లోలోపల చాలా కుమిలిపోతుంటారు. అయితే ఇలాంటి అనుభవాల్ని ఎప్పుడో ఓసారి బయటపెడితే తప్పితే ఈ విషయాలు బయటకురావు. అలా కమెడియన్ వైవా హర్ష.. తన రంగు, శరీరాకృతిపై ఇండస్ట్రీలో పడ్డ మాటల్ని, ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టాడు. తాజాగా 'సుందరం మాస్టర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవన్నీ రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) 'ఆస్తమా తగ్గడం కోసం చిన్నప్పుడు స్టెరాయిడ్ ఉపయోగించాల్లి వచ్చింది. ఫలితంగా నేను బొద్దుగా అయిపోయాను. స్కూల్ చదువుతున్న టైంలోనే లావుగా ఉన్నానని ఏడిపించేవారు. ట్రైన్లో పేరెంట్స్‌తో వెళ్లాలన్నా సరే చాలా భయంగా ఉండేది. ఎందుకంటే.. 'వాడు చూడు ఎంత నల్లగా ఉన్నాడోనని' అని నన్ను చూపించి.. ఎదురుగా ఉన్నవాళ్లు మాట్లాడుకుంటారని భయంగా ఉండేది' ''కలర్ ఫోటో' సినిమా చేసేంతవరకు కూడా.. అరె మనం ఇండస్ట్రీకి వచ్చిన ఏం చేస్తున్నాం అని అనుకునేవాడిని. కానీ బిల్స్ కట్టడం కోసం ఇష్టం లేకపోయినా సరే పిచ్చి పిచ్చి పాత్రలన్నీ చేశా. ఈ క్రమంలోనే అస్సలు ఇక్కడ ఉండాలనిపించేది కాదు, ఎక్కడికైనా పారిపోవాలనిపించేది.. ఏంటి ఇక్కడికి వచ్చింది ఇది చేయడానికి కాదు కదా అనిపించేది. అప్పట్లో సెట్స్ మీద నా కలర్, బాడీ గురించి జోకులు వేసేవారు. అయినా సరే డబ్బులు కోసం అవన్నీ భరించాను. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరేం కామెంట్ చేయనప్పటికీ.. డిజిటల్ మాధ్యమాల్లో మాత్రం నాపై ఇప్పటికీ జోకులు వేస్తుంటారు' అని వైవా హర్ష చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) -
హీరో అవ్వాలని ఉద్దేశం నాకు లేదు.. ఆ తర్వాత సీన్ రివర్స్"
-
ఆలోచింపజేసే సుందరం మాస్టర్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. ప్రతీసారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ‘సుందరం మాస్టర్’లో కామెడీతో పాటు డ్రామా ఉంటుంది. ఇది అందర్నీ ఆలోచింపజేసే చిత్రమవుతుంది’’ అని హర్ష చెముడు అన్నారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న హర్ష చెముడు హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్య శ్రీపాద హీరోయిన్. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో చిరంజీవి విడుదల చేసి, సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఓ గిరిజన గ్రామంలో అందరూ స్పష్టంగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడతారనే దానికి గల కారణం మా సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సుధీర్ కుమార్ కుర్రు. -
వైవా హర్ష గృహప్రవేశం.. అటెండ్ అయిన మెగా హీరో !
ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ వైవా హర్ష కొత్తింటి కల సాకారం చేసుకున్నాడు. తాజాగా అతడు తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇంట్లో పాలు పొంగించి, పూజ చేసుకున్న ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ వచ్చి హర్షకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్తింట్లో అడుగుపెట్టిన హర్షకు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో వీడియో తీసి బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అతడి పేరు వైవా హర్షగా స్థిరపడిపోయింది. అతడి ప్రతిభకు యూట్యూబ్ నుంచే కాకుండా వెండితెర నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2014లో మై నే ప్యార్ కియాతో సినిమాలో నటించిన హర్ష కలర్ ఫోటోలో కీలక పాత్రలో నటించాడు. ఇప్పటివరకు కమెడియన్‌గా, హీరో స్నేహితుడిగా నటించిన హర్ష సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ చిత్రంతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్ షో అనిల్ -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
#మెన్‌టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్‌టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
ఆర్జీవీ చేతుల మీదుగా దీపాల ఆర్ట్స్ సినిమా ప్రారంభం, టైటిల్ ఇదే..
హీరో త్రిగున్(అరుణ్ అదిత్), పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగాసాయి తేజ సప్పన్న దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘కార్టూన్స్ 90s కిడ్స్ బే ఈడా’. శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ.. హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఇక నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా రామ్ గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించాడు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. -
ఘనంగా వైవా హర్ష వివాహం.. ఫోటోలు వైరల్
Youtuber Viva Harsha Got Marraied To Akshara: ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హర్ష-అక్షర నిన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కె ఎన్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది జనవరి11న అక్షర-హర్షల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించి హర్ష..‘వైవా’ కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి బాగా పాపులర్ అయ్యాడు. 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాలో నటించిన హర్ష..గతేడాది కలర్ ఫోటో చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. -
Anasuya Bharadwaj: ‘థ్యాంక్ యు బ్రదర్’ మూవీ రివ్యూ
టైటిల్: థ్యాంక్ యు బ్రదర్ నటీటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, , అనీశ్ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, వైవా హర్ష తదితరులు నిర్మాణ సంస్థ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి దర్శకత్వం: రమేశ్ రాపర్తి సంగీతం: గుణ బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు విడుదల తేది : మే 07, 2021(ఆహా) బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఇందులో ప్రెగ్నెంట్ లేడీ గెటప్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది ఈ అందాల యాంకర్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం (మే 7)న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘థ్యాంక్యు బ్రదర్’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథ అభి (విరాజ్ అశ్విన్ ) జీవితంపై అస్సలు బాధ్యతలేని గొప్పింటి కుర్రాడు. తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తల్లి ఎన్నిసార్లు మందలించిన తన ప్రవర్తనను మార్చుకోడు. తన అవేశం, లెక్కలేనితనం కారణంగా ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఒకానొక సమయంలో తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే... ప్రియ(అనసూయ భరద్వాజ్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. నిండు గర్భిణి. అప్పటికే తన భర్త చనిపోయి ఉంటాడు. అత్తమ్మతో కలిసి కుట్లు, అల్లికలు చేసూకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. ఇలా ఒకరికొకరు ఎలాంటి సంబంధంలేని అభి, ప్రియ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుపోతారు. అదే సమయంలో ప్రియకు నొప్పులు వస్తాయి. ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే అభి, ప్రియను ఎలా సేవ్ చేశాడు? లిఫ్ట్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన ప్రియ క్షేమంగా ఉందా? లేదా?. ప్రియ ఘటన అభిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ. నటీనటులు అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. ఈ మూవీలో కూడా మరోసారి తనలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టింది. ప్రియ పాత్రలో అద్భుతంగా నటించి సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా డెలివరీ అయ్యే సీన్లో తనదైన నటనతో అందరిని భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఇక హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ తన పాత్రకు న్యాయం చేశాడు. బాధ్యత లేకుండా తిరిగే గొప్పింటి కుర్రాడు అభి పాత్రలో జీవించాడు. ఇది వరకు కొన్ని సినిమాల్లో నటించినా విరాజ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుంది. కమెడియన్ వైవా హర్ష ఒకటి రెండు చోట్ల నవ్వించేప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ గర్భవతి అయిన ఓ మహిళ.. తల్లి విలువ తెలుసుకోలేని ఓ కొడుకు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దానిని ఎలా పరిష్కరించారనేదే ‘థ్యాంక్ యు బ్రదర్’నేపథ్యం. పాయింట్ పరంగా మంచి కంటెంట్ ఎంచుకున్న దర్శకుడు.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ అంతా బోల్డ్ సీన్స్, లవ్‌ట్రాక్‌తో సోసోగా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథని చూపించాడు. ఈ సినిమాకు ఉన్నంతలో ప్రధాన బలం సెకండాఫ్. అయితే సెకండాఫ్‌లో కూడా కొన్ని సీన్స్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దే స్కోప్ ఉన్నప్పటీకీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. తల్లి సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో ఆమె పాత్రని కూడా బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ గుణ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ అనసూయ, విరాజ్ అశ్విన్ నటన లిఫ్ట్‌లోని సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్ ఫస్టాఫ్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హర్ దిన్ శుభ్హై.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్‌ను ముంబైలోని అలీబాగ్‌లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. హర్‌దిన్‌శుభ్‌హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్‌లాక్‌లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. హర్‌దిన్‌శుభ్‌హై కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్‌లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు. -
డేటింగ్ సీక్రెట్ బయటపెట్టిన వైవా హర్ష..
యూట్యూబ్ ద్వారా పాపులారిటి సంపాదించిన వైవా హర్ష అప్పటి నుంచి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బాల ఏసుగా తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక త్వరలోనే హర్ష ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్షర అనే అమ్మాయితో హర్ష నిశ్చితార్ధ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఈ వేడుక జరగగా.. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, వేష్ణవ్ తేజ్, సుష్మితా కొణిదెల సందడి చేశారు. తన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: వైవా హర్ష నిశ్చితార్థం: వైరల్‌గా మారిన ఫొటోలు తాజాగా హర్ష తన లవ్ స్టోరీని మీడియా ముందు వెల్లడించాడు. పీజీ(M.com) చదివిన అక్షర తనకు నాలుగేళ్లుగా పరిచయమని హర్ష తెలిపాడు. స్నేహంగా ఏర్పడిన తమ పరిచయం మెల్లమెల్లగా ప్రేమకు దారితీసిందన్నారు. ‘మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అక్షరను నేను కలిశాను. గత నాలుగేళ్లుగా ఆమె నాకు తెలుసు. రెండేళ్ల నుంచి మేము డేటింగ్లో ఉన్నాం. ఇద్దరం జీవితాంతం ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. అదే జరిగిపోయింది. నేను తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమెతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నా ప్రేమ విషయం చెప్పగానే మా పేరెంట్స్ సత్యనారాయణ రావు, రామదేవి త్వరగా ఒప్పుకున్నారు. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ కొంత సమయం తీసుకున్నాడు. కానీ అప్పటి వరకు ఆమె నా గురించి తన తండ్రికి చెప్పకపోవడంతో ఆయన కొంచెం భయపడ్డాడు. వాళ్ల అమ్మకు (సత్య) మాత్రమే మా గురించి తెలుసు. అయితే ఒకసారి నేను అక్షర తండ్రితో కొంత సమయం గడిపే సరికి ఆయన నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మా పెళ్లికి అంగీకరించాడు. నిశ్చితార్థ వేడుకలో అతను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు’ అని వెల్లడించాడు. అదే విధంగా జీవితాంతం అక్షరతో గడపడానికి నేను ఇంకా వేచి ఉండలేనని.. జూన్, జూలైలో వివాహం ఉండనున్నట్లు తెలిపాడు. తన సోదరి లాస్ ఏంజిల్స్‌లో ఉంటుందని, ఆమె వచ్చాక పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైవా హర్ష నిశ్చితార్థం ఫొటోలు
-
వైవా హర్ష నిశ్చితార్థం: వైరల్‌గా మారిన ఫొటోలు
నటుడు, కమెడియన్ వైవా హర్ష బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు వైవా హర్ష ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'చివరి బ్యాచిలర్ సెల్ఫీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అలాగే కాబోయే భార్య అక్షరతో నేడు(శనివారం) నిశ్చితార్థం జరుపుకున్న ఫొటోలను స్టోరీస్‌లో యాడ్ చేశాడు. ఇందులో జీవితాంతం తను వేలు పట్టుకుని నడవనున్న అక్షర మెడలో దండ వేసి సగం పెళ్లి కానిచ్చేశాడు. తర్వాత ఆమెతో కలిసి కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: భార్యను ఏడిపించిన సింగర్) దీంతో పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా స్టార్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తన డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న వైవా హర్ష సూపర్ డూపర్ హిట్ చిత్రం కలర్ ఫొటోలో నటించారు. ఇందులో తనదైన శైలిలో కామెడీ పండించి అందరికీ వినోదాన్ని పంచారు. (చదవండి: చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను : నిహారిక) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
తరగతి గదిలో ప్రేమ
హాస్యనటుడు సుహాస్ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తరగతి గదిలో...’ అంటూ సాగే మొదటి పాటను ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుహాస్ మాట్లాడుతూ– ‘‘కమెడియన్‌గా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి రుణపడి ఉంటాను. ఓ అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథతో మా కలర్ ఫొటో రెడీ అయింది. సునీల్‌గారితో, చాందినీ చౌదరితో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది’’అన్నారు. ‘‘డైరెక్టర్‌గా నాకు ఇది తొలి సినిమా అయినప్పటికీ నా స్నేహితుడు సుహాస్ హీరో కావడంతో ఎలాంటి బెదురు, టెన్షన్ లేకుండా సినిమా తెరకెక్కించాను’’ అన్నారు సందీప్ రాజ్. చాందినీ చౌదరి, లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్, కెమెరామేన్ వెంకట్ ఆర్. శాఖమూరి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మణికంఠ. -
నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?
స్టార్ హీరోలతో వరుస సక్సెస్‌లు సాధించిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల. ప్రస్తుతం కెరీర్లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న ఈ కామెడీ స్పెషలిస్ట్ తన లేటెస్ట్ మూవీ మిస్టర్‌తో మరో సారి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న మిస్టర్, దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో వరుణ్ తేజ్ కెరీర్‌కు కూడా కీలకం కానుంది. అయితే ఇటీవల కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనువైట్ల భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే దర్శకత్వంతో పాటు సొంతంగా బిజినెస్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నాడు. వెండితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీనువైట్ల తన తొలి వ్యాపార ప్రయత్నం మాత్రం బుల్లితెర మీద చేస్తున్నాడు. యూట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైవా హర్షతో ఓ కామెడీ షోను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షోకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన కామెడీ జానర్నే నిర్మాతగానూ నమ్ముకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. -
గురువారం మార్చ్ 1 మూవీ ఓపెనింగ్