Divya Sripada
-
ఆలోచింపజేసే సుందరం మాస్టర్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. ప్రతీసారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ‘సుందరం మాస్టర్’లో కామెడీతో పాటు డ్రామా ఉంటుంది. ఇది అందర్నీ ఆలోచింపజేసే చిత్రమవుతుంది’’ అని హర్ష చెముడు అన్నారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న హర్ష చెముడు హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్య శ్రీపాద హీరోయిన్. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో చిరంజీవి విడుదల చేసి, సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఓ గిరిజన గ్రామంలో అందరూ స్పష్టంగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడతారనే దానికి గల కారణం మా సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సుధీర్ కుమార్ కుర్రు. -
'ఆ ఊరి అమ్మాయిలకు నల్లగా ఉండే వాళ్లంటేనే ఇష్టం'..!
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోల్డెన్ మీడియా, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మెగాస్టార్ ప్రశంసలు.. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని మెగాస్టార్ అభినందించారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌తోనే నవ్వులు తెప్పిస్తోన్న ఈ చిత్రం.. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. MEGASTAR #Chiranjeevi garu launched the trailer of #SundaramMaster @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA All The Best #SundaramMasterOnFeb23rd Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/OnmGjU2hVa — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2024 -
సోషల్ టీచర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే...
హర్ష చెముడు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీ పాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, కుర్రు సుధీర్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘సోషల్ స్టడీస్ బోధించే సుందరం మాస్టర్ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్ టీచర్‌గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆకట్టుకుంటున్న ‘చరిత కామాక్షి’ స్పెషల్ పోస్టర్
నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చరిత కామాక్షి’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ పోషిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు.