Aadi Pinisetty
-
'శపథం' పూర్తి చేసిన స్టార్ హీరో
రంగస్థలం, నిన్నుకోరి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆది పినిశెట్టి. ఇతడు హీరోగా నటించిన కొత్త మూవీ శపథం. అరివళగన్ దర్శకుడు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో 'ఈరం' చిత్రాన్ని తీశారు. అది హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'శబ్దం' పేరుతో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) హరర్, థ్రిల్లర్ సినిమాలతో తీయడంలో ఎక్స్పర్ట్ అయిన అరివళగన్.. అదే తరహా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. కాగా శపథం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలో ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
హీరోయిన్ లైలా ఏంటి ఇలా మారిపోయింది?
‘వైశాలి’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి– దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శబ్దం’. 7ఎ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్‌పై 7ఎ శివ నిర్మిస్తున్నారు. లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి లైలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసి, ఆమె లుక్ రిలీజ్ చేశారు. ‘ ‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘శబ్దం’. మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో లైలా కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: భానుప్రియ శివ, సంగీతం: తమన్, కెమెరా: అరుణ్ పద్మనాభన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. బాలకుమార్, రచన– దర్శకత్వం–లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్. The sets of #Sabdham just got brighter & bigger! Welcoming @Lailalaughs onboard!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames #LakshmiMenon @KingsleyReddin @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @teamaimpr @decoffl pic.twitter.com/tCLjYXQKrW — Aadhi🎭 (@AadhiOfficial) March 9, 2023 -
ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల పెళ్లి వీడియో వచ్చేసింది..
హీరోయిన్ నిక్కీ గల్రానీతో నటుడు ఆది పినిశెట్టి వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా పెళ్లై మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్లుంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. హల్దీ, మెహందీ సహా పెళ్లి వరకు ప్రతీ మూమెంట్‌ని ఆది-నిక్కీ ఎంతో అనందంగా సెలబ్రేట్ చేసుకున్నారో వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు. డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది. "వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాన్న.. మూవీలో నా నెగెటివ్ పాయింట్స్ చెప్పారు: ఆది
‘‘నేను తెలుగువాణ్ణి అని తమిళ ప్రేక్షకులు అనుకుంటున్నారు.. తెలుగువాళ్లేమో తమిళోడిని అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, నటన బాగుంటే ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గురు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి శుక్రవారం విలేకరులతో చెప్పిన విశేషాలు ► ‘సరైనోడు’ తర్వాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా ‘అజ్ఞాతవాసి’ కంటే బెటర్‌గా ఉండాలని అనుకున్నాను. ‘ది వారియర్’లో ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురు పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది.. అది నచ్చడంతో ఈ చిత్రం చేశాను. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ► ‘ది వారియర్’ క్లైమాక్స్ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. ఆ క్రెడిట్ అన్బు–అరివు మాస్టర్లదే. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నట్టుందని లింగుసామి చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. ► నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి) నాలో నెగెటివ్ పాయింట్స్ చెప్తారు. ఈ చిత్రంలో నా యాస ఇంకొంచెం బాగుండాల్సింది అని మా నాన్న అన్నారు. నేను హైలైట్ అయ్యానంటే రామ్ గొప్పదనం అని, అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని కూడా ఆయన అన్నారు. నిక్కీ గల్రానీతో నా పెళ్లి జీవితం బాగుంది.. అంతా హ్యాపీ. చదవండి: లలిత్ మోదీ గట్టిగానే ట్రై చేశాడు, ఇన్నేళ్లకు ఫలించింది! లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్ -
ఆది-నిక్కీల అన్‌సీన్ పెళ్లి ఫోటోలు చూశారా?
Aadhi Pinisetty and Nikki Galrani Wedding Pics: యంగ్ హీరో ఆది పినిశెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హీరోయిన్ నిక్కీ గల్రానీతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆది పినిశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అందించండి' అంటూ ఆది తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు ప్రముఖులు, సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమికులయ్యారు. పెద్దల సమక్షంలో ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. #నాది(నిక్కీ-ఆది)ల పేరుతో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు. ఇప్పటికే హల్ది వేడుకల్లో వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆది, నిక్కీల పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తారట! కాగా ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్.. వీడియో షేర్ చేసిన ఆది పినిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరి ఎంగేజ్మెంట్ ఇటీవలె అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈనెల 24న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట ఇటీవలె అభిమానులతో పంచుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రానీ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇటీవలో ఆది గుడ్ లక్ సఖి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. Love. Happiness. Positivity ♥️♾ @nikkigalrani @camsenthil pic.twitter.com/PzEYRI8sTV — Aadhi🎭 (@AadhiOfficial) March 28, 2022 -
హీరోయిన్ చెల్లెలితో టాలీవుడ్ హీరో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి
Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani?: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పాటలు ఎక్కనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. బుజ్జిగాడు హీరోయిన్ సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ. చదవండి: ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్,అసలేమైందంటే.. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ వేడకకు సైతం నిక్కీ హాజరైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్‌పోర్ట్‌లో వీరు జంటగా దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా నిక్కీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' సినిమాలతో అలరించిన ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతి -
ఓటీటీలో ఆది పినిశెట్టి క్లాప్ మూవీ రిలీజ్
‘‘నేను నటుడిగా కాకుండా ఓ ప్రేక్షకుడిగా కథలు వింటాను. సుకుమార్‌గారు ‘రంగస్థలం’లో నా పాత్ర (కుమార్ బాబు) గురించి చెప్పిన వెంటనే చేస్తానని చెప్పేశా. అలాగే పృథ్వీ ఆదిత్యగారు ‘క్లాప్’ కథ చెప్పగానే ఓకే చెప్పాను. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్లాప్’. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లాప్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా నేడు ‘సోనీలివ్’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘క్లాప్’ టీజర్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో కామెడీ, డాన్స్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలుండవు. కానీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. నేను, ఆకాంక్ష స్పోర్ట్స్ పర్సన్స్‌గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం ఇళయరాజాగారి సంగీతం, రీ రికార్డింగ్ సినిమాకు బలం’’ అన్నారు. ‘‘ఈ కథలోని నిజాయితీ, ఆదిగారివల్లే ఈ సినిమా తీశాను’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా వల్ల సోనీలివ్‌తో కమిట్ అయి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు రామాంజనేయులు. -
ఓటీటీలో గుడ్ లక్ సఖి.. ఎప్పటి నుంచంటే
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. జనవరి28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సినిమా ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రేపట్నుంచి(ఫిబ్రవరి12) స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. -
అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు
Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి సురేష్, కోచ్ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మనదేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ఎలా మారిందన్న నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆదిపినిశెట్టి కీలక పాత్రలోకనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
'సరైనోడు' తర్వాత మళ్లీ విలన్ పాత్రలో ఆది
Aadhi Pinisetty In RAPO19: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి కథానాయికగా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టిని విలన్‌గా ఖరారు చేశారు. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'సరైనోడు తర్వాత మళ్లీ విలన్‌గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలనుకున్నాను. దర్శకుడు చెప్పిన కథ విన్నాక ఇది మామూలు రోల్ కాదనిపించింది. సాధారణంగా సినిమాల్లో విలన్ పాత్రకు డీటెయిలింగ్ ఉండదు. ఇందులో అది ఉంది. నాది కడప, కర్నూల్‌కు చెందిన రా అండ్ రస్టిక్ రోల్.. తమిళంలో మధురై బేస్‌లో ఉంటుంది. సరైనోడులో స్టైలిష్ విలన్‌గా చేశాక ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ఓవైపు నా సినిమాలు నేను చేస్తూ డిఫరెంట్ షేడ్‌ను ఇందులో చూపించవచ్చు. `యూటర్న్` నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశాను తను చాలా ఎనర్జిటిక్ గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. లింగుస్వామి గారు విలన్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు. ఈ కారణాల వల్లే ఈ సినిమా చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించడానికి ఓ మంచి అవకాశం అనుకుంటున్నాను. షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని ఎదురు చూస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి. -
ఆది@ అథ్లెట్
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ కథను రాసుకుంటున్నంత సేపు నా మనసులో ఆదిగారే మెదిలారు. కథ విన్న ఆయన చేస్తానని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయనతో పని చేయడానికి ఉత్సాహంగా ఉంది. అథ్లెటిక్స్ (క్రీడాకారులు)కు సంబంధించిన కథ ఇది. తన కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఇతర వివరాలు చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్), కెమెరా: ప్రవీణ్ కుమార్. -
చంపుతున్నది ఎవరు?
సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోని సంఘటన జరిగి, ఇబ్బందులు ఏర్పడితే లైఫ్ ఒక్కసారిగా ‘యు టర్న్’ అయింది అంటాం. అదే యు టర్న్ ఓ సినిమాకి కీలకమైంది. తప్పు దోవలో యు టర్న్ తీసుకున్నవాళ్లు చనిపోతుంటారు. చంపుతున్నది ఎవరు? అనే పాయింట్‌తో రూపొందిన కన్నడ చిత్రం ‘యు టర్న్’. అదే టైటిల్‌తో సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. పవన్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌కు తెలుగు, తమిళ భాషల్లో 65 లక్షల వ్యూస్ వచ్చాయి. రెండు భాషల్లోనూ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 13న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మి íసినిమాటోగ్రాఫర్, పూర్ణచంద్ర తేజస్వి స్వరకర్త. -
విస్మయపరుస్తున్న ఆది ’రంగస్థలం’ డబ్బింగ్ వీడియో
-
ఇక మీదట హీరోగానే..!
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్‌లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్‌గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు. ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు. -
రాజకీయ రంగస్థలం
ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్‌ను ఆధారంగా చేసుకుని ...‘రంగస్థలం’ సినిమా ఓ ఫ్యామిలీ కమ్ క్యూట్ లవ్‌స్టోరీ అనుకుంటే పొరపాటే. రంగస్థలంలో రాజకీయాలు మస్త్ రంజుగా ఉన్నాయి. రంగస్థలం అనే గ్రామంలో సాగే రాజకీయ ఆధిపత్య పోరు నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్. ఇందుకు తగ్గట్లుగానే –‘‘రంగస్థలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామప్రజలు బలపరిచిన కె.కుమార్‌బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి’’ అని కుమార్ బాబు ఫొటోతో ఉన్న కరపత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. ఈ సినిమాలో వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మీ పాత్రలో సమంత నటించారు. మరి.. సడన్‌గా కుమార్ బాబు ఎవరు? అంటే..ఆది పినిశెట్టి. మరి..కుమార్‌బాబు ఎన్నికల్లో గెలిచాడా? ప్రత్యర్థులు ఎవరు? రంగస్థలం రాజకీయాల్లో చిట్టిబాబు పాత్ర ఎంత? వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే మాత్రం ‘రంగస్థలం’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్, ఆది పినిశెట్టి అన్నదమ్ములుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1985 కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని ఈనెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
పవన్ కళ్యాణ్‌కు సరైనోడు
కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమా లాంచనంగా ప్రారంభించగా.. ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా.., పవన్ సినీ కెరీర్‌తో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కథా కథనాలను సిద్ధం చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో పవన్‌కు ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆదిని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడైన ఆది, పలు స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ముఖ్యంగా సరైనోడు సినిమాలో ఆది చేసిన విలన్ పాత్ర హీరోతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పవన్‌కు విలన్‌గా ఆదినే సరైనోడని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే పవన్, త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించనున్నారు. -
మళ్లీ విలన్‌గా చేస్తా..!
‘‘ఇప్పటివరకూ నేను హీరోగానే చేస్తూ వచ్చాను. బోయపాటి శ్రీను కథ చెప్పగానే కొత్తగా అనిపించింది. అందుకే విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నా’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’లో ఆది విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. శనివారం పాత్రికేయులతో ఆది మాట్లాడుతూ - ‘‘ఇందులో వైరం ధనుష్ పాత్రను నేను ఊహించినదాని కన్నా తెర మీద బోయపాటి శ్రీను బాగా తీర్చిదిద్దారు. జస్ట్ ఆయన చెప్పినది ఫాలో అయిపోయానంతే. తమిళనాడులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను చేసిన పాత్ర బన్నీకి కూడా బాగా నచ్చేసింది. అందుకే వేరే భాషలో రీమేక్ చేస్తే తానే హీరోగా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా చూసి, చిరంజీవిగారు, వీవీ వినాయక్‌గారు ఫోన్ చేసి నా లుక్, స్టయిల్‌ను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి వెనకాడను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేను హీరోగా రెండు చిత్రాలు రూపొందనున్నాయి. త్వరలో ఓ ఇంటి వాణ్ణి కాబోతున్నా. అమ్మా, నాన్నలు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా’’ అన్నారు. -
'మలుపు' మూవీ న్యూ స్టిల్స్
-
మలుపు మూవీ స్టిల్స్
-
'మలుపు' ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్
-
బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఆది