Nikki Galrani
-
నీ జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు.. హీరోయిన్ ఎమోషనల్
హీరో ఆది భార్య, హీరోయిన్ నిక్కీ గల్రానీ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తమ పెంపుడు శునకం చనిపోయిందని బోరున విలపిస్తోంది. నిక్కీ గల్రానీ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఛాంపియన్ అనే శునకం ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.మళ్లీ కలుసుకుందాంనీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే! మరోసారి కలుసుకుందాం ఛాంప్ అని రాసుకొచ్చింది. ఛాంపియన్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్టుకు జత చేసింది.ఎంతో అమాయకుడుతన పెంపుడు శునకం గురించి మరింత మాట్లాడుతూ.. వాడిని మేము తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్నాం. ఎంతో అమాయకుడు. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా వీడిని చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా ఉండేవాడు. వాడు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా అంటూ నిక్కీ గల్రానీ ఎమోషనలైంది. View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) చదవండి: మా ప్రాంక్ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో -
Birthday Special: హీరోయిన్ నిక్కీ గల్రానీ బర్త్ డే స్పెషల్.. (ఫొటోలు)
-
ఆన్‌స్క్రీన్‌పై మరోసారి జత కట్టనున్న రియల్ కపుల్.. పెళ్లయ్యాక తొలిసారి!
తమిళసినిమా: నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి గల్రాణి జంటగా నటించిన చిత్రం మరకత నాణయం. ఈ చిత్రం ద్వారా ఏఆర్కే శరవణ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడు ఏ ఆర్ కె .శరవణ్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఈయన సుమారు ఐదేళ్ల తర్వాత ఇటీవల హిప్ హాప్ తమిళా ఆది హీరోగా వీరన్ అనే సోషియో ఫాంటసీ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఓటిటిలోనూ వీక్షకుల విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు ఏ ఆర్ కె శరవణ్ తన తాజా చిత్రాల పనిలో చాలా బిజీగా ఉన్నారు. దీని గురించి ఆయన పేర్కొంటూ తన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటం సంతోషంగా ఉందన్నారు. వీరన్ చిత్రం తర్వాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2023– 24 లో తాను చాలా బిజీగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆది పినిశెట్టి, నిక్కి గల్రాణి జంటగా తాను దర్శకత్వం వహించిన మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ కు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందులోనూ అదే జంట నటిస్తారని తెలిపారు. ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఇది ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు ఏఆర్కే శరవణ్ చెప్పారు. -
భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన హీరో ఆది, పిక్స్ వైరల్
హీరోహీరోయిన్లు ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ గతేడాది మేలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మలుపు చిత్రం నుంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ మొదట్లో చాలా గొడవపడేవారు. ఈ గొడవలు, మనస్పర్థల వల్ల కొన్ని రోజులు మాట్లాడుకోలేదు కూడా! మలుపు ముగింపులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీ గల్రానీ ఆదికి ప్రపోజ్ చేసింది. తనే అంత ఓపెన్‌గా మనసులోని మాట బయటపెట్టడంతో ఇంక ఆలస్యం చేయడం ఇష్టం లేని ఆది వెంటనే ఓకే చెప్పాడు. దీంతో ఇంట్లోవాళ్లను ఒప్పించి మే 18న చెన్నైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మంగళవారం(జనవరి 3న) నిక్కీ బర్త్‌డే. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సమక్షంలో భార్య బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు ఆది. పనిలో పనిగా ఆమె ముఖానికి కేక్ రుద్దాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిక్కీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విషెస్ తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నా పుట్టినరోజును నా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నాను అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Nikki Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) చదవండి: కొడుకుతో వంట చేయిస్తున్న స్నేహ నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య -
తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్
హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ నిక్కీ గల్రానీ సోషల్ మీడియా వేదిక స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివరి డేట్ కూడా మీరే చెప్పేయండి’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ అదే విధంగా ‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది తప్పకుండ జరుగుతుంది. అప్పడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ తన ప్రెగ్నెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. కాగా కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఈ ఏడాది మేలో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టిలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిక్కీ, ఆది కలిసి ‘యగవరయినమ్ నా క్కాక’, ‘మరగధ నానయమ్’ సినిమాల్లో నటించారు. అదే సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఆది-నిక్కీ ఈ ఏడాది పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. pic.twitter.com/1tucglygut — Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022 -
తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి?
యంగ్ హీరో, నటుడు ఆది పినిశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో అయిన ఆది, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వీ చిత్రం మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ఆది ప్రస్తుతం తెలుగులో విలన్ పాత్రలు చేస్తున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది ఇక్కడి ప్రేక్షకుల బాగా మెప్పిస్తున్నాడు. దీంతో ఓ స్టార్ హీరో స్థాయిలో తెలుగు ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో కోలీవుడ్ హీరోయిన్, తన ప్రేయసి నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆది సంబంధించిన ఓ ఆసక్తిర న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్ త్వరలోనే ఆది తండ్రి కాబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఆది-నిక్కీలు తల్లిదండ్రులు కాబోతున్నారని కోలీవుడ్‌లో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ కోలీవుడ్ జంట స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా మే 18, 2022న ఇరు కుటుంబ సమక్షంలో ఆది-నిక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకులో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సందీప్ కిషన్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆది ది వారియర్మూవీలో నటించారు. ప్రస్తుత్తం ఆది తమిళం, తెలుగులో పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. -
ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల పెళ్లి వీడియో వచ్చేసింది..
హీరోయిన్ నిక్కీ గల్రానీతో నటుడు ఆది పినిశెట్టి వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా పెళ్లై మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్లుంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. హల్దీ, మెహందీ సహా పెళ్లి వరకు ప్రతీ మూమెంట్‌ని ఆది-నిక్కీ ఎంతో అనందంగా సెలబ్రేట్ చేసుకున్నారో వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆది
ఆది పినిశెట్టి తాజాగా ది వారియర్ మూవీతో అలరించాడు. పెళ్లి అనంతరం విడుదలైన ఆయన తొలి చిత్రం ఇది. గురువారం(జూలై 14న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇందులో ఆది విలన్ గురుగా కనిపించాడు. ఈ మూవీ రిలీజైన సందర్భంగా ఆది మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆది నటి నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లిపై ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘నేను నిక్కీ మలుపు చిత్రం నుంచే మంచి స్నేహితులం. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నాకు గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులు మేం మాట్లాడుకోలేదు. సెట్లో మేం అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. దాదాపు షూటింగ్ అంతా అలానే పూర్తి చేశాం. ఇక చివరిలో మళ్లీ కలిశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘మలుపు అనంతరం ఇద్దరం కలిసి పలు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీనే నాకు ప్రపోజ్ చేసింది. తను నా దగ్గరకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ వెంటనే నేను కూడా ఓకే చెప్పాను. కొన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాతే ఇంట్లోవాళ్లకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోంది. నేను, నిక్కీ కలిసి నటించిన ‘శివుడు’ సినిమా త్వరలోనే రాబోతుంది” అని చెప్పాడు. కాగా మే నెలలలో ఆది-నిక్కీలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మే 18వ తేదీన రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. చదవండి: వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్ View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
హీరో ఆది పినిశెట్టి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?
యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే! మే 18న తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే ఆది దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది కట్నకానులకు బద్ధ వ్యతిరేకి అని, పెళ్లికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారట. ఆది ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిక్కీ కుటుంబం రెడీగా ఉన్నా అతడు మాత్రం పైసా కూడా వద్దని సున్నితింగా తిరస్కరించాడట. ఆది మంచి మనసుకు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) చదవండి 👇 నేనూ సాయిపల్లవి ఫ్యానే, జూన్ 5న రెడీగా ఉండండి: రానా మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిమానులతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి: సీక్రెట్ ఎంగేజ్మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ విక్రమ్ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
ఆది-నిక్కీ రిసెప్షన్లో కోలీవుడ్ తారలు.. ఫొటోలు
-
అంగరంగ వైభవంగా హీరో ఆది పినిశెట్టి ,నిక్కీ గల్రానీ వివాహం (ఫొటోలు)
-
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. మరో వైపు సంజన చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గుడ్‌న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బిగ్‌బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ అయిన సంజన గల్రానీ శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు. ఇప్పటికే హల్ది వేడుకల్లో వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆది, నిక్కీల పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తారట! కాగా ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
హీరో పెళ్లి వేడుకలు షురూ.. స్టెప్పేసిన నాని, సందీప్ కిషన్
యువ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఎంతోకాలంగా ప్రేమలో ఉంటున్న ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. మే 24న నిశ్చితార్థం జరుపుకున్న ఈ ప్రేమజంట నేడు(మే 18న) పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమపక్షులు గత రెండు రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరుపుకున్నారు. ఈ వేడుకలో పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన వధూవరులు సంతోషంగా చిందులేశారు. నేచురల్ స్టార్ నాని, హీరో సందీప్ కిషన్ సైతం హల్దీ ఫంక్షన్‌కు హాజరై ఆదితో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్ కూడా ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్, వారియర్ సినిమాలు చేస్తున్నాడు. #Sundeep Kishan and #Nani dance in joy at #AadhiPinisetty & #NikkiGalrani's haldi ceremony!! 🤩❤️@NameisNani @sundeepkishan @AadhiOfficial @nikkigalrani pic.twitter.com/um1K2Kd7B5 — Ramachandran Srinivasan (@indiarama) May 18, 2022 Lovable @AadhiOfficial & @nikkigalrani haldi function moments 💖😍#NikkiGalrani #Aadhi #AadhiWedsNikkiGalrani pic.twitter.com/MpFmnwNtrD — Kodiyil Oruvan Gokul (@GMGokulOfficial) May 18, 2022 View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) View this post on Instagram A post shared by 𝕊𝕒𝕟𝕥𝕙𝕠𝕤𝕙𝕚_𝕊𝕒𝕟𝕥𝕙𝕦🔵 (@nameisnani_vibes) చదవండి 👇 ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్ప్రైజ్ వాళ్లకు నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా ఫైర్ -
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్ చేస్తారా? లేక ఎంగేజ్మెంట్ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్లో ప్రతి కథానాయకుడిగా నటించాడు. -
ఆ రోజే హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి!
యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీతో మార్చి 24న నిశ్చితార్థం జరుపుకున్న హీరో మరికొద్ది రోజుల్లో ఆమెతో ఏడడుగులు వేయనున్నాడు. వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్లో మే 18న వీరి వివాహం జరగనుందట. ఎంగేజ్మెంట్ సింపుల్‌గా చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్, వారియర్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: నా కూతురితో కారులో ఉన్నాను.. అతడు అత్యాచారం చేస్తానని బెదిరించాడు ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ -
హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్.. వీడియో షేర్ చేసిన ఆది పినిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరి ఎంగేజ్మెంట్ ఇటీవలె అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈనెల 24న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట ఇటీవలె అభిమానులతో పంచుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రానీ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇటీవలో ఆది గుడ్ లక్ సఖి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. Love. Happiness. Positivity ♥️♾ @nikkigalrani @camsenthil pic.twitter.com/PzEYRI8sTV — Aadhi🎭 (@AadhiOfficial) March 28, 2022 -
హీరో ఆది పినిశెట్టితో హీరోయిన్ నిక్కీ గల్రానీ నిశ్చితార్థం (ఫొటోలు)
-
సీక్రెట్‌గా హీరో, హీరోయిన్ల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అంతేకాదు తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలియజేస్తూ... ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ఎంగేజ్మెంట్ మార్చి 24న జరగ్గా.. రెండు రోజుల తర్వాత శనివారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘2022 మార్చి 24.. మా ఇద్దరికి ఎంతో స్పెషల్. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’అని తన ట్విటర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది నిక్కీ గల్రానీ. ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. The best thing to hold onto in life is each other. We found each other a couple of years ago & it’s official now💍 24.3.22 was really special to us. We got engaged in the presence of both our families🌸 Seeking all you love & blessings as we take on this new journey together🙏🏻♥️ pic.twitter.com/hrMbxieCAn — Nikki Galrani (@nikkigalrani) March 26, 2022 -
హీరోయిన్ చెల్లెలితో టాలీవుడ్ హీరో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి
Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani?: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పాటలు ఎక్కనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. బుజ్జిగాడు హీరోయిన్ సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ. చదవండి: ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్,అసలేమైందంటే.. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ వేడకకు సైతం నిక్కీ హాజరైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్‌పోర్ట్‌లో వీరు జంటగా దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా నిక్కీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' సినిమాలతో అలరించిన ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతి -
సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్
చెన్నై: నటి నిక్కీ గల్రాణి ఇంటిలో చోరీ జరిగింది. బహుభాషా నటి అయిన నిక్కీ గల్రాణి స్థానిక రాయపేటలో నివసిస్తున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్ (19) అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరాడు. ఈనెల 11న అతడు రూ.1.25 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు ధనుష్‌ను అన్నాశాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చదవండి: (ఆన్లైన్ టికెట్ల విధానంలో తప్పేముంది?) -
ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'డార్లింగ్', 'వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్', 'కడవుల్ ఇరుక్కన్ కుమారు', 'మొట్ట శివ కెట్ట శివ', 'హరహర మహాదేవకి', 'మరగత నానయం' వంటి తమిళ చిత్రాలతో చాలా పాపులర్ అయింది. జనవరి 11న తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యువకుడు ధనుష్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నిక్కీ. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రానీ ఇంట్లో పని చేస్తున్నాడు ధనుష్. ఈ క్రమంలో నిక్కీకి చెందిన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ధనుష్ పరారీలో ఉండటంతో అతనే దొంగతనం చేసినట్లుగా భావించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ధనుష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది నిక్కీ. (చదవండి: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్) రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్ తిరుపూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. సోమవారం తిరుపూర్‌లో ధనుష్‌ను అరెస్టు చేసి, అతను దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ధనుష్‌ను చైన్నైకి తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం దుస్తులు, కెమెరాను తిరిగి నిక్కీ గల్రానీకి అప్పగించారు. దీంతో నిక్కీ తన ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ధనుష్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం. ఎందుకంటే తన వస్తువులు తనకు తిరిగి దొరికాయన్న సంతృప్తి చాలని నిక్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ వస్తువుల విలువ సుమారు రూ. లక్షకుపైగా ఉంటుందని అంచనా. (చదవండి: ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?) -
‘మిస్టర్ ప్రేమికుడి’గా ప్రభుదేవా
ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్‌తో పాటు అదా శర్మ, నిక్కీ గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ప్రభుదేవా తరహా హాస్యంతో పాటు ఆయన డ్యా¯Œ ్సని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. -
అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్
బెంగుళూరు : శాండిల్ వుడ్లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, అయితే ఇప్పటివరకు పేమెంట్ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్‌కాల్స్‌కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇండసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. చదవండి : జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా! -
సొంత వైద్యం వద్దు
కరోనా నుంచి కోలుకున్నారు కన్నడ భామ నిక్కీ గల్రానీ. తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించారామె. ‘మలుపు, మరకతమణి’ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కరోనా నుంచి కోలుకోవడం గురించి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘నా కోసం ప్రార్థించిన వాళ్లకు, ప్రేమాభిమానాలు అందించినవాళ్లకు కృతజ్ఞతలు. నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. కొన్ని నెలలుగా మనందరం ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం. భయం, ఆందోళన మన ఆలోచనల్ని తినేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిదే. కానీ అదే పనిగా భయపడటం కూడా సరైనది కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వైరస్ మన వరకూ ఎలా వస్తుందో తెలియదు. కానీ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్ట్ చేసుకోండి. ఏమీ లేదనుకుని మీ చుట్టుపక్కనవాళ్లను ఇబ్బందుల్లో పడేయొద్దు. 14 రోజుల్లో కోలుకోవచ్చు. డాక్టర్‌ను సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోవద్దు’’ అన్నారు నిక్కీ. -
కరోనా సోకింది, లక్షణాలివే: హీరోయిన్
చెన్నై: తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె గురువారం ట్విటర్లో వెల్లడించారు. "నాకు గత వారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు దగ్గర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుటపడటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అయితే కరోనా గురించి ప్రచారంలో ఉన్నవాటిని పక్కనపెడితే నా అనుభవాన్ని తెలియజేస్తున్నా. నాకు గొంతు నొప్పి, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నాను. అయితే ఇంట్లోనే క్షేమంగా క్షేమంగా, సురక్షితంగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది క్లిష్ట సమయం అని తెలుసు. కానీ ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటూ, ఎదుటివారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం మరింత అవసరం." (మాలీవుడ్; అన్ లాక్) "నా వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను కరోనా నుంచి బయటపడతాననే భావిస్తున్నాను. కానీ నా తల్లిదండ్రులు, పెద్దలు, స్నేహితులకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి దయచేసి మాస్కు ధరించండి, భౌతిక దూరం పాటించండి, ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అస్తమానం ఇంట్లోనే ఉండాలంటే చిరాకు వేస్తుందని తెలుసు. కానీ మనం కష్టకాలంలో జీవిస్తున్నాం. సమాజం కోసం మనవంతు సాయం చేయడానికి ఇదే సరైన సమయం. కుటుంబాలతో కలిసి ఆహ్లాదంగా గడపండి, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అని రాసుకొచ్చారు. కాగా నిక్కీ గల్రానీ "కృష్ణాష్టమి" చిత్రంలో సునీల్ సరన నటించారు. అలాగే డబ్బింగ్ మూవీ "మరకటమణి"లోనూ కనిపించి ఆకట్టుకున్నారు (హీరోయిన్ రిషికా సింగ్ కారుకు ప్రమాదం) -
నాకూ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు..!
తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది నటి నిక్కీగల్రాణి. ఆ మధ్య మంచి సక్సెస్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం కాస్త వెనుక పడిందనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత ఫ్యాషన్ డిజైనర్, మోడలింగ్ రంగాల్లో రాణించి తద్వారా సినీరంగానికి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదట మాలీవుడ్‌లో అవకాశాలు వరించాయి. ఆపై కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్గా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో డార్లింగ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమై ఆ చిత్ర సక్సెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా మరగతమణియన్, వేలన్ను వందుట్టా వెళైక్కారన్ హింట్ చిత్రాల్లో నటించింది. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో నిక్కీగల్రాణి మార్కెట్ డౌన్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడిని ప్రేమ అనుభవం ఉందా? అని అడగ్గా, ఓ ఉందే అని టక్కున చెప్పింది. ఎవరతను? పెళ్లెప్పుడూ? అన్న ప్రశ్నలకు నిక్కీగల్రాణి సూటిగానే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చెప్పిందో చూద్దాం. నేనూ ప్రేమలో పడ్డాను. నా లవర్‌ను చెన్నైలోనే కలుసుకున్నాను. అయితే ప్రస్తుతానికి అతనెవరన్నది బయటపెట్టను. మీకో విషయాన్ని బహిరంగంగా చెప్పుతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. నేను నటించాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి. మంచి పాత్రల్లో నటించాలి. మరో మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాను అని నిక్కీగల్రాణి చెప్పింది. అయితే మార్కెట్ తగ్గడంతోనే ఈ అమ్మడి పెళ్లి సిద్ధం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అన్నట్టు నిక్కీగల్రాణికి ఇప్పుడు జస్ట్ 27 ఏళ్ల వయస్సే. అంటే మూడు పదుల వయసులో పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటుందన్నమాట. -
నాకు కెమెరామెన్‌కు ఎలాంటి లింకూ లేదు
సినిమా: నాకు ఆయనతో సంబంధం అంటగడతారా అని మండి పడుతోంది నటి నిక్కీగల్రాణి. ఇటీవల కథానాయకిగా వెనుక పడ్డ ఈ అమ్మడు అబ్బే అదేం లేదు నేను బిజీగానే ఉన్నాను అని అంటోంది. కలగలప్పు–2, చార్లీచాప్లిన్–2 చిత్రాల తరువాత ఈ అమ్మడు నటించిన కీ చిత్రం 12న తెరపైకి రానుంది. ఇందులో జీవాతో రోమాన్స్ చేసింది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణితో చిట్‌చాట్ ప్ర: చిత్రం పేరు కీ అనగానే మీకేమనిపించింది? జ:సాధారణంగా కీ అంటే తాళం కప్పకు వాడే చెవి అని అని అనుకున్నాను. అయితే దర్శకుడు చెప్పింది వేరు. మనం ఏ పని చేసినా మంచి జరగవచ్చు, లేదా చెడూ జరగవచ్చునని, దానికే కీ అని అర్థం అన్నారు. కథ విన్న తరువాత నాకూ కీ అనేదానికి అర్థం తెలిసింది. ప్ర: కీ చిత్రంలో మీ పాత్ర గురించి? జ: నేనిందులో దియా అనే యువతిగా నటించాను. ఈ నాగరిక కాలంలో మనం రకరకాల ఆధునిక సెల్ఫోన్లను వాడుతున్నాం. ఒక హ్యాకర్ ద్వారా మన జీవితాలు ఎలా బాధింపునకు గురవుతాయని చెప్పే చిత్రంగా కీ ఉంటుంది. మొబైల్ ఫోన్లు వాడే ప్రతివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుంది. ప్ర:జీవాతో నటించిన అనుభవం? జ: జీవాతో కలిసి నటించడం చాలా సంతోషం. మేమిద్దం కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. అయితే కలగలప్పు–2 చిత్రం ముందుగా విడుదలైంది. జీవా నేను చాలా జాలీగా ఉంటాం. షూటింగ్లో గొడవ పడుతూనే ఉంటాం. అదే విధంగా ఇతరులను ఆట పట్టిస్తాం. షూటింగ్లో అంత జాలీగా ఉంటుంది. ప్ర:చిత్ర దర్శకుడు కలీస్ గురించి? జ: కొత్త దర్శకుడు కలీస్. చాలా జాగ్రత్తగా ఈ కథను ఎంచుకున్నారు. అంతకంటే బాగా తెరకెక్కించారు. అదే విధంగా దీనికి విశాల్ చంద్రశేఖర్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో నాకు జీవాకు ఒక డ్యూయోట్ పాట ఉంది. అది మా ఇద్దరికీ చాలా నచ్చిన పాట. ప్ర: హీరోయిన్లను అందంగా చూపించడానికి ఛాయాగ్రాహకులతో లింక్ పెట్టుకుంటారంటారు. అదే విధంగా మీరూ లింక్ పెట్టుకున్నారా? జ: నాకు కెమెరామెన్‌కు ఎలాంటి లింకూ లేదు. నేను నా పని చేస్తాను. ఆయన తన పని చేసుకుంటారు. అందుకే తెరపై చూస్తున్నప్పుడు సన్నివేశాలు అందంగా ఉంటాయి. అందుకు కెమెరామెన్లతో లింకు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. అలా అనడం కూడా సరికాదు. ప్ర: చిత్రాలను ఎంచుకునేటప్పుడు మీరు తీసుకునే శ్రద్ధ గురించి ? జ: చిత్రం అన్ని వర్గాల వారిని అలరించాలని నేను భావిస్తున్నాను.ముఖ్యంగా అందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలాంటి కథలకే అధిక ప్రాముఖ్యతనిస్తాను. -
ప్రేమికుడి వినోదం
ప్రభుదేవా హీరోగా, అదాశర్మ, నిక్కీగల్రాని హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్; కెమెరా: సౌందర్ రాజన్, సహ నిర్మాతలు: మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి. -
నచ్చితేనే చేస్తా!
సినిమా: నచ్చితేనే చేస్తానంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే హిట్ అవడంతో వచ్చిన అవకాశాలన్నీ ఎడా పేడా ఒప్పేసుకుని నటించేసింది. లక్కీగా మంచి విజయాలనే అందుకుంది. అందాలారబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పని నటిగా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణి ఆ మధ్య నటించిన చిత్రం కలగలప్పు 2. ఆ చిత్రం సక్సెస్ అనిపించుకుంది. ఇక ఇటీవల ప్రభుదేవాతో జతకట్టిన చార్లీచాప్లిన్–2 చిత్రం కూడా పర్వాలేదనిపించుకుంది.కార్తీ హీరోగా నటించిన దేవ్ చిత్రంలో అతిథిగా మెరిసింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే అంతగా నిక్కీగల్రాణికి అవకాశాలు మరీ అడుగంటలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ జీవాతో రొమాన్స్ చేసిన కీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా నటుడు శశికుమార్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనకు అవకాశాలు తగ్గాయనడం సరికాదని అంది. నిజం చెప్పాలంటే చిత్రాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పింది. పాత్ర నచ్చితేనే నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఒక కథను విన్నప్పుడు అందులో తాను నటిస్తే ఎలా ఉంటుందని ఒక అభిమానిగా ఆలోచిస్తానని అంది. అలా పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నానని చెప్పింది. వైవిద్యభరిత పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అని, అందుకే పాత్రల ఎంపికలో ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నానని నిక్కీగల్రాణి చెప్పింది. -
చార్లీ చాప్లిన్2 సినిమా ఫొటో గ్యాలరీ
-
తను చాలా నచ్చింది!
‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’... ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు హీరోల చేత కూడా తనదైన శైలిలో స్టెప్పులేయించి, ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలకొట్టించి గోల చేయించగలరు. ప్రభుదేవా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులే. తాజాగా పాటల రచయితగా మరో అవతారం ఎత్తారాయన. ప్రభుదేవా, నిక్కీగల్రానీ, అదా శర్మ ముఖ్య తారలుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. 2002లో విడుదలై ఘన విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రానికి ఇది రీమేక్. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘ఇవళ ఇవళ రొంబ పిడిచిరుక్కు...’ (తను తను చాలా నచ్చింది) అనే పాటను ప్రభుదేవా రాశారు. ఈ పాటకి అమ్రిష్ చక్కని స్వరాలు అందించారు. హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రభుదేవా రాసిన తొలి పాట వినేస్తే పోలా! -
స్టైలిష్ దేవ్
కుర్రాడు వాడే బైక్ మాత్రమే కాదు కుర్రాడు కూడా స్పీడే. మరి.. దేవ్ స్పీడ్‌కు ఎవరైనా బ్రేక్‌లు వేశారా? వేస్తే.. ఆ తర్వాత గేర్ మార్చి దేవ్ ఎలా స్పీడ్‌గా దూసుకెళ్లాడు? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘దేవ్’ సినిమా చూడాల్సిందే. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. రకుల్‌ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ‘ఠాగూర్’ మధు సొంతం చేసుకున్నారు. గురువారం దేవ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.‘‘ఖాకీ’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాస్ వంటి లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కార్తీక్ ముత్తు రామన్, ఆర్.జె. విఘ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. -
వారితో రొమాన్సే చాలు !
తమిళసినిమా : ఇప్పటికీ హీరోలతో రొమాన్సే చాలనుకుంటున్నాను అంటోంది నటి నిక్కీగల్రాణి. కోలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన ఉత్తరాదిభామ ఈ జాణ. డార్లింగ్, కలగలప్పు–2 చిత్రాలతో తమిళ సినీరంగంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణికి ఇటీవల నటించిన పక్కా చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం కీ, చార్లిన్చాప్లిన్–2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రభుదేవాకు జంటగా చార్లిన్ చాప్లిన్–2 చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నిక్కీగల్రాణితో చిన్న ఇంటర్వ్యూ.. ప్ర: ప్రేమ, రొమాన్స్లాంటి పాత్రలతో పాటు యాక్షన్ కథా పాత్రల్లో నటించాలన్న ఆసక్తి లేదా? జ: నిజం చెప్పాలంటే నేను కథ, నా పాత్ర బాగుండాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. అందులో ప్రేమ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయా అన్నది ఆలోచించను. నచ్చిన కథా చిత్రాలను ఎంచుకుని నటించడం వల్లే వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్నాను. ప్ర: ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న కథలను తయారు చేసుకుంటున్న క్రియేటర్స్ అధికం అవుతున్నారు. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: ప్రస్తుతానికి అలాంటి కథా చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మరొ కొన్నేళ్లు నేను హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను. నా చుట్టూ తిరిగే కథా చిత్రాలు ఇప్పుడే అవసరం అనుకోవడం లేదు. మరి కొన్ని ఏళ్లు హీరోలతో రొమాన్స్ చేసే పాత్రల్లో నటించి, ఆ తరువాత మీరంటున్న ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల గురించి ఆలోచిస్తాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న కీ, చార్లిన్ చాప్లిన్ 2 చిత్రాల గురించి? జ: నిజం చెప్పాలంటే జీవాకు జంటగా నటించడానికి అంగీకరించింది కీ చిత్రంలోనే. అయితే ఆ తరువాత ఒప్పుకున్న కలగలప్పు–2 చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. కీ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండడంతో ఆ చిత్ర విడుదల్లో జాప్యానికి కారణం అని నా అభిప్రాయం. ఇందులో చలాకీగా ఉండే యువతిగా నటిస్తున్నాను. నాకు ఏది అనిపిస్తే అది చేసే పాత్ర. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించని పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక చార్లిన్ చాప్లిన్–2 చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక్క పాటనే చిత్రీకరించాల్సి ఉంది. దర్శకుడు శక్తిచిదంబరం, ప్రభుదేవా వంటి జాలీ అయిన కాంబినేషన్లో నటిస్తున్నాను. చిత్ర షూటింగ్ పండగ వాతావరణంలో సాగింది. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్ర: నెరుప్పుడా, పక్కా చిత్రాలు ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.దీనికి మీ స్పందన? జ: చిత్రం విజయం సాధింస్తుందని భావించే 100 శాతం శ్రమిస్తాం. అలాంటి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందక పోతే బాధే కదా. అయితే దేశవ్యాప్తంగా ఏడాదికి 500లకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో నా చిత్రం ఒకటి అని సరిపెట్టుకుంటాను. -
గొర్రెల కాపరిగా అవతారం..
తమిళసినిమా: కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం చాలా కాలంగా పోరాడుతున్న పదహారణాల తెలుగమ్మాయి నటి బిందుమాదవి. నిజం చెప్పాలంటే పక్కింటి అమ్మాయి ఇలానే ఉంటుంది అనేంతగా కుటుంబ కథా పాత్రల్లో ఇమిడిపోయే నటి ఈ అమ్మడు. ఒకరకంగా అలాంటి ఇమేజ్‌నే బిందుమాధవికి మైనస్ అయ్యిందేమో. కేడీబిల్లా కిలాడిరంగా లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన బిందుమాధవికి మార్కెట్ పెరగలేదు. అంతే కాదు అవకాశాలు అడపాదడపాగానే వస్తున్నాయి. నటనకు గ్యాప్ రావడంతో ఈ చిన్నది ఇటీవల సొంత ఊరు వెళ్లి కుటుంబసభ్యులతో గడపడంతో పాటు అక్కడ పిల్లలతో ఆడి పాడడం, గొర్రెల కాపరిగా అవతారం ఎత్తడం లాంటి పనులు చేశారు. అంతేకాదు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కాస్త ప్రచారం పొందే ప్రయత్నం చేశారు. బిందుమాధవి గొర్రెలను కాస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా, అవి పెద్దగా వర్కౌట్ అయినట్లు లేదు. దీంతో ఇప్పటి వరకూ మడికట్టుకు కూర్చున్న ఈ జాణ ఇక లాభం లేదని భావించిందో ఏమో అదిరిపోయేలా అందాలారబోత ఫొటోలను తాజాగా ఇంటర్నెట్లో విడుదల చేసింది. ఈ ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫొటోలు బిందుమాధవికి గ్లామర్ పాత్రలను ఏ మేరకు తీసుకోస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ విక్రమ్‌ప్రభుతో జత కట్టిన పక్కా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. విశేషం ఏమిటంటే ఇందులోనూ బిందుమాధవి లంగా ఓణి ధరించి పల్లెటూరి భామగానే నటించింది. గ్లామర్ కంటూ నటి నిక్కీగల్రాణి ఉందీ చిత్రంలో. మరి పక్కా చిత్రం బిందుమాధవి కెరీర్‌కు ప్లస్ అవుతుందా చూద్దాం. -
27న తెరపైకి ‘పక్కా’
తమిళసినిమా: ఈ నెల 27న తెరపైకి రావడానికి ‘పక్కా’చిత్రం రెడీ అవుతోంది. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన చిత్రం పక్కా. ఆయనతో నటి నిక్కీగల్రాణి, బిందుమాధవి నాయికలుగా నటించారు. చిత్రంలో సూరి, సతీష్, ఆనంద్‌రాజ్, నిళల్‌గళ్‌రవి, సింగముత్తు, సింగంపులి, రవిమరియ, వైయాపురి, ఇమాన్‌అన్నాచ్చి, జయమణి, కృష్ణమూర్తి, ముత్తుకాళై, సిజర్‌మనోహర్, సుజాత, నాట్టామైరాణి, సాయిదీనా ముఖ్య పాత్రలను పోషించారు. పెణ్ కన్‌స్టోరిటియం పతాకంపై టి.శివకుమార్ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించిన ఈ చిత్రానికి బి.శరవణన్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్.సూర్య కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించారు. ఎస్.శరవణన్ ఛాయాగ్రహణం, సి.సత్య సంగీతం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా వినోద ప్రధానంగా తెరకెక్కించిన చిత్రమన్నారు. నటుడు విక్రమ్‌ప్రభును కొత్తగా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఆయన కేరీర్‌లోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. హీరోయిన్లు నిక్కీగల్రాణి, బిందుమాధవి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పలువురు హాస్యనటులు చిత్రంలో నటించడం విశేషమన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
సోల్‌మేట్ కోసం తపన!
బుధవారం వేలంటైన్స్ డే. సోలోగా ఉన్నవారికి సోల్‌మేట్ దొరికితే ఫుల్ ఖుష్ అవుతారు. లేనివాళ్లు సోల్‌మేట్‌ని వెతికే పనిలో ఉంటారు. సింగిల్‌గా ఉన్న ‘హార్ట్ ఎటాక్’ గాళ్ అదా శర్మ కూడా తన సోల్‌మేట్‌ను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. అతగాడు ఎప్పుడెప్పుడు కలుస్తాడా? అని తపన పడుతున్నారు. ఏంటీ.. అదా పెళ్లికి తొందరపడుతున్నారా? అంటే కాదు. సోల్‌మేట్‌ను వెతుకుతున్నది రియల్‌లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. రెండేళ్ల క్రితం ‘క్షణం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన అదా వేలంటైన్స్ డే రోజున ‘సోల్‌మేట్’ అనే చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. అబిర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో అదా డ్యూయెల్ రోల్ చేయనున్నారు. ‘‘ఎంతో తపనతో సోల్‌మేట్‌ను వెతుక్కునే మోడ్రన్ గాళ్ క్యారెక్టర్లో నటించనున్నాను. ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. కానీ అందుకు టైమ్ ఉంది’’ అన్నారు అదా శర్మ. తెలుగులో ఈ చిత్రంతో పాటు అటు తమిళంలో ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో అదా కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీ గల్రానీ మరో కథానాయిక. -
ప్రేమలో చిక్కులు
జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా, నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వీడి లవ్‌లో అన్నీ చిక్కులే’ అన్నది ఉపశీర్షిక. శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్ కుమార్‌ని అభినందిస్తూ, తనకు నిర్మాతగా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారి దగ్గర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో జీవాగారు గెస్ట్ రోల్లో కనిపిస్తారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
వీడి లవ్‌లో అన్నీ చిక్కులే
జీవీ ప్రకాష్ కుమార్, నిక్కీ గల్రానీ జంటగా ఎం. రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘వీడి లవ్ లో అన్నీ చిక్కులే’ అన్నది ఉప శీర్షిక. యశ్వంత్ సాయికుమార్ సమర్పణలో వి.జయంత్ కుమార్ (బి.టెక్) తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని నిర్మాత కేవీవీ సత్యానారాయణ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నేను కూడా డబ్బింగ్ సినిమాలతో నిర్మాతగా పరిశ్రమకు పరిచయమై తర్వాత పెద్ద సినిమాలు నిర్మించా. జయంత్ కూడా భవిష్యత్ లో మంచి సినిమాలు నిర్మించి, పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. వి.జయంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ప్రకాశ్‌రాజ్‌గారి పోలీస్ పాత్ర సినిమాకు హైలైట్. జి.వి. ప్రకాష్ అద్భుతమైన నటనతో పాటు, మంచి సంగీతం అందించారు. అందమైన ఫారిన్ లోకేషన్లలో పాటలు చిత్రీకరించారు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.కృష్ణ, పాటల రచయిత సీహెచ్ పూర్ణాచారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: వెలిదెండ్ల రామ్మూర్తి. -
ఒక్క నిమిషం!
ఒక్క నిమిషం.. అంటే 60 సెకన్లు్ల.. ఒకే ఒక్క నిమిషంలో ఏం చేయగలం? అంటే.. తలచుకుంటే ఏమైనా చేయొచ్చు. మంచి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అదే చేశారు హీరోయిన్లు శ్రియ, నిక్కీ గల్రాని. ‘‘న్యూ ఇయర్ రిజల్యూషన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? నేనైతే రోజులో కనీసం ఒక్క నిమిషమైనా యోగ చేయాలనుకుంటున్నా. డైలీ యోగ చేయడాన్ని మర్చిపోలేని అలవాటుగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను’’ అన్నారు శ్రియ. అయితే ఒక్క నిమిషంలో ఏ ఆసనం వేస్తారో మాత్రం చెప్పలేదు. ఇక నిక్కీ గల్రాని కూడా సేమ్ శ్రియ తీసుకున్న నిర్ణయాన్నే తీసుకున్నారు. ఆమె కూడా యోగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ప్రాణాయామం చేయాలని ఫిక్సయ్యారట. ‘‘ఈ సంవత్సరం ప్రతి రోజూ కనీసం ఒక్క నిమిషమైనా ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తా. మీరూ ఓ మంచి నిర్ణయం తీసుకోండి’’ అన్నారు నిక్కీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. నిక్కీకి ఫిబ్రవరి 9 సూపర్ డే. ఆమె హీరోయిన్గా నటించిన రెండు చిత్రాలు ‘కీ, కలకలప్పు–2’ ఆ రోజునే విడుదల కానున్నాయి. సో..ఆ రోజు నిక్కీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అన్నమాట. -
సందడి సందడిగా
హైదరాబాద్‌లోని ఫైనల్ షెడ్యూల్‌తో సందడి కంప్లీట్ అయ్యింది. కానీ సినిమాలో యాక్టర్స్ చేసిన సందడి థియేటర్లో ప్రేక్షకులను ఏ లెవెల్లో నవ్విస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగక తప్పదు. జీవా, జై, శివ, నిక్కీ గల్రానీ, కేథరిన్ ముఖ్య తారలుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలకలప్పు–2’. ఐదేళ్ల క్రితం సుందర్. సి దర్శకత్వంలోనే వచ్చిన ‘కలకలప్పు’ చిత్రానికి ఇది సీక్వెల్. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కలకలప్పు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. థియేటర్లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా సుందర్ తెరకెక్కించారు. లవ్లీ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు హీరో జీవా. ఇంతకీ కలకలప్పు అంటే ఏంటో తెలుసా? సందడి అని అర్థం. ఇక్కడున్న ఫొటోలో తారలు ఎలా సందడి చేశారో చూస్తున్నారుగా. షూటింగ్ చివరి రోజు స్టిల్ ఇది. సినిమాలో డబుల్ సందడి ఉంటుందట. -
రారండోయ్ వేడుక చేద్దాం
పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచారు. తిరుపతిలో పెళ్లి మండపం బుక్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబాలు రారండోయ్ వేడుక చేద్దాం అని తిరుపతికి బయల్దేరాయి. అలకలు, బుజ్జగింపులు, సరదాలతో పెళ్లిసందడి మొదలైంది. అంతలో సడన్‌గా ఓ ట్విస్ట్. అంతే పెళ్లాగిపోయే పరిస్థితులు వచ్చాయట. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు పెళ్లి జరిగిందా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకులు శక్తీ చిదంబరం. ప్రభుదేవా, నిక్కీ గల్రానీ, అదా శర్మ ముఖ్యపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 15ఏళ్ల క్రితం చిదంబరం డైరెక్ట్ చేసిన ‘చార్లీ చాప్లీన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారన్నది కోలీవుడ్ సమాచారమ్. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ‘‘చార్లీ చాప్లీన్ 2’ సినిమాలో ప్రభుదేవాతో డ్యాన్స్ చేస్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ సూపర్. ఇక్కడ మరికొన్ని సాంగ్స్‌ను షూట్ చేసిన తర్వాత చెన్నైలో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాం’’అని పేర్కొన్నారు అదా శర్మ. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆయనకు ఇద్దరు..!
నృత్య దర్శకుడు ప్రభుదేవా, నటుడు, దర్శకుడు అంటూ ఆల్ రౌండర్‌గా హోల్ ఇండియాను చుట్టేశారు. ప్రస్తుతం ఆయన నటనపై దృష్టి సారిస్తున్నారు. హీరోగా ఆయనకు దేవి చిత్రం మంచి రీఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుదేవా చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అంతేకాక మరిన్ని అవకాశాలు ముంగిట వాలడానికి రెడీగా ఉన్నాయి. ప్రభుదేవా ఇటీవలే ఒకే చెప్పిన చిత్రంలోనే ఇద్దరు ముద్దుగుమ్మలు ఆయనతో రొమాన్స్ చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. 2002లో విడుదలైన చార్లీ చాప్లిన్ మంచి విజయాన్ని సాధించడంతోపాటు తెలుగు సహా ఆరు ఇతర భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ చిత్రంలో ప్రభు, ప్రభుదేవా కలిసి నటించారు. వారికి జంటగా అభిరామి, గాయత్రి రఘురామ్ సీక్వెల్లోనూ నటించడంతోపాటు ప్రభు పాత్రను కూడా పోషించేస్తున్నట్లు సమాచారం. అంటే ద్విపాత్రాభినయం చేయనున్నారన్నమాట. ఆయనతో గ్లామర్ భామ నిక్కీగల్రాణి, తాన్యా రవిచంద్రన్‌లు రొమాన్స్ చేయనున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇటీవల కరుప్పన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. క్రేజీమోహన్ మాటలను అందిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మాక్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం సాంగ్ చిత్రీకరణతో గోవాలో ప్రారంభం కానుందని తెలిసింది. -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్‌తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్‌లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్‌ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
నిక్కిపాట్లు
తమిళసినిమా: జీవీ.ప్రకాశ్ నటించిన డార్లింగ్ చిత్రంతో తమిళంలోకి వచ్చిన అందాల తార నిక్కీగల్రాని. తొలి చిత్రంలోనే దెయ్యం పాత్రలో నటించి అందరిని భయపెట్టి అభిమానులను చూరగొంది ఈ చిన్నది. దీంతో ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా జయాపజయాలను సమానంగా పొందుతూ వస్తున్న నిక్కీగల్రాని హరహర మహాదేవ చిత్రంలో నటించి అడల్ట్ నటిగా మారింది. అంతే అనేక మంది దర్శక నిర్మాతలు నిక్కీగల్రాని అందాలను మరింత అందంగా చూపుతామని ముందుకొచ్చినా ఈ అమ్మడు వారి మాటలకు లొంగలేదు. అంతేకాదు అడల్ట్ ఇమేజ్‌లో కొనసాగకూడదనే ఆమె ఇరుట్టి అరయిల్ మురట్టు కుత్తు (చీకటి గదిలో మొరటి పోట్లు) చిత్రంలో మళ్లీ గౌతమ్ కార్తీక్ సరసన నటించడానికి నిరాకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుందర్.సి రూపొందిస్తున్న కలగలప్పు–2 చిత్రంలో నటిస్తోంది. ఈ విషయం గురించి నిక్కీగల్రాని వివరిస్తూ కలగలప్పు–2 జనవరిలో విడుదలవుతుంది. హరహర మహాదేవ కామెడీ చిత్రం అయినప్పటికీ, అది అడల్ట్ ఓన్లీ చిత్రం అయ్యింది. కలగలప్పు–2 కూడా కామెడీ చిత్రమే. ఈ చిత్రం విడుదల తర్వాత తనపై ఉన్న అడల్ట్ చిత్రాల నాయిక ఇమేజ్ పోతుందనే నమ్మకంతో ఉన్నట్టు నిక్కీ తెలిపింది. -
అడల్ట్ నటి ఇమేజ్‌తో పాట్లు..!
జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన డార్లింగ్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నిక్కీగల్రాని. తొలి చిత్రంలోనే దెయ్యం పాత్రలో నటించి అందరినీ భయపెట్టింది. దీంతో ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు వెల్లువెత్తాయి. కెరీర్లో జయాపజయాలను చవిచూసిన నిక్కీగల్రాని ’హరహర మహాదేవకి’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అడల్ట్ నటిగా మారింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆమెకు ఇదే తరహా ఆఫర్లతో ముంచెత్తారు. వాటికి నో చెప్పిన నిక్కీ అడల్ట్ నటి ఇమేజ్ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. అందులోభాగంగానే ’ఇరుట్టి అరయిల్ మురట్టు కుత్తు’ (చీకటి గదిలో మొరటి పోట్లు) చిత్రంలో మళ్లీ గౌతమ్ కార్తీక్ సరసన నటించడానికి ఆమె నిరాకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుందర్ సీ రూపొందిస్తున్న ’కలగలప్పు-2’ చిత్రంలో నటిస్తోంది. జనవరిలో ఈ సినిమా విడుదలవుతుందని నిక్కీ తెలిపింది. హరహర మహాదేవ కామెడీ చిత్రం అయినప్పటికీ అది అడల్ట్ ఓన్లీ చిత్రమని, కలగలప్పు-2 కూడా కామెడీ చిత్రమే అయినా ఇది అడల్ట్ చిత్రం కాదని, ఈ చిత్రంతో తనపై ఉన్న అడల్ట్ చిత్రాల నాయిక ఇమేజ్ పోతుందనే నమ్మకంతో ఉన్నట్టు నిక్కీ తెలిపింది. -
'పక్కా' ధోని అభిమానిగా..
సాక్షి, చెన్నై: అభిమానం కలగాలే గానీ, అది ఎంత వరకైనా తీసుకెళుతుంది. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే ఎవరికి అభిమానం ఉండదు. అలా ఆయన వీరాభిమానుల్లో ఒకడిగా విక్రమ్‌ప్రభు నటిస్తున్న తాజా చిత్రం పక్కా. బెన్ స్ట్రోడియం పతాకంపై టి.శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు సరసన నిక్కీగల్రాణి, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ప్రధాన పాత్రలో నిర్మాత టి.శివకుమార్ నటించడం విశేషం. సి.సత్య సంగీతాన్ని, శరవణన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి చిత్ర కథానాయకుడి విక్రమ్‌ప్రభు తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్, కామెడీ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో తాను ఉత్సవాల్లో బొమ్మలు విక్రయించే దుకాణం నడుపుకునే యువకుడిగా నటిస్తున్నానని, క్రికెట్ క్రీడ అంటే మహాపిచ్చి అని, దీంతో ధోని అభిమాన సంఘాన్ని నడుపుతానని చెప్పారు. ఇక నటి నిక్కీగల్రాణి రజనీకాంత్ అంటే పడి చచ్చే అమ్మాయిగా ఆయన అభిమాన సంఘ నాయకురాలిగా నటిస్తున్నారన్నారు. ఒక గ్రామ పెద్ద కూతురిగా నటి బిందుమాధవి నటిస్తున్నారని తెలిపారు. ఈ ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలే పక్కా చిత్రం అని వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంతకు ముందెప్పుడూ చేయని యథార్థంతో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు, తనను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పక్కా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత టి.శివకుమార్ మాట్లాడుతూ పక్కా చిత్రంలో తాను ఒక కీలక పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని అన్నారు. తదుపరి ధర్మన్ అనే చిత్రాన్ని నిర్మించనున్నానని, త్వరలోనే ఆ చిత్ర వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి బి.శరవణన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎస్ఎస్.సూర్య నిర్వహిస్తున్నారు. -
ఇద్దరు భామల కనువిందు
తమిళసినిమా: ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో నటిస్తే, అదీ తమ అందాలతో కుర్రకారును కనువిందు చేయడానికి ఎంతదాక అయినా వెళ్లడానికి రెడీ అనే బ్యూటీస్ అయితే ఆ చిత్రం కచ్చితంగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక సుందర్.సీ వంటి వినోదాన్ని పండించే దర్శకుడు ఆ చిత్రాన్ని మలిస్తే ఇక ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టెయిన్మెంట్కు కొదవే ఉండదు. కరెక్ట్‌గా అలాంటి చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు సుందర్.సీ దర్శకత్వం వహించిన కలగలప్పు చిత్రం కోలీవుడ్ తెరపై మంచి సందడి చేసింది. అంతే కాదు అంతకు ముందు మార్కెట్ డల్ అయిన నటులు విమల్, శివ, నటీమణులు అంజలి, ఓవియలకు విజయోత్సాహాన్నిచ్చిన చిత్రం అది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు సుందర్.సీ సిద్ధం అయ్యారు. అయితే ఈ సారి మరింత పెద్ద కాస్టింగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. విమల్, శివలకు బదులు ఇందులో జీవా, జైలను హీరోలుగా ఎంచుకున్నారు. ఇక ఓవియ, అంజలి స్థానంలో అందాల భామలు నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసాలను ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ కలగప్పు–2 చిత్రాన్ని సుందర్.సీ అక్టోబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించే అవకాశం ఉంది. -
‘నయన్‌తో స్నేహం కుదిరింది’
చెన్నై: ఒక్కోసారి అనుకోకుండానే కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకు ముందు తెలుగులో అఖిల్ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్‌లో ఇంతకు ముందు నటి సమంత ఉండేది. ఆ ఫ్లాట్‌లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందని సమాచారం. దీంతో తాను బిజీ హీరోయిన్ అయ్యిపోతాననే కలలు కంటోంది నటి సాయేషాసైగల్. ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్‌లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్మెంట్లో నిక్కీగల్రాణి ఫ్లాట్‌కు పైన ఫ్లాట్‌లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్మెంట్లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో తన ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. ఇలా యాదృశ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట. -
ఆమె చెల్లెలు లాంటిది: క్రికెటర్ శ్రీశాంత్
తమిళసినిమా: నటి నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని నటుడిగా రంగప్రవేశం చేస్తున్న సంచలన క్రికెట్ కీడాకారుడు శ్రీశాంత్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం టీమ్ 5. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ ఫిలింస్ పతాకంపై రాజ్ జక్కారియాజ్ నిర్మిస్తున్నారు. సురేశ్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్‌కు జంటగా నటి నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో మరాఠి నటుడు దేశ్‌పాండే నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని, సైజిత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను బైక్ రేసర్‌గా నటిస్తున్నానని తెలిపారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందానని చెప్పారు. తనకిది తొలి చిత్రం అని, నటి నిక్కీగల్రాణి 25 చిత్రాలకు పైగా నటించారని అందువల్ల నటనలో ఆమె తనకు చాలా నేర్పించారని చెప్పారు. నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని అన్నారు. తను చిన్నతనం నుంచి ఆయనకు తెలుసన్నారు. తన కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు, అన్నయ్య అందరూ సినిమాకు చెందిన వారేనని తెలిపారు. తాను మాత్రమే క్రికెట్ రంగంలోకి వెళ్లానని, ఇప్పుడు మళ్లీ సినిమారంగంలోకి వచ్చానని అన్నారు. తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనని చెప్పారు. త్వరలోనే భారత క్రికెట్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడనున్నట్లు చెప్పారు. తాను రజనీకాంత్, కమలహాసన్‌లను చూసి పెరిగిన వాడినని అన్నారు. కొందరు విజయ్, అజిత్‌లతో కలిసి నటిస్తారా అని అడుగుతున్నారని, వారితో ఒక్క సన్నివేశంలో నటించడానికైనా సిద్ధమేనని శ్రీశాంత్ అన్నారు. -
వాళ్లతో చేయాలని ఉంది!
గ్లామర్ దుస్తుల్లోనే అందాలా? చీరలు, చుడీదారులు ధరించి కూడా అందాలను అందంగా కనిపించవచ్చునని అంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు యువ నటులందరికీ డార్లింగ్‌గా మారిపోయింది. చాలా తక్కువ కాలంలోనే 25 చిత్రాల మైలురాయిని దాటేసిన నిక్కీగల్రాణి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, మాలీవుడ్ అంటూ సౌత్ అంతా చుట్టేస్తోంది. నిక్కీగల్రాణి నటించిన 25వ చిత్రం మరగదనాణిమం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఉంటుందంటున్న నిక్కీగల్రాణితో చిన్న భేటీ. ప్ర: కోలీవుడ్ యువ హీరోలందర్నీ ఆకట్టకున్నట్లున్నారే? జ:యువ హీరోలనే కాదు తమిళ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్నాననే సంతోషంతో ఉన్నాను. నేను అందరితోనూ సన్నిహితంగా ఉంటాను. ప్ర: షూటింగ్ స్పాట్లో గోలగోల చేస్తారట? జ: విష్ణువిశాల్, విక్రమ్‌ప్రభు, ఆది, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇలా చాలా మంది యువ హీరోలతో రెండు, మూడు సార్లు నటించాను. వీళ్లంతా నాతో స్నేహంగా ఉంటారు. అదే విధంగా నాకు హీరోయిన్ అన్న గర్వం ఏమీ ఉండదు. కెమెరా ముందు ఎలాగూ నటిస్తున్నాం. నిజజీవితంలోనూ నటిస్తే బాగుండదు. మనల్ని మనం అర్థం చేసుకోలేం. అందుకే నిజజీవితంలో నేను నేనుగానే ఉంటాను. ప్ర: చాలా త్వరగా 25 చిత్రాలు పూర్తి చేసినట్లున్నారు? జ: నా వృత్తిని మనçస్ఫూర్తిగా ప్రేమించడమే ఇందుకు కారణం. ఇంట్లో కాళీగా కూర్చోవడం నాకిష్టం ఉండదు. అదే విధంగా పనిపై తప్ప మరే అంశంపైనా దృష్టి సారించను. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం కావచ్చు. ప్ర: ఒకే తరహా పాత్రలు ప్రేక్షకులకు బోర్ కొడుతుందనుకుంటా? జ: ఈ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. నేను ఎంచుకునే కథా చిత్రాలు, పాత్రలన్నీ వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా పాత్రల్లో కొత్తదనం ఉంటేనే నటించడానికి అంగీకరిస్తాను. అలా చాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నాను. ప్ర: స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడం లేదా? జ: నిజం చెప్పాలంటే పెద్ద హీరోలతో నటించాలనే కోరిక నాకూ ఉంది. అందుకు సరైన టీమ్ కావాలి. అందుకు తగిన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం ఎదురు చూస్తున్నా. ప్ర: ఆ మధ్య నటించిన మొట్టశివ కెట్టిశివ చిత్రంలో అందాలారబోతలో హద్దులు మీరి నటించారనే విమర్శల గురించి మీ కామెంట్? జ: ఇక్కడ మీకో నిజం చెప్పాలి. ఆ చిత్రంలో పాటల చిత్రీకరణ సమయంలో నా కాలుకు పెద్ద గాయమైంది. సరిగా డాన్స్ కూడా చేయలేక పోయాను. అయినా ఆ చిత్రంలోని పాటలను సక్సెస్ చేయాలన్న వెర్రి మాత్రం ఉండేది. ఇంకా చెప్పాలంటే కురచ దుస్తులు ధరించి నటిస్తేనే గ్లామర్ అనడం సరికాదు. అమ్మాయిల్ని, చీరల్లోనూ, చుడీదార్‌లోనూ అందంగా చూపించవచ్చు. -
జీవాకు జంటగా నిక్కీగల్రాణి
నటుడు జీవా బ్యూటీ నిక్కీగల్రాణితో కలిసి కీ అంటున్నారు. నటుడు జీవాకు ఇప్పుడు ఒక మంచి విజయం చాలా అవసరం. ప్రస్తుతం ఆయన సంగిలి బుంగిలి కదవై తోర చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తాజాగా మరో చిత్రంలో నటించేస్తున్నారు. దీని పేరు కీ. ఇందులో నటి నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్జే.బాలాజీ, పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మనోబాలా, మీరాకృష్ణన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు స్నేహం ఇతివృత్తంతో నాడోడిగళ్, క్రీడా నేపథ్యంలో ఈటీ, హర్రర్ కథా చిత్రంగా మిరుదన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత ఎస్.మైఖెల్ రాయప్పన్ ప్రస్తుతం శింబు హీరోగా అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జీవా కథానాయకుడిగా కీ చిత్రాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు సైలెంట్‌గా మొదలయ్యాయి. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ జరుపుకుని ఈ 20వ తేదీకీ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం ద్వారా సెల్వరాఘవన్ శిష్యుడు కలీస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, అనీష్ తరుణ్‌కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
మరగదనాణయంకు యూ సర్టిఫికెట్
మరగదనాణయం చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన చిత్రం మరగదనాణయం.ఆనందరాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్ రాజ కామరాజ్, డేనీ, కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైమ్‌గోపి ము ఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే.శరవణ్ దర్శకత్వంలో యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై డిల్లీబాబు నిర్మిస్తున్నారు.యాక్షన్, ఎండ్వెచర్, వినోదం కలగలిపిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మరగదనాణయం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. చిత్రాలకు యూ సర్టిఫికెట్ రావడమే గగనంగా మారిన తరుణంలో తమ చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఢిల్లీబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.మంచి కథా చిత్రాలను నిర్మాంచాలన్న ఒక ఆశయంతో ఈ రంగంలోకి వచ్చామని, మరగద నాణయం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను పొందుతోంది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందన్నది గమనార్హం. -
ప్రేమ కథా చిత్రంగా కడవుల్ ఇరక్కాన్ కుమారు
టాస్మాక్ సన్నివేశాలు లేని చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు. టాస్మాక్‌ను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు మద్యం సన్నివేశాలు లేకుండా ఉండడం లేదు. ఇక అసలు విషయం దర్శకుడు రాజేశ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు లేని చిత్రమే లేదు. అలాంటిది ఆయన తాజా చిత్రమే కడవుల్ ఇరుక్కాన్ కుమారు. అమ్మా క్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి, ఆనంది నటిస్తున్నారు. జీవీకి స్నేహితుడిగా ఆర్జే.బాలాజీ, ముఖ్యపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న ఈచిత్రం గురించి దర్శకుడు రాజేశ్ తెలుపుతూ సరోజ చిత్రం తరువాత రోడ్డు ప్రయాణంలో సాగే మించి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రం అని తెలిపారు. ఇందులో ప్రేమ, కామెడీ, సెంటి మెంట్ అంటూ ఆబాలగోపాలం చూసి ఆనందించే జనరంజక అంశాలు ఉంటాయన్నారు. ఇది రోడ్డు జర్నీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను ప్రధాన రోడ్లపైనే నిర్వహించామని తెలిపారు.అందుకు చెన్నై, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో జనసంచారం లేని రోడ్లలో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. తన గత చిత్రాల్లో టాస్మాక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయనే అపవాదు ఉందన్నారు. అయితే ఈ చిత్రంలో అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఉండదని ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు. -
హారర్ చిత్రాలొద్దు బాబోయ్
హారర్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి నిక్కీగల్రాణి ఇప్పుడలాంటి చిత్రాలు వద్దంటున్నారు. ఈ అమ్మడికి ఆదితో నటించిన యాగవరాయనుమ్ నాకాక్క తొలి చిత్రం అయినా తెరపైకి వచ్చిన మొదటి చిత్రం మాత్రం డార్లింగ్. జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి తను హారర్ రొమాన్స్ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా అవకాశాలు నిక్కీగల్రాణి తలుపుతడుతున్నాయి. కో-2, వేల్లన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. మధ్యలో దెయ్యం కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చాయట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ డార్లింగ్ చిత్రం తరువాత ఆ తరహా దెయ్యం చిత్రాల అవకాశాలు పలు వచ్చాయన్నారు. అయితే వరుసగా అలాంటివే చేస్తే దెయ్యం చిత్రాల నాయకి అనే ముద్రవేస్తారని భయంతో నిరాకరించానని చెప్పారు. అయితే ప్రతీకారం తీర్చుకునే పాత్రలు కాకుండా వైవిధ్యభరిత కథా పాత్రలైతే హారర్ చిత్రాలు చేయడానికి రెడీ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కెట్టశివ మొట్టశివ, నెరుప్పుడా, కీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, మరగద నాణయం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే కెట్టశివ మొట్టశివ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, నెరుప్పుడా చిత్రాల్లో అందాలారబోతలో దుమ్మురేపుతున్నారట. ఈ చిత్రాలతో యువతకు మరింత దగ్గరవుతాననే నమ్మకాన్ని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. -
నిక్కీగల్రాణితో రొమాన్స్‌కి సై అంటున్న జీవా
నటుడు జీవాతో తొలిసారిగా రొమాన్స్‌కు సిద్ధమయ్యారు నటి నిక్కీగల్రాణి. వీరిద్దరూ కలిసి నటించే చిత్రానికి కీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు నాడోడిగళ్, ఈటీ, మిరుదన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత మైఖేల్‌రాయప్పన్ ప్రస్తుతం శింబు హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా జీవా, నిక్కీగల్రాణి జంటగా కీ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. మరో నాయకిగా అనైక సోటీ నటిస్తున్నారు. నూతన దర్శకుడు కలీస్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడన్నది గమనార్హం. ఈ కీ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్జే.బాలాజీ, మలయాళ నటుడు పద్మసూర్య, రాజేంద్రప్రసాద్, సుహాసిని, మీరాకృష్ణన్, మనోబాలా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఆ చిత్రం పూజాకార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. స్నేహితుని స్నేహితుడు తనకూ స్నేహితుడే అన్న కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో ఏకధాటిగా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
ఆ ముగ్గురికీ పదో చిత్రం
ఒక్కోసారి కొన్ని విషయాలు యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. అలా చిత్ర కథానాయకుడికి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి పదో చిత్రమైంది వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా మారారు. ఆయన కథానాయకుడిగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎళిల్‌మారన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి ఎళిల్‌మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ముగ్గురికీ వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ పదో చిత్రం కావడం విశేషం. నిక్కీగల్రాణి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం, సూరి రవి మరియు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం వివరాలను తెలియచేయడానికి మంగళవారం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎళిల్‌మారన్ మాట్లాడుతూ చిత్ర కథను నటుడు విష్ణువిశాల్‌కు వినిపించగా చాలా బాగుందంటూ తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకొచ్చారన్నారు. ఈ రోజుల్లో చిత్రాన్ని నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్ చాలా కష్టం అయ్యిందన్నారు. విష్ణువిశాల్ చిత్ర నిర్మాణ ఆలోచనలు, ప్రమోషన్ విధానం చాలా కొత్తగా ఉన్నాయని అన్నారు. చిత్ర హీరోయిన్ నిక్కీగల్రాణికి ఇందులో చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. తను మహిళా పోలీస్‌గా నటిస్తున్నారని, ఫైట్స్ కూడా చేశారని తెలిపారు. చిత్ర కథానాయకుడు,నిర్మాతలలో ఒకరైన విష్ణువిశాల్ మాట్లాడుతూ వేల్లైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రం తనకు మాత్రమే 10వ చిత్రం అనుకున్నానన్నారు.ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పగా ఆయనకు,సంగీత దర్శకుడు సత్యకు 10వ చిత్రం అని తెలిపారన్నారు. నీర్పరవై చిత్రం తరువాత చిత్రాల ఎంపికలో చాలా శ్రద్ధ చూపిస్తున్నానన్నారు. అలా ఆలోచించి అంగీకరించిన చిత్రం ఇదని చెప్పారు. -
ఆది, నిక్కీగల్రాణి చిత్రానికి శ్రీకారం
యువ నటుడు ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించనున్న తాజా చిత్రానికి మంగళవారం పూజాకార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు ఉరుమీన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత ఢిల్లీబాబు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఏఆర్కే.శరవణ్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. పీవీ.శంకర్ చాయాగ్రహణం, నవ సంగీతదర్శకుడు దీపు సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనకు చిన్నతనం నుంచి సినిమా అంటే హద్దు మీరిన మోహం అన్నారు. ఈ రంగంలో తన కంటూ ఒక స్థాయిని సాధించుకోవాలన్న కోరిక ఉరిమీన్ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు. సినిమాలో దర్శకుడు, సంగీతదర్శకుడు,నటీనటులు ముఖ్యభాగం అయినా ప్రధాన బాధ్యత అన్నది నిర్మాతపైనే ఉంటుందన్నారు. ఈ రంగంలో ప్రతిభావంతులైన వారికి ఆక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ ఒక నిచ్చెనలా ఉండాలన్న భావంతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాంటి వారికి తమ సంస్థ కచ్చితంగా ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందన్నారు.అదే విధంగా ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. -
జీవీతో మూడోసారి
పిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకుడిగానూ విజయాల బాటలో దూసుకుపోతున్నారు. జీవీ హీరోగా నటించిన మూడు చిత్రాలు విడుదలై విజయవంతం అవడం విశేషం. ఆయనతో నటించిన హీరోయిన్లకు వరుసగా అవకాశాలు రావడం గమనార్హం. జీవీతో డార్లింగ్ చిత్రంలో నటించిన నిక్కీగల్రాణి కోలీవుడ్‌లో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. అలాగే త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో జత కట్టిన ఆనంది ఆ చిత్రంలో తనను అశ్లీలంగా చిత్రీకరించారంటూ గగ్గోలు పెట్టడమే కాకుండా చిత్రం దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది. ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తేసింది. ఆ ప్రభావ మో ఏమో గానీ ఇప్పుడు ఆయనతో వరుసగా రెండు చిత్రాలలో రొమాన్స్ చేసే అవకాశాలను కొట్టేసింది. ప్రస్తుతం ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నటిస్తున్న ఆనంది తాజాగా మూడో సారి ఆయనతో నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. బ్రూస్లీ చిత్రాన్ని పూర్తి చేసిన జీవీ ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా తదుపరి ఎం.రాజేశ్ దర్శకత్వంలో కడ వుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఇక హీరోయిన్గా నిక్కీగల్రాణి ఎంపికైన విషయం తెలిసిందే. మరో హీరోయిన్గా ఆనంది నటించనున్నట్లు తెలిసింది. ఇక నటి అవికాకౌర్ ముఖ్య పాత్రను పోషించనున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, ఆర్వీ.బాలాజీ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్, మనోబాలా, రోబోశంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జీవీనే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మా క్రియేషన్స్ శివ నిర్మించనున్నారు. చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. -
రాజకీయ నేపథ్యంగా కో-2
కో-2 చిత్రం మే 6న తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత ఎల్రెడ్. కుమార్ నిర్మించిన తాజా చిత్రం కో-2. నవ దర్శకుడు శరత్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీతలు బాబీసింహా, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నటి నిక్కీగల్రాణి కథానాయకిగా నటించిన ఇందులో నటుడు బాలా శరవణన్ కీలక పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు కల్గిన రంగాలు రాజకీయం, మీడియా. రాజకీయాల్లో మీడియా ప్రధాన భూమికను పోషిస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మీడియా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి ఇతి వృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం కో-2 అన్నారు చిత్ర నిర్మాత. ఇందులో నటుడు బాబీసంహా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందనీ. ఈ చిత్రం ఆయన కేరీర్‌ను మంచి మలుపు తిప్పుతుందనే నమ్మకం ఆశాభావంతో ఆయన ఉన్నట్లు పేర్కొన్నారు. నిక్కీగల్రాణి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఈ పాత్ర చిత్రం అంతా ఉంటుందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అంతకు ముందే రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన కో-2 చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తరువాత హీరోగా మారిన తమిళ స్టార్ జివి ప్రకాష్ కుమార్ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ఆయన స్వల్పంగా గాయపడ్డారు. చిన్నపాటి గాయాలతో జీవీ బయటపడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం జీవీ ప్రకాష్ 'కడవుల్ ఇరుక్కన్ కుమార' అనే తమిళ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్, ఆర్జే బాలజీలపై పాండిచ్చేరిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిక్కి గల్రానీ, అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి గత సినిమాల మాధిరిగానే ఈ సినిమాను కూడా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జివి ప్రకాష్ నటించిన 'నాకు ఇంకో పేరుంది' సినిమా టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఈ మూవీని కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్
మళ్లీ ఇద్దరమ్మాయిలతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు జీవీ.ప్రకాశ్‌కుమార్. ఇంతకు ముందు మనీషాయాదవ్, ఆనందిలతో ఈయన డ్యూయెట్లు పాడిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కమర్షియల్‌గా హిట్ అయి కాసుల వర్షం కురిపించిదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటు హీరోగానూ,అటు సంగీతదర్శకుడిగానూ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న జీవీ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు.కడవుళ్ ఉరుకిరాన్ కుమారు చిత్రంలో నటించి సంగీతం అందించడానికి రెడీ అవుతున్నారు.ఇంతకు ముందు శివ మనసుల శక్తి, ఒరుకల్ ఒరుకన్నాడీ, బాస్‌ఎన్గిర భాస్కరన్, వాసువుమ్,శరవణనుమ్ ఒన్నా పడిచవంగ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఎం.రాజేశ్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది. దైవవాక్కు, చిన్నమాప్లే, రాసయ్య, అరవిందన్ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మా క్రియేషన్స్ శివ చిన్న గ్యాప్ తరువాత నిర్మించనున్న చిత్రం కడవుళ్ ఇరుక్కిరాన్ కుమారు. ఇందులో జీవీ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు నిక్కీగల్రాణి కాగా ఇంకో బ్యూటీ అవిక గోర్. ఈ గుజరాతి చిన్నది చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ ద్వారా మంచి ప్రాచుర్యం పొందింది. అంతే కాదు తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేసి అక్కడి అక్కడి అభిమానుల మనసుల్ని దోచుకుంది. తాజాగా కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ అనే కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్న అవికగోర్ ఇప్పుడు జీవీతో కలిసి తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి కానుందన్న మాట. లవ్, రొమాంటిక్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో అందే వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని ఆ తరహాలోనే జనరంజకంగా తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారట. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని విశాఖపట్టణం.గోవా ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
ఆయనతో డ్యాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం
నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వద్ద శిక్షణ పొందుతున్నాని తెలిపింది నటి నిక్కీగల్రాణి. ఫొటోగ్రాఫర్లకు హాట్ హాట్ ఫోజులిస్తూ సినీ వర్గాల దృష్టిని తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పటికే డార్లింగ్ చిత్రంలో సక్సెస్ ఖాతాను ప్రారంభించిందన్నది గమనార్హం. చేతి నిండా చిత్రాలున్న నిక్కీగల్రాణి తా జాగా తెలుగులో కూడా ఖాతా తెరిచింది. సునిల్‌కు జంటగా నటించిన కృష్ణాష్టమి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే తమిళంలో ఆదితో నటించిన యాగవరాయనుమ్ నాకాక్క చిత్రం మలు పు పేరుతో అనువాదం అయి ఇదే రోజున విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్లో ఏ మాత్రం ఆకర్షితురాలవుతుందో వేచి చూడాల్సిందే. ఈ క్యూట్బేబీ ఇప్పుడు రాఘవ లారెన్స్ వద్ద నృత్య రీతులు నేర్చుకుంటోందట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశిస్తున్నానంది.లక్కీగా తనకు అలాంటి అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉందని చెప్పింది. తెలుగులో తాను నటించిన కృష్ణాష్టమి చిత్రం శుక్రవారం తెరపైకి రానుందని తెలిపింది. అందులో విదేశాల్లో నివశించే భారతీయ యువతిగా నటించానని చెప్పింది. ఇందు లో రచయిత్రిగా నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది. ఇక తమిళంలో డార్లింగ్ చి త్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యానని ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్, కో-2,మొట్టశివ కెట్టశివ చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించింది. రాఘవ లారెన్స్‌కు జంటగా నటిస్తున్న మొట్టశివ కెట్టశివ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధిం చిన పటాస్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోందని తెలిపింది. ఆర్బీ.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిరమణి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పిం ది. ఈ చిత్రం కోసం రాఘవ లారెన్స్ వద్ద డాన్స్ నే ర్చుకుంటున్నానని ఆయన వద్ద డాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం అని నిక్కీగల్రాణి పేర్కొంది. -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!
- నిక్కీ గల్రానీ ‘‘చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. నేను మాత్రం చదువు మధ్యలోనే మానేసి ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి, సినిమా రంగానికి వచ్చా’’ అన్నారు యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాల్లో నటించిన నాయిక సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’లో, ఆది పినిశెట్టికి జతగా ‘మలుపు’ చిత్రంలో హీరోయిన్గా నటించారామె. ఈ రెండు చిత్రాలూ ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. తెలుగులో తన తొలిచిత్రమైన ‘కృష్ణాష్టమి’ విశేషాలు నిక్కీ గల్రానీ మాటల్లోనే... * చదువుతున్నప్పుడు మధ్యలో మానేసి మోడలింగ్‌లోకి వచ్చా. కేవలం 10 నెలల్లో 45 యాడ్స్ చేశా. ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా రంగానికి వచ్చా. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రెండున్నరేళ్లలో 15 సినిమాలు చేశా. * మలయాళంలో చేస్తున్నప్పుడు నిర్మాత ‘దిల్’ రాజుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. కానీ, మలయాళ చిత్రం పూర్తయ్యేవరకు కుదరదని చెప్పా. తరువాత ‘దిల్’రాజుగారు ఫోన్ చేసి, ‘నెల తరువాతే షూటింగ్’ అని చెప్పడంతో ఓకే అనేశా. అలా తెలుగులో ‘కృష్ణాష్టమి’ నా మొదటి చిత్రమైంది. * ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర చేశా. ‘పల్లవిజం’ అనే బుక్ రాస్తుంటా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందనుకునే తత్త్వం. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటుంది. * కెరీర్‌పరంగా నాకు ఏదైనా అనుమానం వస్తే మా అక్క సంజనను అడిగి, సమాధానం తెలుసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగ అన్నమాట! * వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి హీరో సునీల్. ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. విదేశాల్లో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో వణుకొచ్చే చలిలో కూడా ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి జాగింగ్‌కు వెళ్లొచ్చేవారు. నేను చాలా సహనంగా ఉంటాను. ఇక, మా డెరైక్టర్ వాసువర్మగారైతే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. * ఏ సినిమా చేసినా నా పాత్రకూ, నా నటనకూ ప్రాధాన్యం ఉండాలి. నా సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలి. అటువంటి పాత్రలైతేనే ఎంచుకుంటా. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిలను చీరలో కూడా అందంగా చూపొచ్చు. ఈ చిత్రంలో స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యత ఉండదు. * తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ తర్వాత ఖరారు చేస్తా. -
సాహసరాణి నిక్కీగల్రాణి
కొన్ని సార్లు రిస్కీ ఫైట్స్ అనిపిస్తే ప్రముఖ హీరోలకే డూప్‌లను నటింపజేస్తారు. అలాంటిది నటి నిక్కీగల్రాణి ఏకంగా కరాటే ఫైట్‌లోనే డూప్ లేకుండా నటించేసిందట. ముద్దుగా డార్లింగ్ అంటూ దెయ్యంగా తమిళ ప్రేక్షకుల్ని భయపెట్టేసి గుర్తింపుపొందేసిన నటి నిక్కీగల్రాణి. ఆ తరువాత యాగవరాయనుమ్ నాకాక్క తదితర చిత్రాల్లో మెరిసి వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఎళిల్ దర్శకత్వంలో విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో నిక్కీగల్రాణి పోలీస్ అధికారిణిగా కనిపించనుందట. ఇందులో ఫైట్ సన్నివేశాల్లోనూ దడదడలాడించిందట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన సాహస దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయట. ఒక ఫైట్ సన్నివేశంలో కరాటే విద్యను కూడా ప్రదర్శించిందట. ఆ ఫైట్ సన్నివేశంలో గాయాలకు గురై అస్పత్రి పాలైందట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ రిస్కీ సన్నివేశం అయిన తెలిసినా డూప్ లేకుండా తానే నటించాలని భావించానని చెప్పింది. అలా రిస్క్ తీసుకుని నటించడంతో తన కుడి చెయ్యి వేలు విరిగిందని దాంతో వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపింది. తాను రికవరీ అవ్వడానికి రెండు వారాలకు పైనే పట్టిందని చెప్పింది. అదే విధంగా లారెన్స్ సరసన మొట్ట శివ కెట్ట శివ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. అందులో విలేకరిగా నటిస్తుండటంతో ఆ పాత్రకు తగ్గట్టుగా కనిపించడానికి బరువు చాలా తగ్గినట్లు చెప్పింది. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. కన్నడం కంటే తమిళంలో ఆదరణ బాగుండడంతో చెన్నైకి మకాం మార్చినట్లు నిక్కీగల్రాణి తెలిపింది. తెలుగులో మలుపు, క్రిష్ణాష్టమి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని,అలాగే తమిళంలో కో-2 చిత్రం త్వరలో విడుదలకానుందని నిక్కీగల్రాణి వెల్లడించింది. -
నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు
నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటోంది నిక్కికల్ రాణి. ఈ కన్నడ భామ కోలీవుడ్‌లో పరిచయమైన చిత్రం డార్లింగ్. తొలి చిత్రంతోనే తమిళ సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న జాణ ఈమె. కన్నడ నటి సంజనకు సోదరి అయిన ఈ సుందరితో మినీ ఇంటర్వ్యూ. ప్ర: చిత్ర రంగ ప్రవేశం ఎలాజరిగింది? జ: ఇంట్లో వాళ్లకేమో నేను డాక్టర్ కావాలని ఆశ. నేను అయితే, ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేశాను. ఆ తర్వాత మోడలింగ్‌పై దృష్టి పెట్టాను. ఇప్పుడు నటి అయ్యాను. దీన్ని బట్టి చూస్తే, ఏదీ మన చేతుల్లో లేదని అర్థం అవుతుంది. ప్ర: మీ అక్క సంజన ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? జ: అక్క బిజీ ఆర్టిస్టు. అయినా, నేను నటిని కావడం ఆమెకు సంతోషం. మేకప్, కాస్ట్యూమ్స్ లాంటి విషయాల్లో సలహాలు ఇస్తుంటుంది. షూటింగ్ స్పాట్లో ఎలా నడుచుకోవాలో అన్నదానిపై సూచనలు ఇస్తుంటుంది. ప్ర: డార్లింగ్ చిత్రంలో నటిగా అనుభవం? జ: చాలా సరికొత్త అనుభవం. ఒక భూత్ బంగ్లాలో దారుణంగా హత్యకు గురైన యువతి దెయ్యంగా మారి నాలో ప్రవేశిస్తుంది. దీంతో జీవీ ప్రకాష్ కుమార్ ప్రేయసిగా, ఒక విధమైన హాస్యభరిత నటనతో దెయ్యం పట్టిన మనిషిగా నటన ప్రదర్శించడం సవాల్‌గా మారింది. రెండు విభిన్న కోణాల్లో సాగిన ఈ పాత్రల్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ఈ చిత్రంలో నా నటనకు తమిళ ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. ప్ర: దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తున్నారటా? జ: మలయాళంలో దిలీప్‌తో ఇవన్ మర్యాద రామన్, వినిత్ శ్రీనివాస్ సరసన ఒరు సెండ్ క్లాస్ యాత్ర, సురేష్ గోపికి జంటగా రుద్రసింహాసనం చిత్రాల్లో, కన్నడంలో సిద్దార్థ అనే ఒక చిత్రంలో, తెలుగులో సునీల్‌కు జంటగా మలుపు అనే చిత్రంలో నటిస్తున్నాను. ప్ర: బాలీవుడ్ ఆశ మరీ? జ: అన్ని భాషల్లో నటించాలని ఉంది. అయితే, అన్నీ సక్రమంగా అమరాలిగా. ముందు ఇక్కడ పేరు సంపాదించుకోవాలి. ఆ తర్వాత బాలీవుడ్ ఆశిస్తాను. ప్ర: దక్షిణాదిలో నాలుగు భాషల్లో నటిస్తున్నారు..వీటిలో ఏ భాష సౌకర్యంగా ఉంది? జ: భాషలు వేరైనా నటన ఒక్కటే. పాత్రను అందులోని భావాలను అర్థం చేసుకుంటే, ఏ భాషలోనైనా నటించడం సౌకర్యంగా ఉంటుంది. నాకు తెలిసిన భాషలో సంభాషణ రాసుకుని, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని హావభావాలు వ్యక్తం చేస్తూ నటిస్తాను. ప్ర: గామర్ విషయంలో మీ భావన? జ: నాలో నటనా ప్రతిభ ఉంది. మొదట దానిని బహిర్గతం చేయాలని ఆశ పడుతున్నాను. అలాగని, నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే, నటనకు అవకాశం ఉన్న పాత్రనే ప్రేక్షకుల మనస్సుల్లో చిరకాలం నిలిచి పోతాయన్నది నా అభిప్రాయం. గౌరవాన్ని కాపాడుకునే పాత్రలు చేయాలని కోరుకుంటున్నా. ప్ర: బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? జ: ఒకడు ఉన్నాడు. అతడి పేరు సినిమా. అవును నేను ఇప్పుడు సినిమాలను మాత్రమే ప్రేమిస్తున్నాను. నటిగా ఇప్పుడే అడుగులు వేయడం ఆరంభించాను. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏమిటి. ఇప్పటి నుంచే ప్రేమ గురించి ఆలోచిస్తుంటే, కెరీర్ దెబ్బ తింటుంది. అందువల్ల ప్రస్తుతం నా దృష్టి అంతా నటనను ప్రేమించడమే.