
సాక్షి, హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్‌ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్ కూడా బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్‌పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇక ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment