vellampally srinivas
-
చంద్రబాబుకి మసాజ్ చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు: వెల్లంపల్లి
-
అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
జనసేన కాదు ..గూండా సేన : వెల్లంపల్లి
-
లోకేష్ కు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్
-
దేశభక్తిని పెంపొందించే విధంగా... సాక్షి టీవీ సామాజిక విప్లవం..
-
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
-
చర్చలకు వచ్చిన 48 గంటల్లోనే సమస్య క్లోజ్: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
మత రాజకీయాలు ఇక్కడ సాగవు
-
రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు
-
పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
అమరావతి: శారదా పీఠంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడే పీఠం అడిగినప్పుడు స్థలం ఇవ్వడంలో తప్పేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు ప్రభుత్వాలలో కూడా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొన్నెళ్ల క్రితం చిన్నజీయర్ సంస్థ కి భూములు కేటాయించాం.. ఇప్పుడు శారదా పీఠంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కి కూడా ఇస్తున్నామని తెలిపారు. కాగా, చంద్రబాబు హయాంలో మాత్రం.. రాయపాటి, నారా లోకేష్ లకు అప్పనంగా భూములు ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మం కాపాడే పీఠానికి భూములు ఇస్తుంటే టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి మీడియా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే హిందువులు ఆంధ్రజ్యోతి ని బహిష్కరిస్తారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చదవండి: అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. (చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి) తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది. చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్ కల్యాణ్: మంత్రి వెల్లంపల్లి
-
డ్రగ్స్‌పై టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు : వెల్లంపల్లి
-
మహిళలంతా సీఎం వెంటే ఉన్నారు : వెల్లంపల్లి
-
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
-
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలోనే తెర
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు. కాగా బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలో తెరపడనుందనే సంకేతాలు ఇచ్చారు. వివాదానికి కారణమైన రెండు వర్గాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి రావాలని కోరిన ఆయన త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది. చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి! -
మాన్సాస్ ట్రస్ట్‌పై ఫోరెన్సిక్ ఆడిట్
సాక్షి, విశాఖపట్నం: అక్రమాల పుట్టగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకోసం దేవదాయశాఖ కమిషనర్ ప్రత్యేకాధికారిగా నలుగురు జాయింట్ కమిషనర్లతో ఫోరెన్సిక్ ఆడిట్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరునాటికి ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ వ్యవహారాలపై పదేళ్లుగా ఆడిట్ జరగలేదని చెప్పారు. విశాఖ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశాఖఫట్నం, విజయనగరం జిల్లాల్లో దేవదాయశాఖ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోను, అనంతరం మీడియా సమావేశంలోను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఈరోజు దొడ్డిదారిన చైర్మన్ అయిన అశోక్‌గజపతిరాజు పంచగ్రామాల్లో 12 వేల ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో విజయం సాధించి అశోక్‌గజపతిరాజును ఆ కుర్చీ నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు ఉన్న 14 వేల ఎకరాలకుపైగా భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీకాకుళం సీతారామస్వామి దేవస్థానాల నుంచి సుమారు 6 వేల ఎకరాలను బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగరం సంస్థానానికి చెందిన పీవీజీ రాజుకు లీజుకు ఇచ్చారని తెలిపారు. ఈ లీజు భూములు ఎవరి పేరుమీద ఉన్నాయో, అర్బన్ ల్యాండ్‌సీలింగ్ కింద ఎందుకు ప్రకటించలేదో అశోక్‌గజపతిరాజు చెప్పాలన్నారు. పీవీజీ రాజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒకరోజు ముందు మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన భూముల్లో కొన్ని మాన్సాస్ ట్రస్ట్‌కు, కుటుంబసభ్యులకు ఇచ్చారని, కొన్ని భూములు ఆయన పేరు మీదే ప్రభుత్వ రికార్డుల్లో ఉంచేశారని చెప్పారు. ఆ భూముల్ని ఎన్వోసీల పేరుతో అమ్ముకుంటూ ఏడుగురు కుటుంబసభ్యులు వాటాలు పంచుకుంటున్నారని తెలిపారు. విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాన్సాస్ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని, వీటన్నింటిపైనా విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సింహాచలం భూముల సమస్య త్వరలోనే తీరుతుంది దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాల్లో గ్రామ దేవతల నుంచి పెద్ద ఆలయాల వరకు ఉన్న భూములు, వాటిలో ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సింహాచల భూముల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా ట్రస్టు ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అనుభవించడం మంచిపద్ధతి కాదని అశోక్‌గజపతిరాజు తెలుసుకోవాలని సూచించారు. పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్టుకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారంటే.. అశోక్‌గజపతిరాజు ధనదాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాల వరకు మాత్రమే తనకు అధికారాలున్నాయని, విద్యాసంస్థల కార్యకలాపాలను కరెస్పాండెంట్ ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
104 కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు బలోపేతం
-
మున్సిపల్ ఎన్నికల సమయంలో బాబు వ్యాఖ్యలు సరికావు
-
వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన కార్యకర్తలు
సాక్షి, విజయవాడ: టీడీపీతో జనసేన లోపాయికారి ఒప్పందం నచ్చకపోవడం వల్లే చాలా మంది ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమకు జనసేనలో అన్యాయం జరిగిందని ఎవరైనా బయటకు వస్తే వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఫాంహౌజ్‌కే పరిమితం కావడం వల్ల స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఆయనకు తన పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. విజయవాడలోని 64 డివిజన్లు తామే గెలుస్తామని మంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు జనసేన కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన అభ్యర్థి హరీష్ కుమార్ సహా ఇతర కార్యకర్తలకు కండువా కప్పి వెల్లంపల్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘జనసేన అభ్యర్ధిగా బీ-ఫామ్ ఇచ్చి, గెలుపు కోసం కాకుండా టీడీపీ గెలవాలని స్ధానిక జనసేన నాయకులే సొంతక్యాడర్‌ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరం. టీడీపీ- జనసేన ఒప్పందం నచ్చకే ఈ వలసలు. చంద్రబాబుతో పవన్ అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఫాంహౌజ్‌లో ఉండే పవన్.. ఇకనైనా కళ్లు తెరవాలి. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వారు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారు. స్ధానికంగా జనసేన-టీడీపీ నేతలు చేసుకున్న ఒప్పందం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వైఎస్సార్ సీపీని ఓడించేందుకు, టీడీపీ జనసేనకు, జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలనే దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రజలంతా గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
ఇంద్రకీలాద్రి: ఆషాఢ సారె మహోత్సవం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం.. వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు. ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధేస్తోందని పేర్కొన్నారు. ( ‘ఆయనకు టీడీపీ క్షమాపణ చెప్పాలి’ ) తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని అన్నారు. ప్రజలకు మేలు జరగకూడదనే.. ప్రజలకు మేలు జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుంటున్నారు. మండలిలో అంగబలం ఉంది.. సంగతి చూస్తామంటున్నట్టు టీడీపీ వ్యవహరించింది. మండలి ఛైర్మన్ గతంలో రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని డిప్యూటీ ఛైర్మన్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. గన్ మెన్లను తొలగించారంటూ డిప్యూటీ ఛైర్మన్ చైరులో కూర్చొని కామెంట్లు చేయడం సరి కాదు. చైరులో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ వాళ్లని మా వాళ్లని సంబోధిస్తున్నారు. రూల్ 90 కింద చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడేశారు. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారు. డిమాండ్ల మీద మంత్రులే సమాధానం చెప్పాలి కాబట్టి మండలికి వెళ్లాం. బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి శునకానందం పొందగలరు తప్ప.. లాభం ఏముంటుంది..?. ప్రజల కోసం మేం భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరు. బిల్లు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి శాసనసభలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంటుంది. అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. సంఖ్యా బలం ఉందని మాత్రమే మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. మండలిలో డిప్యూటీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఛైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి. దొడ్డిదారిన యనమల తెచ్చిన రూల్ 90 నోటీసును చర్చకు అనుమతించారు. యనమల ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణలో అరెస్టైన నేతలు మాకు నీతులు చెప్తున్నారు. వీర సైనికుడు సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు.. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ గొప్ప వ్యక్తి. శాసనసభ కూడా సంతోష్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. సంతోష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -
లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలి : కన్నబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడికి దిగారని తెలిపారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినట్టు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సభలో ఫొటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని చెప్పారు. (చదవండి : మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి) ప్రజాసంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరిన పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. లోకేశ్ సభలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని.. ఇది సభను చులకన చేయడమేనని విమర్శించారు. లోకేశ్ సభ్యుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. లోకేష్ తీరుపై సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి సాక్షిగా మంత్రిపై దాడి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశం సభ్యులు బుధవారం గందరగోళం సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి తెగబడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై చేయి చేసుకుని అమర్యాదగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో టీడీపీ నేతలు హడావుడి చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. (చదవండి : ‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’) ఈ క్రమంలో లోకేష్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్.. ఫొటోలు తీయొద్దని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మంత్రులు.. లోకేష్ తీరు సరికాదంటూ మండిపడ్డారు. ఇంతలో మంత్రుల దగ్గరికి చేరుకున్న టీడీపీ సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డారు. మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కాళ్లతో తన్ని, చేయి చేసుకుని ఆయనను అవమానించారు. ఇదిలా ఉండగా.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. -
అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు?
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోతే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 దేవాలయాలు కూల్చేసినపుడు కూడా కన్నా మాట్లాడలేదని, బాబు ఇచ్చిన డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారన్నారు. బుధవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ ఆస్తులని అమ్మాలని సంతకాలు కూడా చేశారు. భాను ప్రకాష్ రెడ్డి విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదు. అప్పట్లో నేను బీజేపీలో ఉండి దేవాలయాలు పడగొట్టే అంశాన్ని అడ్డుకుంటే నన్ను అరెస్ట్ చేశారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ( ‘ఆనాడు భూముల విక్రయ కమిటీలో బీజేపీ వారు లేరా) మీరు అమ్మాలనుకున్న ఆస్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపితే నిరాహార దీక్ష చేస్తారా? దేవాలయాల డబ్బులు తీసుకుని వెళ్లి ఇమామ్‌లకి, పాస్టర్లలకి ఇస్తున్నారన్న దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. టీటీడీ ఆస్తుల గురించి ఫిబ్రవరిలో చర్చించాం అంతే. డబ్బులకి అమ్ముడు పోయి ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని మీరిలా మాట్లాడటం సబబు కాదు. పవన్ కళ్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు, చేతిలో దేవుడి పటం ఉంటుంది. వీళ్ళు కూడా టీటీడీ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి: మల్లాది విజయవాడ : టీటీడీ ఆస్తుల అమ్మకం సమయంలో టీడీపీతో జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని, అప్పుడు వారెవరూ దీని గురించి నోరు విప్పలేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో బీజేపీలో ఉన్నారని తెలిపారు. భాను ప్రకాష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. జనసేనలో ఉన్న నాగబాబు గాడ్సేని భుజాన వేసుకుని మాట్లాడారని, ఆయనకి దేవాలయాల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. -
డబ్బులకి అమ్ముడు పోయి మౌనంగా ఉండిపోయారు..
-
అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకు పవన్
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకండి పవన్ అంటూ ఎద్దేవా చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురోహితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సాయం ప్రకటించిన తరువాత కూడా వారిని ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురోహితులపై పవన్ కల్యాణ్ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. (‘నీచ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి’) ‘ఇదివరకే సాయం ప్రకటించాకా మళ్లీ డిమాండ్ ఏంటండీ పవన్ కల్యాణ్.. కామెడీ కాకుంటే..’ అంటూ ఎద్దేవా చేశారు. లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయిందా అని ప్రశ్నించారు. హైదరాబాదులో కూర్చున్న పవన్ కళ్లకు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో అని అన్నారు. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిదని సూచించారు. గురువారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లంపల్లి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది మనసున్న ప్రభుత్వం. బ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈనెల 19వ తేదీ సంక్షేమ పథకాలకు క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అందులో మే నెల 26న అర్చకులకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ మనుగడ కోసం మే 20వ తేదీన పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలందరికీ నాలుగు విడుదల రేషన్ పంపిణీ చేసింది.’ అని అన్నారు. -
‘నీచ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు కరోనా వైరస్‌ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం వేసే పనిని తమ ప్రభుత్వం చెయ్యదన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. -
పేద పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణానది దుర్గాఘాట్‌లో పితృకర్మలు నిర్వహించే పేద పురోహితులకు బియ్యం, నిత్యావసర సరుకులను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పురోహితులకు తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూచన మేరకు వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా ప్రభావంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంటే హైదరాబాద్ వాసి చంద్రబాబు, అజ్ఞాతవాసి పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మోడల్ గెస్ట్‌హౌస్, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పితృకర్మలు నిర్వహించే పురోహితులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విజయమ్మకు ధన్యవాదాలు పితృకర్మలు నిర్వహించే పేద బ్రాహ్మణుల సమస్యపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించడంపై అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పేద బ్రాహ్మణుల సమస్యపై శుక్రవారం విజయమ్మ స్పందించి మంత్రి వెలంపల్లికి సూచించడంతో శనివారం నిత్యావసరాలు పంపిణీ చేశారని, బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
కేంద్రం సూచనతో హోమియో మందుల పంపిణీ
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం అర్సానిక్ ఏఎల్బీ 30 హోమియో మందుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కేబీఎన్ కాలేజీలో రాష్ట్ర దేవదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మందుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. హోమియో మందుల వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు. కరోనా రాకుండా నిలువరించే శక్తి హోమియో మందులకు ఉంటుందని వెలంపల్లి తెలిపారు. ప్రతీ ఒక్కరూ హోమియో మందులను తప్పకుండా వాడాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటంతో పాటు రాకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
అర్హులందరికి ఇంటి స్థలం
-
వికేంద్రీకరణకు జైకొట్టిన బెజవాడ మహిళలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం భారీ ర్యాలీ చేపట్టింది. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, పార్థసారథి, పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని అవినాశ్, గౌతం రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మహిళలు నినదించారు. మూడు రాజధానులను స్వాగతిస్తున్నామని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ముఖ్యమంతి వైస్ జగన్ నిర్ణయాలను విజయవాడ ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో చంద్రబాబు అండ్ గ్యాంగ్ భూముల్ని కొట్టేశారని వెల్లంపల్లి ఆరోపించారు. . ఆయనొక అసమర్థుడు.. చంద్రబాబు రాయకీయ భిక్షగాడని ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో దుర్గా వారధిని కట్టని అసమర్థుడు చంద్రబాబు అని అన్నారు. బాబు ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అమరావతిలో బాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమన్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలోనే ఉందని గుర్తు చేశారు. సుజనాచౌదరి వంటి బ్రోకర్ల మాటలు నమ్మొద్దని అన్నారు. -
ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు
-
పవన్ గబ్బర్‌సింగ్ కాదు రబ్బర్‌సింగ్
-
పవన్ గబ్బర్‌సింగ్ కాదు రబ్బర్‌సింగ్
సాక్షి, విజయవాడ: రాజధానిలో సినిమా స్టoట్లు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాల్లో గబ్బర్ సింగ్లా పవన్ కల్యాణ్ ఈలలు వేయించుకొని ఉండొచ్చుకానీ, ఇప్పుడు ఆయన గబ్బర్‌సింగ్ రబ్బర్‌సింగ్ అని ఎద్దేవా చేశారు. రాజకీయ ముసుగులో విధ్వంసం సృష్టించాలని పవన్, చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయ క్రీడకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వారి ఆటలు సాగవని, రైతులకు వైఎస్ జగన్‌హన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికారులను చులకన చేసి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని, ప్రతిపక్ష నాయకుడన్న స్పృహను మరచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని తప్పుబట్టారు. నీతి నిజాయితీ కలిగిన పోలీసులకు, అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన తమను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్లు చుట్టు తిప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని అని అన్నారని, కానీ సంవత్సరానికి 3600 కోట్లు ప్రభుత్వనికి భారమైనా సీఎం వైఎస్ జగన్ కార్మికుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని ప్రశంసించారు. మంచి చేయడానికి డబ్బు కాదు సీఎం జగన్లాగా మంచి మనసుకూడా ఉండాలన్నారు. ఆర్టీసి కార్మికులు తమని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత ఐదేళ్లు డిమాండ్ చేసినా అప్పటి సీఎం చంద్రబాబును పట్టించుకోలేదని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలుపుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పక్కరాష్టంలో ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు మన రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని స్వాగతించలేక పోతున్నారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి రాజధాని గురించి మాట్లాడేముందు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో రాజధాని పూర్తి చేయలేకపోయానని చంద్రబాబు ఒప్పుకోవాన్నారు. 40 ఏళ్ల అనుభవంతో ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 23 సీట్లు ఇచ్చి ప్రజలు తిరస్కరించిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. పవన్ ,చంద్రబాబు, కన్నా లక్ష్మీ నారాయణకు రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఐదేళ్ల ఉమ్మడి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. లక్ష కోట్ల అంచనాతో లేని రాజధానిని చూపించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు రైతుల ముసుగులో వారు చేస్తున్న రాజకీయన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలోని 13 జుల్లాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధే సీఎం లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ వేసిన హైపవర్ కమిటీ.. చంద్రబాబు వేసిన నారాయణ కమిటీలా దోచుకునే కమిటీ కాదన్నారు. చంద్రబాబులా సీఎం జగన్ చెత్త కమిటీలు వేయరని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని తప్పుబట్టారు. కానీ, చంద్రబాబు, కన్నా లక్ష్మీ నారాయణ, పవన్ కల్యాణ్‌లను ప్రజలు నమ్మబోరని, వారు రాష్ట్రానికి పనికిమాలిన దద్దమలు అని అన్నారు. -
