Case Filed On 2 Men For Attacking On Young Women In Banjara Hills - Sakshi
Sakshi News home page

Banjara Hills: మహిళపై దాడి చేసిన వ్యక్తులపై కేసు

Published Sun, Jan 9 2022 5:00 AM | Last Updated on Sun, Jan 9 2022 10:38 AM

Unknown Person Attacked On Young Women In Banjara Hills - Sakshi

బంజారాహిల్స్‌: తనపై దాడి చేయడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించినందుకు అసభ్యకర పదజాలంతో దూషించిన వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌కు చెందిన మారెమ్మ అనే మహిళ ఈ నెల 4వ తేదీన అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉదయం 10 గంటలకు పూజల్లో పాల్గొనేందుకు వెళుతుండగా అక్కడ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌ అనుచరుడు శివతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశారని.. అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనపై దాడి చేసి తిట్టడానికి మీరెవరంటూ ఆమె ప్రశ్నించగా ఆగ్రహంతో ఊగిపోతున్న శివ తనపై దాడికి యత్నించాడని ఆరోపించారు. పక్కనే ఉన్న తన స్నేహితురాలిపై కూడా శివతో పాటు గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసేందుకు యత్నించారని, తాము ఎంత వారిస్తున్నా వినకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పల్లపు గోవర్ధన్‌ అనుచరుడైన శివతోపాటు మరో వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement