
సాక్షి, సిటీబ్యూరో: అందాల తారల ర్యాంప్ వాక్‌తో హెచ్‌టీ ఫ్యాషన్ వీక్ అదరహో అనిపించింది

హోటల్ పార్క్ హయత్‌లో ఆదిత్య లగ్జరీ వింటేజ్ సమర్పించిన ఈ షోలో వెరైటీ థీమ్స్‌తో తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు

ఎన్‌ఐఎఫ్ గ్లోబల్ స్టూడెంట్స్, స్టార్ లైఫ్ షాఫీక్ రెహా్మన్, సాహిల్ కచ్చర్ తదితర ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన డిజైన్ కలెక్షన్స్ వీటిలో ఉన్నాయి

ప్రముఖ సినీతారలు రెజినా కాసాండ్రా, ఈషా రెబ్బలతో పాటు బాలీవుడ్ నటి దియా మీర్జా షో స్టాపర్స్ గా మెరిచారు

దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఈ రెండు రోజుల షో ప్రదర్శించింది. నగరంతో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పాల్గొన్నారు



































