సినీ నిర్మాత కారు చోరీ | Producer Manjunath Car Stolen At Park Hyatt Hotel Parking | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత కారు చోరీ

Published Fri, Jan 29 2021 6:14 PM | Last Updated on Sat, Jan 30 2021 4:12 PM

Producer Manjunath Car Stolen At Park Hyatt Hotel Parking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో  ఫార్చునర్‌ కారు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సదాహల్లి మల్బరి మెడోస్‌ విల్లాస్‌లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్‌ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చి పార్క్‌హయత్‌ హోటల్‌లో బస చేశాడు.

ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన ఆయన తన కారును పార్కింగ్‌ చేశాడు. 27న ఉదయం బయటికి వెళ్లేందుకు  కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్‌ స్థలంలో కారు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. కారులో  చెక్‌బుక్‌లు, మొబైల్‌ఫోన్లు, బెంజికారు తాళాలు, ఖరీదైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు ఉన్నట్లు పేర్కొంటు శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్కి ంగ్‌ ప్లేస్‌తో పాటు హోటల్‌ చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement