బంజారాహిల్స్: పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను ఎన్‌బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న గణేష్‌కు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఫిలింనగర్‌లో నివసించే గణేష్‌కు వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్‌స్టేషన్‌కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం కడప కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే గణేష్‌కు నోటీసులు జారీచేశారు. వీటికి సమాధానం చెప్పేందుకు ఆయన పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment