Banjarahills Police Station
-
వెనక్కి తగ్గిన సరయూ, పోలీస్ స్టేషన్‌కు పిటిషనర్..
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, ‘7ఆర్ట్స్’ సరయూపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్‌లో పోలీసులు సరయూతో పాటు ఆమె షార్ట్ ఫిల్మ్ బృందాన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు అరెస్ట్.. ఈ క్రమంలో సరయూ బంజారాహిల్స్ పోలీసులకు వివరణ ఇచ్చింది. తన వీడియోలో ఉన్న కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించింది. అంతేకాదు పటిషనర్ డిమాండ్స్ మేరకు కంటెంట్‌ని తొలగించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ఇప్పటికే ఆ వీడియోలోని అభ్యంతకర సన్నివేశాన్ని ఎడిట్ చేసేశామని, ఇంకా అభ్యంతరం అనుకుంటే వీడియో డిలీట్ చేస్తామంటూ సరయూ, ఆమె టీం వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే కాసేపట్లో పిటిషనర్ చేపూరి అశోక్ సిరిసిల్ల నుంచి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకోనున్నాడు. చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమే, లేదంటే సహజీవనం: కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్ పిటిషనర్ వచ్చాక ఇరు వర్గాలను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టనున్నారని సమాచారం. సరయూ ‘7 ఆర్ట్స్’ అనే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది. ఆ ఛానల్ రూపొందించిన అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో రిలీజ్ చేసింది. అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. -
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు అరెస్ట్..
Is 7Arts Sarayu Arrested By Banjara Hills Police?: యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం 7 ఆర్ట్స్ సరయు ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ యాడ్‌లో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా సరయును నిన్న బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రశ్నించిన పోలీసులు సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు ఠాణాకు తరలించారు. కాగా 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో రిలీజ్ చేసింది.అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 153A, 295A సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అభ్యంతరకర వీడియో.. వివాదంలో బిగ్‌బాస్ ఫేం సరయు -
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
-
7ఆర్ట్స్ సరయుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
Case Filed On 7 Arts,Bigbos Fame Sarayu: యూట్యూబూర్ 7ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్నెస్తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మహిళపై దాడి చేసిన వ్యక్తులపై కేసు
బంజారాహిల్స్: తనపై దాడి చేయడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించినందుకు అసభ్యకర పదజాలంతో దూషించిన వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌కు చెందిన మారెమ్మ అనే మహిళ ఈ నెల 4వ తేదీన అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉదయం 10 గంటలకు పూజల్లో పాల్గొనేందుకు వెళుతుండగా అక్కడ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ అనుచరుడు శివతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశారని.. అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి తిట్టడానికి మీరెవరంటూ ఆమె ప్రశ్నించగా ఆగ్రహంతో ఊగిపోతున్న శివ తనపై దాడికి యత్నించాడని ఆరోపించారు. పక్కనే ఉన్న తన స్నేహితురాలిపై కూడా శివతో పాటు గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసేందుకు యత్నించారని, తాము ఎంత వారిస్తున్నా వినకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పల్లపు గోవర్ధన్ అనుచరుడైన శివతోపాటు మరో వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నిర్మాత కారు చోరీ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో ఫార్చునర్ కారు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సదాహల్లి మల్బరి మెడోస్ విల్లాస్‌లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చి పార్క్‌హయత్ హోటల్లో బస చేశాడు. ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన ఆయన తన కారును పార్కింగ్ చేశాడు. 27న ఉదయం బయటికి వెళ్లేందుకు కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్ స్థలంలో కారు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. కారులో చెక్‌బుక్‌లు, మొబైల్ఫోన్లు, బెంజికారు తాళాలు, ఖరీదైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు ఉన్నట్లు పేర్కొంటు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్కి ంగ్ ప్లేస్‌తో పాటు హోటల్ చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు
హైదరాబాద్ : బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ యాంకర్ శ్రీముఖి, జెమినీ టీవీ నిర్వాహకులపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘జూలకటక’ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణుడిని కించపరిచేలా చిత్రీకరించారని, కార్యక్రమ నిర్వాహకులతో పాటు యాంకర్ శ్రీముఖిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన ఎం వెంకటరమణ శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీముఖిపై ఐపీసీ సెక్షన్ 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పలు చిత్రాల్లో కూడా నటించారు. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు దగ్గయ్యారు. అందంతోపాటుగా తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి.. రన్నరప్‌గా నిలిచారు.(చదవండి : విజయ్‌కు మద్దతు తెలిపిన నిర్మాతల మండలి) -
శాల్తీని లేపేస్తానంటూ శ్రీరెడ్డి వార్నింగ్!
