Sarayu's Interesting Comments On Bigg Boss Reality Show - Sakshi
Sakshi News home page

Sarayu: బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సరయు, డబ్బులిచ్చి కొనుక్కుంటారంటూ..

Published Sun, Jul 23 2023 11:12 AM | Last Updated on Sun, Jul 23 2023 11:34 AM

Sarayu Interesting Comments On Bigg Boss Reality Show - Sakshi

బూతు డైలాగులు, వల్గర్‌ పంచులతో రెచ్చిపోయే నటి సరయు. యూట్యూబ్‌లో 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, షార్ట్‌ వీడియోలు చేస్తూ రెచ్చిపోయే సరయు ఆ మధ్య బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన సరయు షో మొదలైన వారం రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో పార్టిసిపేట్‌ చేయగా ఇక్కడ నాలుగువారంలో ఎలిమినేట్‌ అయింది.

డబ్బులిచ్చి కొనుక్కోవడమే
రెండు సార్లు బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న సరయు.. తాజాగా ఈ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాసే కాదు.. 'ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్‌. కొనుక్కుని, లేదంటే తిరిగి వాళ్లకే డబ్బులిచ్చి మన అనుకునేవాళ్లను ప్రమోట్‌ చేసి ముందుకు తీసుకెళ్లే ప్లాట్‌ఫామ్సే ఈ రియాలిటీ షోలు. మిమ్మల్ని, మనల్ని.. జనాలందరినీ పిచ్చోళ్లను చేస్తున్నారు. దయచేసి ఇలాంటి రియాలిటీ షోలు చూడకండి. మీ టైం పాడు చేసుకోకండి.

వారితో ఫైట్‌ చేస్తే మనమే నెగెటివ్‌
నేను బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను. బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు నాకేం తెలియదు. అంతకుముందు ఉద్యోగం చేశామా? ఇంటికొచ్చామా? యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్నామా? అంతే ఉండేది. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాక కొంతమందికి బయట నుంచే కాకుండా లోపల కూడా సపోర్ట్‌ ఉండేది. వారి కాన్ఫిడెన్స్‌ వేరేలా ఉంటుంది. అలాంటివాళ్లతో పోరాడటం చాలా కష్టం. వారితో ఫైట్‌ చేస్తే మనమే నెగెటివ్‌ అవుతాం. ఒత్తిడికి లోనయ్యేదాన్ని' అని చెప్పుకొచ్చింది సరయు. కాగా సరయు 18 పేజెస్‌ చిత్రంలో హీరో నిఖిల్‌ స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో భైరవకోన, భారీ తారాగణం.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ పోతోంది.

చదవండి: నచ్చినావురో ఫోక్‌ సాంగ్‌లో కనిపించిన నటి హీరోయిన్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement