
Aadhi Pinisetty and Nikki Galrani Wedding Pics: యంగ్ హీరో ఆది పినిశెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హీరోయిన్ నిక్కీ గల్రానీతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రాత్రి వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆది పినిశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అందించండి' అంటూ ఆది తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు ప్రముఖులు, సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమికులయ్యారు. పెద్దల సమక్షంలో ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. #నాది(నిక్కీ-ఆది)ల పేరుతో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment