
Case Filed On 7 Arts,Bigbos Fame Sarayu: యూట్యూబూర్ 7ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్‌నెస్‌తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.