Did Sundeep Kishan Confirm Dating with Regina Cassandra - Sakshi
Sakshi News home page

Sundeep Kishan : రెజీనాతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్‌ చేసిన సందీప్‌ కిషన్‌

Published Fri, Dec 16 2022 8:42 AM | Last Updated on Fri, Dec 16 2022 10:30 AM

Did Sundeep Kishan Confirms His Relationship With Regina Cassandra - Sakshi

తమిళసినిమా: ప్రస్తుతం వార్తల్లో ఉన్న నటి రెజీనా కసాండ్రా. ఈ చెన్నై అమ్మాయి బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్‌ ముదల్‌ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ బ్యూటీ ఎక్కువ చిత్రాలు చేయడం, కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాలర్‌గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురిం రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్‌ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.

ఆ సందర్భంగా నటుడు సందీప్‌ కిషన్‌ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్‌ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్‌ కిషన్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement