
Youtuber Viva Harsha Got Marraied To Akshara: ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హర్ష-అక్షర నిన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కె ఎన్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గతేడాది జనవరి11న అక్షర-హర్షల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించి హర్ష..‘వైవా’ కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి బాగా పాపులర్ అయ్యాడు. 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాలో నటించిన హర్ష..గతేడాది కలర్ ఫోటో చిత్రంలో కీలక పాత్రలో నటించాడు.