
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని 'వాస్తు'లో గ్రాండ్‌గా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కాగా నూతన జంట రణ్‌బీర్-ఆలియాల పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. చాలా గోప్యంగా పెళ్లి వేడుకలకు ఏర్పాటు చేసిన కపూర్ అండ్ భట్ కుటుంబం వివాహం జరిగేంత వరకు ఒక్క ఫోటోని కూడా లీక్ కానివ్వలేదు. అయితే అభిమానుల కోసం మరికాసేపట్లో ఆలియా -రణ్‌బీర్‌లు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేయనున్నారు. ఈ ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక కొత్తజంటకు బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment