Regina Cassandra
-
హీరోలతో రిలేషన్ రూమర్స్.. 'మ్యాగీ' కాంట్రవర్సీ.. రెజీనా ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
సౌత్‌కు, బాలీవుడ్‌కు ఉన్న పెద్ద తేడా ఇదే!: రెజీనా
చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి ఇక్కడే సెటిలైపోయింది రెజీనా కసాండ్రా. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్రపరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది నుంచి వచ్చే నటీమణులు ఎందరో భాష విషయంలో ఇబ్బందిపడుతూ ఉంటారు. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మనకు భాష రాదంటే సినిమాలో సెలక్ట్ చేయడానికి బాలీవుడ్ ఇష్టపడదు. కానీ సౌత్‌లో ఇలా ఉండదు. భాష రాకపోయినా సినిమాకు ఎంపిక చేసుకుంటారు.కాస్టింగ్ ఏజెంట్లు ఉండరుపైగా బాలీవుడ్లో పని చేయాలనుకున్న కొత్తలో నేను ముంబైలోనే ఉండాలన్నారు. మీటింగ్స్‌కు హాజరవుతూ ఉండాలన్నారు. సౌత్‌లో ఇలాంటి నియమనిబంధనలేమీ ఉండవు. కాస్టింగ్ ఏజెంట్లు అన్న పదానికి కూడా చోటు లేదు. కేవలం మేనేజర్లు, పీఆర్వోలు ఉంటారు. ఇప్పుడిప్పుడే టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు సౌత్‌లోనూ ప్రవేశిస్తున్నాయి.అందుకే నా కోసం ఓ టీమ్ఇకపోతే బాలీవుడ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అలాగని నాకు త్వరగా ఆఫర్లు రావాలని మార్కెట్లో నన్ను నేను అమ్ముకోలేదు. కానీ ఇలా మొండిగా ఉంటే ఛాన్సులు రావని ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే నాకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాను. వాళ్లే నాకోసం సంబంధిత వ్యక్తులతో బేరసారాలు, సంప్రదింపులు జరుపుతూ ఉంటారు అని రెజీనా చెప్పుకొచ్చింది.చదవండి: కన్నడ సినిమా రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్.. ఫస్ట్ మూవీ ఇదేనా..? -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం'
దసరా సందర్భంగా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం.’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
ఆ సమయంలో అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయా: రెజీనా
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా నటి రెజీనాకు అభిమానులు ఉన్నారు. సుమారు 17 ఏళ్లుగా ఆమె పలు సినిమాలతో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు తమిళం, తెలుగు ,హిందీ తదితర చిత్రాల్లోనూ కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా ఛాన్సులు రావడం లేదు. దీంతో వెబ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే, తాజాగా తమిళంలో నటుడు అజిత్ కథానయకుడిగా నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇండస్ట్రీలో రెజీనా చాలా బోల్డ్ నటి అనే చెప్పాలి. సాధారణంగా నటీమణులు వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానిక ఇష్టపడరు. అయితే రెజీనా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈమె సినిమా విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను ధైర్యంగా బయటకు చెప్పేస్తారు. ఆ మధ్య తాను చాలా మందితో డేటింగ్ చేశాయని చాలా బోల్డ్‌గా చెప్పిన ఈ అమ్ముడు తాజాగా మరో వ్యక్తిగత విషయాన్ని బయట పెట్టారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రెజీనా ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని చెప్పకూడని ఏదైనా విషయం చేసి తల్లిదండ్రుల వద్ద దొరికిపోయారా అని ప్రశ్నించాడు. అందుకు బదులిచ్చిన రెజీనా ఒకసారి పక్క ఇంట్లో ఎదో జరుగుతుంది. అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం అని ఇంటిలోకి తొంగి చూస్తుండగా అమ్మ కంటిలో పడ్డానని, అప్పుడు అమ్మ తనను గట్టిగానే చివాట్లు పెట్టారని చెప్పారు. ఇరుగుపొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని హెచ్చరించింది. కాగా 33 ఏళ్ల ఈ పరువాల భామ ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. -
సందీప్, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్ గురించి తాజాగా రివీల్ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే, సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్ అయ్యారు.'సందీప్, సాయి ధరమ్‌తేజ్ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్ పర్సన్. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్‌తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బిజినెస్‌మేన్‌తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాను షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది. -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'చాలామందితో రిలేషన్లో ఉన్నా.. కానీ'.. రెజీనా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ సినీ ప్రియులకు రెజీనా పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించింది. ప్రస్తుతం ఉత్సవం మూవీతో మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన తాజా చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈరోజే అంటే సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేసింది. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్ నిర్మించారు.అయితే అంతకుముందు మూవీ ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను చాలామందితో రిలేషన్లో ఉన్నానని తెలిపింది. అయితే నాకు చాలా ప్రపోజల్స్ ఉన్నాయని.. ఈ విషయంలో నేను ఒక సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది రెజీనా.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్)అయితే గతంలో ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్తా ఆగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
నాటకం అమ్మలాంటిది – అనిల్ రావిపూడి
‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్‌తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్ ప్రకాష్. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబె¯Œ్స, లిరిక్ రైటర్ అనంతశ్రీరామ్, రైటర్ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరో, రెజీనా..
-
‘ఉత్సవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రేక్షకుల మనసుని హత్తుకుంటాయి: రెజీనా కసాండ్రా
‘‘నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలంటే ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌లో వేశాను. నాటక రంగంపై పరిశోధన చేసి ‘ఉత్సవం’ కథని రాసుకున్నారు అర్జున్ సాయిగారు. ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలుఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని హీరోయిన్ రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, హిందీలో విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా రెజీనా కసాండ్రా మాట్లాడుతూ–‘‘ఉత్సవం’లో కార్పోరేట్ ఎం΄్లాయ్‌పాత్ర చేశా. చాలా స్వతంత్ర భావాలున్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. స్వతంత్ర భావాలున్న మహిళలకు నాపాత్ర నచ్చుతుంది. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు.. అన్ని వాణిజ్య అంశాలున్న కథ. దిలీప్ ప్రకాష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రకాష్ రాజ్‌గారు, నాజర్ గారు థియేటర్ ఆర్ట్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. రసూల్‌గారి అద్భుతమైన విజువల్స్, అనూప్ రూబెన్స్గారి చక్కని సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నా మొదటి సినిమా ‘ఎస్ఎంఎస్’ చేసినప్పుడే వెర్సటైల్ నటిగా ఉండాలని భావించాను. అది దూరం కాకుండా ఇన్నాళ్లు వైవిధ్యమైనపాత్రలు చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం సన్నీ డియోల్‌గారు హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమా చేస్తున్నాను. అలాగే మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. -
ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసింది!
దిలీప్ ప్రకాశ్, రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం ఉత్సవం. ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేశ్ పాటిల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రంగస్థల నాటకం ప్రధాన అంశంగా ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్, అనీశ్, ఆమని, సుధా, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
పారా స్పోర్ట్స్ శిబిరంలో సినీ నటి రెజీనా సందడి (ఫొటోలు)
-
Regina Cassandra: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా (ఫొటోలు)
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్‌పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్‌గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
ఓటీటీలోకి హారర్- థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా చూసేయండి
కోలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 'కంజూరింగ్ కన్నప్పన్' సూపర్ హిట్ కొట్టింది. సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. హారర్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 8, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం. ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళ్లో మాత్రమే బిగ్ స్క్రీన్‌లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడలో కూడా విడుదల కానుంది. కథ : గేమింగ్ ఇండస్ట్రీపై చాలా ఆసక్తి ఉన్న సతీష్ ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేస్తు ఉంటాడు. అతను డ్రీమ్ క్యాచర్ అని పిలువబడే మంత్రముగ్ధమైన వస్తువును తీసుకొని దాని నుంచి అద్భుతాలు క్రియేట్ చేస్తాడు. అలా సతీష్ నిద్రలోకి జారుకున్నప్పుడల్లా స్వప్న ప్రపంచంలో దెయ్యం వలలో చిక్కుకుంటాడు. చివరికి అతని కుటుంబం తనలాగే చిక్కుకుపోవడంతో ఏం జరిగిందనేది సినిమా.. కామెడీ- హారర్‌తో పాటు ఇందులో థ్రిల్లింగ్ తెప్పించే సన్నివేశాలు కూడా ఉంటాయి. -
Regina Cassandra Traditional Pics: పొద్దు తిరుగుడు పువ్వులా రెజీనా ఎంత ముద్దుగా ఉందో! (ఫోటోలు)
-
నాకు సారీలో నడుము కనపడిన చిరాకు వస్తుంది..!
-
నువ్వు బాగాలేవు అని నాఫేస్ మీదనే అన్నాడు
-
ఎంత క్యూట్ పాడింది..!