
జీవీతో మూడోసారి
పిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకుడిగానూ విజయాల బాటలో దూసుకుపోతున్నారు. జీవీ హీరోగా నటించిన మూడు చిత్రాలు విడుదలై విజయవంతం అవడం విశేషం. ఆయనతో నటించిన హీరోయిన్లకు వరుసగా అవకాశాలు రావడం గమనార్హం. జీవీతో డార్లింగ్ చిత్రంలో నటించిన నిక్కీగల్రాణి కోలీవుడ్‌లో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. అలాగే త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో జత కట్టిన ఆనంది ఆ చిత్రంలో తనను అశ్లీలంగా చిత్రీకరించారంటూ గగ్గోలు పెట్టడమే కాకుండా చిత్రం దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది.
ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తేసింది. ఆ ప్రభావ మో ఏమో గానీ ఇప్పుడు ఆయనతో వరుసగా రెండు చిత్రాలలో రొమాన్స్ చేసే అవకాశాలను కొట్టేసింది. ప్రస్తుతం ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నటిస్తున్న ఆనంది తాజాగా మూడో సారి ఆయనతో నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. బ్రూస్‌లీ చిత్రాన్ని పూర్తి చేసిన జీవీ ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా తదుపరి ఎం.రాజేశ్ దర్శకత్వంలో కడ వుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
ఇందులో ఇక హీరోయిన్‌గా నిక్కీగల్రాణి ఎంపికైన విషయం తెలిసిందే. మరో హీరోయిన్‌గా ఆనంది నటించనున్నట్లు తెలిసింది. ఇక నటి అవికాకౌర్ ముఖ్య పాత్రను పోషించనున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, ఆర్‌వీ.బాలాజీ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్, మనోబాలా, రోబోశంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జీవీనే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మా క్రియేషన్స్ శివ నిర్మించనున్నారు. చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.