
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు.
ఇప్పటికే హల్ది వేడుకల్లో వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆది, నిక్కీల పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తారట!
కాగా ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు.
చదవండి 👇
ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?
నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా..
Comments
Please login to add a commentAdd a comment