సాక్షి, బంజారాహిల్స్: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లోని ఏ బ్లాక్‌లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్ డైరెక్టర్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని, ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. (హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు) గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్బుక్లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నారు. (శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు) ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లోనే శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని, తన మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఆ వీడియో రికార్డులను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. ఇటీవల తాను సీసీఎస్‌లో సైబర్‌క్రైమ్‌లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ శ్రీరెడ్డి ఒత్తిడి తీసుకు వస్తోందని, అందులో భాగంగానే శాల్తీని లేపేస్తానంటూ బెదరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
బంతుల కోసం వెళ్లి బలయ్యాడు
బంజారాహిల్స్: క్రికెట్ ఆడాలని బంతులు తెచ్చుకునేందుకు టెన్నిస్ బాల్‌కోర్టులోకి దూకిన ఓ బాలు డు వాటిని తీసుకుని గోడదూకి వచ్చే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను తాకి విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివాసం ఉండే యాదమ్మ, శేఖర్ల కుమారుడు మంజరి అఖిల్ (12) 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బడి లేకపోవడంతో తోటి స్నేహితులతో కలిసి ఉదయం క్రికెట్ ఆడుతుండగా బంతి పోగొట్టుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న ఎఫ్ఎన్సీసీ టెన్నిస్ కోర్టులో వృథాగా పడి ఉన్న టెన్నిస్ బంతులను తెచ్చుకుందామని గోడదూకి వెళ్లాడు. మాగంటి కాలనీని ఆనుకొని ఉన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ టెన్నిస్ కోర్టులో నిత్యం టెన్నిస్ ఆడుతుం టారు. ఆట పూర్తయిన తర్వాత ఆ బంతులను బుట్టలో వేస్తుంటారు. అది తెలిసిన అఖిల్ ఎమ్మార్సీ కాలనీ వైపునున్న ఎత్తైన గోడను ఎక్కి ట్రాన్స్ఫార్మర్ పక్క నుంచి లోపలికి వెళ్లి బంతులను తెచ్చే క్రమంలో గోడ దూకడానికి యత్నించాడు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం
-
అంతా తూచ్..!
-
తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు... నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’... అంటూ బంజారాహిల్స్ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు. సురేష్ నేరచరిత్రను హైదరాబాద్ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు ఒప్పుకున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సురేష్‌కుమార్ గతంలో విజయవాడలోని పడమట పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉండేవాడు. అప్పట్లో సన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. 2011 నుంచి 2013 మధ్య అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకుని మోసం చేయడంతో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 2007లో ఆయా కేసుల్లో ఇతడికి మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించి బెయిల్ పొందాడు. ఆపై ఇతడిపై అక్కడే అత్త, మరదలు సైతం కేసు పెట్టారు. హైదరాబాద్‌కు వచ్చిన సురేష్‌కుమార్ జూబ్లీహిల్స్ పరిధిలో ఓ స్థలం లీజుకు తీసుకుని గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడంతో గత మార్చిలో జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని అడ్రస్ ఇన్ హోటల్లో రెస్టారెంట్ నిర్వహణ కోసం గతంలో దాని యజమాని వాసుదేవశర్మతో ఒప్పందం చేసుకున్నారు. రెస్టారెంట్, కిచెన్ అభివృద్ధి పేరుతో ఆయన నుంచి రూ.4.72 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితుడు మే నెల్లో బంజారాహిల్స్ ఠాణాలో చేశారు. దీని పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు విషయం కోర్టులోనే తేల్చుకోవాలని ఇరు పార్టీలకు చెప్పి పంపారు. వాసుదేవ శర్మ కోర్టును ఆశ్రయించగా సురేష్‌కు సమన్లు జారీ అయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన సురేష్ ఉద్దేశపూర్వకంగా వాసుదేవ శర్మపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీన్ని తీసుకోవడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారితో దురుసుగా ప్రవర్తించడంతో సురేష్ పైనే కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన భార్యభర్తలు బెయిల్‌పై వచ్చి రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు స్టేషన్లోనే అత్యాచార యత్నం జరిగిందని, తమను దారుణంగా హింసించారని ఇరువురూ దాదాపు 15 నిమిషాల నిడివితో కూడిన వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడంతో పాటు సురేష్ గతాన్ని తవ్వితీశారు. దీంతో మెట్టు దిగిన ‘బాధితులు’ అసలు విషయం అంగీకరిస్తూ బుధవారం 1.5 నిడివితో మరో వీడియో విడుదల చేశారు. -
పోలీసులే హత్యచార యత్నం చేసారు
-
బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం మత్తులో ఓ పబ్బు బయట అపస్మారకంగా పడి ఉన్న ఆమెను బంజారాహిల్స్ పోలీసులు కాపాడి స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే మెలుకువ వచ్చిన తరువాత ఆ యువతి పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎస్సైని అసభ్యపదజాలంతో తిడుతూ ఓ కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. మహిళా పోలీసులు ఆమెను ఎట్టకేలకు అదుపు చేశారు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా అంతు చూస్తానని ఆ యువతి పోలీసులను బెదిరించింది. సదరు యువతి నాగాలాండ్ నుంచి వచ్చిందని, ఆమె పేరు లీసా అని తెలుస్తోంది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో ఆమె పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. యువతి డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. -
బండ్ల గణేష్‌కు రిమాండ్, కడప జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్‌ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్ కూడా బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్‌పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇక ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ -
మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్
-
కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
-
కోడెల మృతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్ కోడెల మృతిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
బిగ్‌బాస్ ప్రతినిధులపై శ్వేతరెడ్డి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కార్యక్రమ ఇంచార్జ్తో పాటు మరో ముగ్గురు ప్రతినిధులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్‌బాస్ కార్యక్రమ ఇంచార్జ్ శ్యాంతో పాటు ప్రతినిధులు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. చదవండి: బిగ్‌బాస్ హోస్ట్‌పై ‘స్టార్ మా’ ప్రకటన ఆయన తెలిపిన వివరాలు ప్రకారం..జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్ సీజన్-3కి ఎంపికైనట్లు ఏప్రిల్‌లో సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి కలవాలంటూ చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఒక ఐస్‌క్రీం షాపులో కలిసి చర్చించారు. అనంతరం మరోమారు కార్యక్రమ ప్రతినిధులు రఘు, శశికాంత్ ఫోన్ చేసి కలవాలని చెప్పారు. దీంతో ఆమె మళ్లీ శ్రీనగర్ కాలనీలో కలిశారు. ఇక చివరగా కార్యక్రమ ఇంచార్జ్ శ్యాంతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, బిగ్‌బాస్‌లో తీసుకుంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్న తర్వాత ముఖం చాటేశారన్నారు. శ్వేతారెడ్డి ఫిర్యాదు చేయడంతో నలుగురుపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్వేతరెడ్డి మాట్లాడుతూ... ‘బిగ్‌బాస్ అనేది మైండ్ గేమ్. అలాంటి షోలో బాడీ షేపింగ్లో ఎందుకు చేసుకోవాలి. బాస్‌ను ఇంప్రెస్ చేయాలంటే ఆకర్షణీయంగా కనిపించాలి అన్నారు. అంతేకాకుండా నా బాడీ వెయిట్ గురించి అసభ్యకరంగా మాట్లాడారు. బిగ్‌బాస్-2 రియాల్టీ షోలో గలీజు...గబ్బు చీకటి కోణం గురించి పోలీసులకు వివరించాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు 150మందితో గేమ్ ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంపికైన ఎవరికీ అగ్రిమెంట్లు ఇవ్వలేదు. నేను ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు. ఇంతకీ ఆ బాస్ ఎవరో.... ఆ దేవుడికే తెలియాలి. ఆ బాస్కే తెలియాలి.’ అని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్-3కి ప్రముఖ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
రెండోరోజూ అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ తీరు మారలేదు. రెండోరోజు కూడా ఆయన పోలీసులకు సహకరించలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలివే... రవిప్రకాశ్‌ని విచారించడానికి పోలీసులు ముందుగానే ప్రశ్నావళిని సిద్ధం చేసుకు న్నారు. ‘‘కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఎవరు, ఎందుకు ఫోర్జరీ చేశారు? తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించ డానికి కారణాలేంటి? శివాజీకి 40వేల షేర్లు ఎందుకు విక్రయించారు? మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు మోసగించారు? టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా’’అంటూ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కాగా, తనపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాశ్ మీడియా ముందు ధ్వజమెత్తారు. పెండింగ్‌లోనే మరో కేసు... టీవీ9 వ్యవహారంలో రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోనూ మరో కేసు పెండింగ్‌లో ఉంది. టీవీ9 లోగో, కాపీ రైట్స్, ట్రేడ్‌మార్కులను 2018 మే నెలలో మోజో టీవీకి విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో ఇచ్చిన నోటీసుకు రవిప్రకాశ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి నోటీసు జారీచేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. రెండో నోటీసు జారీచేసిన తర్వాత కూడా విచారణకు హాజరు కాకుంటే రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. -
సినీ రచయిత రమణగౌతంపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు. పెళ్ళి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకోసాగాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటానని మోసగిస్తున్న రమణగౌతంపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణగౌతంను బంజారాహిల్స్ పోలీసులు పిలిపించి పెళ్ళి చేసుకోవాలంటూ సూచించడంతో అదే రోజు బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ గుడిలో పెళ్ళి చేసుకొని అదే రాత్రి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామంటూ వెల్లడించాడు. దీంతో ఆమె షాక్ తింది. శనివారం మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా షూటింగ్ అంటూ మోసం!
సాక్షి, బంజారాహిల్స్: సినిమా షూటింగ్ కోసమని కెమెరాలు అద్దెకు తీసుకోవడం... వాటిని తిరిగి ఇవ్వకుండా విక్రయించడం... వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం... ఇలా మోసాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఓ కేటుగాడిని పోలీసులు వలపన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్ఐ ఎ.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లికి చెందిన విజ్ఞాన్ దాసరి(27) మణికొండలో నివాసం ఉంటూ తాను ఈవెంట్ ఆర్గనైజర్‌నని ప్రచారం చేసుకుంటాడు. గత నెల 19న శ్రీకృష్ణానగర్‌లో సినిమా షూటింగ్‌లకు కెమెరాలను అద్దెకిచ్చే మహేష్‌ను కలిసి తాను సినిమా తీస్తున్నానని, రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని చెప్పి రూ.6 లక్షల విలువ చేసే కెమెరా తీసుకెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోగా ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కా నిఘా వేసిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు. అద్దెకు తీసుకున్న కెమెరాను రూ.90 వేలకు విక్రయించి ఆ డబ్బుతో గోవాకు వెళ్లి జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కెమెరాను రికవరీ చేసిన పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కెమెరాలు అద్దెకు తీసుకొని అమ్ముకొని జల్సాలు చేసినట్లు తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
పోలీసులకు నటి తారా చౌదరి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని సినీ నటి రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సినీ నటి తారా చౌదరి శ్రీనగర్‌కాలనీ సమీపంలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలోని అపార్ట్మెంట్లో ఉంటోంది. 2016లో ఆమెకు వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్ తన సోదరి సుజాతతో కలిసి గుంటూరులోని తారా చౌదరి ఇంటికి వచ్చాడు. తాను తారా చౌదరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పగా ఇంతకుముందే పెళ్లయినందున ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. దీంతో రాజ్‌కుమార్ సోదరి సుజాత కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాల్సిందిగా తెలిపింది. అనంతరం అతను పలుమార్లు విజయవాడ, హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి తాను విడాకులు తీసుకుంటానని ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెస్పాడు. అనంతరం ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేయసాగారు. అందరికీ తన తారా చౌదరిని తన భార్యగా పరిచయం చేసేవాడు. కొద్ది రోజుల అనంతరం తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని నీ ఆస్తులు విక్రయించి ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గత రెండేళ్లుగా రాజ్‌కుమార్ తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు చావా రాజ్‌కుమార్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణహాని ఉందంటూ హిజ్రాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలు శనివారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. వెంకట్ అనే రౌడీ షీటర్ వేధింపుల నుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకొన్నారు. తమ నివాసాలపై మారణాయుధాలతో దాడి చేసి తరచూ డబ్బులు తీసుకెళ్తున్నాడని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదని వాపోయారు. గత్యంతరం లేకనే ధర్నా చేస్తున్నామని తెలిపారు. వెంకట్ నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రౌడిషీటర్పై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో హిజ్రాలు ఆందోళన విరమించారు. -
బాలికపై వారం రోజులుగా ఘాతుకం
బంజారాహిల్స్ : తొమ్మిదేళ్ల చిన్నారిపై అన్నా, తమ్ముళ్లు వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ఫిలింనగర్‌లోని షేక్‌పేట్ నాలా అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక(9) ఐదో తరగతి చదువుతోంది. బాలిక ఇంటి సమీపంలో ఉంటున్న ఎల్లేష్(19) అనే ప్రైవేట్ ఉద్యోగి ఆదివారం పీకల దాకా మద్యం సేవించి, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను తన గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు చిన్నారిని అతడి భారి నుంచి కాపాడారు. వివరాలు ఆరా తీయగా వారం రోజులు ఎల్లేష్, అతని తమ్ముడు శ్రీకాంత్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఎల్లేష్‌ను అరెస్ట్ చేయగా, శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై కన్నేసి.. భారీ స్కెచ్
బంజారాహిల్స్ : ఇబ్బందుల్లో ఉన్న ఓ వివాహిత అవసరాలను ఆసరాగా చేసుకొని ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె భర్తను హతమార్చేందుకు సైతం కుట్రపన్ని పోలీసులకు చిక్కిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14 వెంకటేశ్వరనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో స్పెషల్ క్వాలిటీ మెయింటెనెన్స్ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీకృష్ణానగర్‌కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన మాల్యాద్రి అంబులెన్స్‌తో పాటు అక్కడికి వచ్చాడు. అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్‌ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్‌లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్‌ను క్రియేట్ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు. నాలుగు రోజుల క్రితం తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసిపోయిందని వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శాశ్వతంగా ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న అతను నందినగర్‌కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి గత శుక్రవారం ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేసినట్లు చెప్పాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు అంగీకరించాడు. ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. అతని పాచిక పారకపోవడంతో పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), 469, 506, 509 కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాధవి లత మౌనదీక్ష
-
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ
-
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆయన కుటుంబసభ్యులు శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు ఆరణాల బాక్సు మాయంపై ఇంట్లో పనిచేసే వాళ్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా కాగా జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శిరీషపై అత్యాచారం జరగలేదు
- నమూనాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు - విశ్లేషణ తర్వాత స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు - బంజారాహిల్స్ పోలీసులకు పరీక్షల నివేదిక అందజేత సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారిం చారు. మృతదేహంతో పాటు ఆమె వస్త్రాల నుంచి సేకరించిన నమూనాల్లో అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు అందించారని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. జూన్ 13న షేక్‌పేట్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయంలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. శిరీషది ఆత్మహత్యగా గతంలోనే నిర్థారించారు. అయితే శిరీష కుటుంబీకులు ఇది హత్యేనంటూ ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె వస్త్రాలపై రక్తపు మరకలు ఉన్నాయని, ఈ నేథప్యంలో ఆమెది హత్యేనంటూ ఆరోపించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శిరీషకు పోస్టుమార్టం పరీక్షలు చేస్తున్న సమయంలో కొన్ని నమూనాలు సేకరించారు. వీటితో పాటు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ధరించిన వస్త్రాలనూ పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు విస్రా (కడుపు నుంచి సేకరించిన నమూనా) పరీక్షలను బట్టి ఆత్మహత్య చేసుకునే సమయంలో శిరీష మద్యం తాగి ఉన్నట్లు నిర్థారించారు. మరోవైపు సున్నితమైన అవయవాల నుంచి సేకరించిన స్వాబ్స్ (నమూనాలు) విశ్లేషించిన నిపుణులు వాటిలో సెమన్(వీర్యం) కానీ, స్పర్మటోజోవా(శుక్ర కణాలు) ఆనవాళ్లు కానీ లేవని నివేదించారు. ఆమె లోదుస్తులపై ఉన్న మరకలు వ్యక్తిగతమైనవిగా తేల్చారు. మరికొన్ని నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఉరి వేసుకోవడం వల్లే ఆమె మరణం సంభవించినట్లు తేల్చారు. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. చనిపోయిన సమయంలో శిరీష ఒంటిపై ఉన్న గాయాల విషయంలోనూ తమకు స్పష్టత ఉందని, పక్కాగా చేపట్టిన దర్యాప్తులో ఈ వివరాలు తెలిశాయని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కుకునూర్‌పల్లి నుంచి తిరిగి వస్తున్న సయమంలో రాజీవ్, శ్రవణ్ ఆమెపై దాడి చేశారని, ఈ నేపథ్యంలోనే ఆ గాయాలు, రక్తపు మరకలు అయ్యాయని వివరించారు. నిందితుల్ని దోషులుగా నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామన్నారు. -
ప్రేమ + స్నేహం= ది ఎండ్
► వేషం ఇస్తానని మోసం ► సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడు ► పోలీసులను ఆశ్రయించిన బాధితులు బంజారాహిల్స్: తాను తీయబోయే సినిమాలో హీరో వేషం ఇస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడిపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా బోదన్కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డీవీ సిద్దార్థ్ ఫిలింనగర్‌లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరుతో సినిమా కార్యాలయం తెరిచాడు. తాను దర్శకుడిగా జూన్ 19న ప్రేమ + స్నేహం= సంగీతం అనే సినిమాను నిర్మిస్తున్నాని, ఇందుకు హీరోలు కావాలని ప్రకటించాడు. స్పందించిన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌గౌడ్ తన అక్క పెళ్లి కోసం దాచిన రూ. 4 లక్షలు ఇంట్లోవారికి తెలియకుండా తెచ్చి హీరో వేషం కోసం ఇచ్చాడు. శ్రావణ్‌తో పాటు అదే ప్రాంతానికి రాజశేఖర్ రూ. 70 వేలు, కిషోర్ రూ. 30 వేలు... ఇలా చాలా మంది యువకులు వేషం కోసం డబ్బు చెల్లించారు. ఇందుకు గాను సదరు డైరెక్టర్ వారికి బాండ్ రాసిచ్చాడు. తీరా గత నెల 19న సినిమా ప్రారంభించాల్సి ఉండగా సిద్దార్థ్ మాయమాటలు చెప్పి దాటవేశాడు. వారం క్రితం సినిమా కార్యాలయం మూసేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తాము మోసపోయానని గ్రహించిన బాధితులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాలో వేషాల కోసం తమతో పాటు చాలా మంది డబ్బులు చెల్లించారని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. -
వెలుగుచూస్తున్న నందినీ చౌదరి లీలలు
హైదరాబాద్: బ్యూటీ స్పా ముసుగులో కస్టమర్లను మోసపుచ్చిన నందినీ చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-72లోని బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరి చేతిలో మోసపోయినవారు రోజుకొకరు బయటపడుతున్నారు. ఆభరణాల వ్యాపారం పేరుతో ఓ వ్యాపారిని నిండాముంచి అరెస్టు అయి జైలులో ఊచలు లెక్కిస్తున్న నందిని చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే కాకుండా పంజగుట్ట, నాంపల్లి, సీసీఎస్‌లో కూడా కేసులు నమోదవుతున్నాయి. నందినీ చౌదరీ తమ వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. తన స్పా అండ్ సెలూన్‌కు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో పాటు అప్పు పేరుతో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. నాలుగు రోజుల క్రితం చందనబ్రదర్స్ నిర్వాహకులు తమను రూ. 20 లక్షల మేర మోసం చేసినట్లు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌లో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ.20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు ఫిర్యాదులిచ్చారు. ఇటీవల ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించగా చాలా విషయాలు చెప్పకుండా దాటవేసినట్లు తేలింది. మరోమారు కస్టడీకి తీసుకోవాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, ఇంకో వైపు సీసీఎస్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేయాలని తలపెట్టారు. ఇదిలా ఉండగా హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి కొందరు యువకులతో పరిచయాలు చేయించి మేల్ ఎస్కార్ట్స్‌ను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. ఇలా పాతికమంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్‌ను సరఫరా చేసి వారినుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. వీరంతా పరువు పోతుందనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని భావిస్తున్నారు. -
ఫేస్బుక్ ప్రేమలీల.. చివరికిలా..
హైదరాబాద్: ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమ్మాయి డిగ్రీ విద్యార్థిని. పెద్దలను ఎదిరించి పెళ్లితో ఒక్కటై హైదరాబాద్ లో కాపురం పెట్టారు. సీన్ కట్ చేస్తే.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కనీసం టెన్త్ కూడా పాస్ కాలేదని తేలింది. రెండు అబార్షన్ల తర్వాత మూడోసారి కడుపుచేసి పారిపోయిన ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన చావలి ఆనంద్‌బాబు అలియాస్ అనిల్(26) పదోతరగతి కూడా పాస్ కాకుండా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నానని అందరికీ చెప్పుకునేవాడు. గత ఏడాది ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా యువతి(19)ని కూడా అలానే నమ్మించాడు. వారిద్దరి మధ్య పరిచయం పెరిగి పెళ్లికి దారితీసింది. హైదరాబాద్ లోని శ్రీకృష్ణనగర్ లో గది అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. ఆనంద్ ఆవారా అని ఆలస్యంగా తెలుసుకున్నయువతి ఎలాగోలా కలిసే ఉండాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో యువతి మూడుసార్లు గర్భం దాల్చింది. మొదటిసారి అనిల్ అబార్షన్ చేయించగా, రెండోసారి పురిట్లోనే శిశువు చనిపోయాడు. ప్రస్తుతం యువతి మూడోసారి గర్భవతి. కాగా, రెండు వారాల కిందట, ఆనంద్.. భార్యకు సమాచారం ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి.. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆనంద్ పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామని పోలీసులు చెప్పారు. -
నేను అరెస్టయ్యా... వర్మ
-
నేను అరెస్టయ్యా..!
బంజారాహిల్స్: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్.. ఆదివారం ఉదయం ఈ వార్త మీడియాలో హల్చల్ చేసింది..దేశ వ్యాప్తంగా ఇది సంచలనం అయింది.. క్షణాల్లో మీడియా లైవ్ వాహనాలన్నీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి.. బ్రేకింగ్‌లు చూసి పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. ఆయన్నుఎందుకు అరెస్టు చేశారంటూ వాకబు చేశారు.. అలాంటిదేమీ లేదంటూ పోలీసులు ప్రకటన చేసి ఆ పుకార్లకు తెరదించారు.. పోలీస్ వాహనమెక్కాలన్న రామ్ కోరికే దీనికి కారణమైంది.. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే..ఆదివారం ఉదయం 10:30 గంటలకు శ్రీనగర్‌కాలనీలోని స్నేహితుని ఇంటికి వచ్చారు వర్మ.. ఆల్పాహారం తీసుకుని బయటకు వచ్చిన ఆయనకు సత్యసాయి నిగమాగమం వద్ద పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కనిపించింది.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిటీ పోలీసులకిచ్చిన అధునాతన వాహనాల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది.. వెంటనే ఆయన వాహనం వద్దకు చేరుకుని ముందుసీట్లో కూర్చున్నారు. ఈ హఠాత్ పరిణామానికి పెట్రోలింగ్ వెహికిల్ డ్రైవర్ శ్రీధర్‌రెడ్డి కంగుతిన్నాడు. మీరెవరంటూ ప్రశ్నించాడు. తాను రాంగోపాల్ వర్మనని పరిచయం చేసుకున్నారు. ఈ సీట్లో పోలీసులు తప్ప వేరెవరూ కూర్చొవద్దని వర్మను వారించాడు. ఈ వెహికల్లో కూర్చోవాలని చాలాసార్లు అనుకున్నానని ఒక ఫొటో దిగుతానంటూ తన సహచరుడికి ఫొటో తీయాల్సిందిగా సూచించాడు. ఫొటోలకు ఫోజులిచ్చారు..ఈ వాహనం బాగుంది..సీఎం కేసీఆర్ పోలీసులకు అధునాత వాహనాలిచ్చారని అభినందించారు.. నగర పోలీస్ కమిషనర్ సైతం సిబ్బంది కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సేపటికి తాను అరెస్టయ్యానంటూ ఫొటోలతో సహా ట్విట్టర్లో పోస్టు చేశారు.. ఇది పెద్ద కలకలాన్నే రేపింది.. సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది..మీడియాలో సైతం బ్రేకింగ్‌లు రావడంతో కలకలం రేగింది. లైవ్ వాహనాలతో మీడియా ప్రతినిధులు క్షణాల్లో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వర్మను ఎందుకు అరెస్టు చేశారో తెలియక పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో వాకబు చేశారు. అలాంటిదేమీ లేదంటూ జూబ్లీహిల్స్, బంజారహిల్స్ పోలీసులు ప్రకటన చేసి దీనికి తెరదించారు. మొత్తానికి పెట్రోలింగ్ వాహనం(టీఎస్ 09 పీఏ 0904) వార్తల్లోకి ఎక్కింది. కేసు నమోదుకు యత్నాలు.. అనుమతి లేకుండా రాంగోపాల్ వర్మ పోలీసు వాహనంలో కూర్చోడం, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, అరెస్టు చేశారని తప్పుడు సంకేతాల్సి ట్విటర్లో పెట్టడం ఎంత వరకు సమంజసమని పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టపరంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సి ఉన్నా న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే చర్య తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయంపై ఏం జరిగిందో లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ శ్రీధర్‌రెడ్డిని ఉన్నతాధికారులు ఆదేశించారు. న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నాం... బంజారాహిల్స్ ఏసీపీ ట్విటర్లో తప్పుడు సమాచారం పోస్టు చేయడం, అనుమతి లేకుండా పోలీసు వాహనంలో ఎక్కడం నేర మే. శ్రీధర్‌రెడ్డి ద్వారా పిర్యాదుతీసుకొని.. వర్మపై కేసు పెట్టవచ్చా అనే అంశంపై న్యాయనిపునుల సలహా తీసుకుంటున్నాము.ఆ తరువాతే కేసు నమోదు విషయంపై తేటతెల్లం అవుతుంది. -
రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: వైద్యకళాశాలల నుంచి రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఎన్టీఆర్ భవన్లో రెండు నెలల క్రితం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేత గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. స్పందించిన కోర్టు ఈ మేరకు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేందుకు కుట్ర జరుగుతోందని డీఎస్ తనయుడు ఫిర్యాదు!
హైదరాబాద్: తనను చంపేందుకు కొందరు వెంబడిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆరోపించారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంజయ్ మంగళవారం మధ్యాహ్నం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సంజయ్ ఫిర్యాదు చేశారు. గతంలో నిజామాబాద్ మేయర్ గా సంజయ్ సేవలందించారు. వ్యక్తిగతంగా తనకెవరితో విబేధాలు లేవని సంజయ్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సంజయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా అనుమానిత వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి కేంద్రికరించారు. -
కుక్కపిల్లనుపోగొట్టారని ఫిర్యాదు...
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను ఊరికి వెళ్తూ పెట్క్లినిక్లో అప్పగిస్తే పోగొట్టారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలు... శ్రీనగర్‌కాలనీలో నివసించే ప్రభు త్వ ఉద్యోగి తులసి ఈనెల 13న ఊరికి వెళ్తూ తన 14 నెలల పగ్ జాతి కుక్కపిల్లను జాగ్రత్తగా చూడాలని చెప్పి శ్రీనగర్‌కాలనీలోని జీకే పెట్ క్లినిక్‌కు అప్పగించారు. రోజుకు రూ.250 చొ ప్పున రుసుం కూడా చెల్లించారు. ఈనెల 17న క్లినిక్ సిబ్బంది ఆ కుక్కపిల్లలను వాకింగ్ కోసం రోడ్డుపైకి తీసుకెళ్లగా...స్కూల్ బస్సు రావడం తో బెదిరి పోయి మెడకున్న గొలుసును తప్పిం చుకొని పారిపోయింది. క్లినిక్ సిబ్బంది గాలిం చినా దాని ఆచూకీ దొరకలేదు. ఊరు నుంచి తిరిగొచ్చిన తులసి తన కుక్కపిల్ల అదృశ్యమైన వి షయం తెలుసుకొని పెట్ క్లినిక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కుక్కపిల్లను పోగొట్టిన పెట్ క్లినిక్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. -
వర్థమాన నటి సాయి శిరీష
మూడు నెలల క్రితం అదృశ్యమైన వర్థమాన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది. తల్లి దండ్రుల వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది. తన స్నేహితుల వద్దే తలదాచుకున్నానని తెలిపింది. ఆమెపై అదృశ్యం కేసు నమోదు కావడంతో బంజారాహిల్స్‌లో పోలీసులు కోర్టుకు తరలించారు. -
సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
-
సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
సినీ సంగీత దర్శకుడు చక్రి వివాదంలో చిక్కుకున్నారు. చక్రి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బేగంపేటకు చెందిన మాధవి అనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చక్రి ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెండ్ షిప్ డే వేడుకల సందర్భంగా తన పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చక్రితో పాటు నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇడియట్ సినిమాతో పాపులరయిన చక్రి పెద్ద సంగీత దర్శకుడిగా ఎదిగారు. పలు హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, శివమణి, దేవదాసు, చక్రం, సింహా తదితర సినిమాలకు చక్రి అందించిన పాటలను శ్రోతలను ఆకట్టుకున్నాయి. సినిమా వాళ్ల ఆకతాయి చేష్టలు ఇటీవల కాలంలో పెరిగాయి. మొన్నటి మొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు చిరంజీవి కుమారుడు హీరో రామ్‌చరణ్ నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై చేయిచేసుకోవడంతో వివాదం చెలరేగిన సంగతి విదితమే.