హర్ష , దివ్య శ్రీపాద
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. ప్రతీసారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ‘సుందరం మాస్టర్’లో కామెడీతో పాటు డ్రామా ఉంటుంది. ఇది అందర్నీ ఆలోచింపజేసే చిత్రమవుతుంది’’ అని హర్ష చెముడు అన్నారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న హర్ష చెముడు హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్య శ్రీపాద హీరోయిన్.
హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో చిరంజీవి విడుదల చేసి, సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఓ గిరిజన గ్రామంలో అందరూ స్పష్టంగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడతారనే దానికి గల కారణం మా సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సుధీర్ కుమార్ కుర్రు.
Comments
Please login to add a commentAdd a comment