potluri varaprasad
-
పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్
-
నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్
బంజారాహిల్స్: పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను ఎన్బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న గణేష్‌కు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఫిలింనగర్లో నివసించే గణేష్‌కు వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్‌స్టేషన్‌కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం కడప కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే గణేష్‌కు నోటీసులు జారీచేశారు. వీటికి సమాధానం చెప్పేందుకు ఆయన పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
విజయవాడ ప్రజలతోనే ఉంటా : పీవీపీ
సాక్షి, విజయవాడ : విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ధన్యవాదాలు తెలిపారు. గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామని పీవీపీ అన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేక సార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయానన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 19 రోజులే పార్లమెంట్ పరిధిలో పర్యటించానని, కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజారిటితో గెలిచేవాడినని పేర్కొన్నారు. ఇక నుండి రెగ్యులర్‌గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని తెలిపారు. -
ఎల్లో మీడియాను రోడ్డుకీడ్చుతా: పీవీపీ
సాక్షి, విజయవాడ : తనపై ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) తెలిపారు. తనపై చాలామంది వ్యక్తులు, సంస్థలు అవాకులు, చెవాకులు పేలారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం జన్మహక్కుగా భావించేవారికి ఎవరో ఒకరు గుణపాఠం చెప్పాలని పీవీపీ అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా తప్పే. ఆయన శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాపై తప్పుడు కేసులు బనాయిస్తే కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. నాపై దుష్ప్రచారం చేసినవారికి లా పవర్ ఏంటో చూపిస్తా. టీవీ 5, మహా న్యూస్, ఒక ఎంపీపై పరువునష్టం దావా వేస్తా. ఒక్కొక్కరిపై రూ.100కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తా. ఇలాంటి వారికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలి. ఇప్పుడు నా చేతల్లో చూపిస్తా. ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాలి. నేను చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటా. ఎన్నేళ్లు అయినా పోరాటం చేస్తా. వారిని రోడ్డుకి ఈడుస్తా. లేకుంటే మరొకరు ఇలాగే చేస్తారు. కోల్గేట్ పవర్ స్కామ్‌లో చంద్రబాబు నాపై ఆరోపణలు చేశారు. ఆ స్కామ్‌లో ఉన్నది వై.హరిశ్చంద్రప్రసాద్. ఆయనకు భూములు కేటాయించింది చంద్రబాబే. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నా పేరు ఎక్కడా లేదు. నేను నిర్మాతగా 150 సినిమాలు తీశాను. సౌండ్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌లో మా కంపెనీకి బెస్ట్ అవార్డు వచ్చింది. మా కంపెనీలో పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లు పనిచేశారు. అగ్రిమెంట్ ప్రకారమే మేము నడుచుకుంటాం. దాన్ని ఎవరు అతిక్రమించినా వెంటనే చర్యలు కూడా ఉంటాయి. అది తెలియకుండా మాట్లాడటం సరికాదు. ఎన్నికలు ముగిసేవరకూ నాపై చేస్తున్న దుష్ప్రచారంపై మాట్లాడకూడదని అనుకున్నాను. సోమవారం నుంచి నా చర్యలు ఉంటాయి. పీవీపీ ఎప్పుడూ తప్పు చేయలేదు. నాపై చేసిన ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటా. ఇక తెలుగు నిఘంటువులో యూటర్న్ అనే పదానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారు. 2014లో చంద్రబాబును గెలిపించింది ఇవే ఈవీఎంలు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారు.’ అని అన్నారు. -
విజయవాడ రుణం తీర్చుకుంటా..
సాక్షి: మీ ప్రచారం చివర అంకానికి చేరింది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? పీవీపీ: ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి సమస్యలను నా కళ్లతో ప్రత్యక్షంగా చూశాను. అనేక వేల మందిని కలిసినప్పుడు వారి బాధలను చెబుతుంటే శ్రద్ధగా విన్నాను. విజయవాడ నగరంలో మూడు వేలకు పైగా ఉన్న మెట్లను ఎక్కి కొండలపై నివసించే వారి కష్టాలను తెలుసుకున్నాను. నగరానికి నడిబొడ్డులో ఉన్న 8 మురికివాడల్లో చిన్నచిన్న గదుల్లో కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందుల్ని చూసినప్పుడు చాలా బాధనిపించింది. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు కనీస వసతులు లేక పడుతున్న కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి: మీ ప్రచారం ఏ విధంగా సాగింది.? పీవీపీ: గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు వివరించాం. వారి కష్టాలను విన్నాను. చూశాను.. ఎంపీగా నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను. సాక్షి: పారిశ్రామికవేత్తగా అనేక దేశాల ప్రధాన నగరాలను చూసి ఉంటారు? మన రాష్ట్ర రాజధాని చూశారు? తేడా ఎలా ఉంది? పీవీపీ: విజయవాడ నా స్వస్థలం. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చదువుకుని.. పెరిగి పెద్దవాడిని అయ్యాను. విజయవాడలో మురికివాడల్లో పేదలు పడే కష్టాలను చూసి చలించి పోయాను. దేశ విదేశాల్లోని అనేక నగరాల్లోని అభివృద్ధిని, అక్కడ పరిపాలన చూసిన తర్వాత నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతో చేయాలనే ఆలోచనలతో వచ్చాను. ప్రచారంలో నాతో పాటు నగరంలోని కొంతమంది పారిశ్రామికవేత్తల్ని తీసుకు వెళ్లి పేద ప్రజలు కనీస సౌకర్యాలు లేకపడుతున్న ఇబ్బందుల్ని వారికి చూపిస్తున్నాను. వారి అందరి సహకారంతో వాటిని పరిష్కరిస్తాను. సాక్షి: ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? పీవీపీ: స్థానికుడిని కావడంతో నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉంది. కనీసం ఇంగ్లిష్‌లో మాట్లాడటం రాని వారు పార్లమెంట్‌కు వెళ్లితే అక్కడ ఏమి మాట్లాడతారు? ఈ ప్రాంత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనన్ని ఎక్కువ నిధుల్ని రాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. కేఎల్‌రావు వంటి వారి వాల్లనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. పారిశ్రామికవేత్తగా ఇక్కడ మాల్స్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఎంపీగా సాధ్యమైనంత ఎక్కువ పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి, ప్రజలకు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. సాక్షి: పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏయే సమస్యలను గుర్తించారు? పీవీపీ: కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ ప్రజలకు కనీసం తాగునీరు అందించడం చేతకానప్పుడు వీరు ప్రజాప్రతినిధులుగా ఎలా చెప్పుకుంటారు? ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో సుబాబుల్ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పథకాలు ప్రజలకు అక్కరకు రావడం లేదు. ఇక తిరువూరు మైలవరం ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్ల కిడ్నీలు చెడిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ కనీసం డయాలసిస్ సెంటర్‌ను కూడా ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయించలేకపోయారు. అభివృద్ధి అంటే చెట్లు నాటించడం, డివైడర్లకు రంగులు వేయడం కాదు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా కనీస సౌకర్యాలు అందించాల్సి ఉంది. వందరోజుల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తా. తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరిస్తా. సాక్షి: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అవకాశాలు ఎలా కల్పించనున్నారు? పీవీపీ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. అవి కొంతమేరకు ఉపయోగపడతాయి. ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారికి కావాల్సిన సౌకర్యాలు అందించాలి. ఇక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేక హోదా రావడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకున్న పరిచయాలను ఉపయోగించి ఇక్కడ చిన్నచిన్న పరిశ్రమలు తీసుకువస్తాను. ఇక్కడ యువకులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు సహాయం అందజేస్తాను. సాక్షి: ఈ ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? పీవీపీ: నూటికి నూరుశాతం విజయం సాధిస్తాను. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి నుంచి చక్కటి స్పందన వస్తోంది. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పట్ల చాలా ఆకర్షితులవుతున్నారు. వైఎస్సార్ సీపీతోనే ప్రత్యేకహోదాను సాధించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. నేను ఎంపీ అయిన తర్వాత వారి సమస్యలను పరిష్కరిస్తానని నమ్ముతున్నారు. సాక్షి: సినీ నిర్మాతగా సినీ పరిశ్రమను ఇక్కడకు తీసుకురాగలరా? పీవీపీ: సినీ పరిశ్రమ ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంటుంది. అయితే ఇతర నిర్మాతలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాం. అలాగే ఇక్కడ సినీ అనుబంధ పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తాను. -
ఆ విషయంలో బాబు దిట్ట : పొట్లూరి
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రాసాద్ విమర్శలు గుప్పించారు. తాను స్థానికుడిని కాదని చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, గోబెల్స్ ప్రచారంలో బాబు దిట్ట అని అన్నారు. హిట్లర్ తరహా చంద్రబాబు పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కాళేశ్వరరావు మార్కెట్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘విజయవాడ పశ్చిమ నియోజకవరాన్ని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పట్టించుకోలేదు. 5 ఏళ్లుగా ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ నవరత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ అభిస్తోంది. విజయవాడ పశ్చిమలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం’ అన్నారు. -
దుర్గమ్మ దయ ఎవరిపైనో!
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒకప్పుడు తెలుగు పత్రికలన్నీ ఇక్కడ నుంచే వెలువడేవి. రాష్ట్ర రాజధాని కావడంతో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, టీడీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) బరిలో దిగారు. మొట్టమొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ నుంచి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), నాలుగుసార్లు టీడీపీ గెలించింది. విజయవాడ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ కె.ఎల్ రావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాస్తికోద్యమ నాయకుడు గోరా కుమార్తె చెన్నుపాటి విద్య, కేంద్ర మాజీ మంత్రి పి.ఉపేంద్ర వంటి వారు ఇక్కడి నుంచే లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు వస్తాయి. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు.. జిల్లా మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తిరువూరుకు కొత్తగా దిగుమతి అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ జవహర్‌కు స్థానిక నేతలు సహకరించడం లేదు. విజయవాడ తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలతో కేశినేనికి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావం ఎంపీ ఎన్నికపైనా పడుతుందనే ఆందోళన టీడీపీలో నెలకొంది. ఇక నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అయినా పెత్తనం మాత్రం మంత్రి దేవినేని ఉమాదే. ఆయన విధానాలు నచ్చక అనేక మంది దళిత నేతలు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. టీడీపీలో కీలకంగా ఉండే కన్నెగంటి జీవరత్నం ఇటీవల వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఇక జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వర్గానికి, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ వర్గానికి మధ్య విబేధాలు ఉన్నాయి. అందువల్ల ఈసారి ఇక్కడ టీడీపీని ఓడించేందుకు నెట్టెం వర్గం ప్రయత్నిస్తోంది. దివంగత సీఎం వైఎస్‌ను జిల్లా మరిచిపోదు.. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజల దృష్టిలో అపర భగీరథుడయ్యారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మించి జగ్గయ్యపేట వాసుల దాహార్తిని తీర్చారు. రూ.4,573 కోట్లతో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు 2007, నవంబర్‌లో పరిపాలన అనుమతులిచ్చారు. పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్న క్రమంలో ఆయన దుర్మరణంతో పరిస్థితి మారింది. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పొట్లూరి వీరప్రసాద్ పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసమ్మతి అనేదే లేదు. విజయవాడ వాసే కావడంతో నియోజకవర్గ వాసులకు పీవీపీ సుపరిచితులు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు. కేశినేని నాని (టీడీపీ) నోటిదురుసు ఎక్కువ. రవాణా కమిషనర్ బాలసుబ్ర హ్మణ్యంపై అప్పట్లో దాడి చేయడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేయబోయి అప్రదిష్టను మూట కట్టుకున్నారు. దేవాలయాలను, కూల్చివేసినప్పుడు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లిన గోశాల ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మొత్తం ఓటరు : 16,19,607 పురుషులు : 7,98,421 స్త్రీలు : 8,21,028 ఇతరులు : 158 – యు.శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, అమరావతి బ్యూరో -
విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్ధిగా పొట్లూరి నామినేషన్
-
పవన్‌కు... రాజు రవితేజ దూరమయ్యాడా?
సినీనటుడు పవన్ కళ్యాణ్ అట్టహాసంగా ప్రారంభించిన 'జనసేన' పాల పొంగులాంటిదేనా? తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రితం జనసేనను ఒక తుఫాను అని అభివర్ణించిన వారే ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం జనసేన కోమాలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అనేది సోదిలో కూడా కనిపించటం లేదు. పవన్ కూడా జనసేనపై ఆసక్తి చూపించటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో జనసేన పార్టీ స్థాపించడానికి తన వెనుక డబ్బున్నవారు, రాజకీయ నేతలు లేరనీ చెప్పిన పవన్ కళ్యాణ్... తన స్నేహితుడు రాజు రవితేజ మాత్రమే ఉన్నాడంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు పవన్‌కు కుడి భుజమైన రాజు రవితేజ ప్రస్తుతం కనిపించటం లేదు. పవన్ తో రాజు రవితేజ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. పవన్ వ్యవహార శైలి నచ్చకే అతను ...దూరం జరిగినట్లు తెలుస్తోంది. పవన్.. ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ.. చేతలు మాత్రం శూన్యమని తెలుసుకున్న రాజు రవితేజ పక్కకు తప్పుకున్నాడని ఓ వర్గం చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... పీవీఆర్... పొట్లూరి వరప్రసాద్. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తాజాగా పీవీఆర్ కూడా పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖలో జరిగిన జనసేన సభల ఏర్పాటు నిమిత్తం పీవీఆర్...సుమారు మూడు కోట్లు ఖర్చుపెట్టారట. ఇందుకోసం ఆయన..ఎంపీ టిక్కెట్ ఇప్పించే విషయంలో ఒత్తిడి తెచ్చినా చివరికి ఫలితం లేకపోయింది. ఎన్నికల తర్వాత పీవీఆర్ కూడా 'తమ్ముడి' పట్టించుకోవటం లేదట. ఓ వైపు వ్యాపార వ్యవహారాలతో పాటు మరోవైపు సినిమా నిర్మాణాలతో బిజీగా ఉన్నారట. ఇక పవన్ కూడా తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఓ వైపు మాల్టీ స్టారర్ సినిమా 'గోపాల గోపాల' తో పాటు గబ్బర్ సింగ్-2లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకవేళ టీడీపీ, బీజేపీలకు తన సేవలు అవసరం అయితే ...మరోసారి పవన్ తెరమీదకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా బీజేపీ... పవన్‌కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. -
పవన్ ఎఫెక్ట్ పని చేసిందా?
విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ విషయంలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. దాంతో పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టించి తీరా ఎన్నికలు వచ్చేసరికి కేశినేని నానిని టీడీపీ అధ్యక్షుడు కూరలో కరివేపాకులా పక్కన పడేశారు. పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు బెజవాడ ఎంపీ టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. ఇటీవల జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో విజయవాడ ఎంపీ సీటు తన సన్నిహితుడు పొట్లూరికే ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నాడు. తాను సూచించిన పొట్లూరికి సీటిస్తే ప్రచారం చేస్తానని పవన్ ఖరాఖండిగా చెప్పడంతో బాబు... కేశినేని నానికి పక్కన పెట్టినట్లు సమాచారం. తనకు ఎంపీ టికెటే కేటాయించాలని కేశినేని నాని...అధినేతను కలిసినా ఫలితం దక్కలేదు. ఎంపీ సీటుపై పట్టు వద్దంటూ విజయవాడ తూర్పు, పెనమలూరు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలంటూ చంద్రబాబు ఈ సందర్భంగా నానికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో విజయవాడ ఎంపీ సీటు కోట్లు పలుకుతోంది. ఎన్.ఆర్.ఐ. కోమటి జయరాం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమేనని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం చైర్మన్ కోనేరు సత్యనారాయణ అదే బాటలో ఉన్నారు. పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్ నిధులకు వెనుకాడకుండా ఖర్చుచేస్తానని చెప్పడంతోపాటు సినీనటుడు పవన్‌కల్యాణ్‌తో సిఫారసు చేయించారు. ఇక ఎంపీ సీటుపై గంపెడంత ఆశ పెట్టుకున్న కేశినేని నానికి బాబు మొండి చేయి చూపించటంతో...నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ సీటు ఆశిస్తున్న కోనేరు సత్యనారాయణ, పీవీపీలు ఇంటర్నేషనల్ స్కామర్లు అంటూ కేశినేని నాని వ్యాఖానించటం పార్టీలో సంచలనం కలిగింస్తోంది. ఇప్పటికే కార్పొ'రేట్' సంస్థగా టీడీపీ మారిపోయిందని, తాజాగా సీట్లు ఆశిస్తున్న మరో ఇద్దరినీ స్కామర్లుగా ఆ పార్టీ నేతే ముద్ర వేయటంతో టీడీపీ ప్రతిష్ట రోడ్డున పడినట్లయింది.