Buzz: Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani, Likely To Announce Date Soon - Sakshi
Sakshi News home page

Aadi Pinisetty- Nikki Galrani Marriage: హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్‌ హీరో

Published Sat, Mar 19 2022 10:20 AM | Last Updated on Sat, Mar 19 2022 1:44 PM

Buzz: Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani, Likely To Announce Date Soon - Sakshi

Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani?: టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పాటలు ఎక్కనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొంతకాలంగా హీరోయిన్‌ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. బుజ్జిగాడు హీరోయిన్‌ సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ. చదవండి: ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్‌,అసలేమైందంటే..


‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ వేడకకు సైతం నిక్కీ హాజరైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్‌పోర్ట్‌లో వీరు జంటగా దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది.


అయితే తాజాగా నిక్కీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' సినిమాలతో అలరించిన ఆది ఇటీవలె గుడ్‌ లక్‌ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: గుండెపోటుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమాని మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement