Singer Arjun Kanugo Married Carla Dennis, Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Arjun Kanugo Marriage: ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్‌ సింగర్‌.. ఫోటోలు వైరల్‌

Published Thu, Aug 11 2022 12:03 PM | Last Updated on Thu, Aug 11 2022 12:39 PM

Singer Arjun Kanugo Ties Knot With Carla Dennis See Pics - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జున్‌ కనుంగో తన చిన్ననాటి స్నేహితురాలు కార్లా డెన్నిస్‌ను పెళ్లాడాడు.ముంబైలోని తాజ్‌ హోటల్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల మధ్య  నిన్న(ఆగస్టు10)న వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.



ఇక పెళ్లిలో అర్జున్‌ తెల్లని షేర్వానీ ధరించగా, వధువు కార్లా రెడ్‌ కలర్‌ లెహంగాలో అందంగా ముస్తాబైంది.  ఇటీవలె వీరిద్దరు తమ రిలేషన్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రియురాలితో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నానంటూ సింగర్‌ అర్జున్‌ ఫోటోలు షేర్‌ చేశారు. 

ఇక గురువారం ముంబైలోని కరణ్ జోహార్ రెస్టారెంట్ న్యూమాలో వీరి రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు సల్మాన్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, శ్రద్దా కపూర్‌, బాబీ డియోల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement