సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రాసాద్ విమర్శలు గుప్పించారు. తాను స్థానికుడిని కాదని చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, గోబెల్స్ ప్రచారంలో బాబు దిట్ట అని అన్నారు. హిట్లర్ తరహా చంద్రబాబు పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కాళేశ్వరరావు మార్కెట్‌లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘విజయవాడ పశ్చిమ నియోజకవరాన్ని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పట్టించుకోలేదు. 5 ఏళ్లుగా ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ నవరత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ అభిస్తోంది. విజయవాడ పశ్చిమలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment