సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆయన కుటుంబసభ్యులు శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు ఆరణాల బాక్సు మాయంపై ఇంట్లో పనిచేసే వాళ్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా కాగా జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment