Park Hyatt Hotel
-
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
Hyderabad: బ్యాగ్‌లో 35 వజ్రాలు.. పార్క్ హయత్‌లో చోరీ జరిగిందా? మర్చిపోయారా?
సాక్షి, బంజారాహిల్స్: ముంబై నుంచి వచ్చిన ఓ వ్యాపారి బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్లో మర్చిపోయిన ఆభరణాల బ్యాగును బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. అటు పంజగుట్ట, ఇటు బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఈ ఆభరణాల మిస్సింగ్ విషయంలో హైరానా పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు దీన్ని ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అహ్మద్ బేగ్ అనే వ్యాపారి తన భార్యతో కలిసి గతనెల 22వ తేదీన బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో బస చేశారు. గత నెల 24వ తేదీన హోటల్లో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ బస చేయడంతో వీవీఐపీ తాకిడి ఎక్కువ కావడం, సేవలు సరిగ్గా లేకపోవడంతో బేగ్ ఇక్కడి నుంచి ఖాళీ చేసి సోమాజిగూడలోని పార్క్ హోటల్‌కు వెళ్లాడు. పార్క్ హయత్ నుంచి ఖాళీ చేసే క్రమంలో ఆయన భార్య తన ఆభరణాల బ్యాగును లిఫ్ట్ వద్ద ఉన్న సర్వీస్ ఫోన్ టేబుల్‌పై ఉంచి మర్చిపోయింది. పార్క్ హోటల్‌కు వెళ్లాక చూసుకోగా ఆభరణాల బ్యాగు కనిపించలేదు. వెంటనే బేగ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిందన్న నేపథ్యంలో సీసీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలను పరిశీలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఈ నెల 1వ తేదీన పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోగొట్టుకున్న బ్యాగులో డైమండ్ బ్రాస్లైట్, 35 డైమండ్లు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, బంగారు గొలుసు, చెవి దిద్దులు ఉన్నాయని వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మంగళవారం బంజారాహిల్స్ క్రైం పోలీసలు మరోసారి పార్క్‌హయత్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే లిఫ్ట్ వద్ద ఉన్న టెలీఫోన్ స్టూల్ బంగారు వర్ణంలో ఉండటం, ఆభరణాల బ్యాగు కూడా అదే రంగులో ఉండటంతో దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల నుంచి ఆభరణాల బ్యాగు అక్కడే ఉండటాన్ని ఎవరూ నమ్మడం లేదు. పార్క్‌హయత్ హోటల్ నిర్వాకంపై గతంలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని అప్పటికప్పుడు ఈ బ్యాగును అక్కడ ఉంచి నాటకానికి తెరలేపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిందా..? మర్చిపోయారా అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ
-
సినీ నిర్మాత కారు చోరీ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో ఫార్చునర్ కారు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సదాహల్లి మల్బరి మెడోస్ విల్లాస్‌లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చి పార్క్‌హయత్ హోటల్లో బస చేశాడు. ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన ఆయన తన కారును పార్కింగ్ చేశాడు. 27న ఉదయం బయటికి వెళ్లేందుకు కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్ స్థలంలో కారు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. కారులో చెక్‌బుక్‌లు, మొబైల్ఫోన్లు, బెంజికారు తాళాలు, ఖరీదైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు ఉన్నట్లు పేర్కొంటు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్కి ంగ్ ప్లేస్‌తో పాటు హోటల్ చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
పార్క్ హయత్’లో హైటెక్ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రతిష్టాత్మక స్టార్ హోటల్లో హైటెక్ చోరీ జరిగింది. సూటుబూటు వేసుకొని వచ్చిన ఓ దొంగ దర్జాగా హోటల్లోకి ప్రవేశించి రూ.12 లక్షల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యా లు పొదిగిన ఆభరణాలను తస్కరించాడు. హిమ యత్నగర్కు చెందిన యువ వ్యాపారి వెంకట్ పెళ్లి ఈ నెల 4న జరిగింది. హనీమూన్ కోసం 5వ తేదీన దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చి 312వ గదిలో బస చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్ సందర్శన, తాజ్హోటల్లో డిన్నర్ కోసమని మరునాడు రాత్రి 7 గంటల ప్రాంతంలో దంపతులు బయటకు వెళ్లారు. కాసేపటికి సూటుబూటు వేసుకొన్న ఓ వ్యక్తి ఆటోలో పార్క్‌హయత్ హోటల్‌కు వచ్చాడు. తాను 312లో బస చేసిన వ్యక్తి తాలూకూ బంధువునని, రూమ్‌లో కార్డు మర్చిపోయానని, దానిని తీసుకోవడానికి వచ్చానని చెప్పడంతో హోటల్ సిబ్బంది యాక్సిస్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఉంటేనే లిఫ్ట్ తెరుచుకుంటుంది. లిఫ్టులోంచి గది వద్దకు వెళ్లిన ఆగంతకుడు పాస్వర్డ్ మర్చిపోయానని రిసెప్షన్‌కు ఫోన్ చేశాడు. కంప్యూటర్లో నాలుగు డిజిట్లను సిబ్బంది నొక్కడంతో యాక్సెస్ కార్డు సహాయంతో గది తెరుచుకుంది. లోనికి వెళ్లిన ఆగంతకుడు సూట్‌కేస్‌లోని డైమండ్స్ పొదిగిన చెవి రింగు, నెక్లెస్, పాపిటబిళ్ల, బంగారు కాళ్ల పట్టీలు, జత గాజులు, రూ. 6 వేల నగదును బ్యాగులో సర్దుకొని ఉడాయించాడు. డిన్నర్ ముగించుకొని బుధవారం రాత్రి వెంకట్ దంపతులు హోటల్లోని తమ గదికి వచ్చారు. సూట్‌కేస్‌లోని ఆభరణాలు కనిపించలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే హోటల్ సిబ్బందికి, బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు పరిశీలించగా ఓ ఆగంతకుడు గదిలోనికి వెళ్లి, బయటకు వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. చోరీకి పాల్పడిన వ్యక్తి చండీగఢ్‌కు చెందిన జయేష్ రావ్జీ భాయ్ సేజ్‌పాల్(48)గా గుర్తించారు. స్టార్ హోటళ్లే లక్ష్యంగా అతడు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరువంటి నగరాల్లో ఈ తరహా దొంగతనాలు 8 వరకు చేసినట్లు తేల్చారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నగరంలోని అన్ని మార్గా ల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్క్‌హయత్ లాంటి స్టార్ హోటల్లో దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం. -
ఫుల్ జోష్ పార్టీలో చిరంజీవి, రాజశేఖర్
-
హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా రంగంలో తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు జూలై 14న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో స్మార్ట్ లాజిస్టిక్స్ సమ్మిట్ జరుగనుంది. తెలంగాణలో ఇటువంటి కార్యక్రమం జరగనుండడం ఇదే తొలిసారి. దిగుమతి, ఎగుమతిదారులు, రిటైలర్లు, తయారీ కంపెనీలు, రవాణా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. మారిటైమ్ గేట్‌వే మీడియా దీనిని నిర్వహిస్తోంది. -
త్వరలో ఇండోర్ స్పోర్ట్స్ రియాలిటీషో
-
ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు నివాసం
- ముచ్చటగా మూడోసారి ఇల్లు మార్చిన ముఖ్యమంత్రి - మదీనాగూడ ఫాంహౌస్ నుంచి బంజారాహిల్స్‌కు రాక - ఎన్టీఆర్ భవన పక్కనే ఉన్న ఐదు నక్షత్రాల హోటల్లో ఉంటున్న వైనం - హోటల్ రూం అద్దె రోజుకు రూ.17 వేల నుంచి రూ. 30 వేలు - నెలకు అపార్ట్మెంట్ అద్దె రూ. 3.60 లక్షల నుంచి 5.25 లక్షలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ మకాం ఐదు నక్షత్రాల హోటల్‌కు మారింది. అందులోనే సుమారు మూడు నెలలపాటు వారు ఉండనున్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న బాధ్యతలు చేపట్టిన తరువాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడోది. మదీనగూడలోని ఫాంహౌస్‌లో చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం ఉంటోంది. తాజాగా ఆయన కుటుంబం బంజారాహిల్స్ రోడ్డు నంబరు2 లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పొరుగునే ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ పార్క్ హయత్‌కు మారింది. దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఓ హోటల్లో మకాం ఉండటం ఇదే తొలిసారి అని రాజకీయ వర్గాలంటున్నాయి. చంద్రబాబు తొలినుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 65లోని సొంత ఇంట్లో ఉండేవారు. కానీ తర్వాత వాస్తు కారణాలతో ఆ ఇంటిని కూలదోసి కొత్త ఇల్లు నిర్మించాలని భావించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణం ప్రస్తుతం తుదిదశలో ఉంది. ఆ ఇంటిని సర్వహంగులతో నిర్మించేందుకు కూలదోసిన సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24లోని ఓ ఇంటిలో అద్దెకు దిగారు. అక్కడ కొద్దిరోజులు ఉన్న ఆయన ఆ తరువాత తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉండేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యులు దానిని పరిశీలించారు. అయితే వారు మనస్సు మార్చుకుని మదీనగూడలోని సొంత ఫాంహౌస్‌కు మారారు. తాజాగా అక్కడి నుంచి ఐదు నక్షత్రాల హోటల్‌కు మారారు. సొంత ఇంటి నుంచి స్టార్ హోటల్‌కు మారే వరకు ఆయన ఉన్న నివాసాలు, కార్యాలయాల మరమ్మతుల నిమిత్తం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వీటి మరమ్మత్తులు, భద్రతా ఏర్పాట్లకే ఈ మొత్తంలో సింహభాగం ఖర్చు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఉండే హోటల్ అద్దె అందులో ఉన్న సౌకర్యాలు, విస్తీర్ణం బట్టి రోజుకు రూ. 17 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. అదే నెలకు అయితే వాటి విస్తీర్ణాన్ని బట్టి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకూ హోటల్ వసూలు చేస్తుంది. వీటికి పన్నులు అదనం. సీఎం కుటుంబం ఎక్కడ నివాసం ఉన్నా వారికి అయ్యే ఖర్చు, అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తాత్కాలికంగా నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని లింగమనేని ఎస్టేట్స్‌కు రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల నిమిత్తం రూ. 10 కోట్లకు పైగా ఖర్చుచేశారు. హైదరాబాద్‌లోని మదీనాగూడ, తాడేపల్లిలో గృహాలను నివాస, క్యాంపు కార్యాలయాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ప్రస్తుతం, భవిష్యత్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ ఏ చిన్న మార్పులు చేసినా ప్రభుత్వమే ఖర్చు భరించాల్సి ఉంటుంది.