'స్వచ్ఛత పై అవగాహన కల్పించడమే లక్ష్యం'
సాక్షి, విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను బుధవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ.. స్వచ్ఛత పై అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలోని 59 డివిజన్లలో ఈ వాహనాల ద్వారా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు వైఎస్ఆర్ నవశకం వాహనాన్ని సైతం ప్రారంభించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. -
‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’
సాక్షి, విజయవాడ: సహకార రంగం బతికి బట్టకట్టింది అంటే కేవలం అది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే అని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. తండ్రి అడుగు జాడల్లోనే కోపరేటివ్ రంగాన్ని బలపరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సహకార రంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. అనంతరం వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక సహకార రంగం ఊపిరి పోసుకుందన్నారు. కోపరేటివ్ రంగాన్ని బలపరిచేవిధంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంటుందన్నారు. సహకార రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. ఉద్యోగుల నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ కాపాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. బ్యాంకింగ్, సహకార వ్యవస్థను ముఖ్యమంత్రి బలోపేతం దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో సహకార సంఘం కుదేలయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అయితే సహకార రంగంలో రెండంచెల విధానాన్ని వైఎస్సార్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. సహకార రంగాన్ని వైఎస్సార్ ముందుండి నడిపించారని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం మరింత ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. -
‘అప్పుడే గొప్పదనం తెలుస్తుంది’
సాక్షి, భీమునిపట్నం: భీమిలి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం విశాఖ డైరెర్ట్ మార్గంలోని రెల్లివీధి వద్ద నుంచి నిర్వహించిన కార్నివాల్‌ను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు జరగాలని.. అప్పుడే అన్ని ప్రాంతాల వారికి ఇక్కడి చరిత్ర, గొప్పదనం గురించి తెలుస్తుందన్నారు. ఉత్సవాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి ముందే వచ్చింది.. భీమిలి ఉత్సవాలతో సంక్రాంతిపండగ ముందుగానే వచ్చినట్లుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్.. వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్ తర్వాత అరకు ఉత్సవ్లు నిర్వహిస్తామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. విశాఖ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆకట్టుకున్నవిద్యార్థుల వేషధారణలు విద్యార్థులు పలు వేషధారణలను ప్రదర్శిస్తూ.. చిన్నబజారు నుంచి మెయిన్‌రోడ్డు మీదగా బీచ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు : వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా.. నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన తరఫున, వైశ్య సమాజం తరఫున వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత అమరులయ్యారని గుర్తుచేశారు. ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత 1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడిందని.. కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా(ఆంధ్రప్రదేశ్) మాత్రం 1956 నవంబరు 1న అవతరించిందని తెలిపారు. అందుకే నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుతామని సీఎం వైఎస్ జగన్ గతంలో మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా జరుపుకోవాలని ఏపీ ప్రజలుకు మంత్రి పిలుపునిచ్చారు. -
శ్రీ శారదా పీఠాధిపతి జన్మదిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్యెల్యేలు కరణం ధర్మశ్రీ, మల్లాది విష్ణు, కోన రఘుపతి, భూమన కరుణాకర్ రెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ స్వామి వారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదం పొందారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా కానున్నారు. ఈ సందర్భంగా చినముషిడివాడలో భక్తులు విశేష ఏర్పాట్లు చేశారు. ఏటా నాగుల చవితి పర్వదినాన స్వామీజీ జన్మదినోత్సవాన్ని జరపడం ఆనవాయితీ. స్వధర్మ సంరక్షణే లక్ష్యంగా.. భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు కృషిచేస్తున్న నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను ధర్మపరిరక్షణ దినోత్సవంగా, భారతీయ పునర్వైభవ పర్వదినంగా జరపనున్నట్లు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెల్లడించారు. పీఠం కేంద్రంగా విశాఖపట్నం, హైదరాబాద్, న్యూఢిల్లీ తదితర నగరాలతో పాటు.. దేశంలోని పలుచోట్ల స్వామి భక్తులు ఉచిత వైద్యశిబిరాలు, అన్నదానం, వస్త్రాల వితరణ తదితర సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. శ్రీ శారదాపీఠం చారిటబుల్ ట్రస్టు, భక్తులు సంయుక్తంగా భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. -
‘కామెడీ స్కిట్లా లోకేష్ ఐదు గంటల దీక్ష’
సాక్షి, విజయవాడ: విజయవాడలోని 29వ డివిజన్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రావాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని), వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు రూ. కోటి 60 లక్షలతో అక్కడ చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణా పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక రూ. 2 కోట్లతో 29వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో 29వ డివిజన్ వివక్షకు గురైందని మంత్రి పేర్కొన్నారు. రూ. కోటి అరవై లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు పాలనలో విజయవాడ అభివృద్ధిలో ఆఖరి భాగంగా ఉందని అన్నారు. విజయవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని , ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. అదే విధంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనకు వెనుకబడిన ఈ డివిజనే ఉదాహరణ అని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కుమారుడు ఇసుక కోసం దీక్ష చేయడం హస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు వారి ఇంటి వెనకాల ఇసుక దోపిడి జరిగితే మూటలు ఇంటికి చేరాయని అప్పుడు మాటలు రాలేదని ఆయన అన్నారు. ఐదేళ్ల వారి తండ్రి పాలన పుణ్యమా అని వర్షాలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. వరదలు రైతాంగానికే అదృష్టమైతే భవన నిర్మాణ కార్మికులకు సమస్యలుగా మారాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే వరదలను కూడా రాజకీయాలకు వాడుకునే దుర్బుద్ధి తండ్రీకొడుకులదని మంత్రి విమర్శించారు. ఇక మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాగానే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని, రైతాంగమంతా సుభిక్షంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులంతా బాధ పడుతుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం దాని నుంచి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ఐదు గంటల దీక్ష కామిడి స్కిట్లా ఉందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై తండ్రీకొడుకులు బురద చల్లాలని చుస్తున్నారని, ఐదేళ్ళలో.. ఇసుక, మట్టి తవ్వకాలను అవినీతికి అడ్డాగా వారిద్దరూ మార్చేశారని అన్నారు. ఎమ్మెల్యే మాల్లాది విష్టు మాట్లాడుతూ.. ఇసుక కొరత ప్రభుత్వం తప్పు, మానవ తప్పిదం అంటూ చంద్రబాబు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడిపై గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన జరిమానానే ఇందుకు ఉదాహరణ అన్నారు. వారోత్సవాల పేరుతో ఇసుక ఇబ్బందిని తీర్చేందుకు సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు విజయవాడలో సమీక్షల పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెడి ఆర్టిస్తులా ప్రవర్తిస్తున్నారని విష్ణు ఎద్దేవా చేశారు.(చదవండి: ఇసుక వారోత్సవం) -
ఏపీలో అర్చక పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : ఈ ఏడాది జూలైలో నిర్వహించిన అర్చక పరీక్షకు సంబంధించిన ఫలితాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనావాస్ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘనతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్ పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. మొత్తం 7687 మంది అభ్యర్థులకు గానూ 4396 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. కాగా, పరీక్షలో ఫేయిలయిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2013 తర్వాత రాష్ట్రంలో అర్చకులకు పరీక్షలు నిర్వహించలేదని , ఇక మీద ప్రతి ఏటా అర్చకులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక జగన్ ముఖ్యమంత్రి కాగానే అర్చకులకు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు గుర్తుచేశారు. ఈ అర్చక పరీక్షల ద్వారా విదేశాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. అర్చకత్వం చేసుకునేవారికి పట్టా లభించడంతో పాటు ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్‌సింగ్‌కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు..
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్, శానిటేషన్, గుడి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించినట్టు కన్నబాబు తెలిపారు. మరోవైపు ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. -
‘పవన్ కళ్యాణ్ అదే రీతిలో ప్రవర్తిస్తున్నారు’
సాక్షి, విజయవాడ: గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు కూడా ఆదే రీతిలో ప్రవర్తిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వందరోజుల పాలన కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు మంత్రి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనసేన నాయకులు పార్టీలోకి చేరటాన్ని స్వాగతిస్తున్నానని, పార్టీలో చేరే నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్నారని, ఆయన పాలన నచ్చే వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక యువతకు పరిశ్రమలో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా బిల్లు తెచ్చామని, దేశ చరిత్రలోనే కాంట్రాక్ట్ పనులు రిజర్వేషన్ల ప్రకారం అమలు జరగాలని చెప్పిన నాయకులు సీఎం జగన్ ఒక్కరేనని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చదవండి : సీఎం జగన్‌ను కలిసిన పృధ్వీరాజ్ -
పట్టించుకోనందుకే పక్కన పెట్టారు
సాక్షి, విజయవాడ : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణను యువత ఆదర్శంగా తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ యువకులకు సూచించారు. మంగళవారం సత్యనారాయణ 125వ జయంతిని పురస్కరించుకొని లెనిన్ సెంటర్లోని ఆయన విగ్రహానికి మంత్రి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విశ్వనాధ సత్యనారాయణ తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని, ఆయన రచనలు మరువలేనివని తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సత్యనారాయణ నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాషను, కవులను పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని రచయిత జొన్నవిత్తుల చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్ ఇంతియాజ్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరాత్రులకు సంబంధించిన బ్రోచర్‌ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి జాబ్ కార్డులు తయారుచేసి ఆయా డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రతకు సంబంధించి ఎన్సీసీ నుంచి 2వేల మందిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన
సాక్షి, విజయవాడ : ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహానికి గురికాక తప్పదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనం నడుపుకొంటూ వీధుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గట్టు వెనుక ప్రాంతం 29వ డివిజన్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల పనులను వేగవంతం చేసి సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
వంశధార, నాగావళికి వరదనీటి ఉధృతి
సాక్షి, శ్రీకాకుళం: ఒడిశాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో వరదనీరు పెరుగుతోంది. గొట్టా బ్యారేజి వద్ద లక్షా 10వేల క్యూసెక్ల ఇన్‌ఫ్లో, నాగావళిలో 75 వేల క్యూసెక్ల ఇన్ ఫో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు రెడ్ ఆలెర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సహయక చర్యలకు కోసం పోలీసు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కొత్తూరు మండలం పొనుగోటువాడ గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ఈ వరదల నేపథ్యంలో జిల్లా ఇన్చార్చి, దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలను అప్రమత్రం చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో ఫోన్ మట్లాడారు. అదేవిధంగా వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి ఆదేశించారు. దీంతో పాటు నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరికలు జారీ చేయమని తెలిపారు. వరద ప్రభావం ఉన్న అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతితో అధికారులు వంశధార నదికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ, నాగావళి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి : ఆలయాలు, ట్రస్టుల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక నుంచి అగ్ర ప్రాధాన్యం దక్కనుంది. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అలాగే, ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ప్రతిష్టను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. ‘ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు–ఎండోమెంట్స్ చట్టం–1987’కు సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. సభ్యులు ఈ బిల్లుకు మద్దతిస్తూ ప్రసంగించారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాంతో ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నారు. అదే విధంగా అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు మహిళలకే రిజర్వ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ బిల్లుకు సవరణను కూడా శాసనసభ ఆమోదించింది. అక్రమాలకు పాల్పడితే ఔటే ఇక ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని రెండేళ్ల పదవీకాలం కంటే ముందే తొలగించడానికి ఈ బిల్లు ఆమోదం ద్వారా మార్గం సుగమమైంది. ఆలయాలు, ట్రస్టుల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. కాగా, తిరుపతి పట్టణాభివృద్ధి, ప్రాధికార సంస్థ (తుడా) చైర్మన్‌ను టీటీడీలో పదవి రీత్యా సభ్యునిగా నియమించేందుకు చట్టంలో సవరణను సభ ఆమోదించింది. ఆలయాల ప్రతిష్ట కాపాడటమే లక్ష్యం సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారికి సామాజిక గౌరవం తీసుకురావాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతం. అందుకే ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో కూడా ఆ వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ఇది ఉపకరిస్తుంది. రెండేళ్ల పదవీకాలం ఉంది కదా అనే ధీమాతో అనుచితంగా ప్రవర్తించే పాలక మండలి సభ్యుల ఆటకట్టిస్తుంది. అలాంటి వారిని పదవుల నుంచి ప్రభుత్వం తొలగించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. – వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆలయాల ప్రతిష్ట, ఆస్తుల పరిరక్షణకు అవకాశం దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు, ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు ద్వారా పూర్తి అధికారాలు దక్కుతాయి. ఎవరైనా పాలకమండలి సభ్యుడు అవినీతికి పాల్పడినా.. భక్తులు, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించినా వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. చంద్రబాబు పాలనలో విజయవాడ దుర్గగుడి పాలక మండలిలో ఓ సభ్యురాలు అమ్మవారి చీరలను అమ్ముకున్నారు. మరో సభ్యుడు క్షురకులను దూషించారు. కానీ, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలాంటి వాటిని సహించబోమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ -
నాయీ బ్రహ్మణులకు అండగా ఉంటాం: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, కృష్ణా : దేవాలయాల్లోని నాయీ బ్రాహ్మణుల సమస్యలపై విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయీ బ్రహ్మణులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో నాయీ బ్రహ్మణులు చంద్రబాబును ఓడించారన్నారు. కాగా మన ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కోన్నారు. త్వరలోనే వారి సమస్యలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో మంత్రులు సమీక్షా సమావేశం నిర్శహించారు. ఈ సమావేశానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని హాజరయ్యారు. విజయవాడలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు తాము అభివృద్ధి పనులపై దృష్టి పెట్టినట్లు అధికారులకు తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని , అలాగే మిగిలిపోయిన పెండింగ్ పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. విజయవాడ నగరం నుంచి అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ సహజంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ ఫ్రీ చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే గుణదల దగ్గర సగంలో ఆగిపోయిన ఫ్లైఓవర్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. -
ముంపు ప్రాంతాలపై చర్యలు చేపట్టండి
సాక్షి,విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలైన రోటరీనగర్, భవానీపురం, కెపిహెచ్బి కాలనీలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. చిన్నపాటి వర్షానికే ఇక్కడి కాలనీలు నీట మునుగుతున్నాయని అక్కడి స్థానికులు మంత్రి వెల్లంపల్లికి వివరించారు. వెంటనే ముంపు ప్రాంతాలలో చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని మంత్రి వెల్లంపల్లి అధికారులను ఆదేశించారు. తర్వాత భవానీపురం దర్గా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. -
‘అది చంద్రబాబు, ఆయన తాత ఆస్తి కాదు’
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వానికి వెళ్తానన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫిరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాదర్బార్‌లో కీలక ఫైళ్లు ఏముంటాయి? ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పజెప్పమని నోటీసులు ఇచ్చినా టీడీపీ నేతలు ఖాళీ చేయలేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని, అక్కడ ప్రజా సమస్యల ఫైళ్లు మాత్రమే ఉండాలన్నారు. అంతేకాని సింగపూర్‌తో ఒప్పందాలు, హెరిటేజ్ ఆస్తుల వివరాలు దాచుకోవడానికి అది చంద్రబాబు ఆస్తి కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయాలని చూస్తే.. టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశం కచ్చితంగా ప్రజావేదికలోనే నిర్వహించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. -
అర్చకులకు 25 శాతం వేతనాల పెంపు
సాక్షి, అమరావతి : దేవాదాయ శాఖా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం వేతనాలు పెంచుతూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల్లో సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. సదావర్తి లాంటి దేవాలయాల భూములను కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎల్లవేళలా పాటుపడుతుందని.. ఎవరైనా దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని దేవాలయాల్లో ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను రద్దు చేసి కొత్త కమిటీలు నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. -
ఆ విషయంలో బాబు దిట్ట : పొట్లూరి
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రాసాద్ విమర్శలు గుప్పించారు. తాను స్థానికుడిని కాదని చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, గోబెల్స్ ప్రచారంలో బాబు దిట్ట అని అన్నారు. హిట్లర్ తరహా చంద్రబాబు పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కాళేశ్వరరావు మార్కెట్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘విజయవాడ పశ్చిమ నియోజకవరాన్ని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పట్టించుకోలేదు. 5 ఏళ్లుగా ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ నవరత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ అభిస్తోంది. విజయవాడ పశ్చిమలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం’ అన్నారు. -
కరుణించవమ్మా మహాలక్ష్మి..
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్‌కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. -
ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు
-
అలా చేయటం దారుణం : వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం 50 కోట్ల విలువైన స్థలం ధారాదత్తం చేయటం దారుణమని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సొమ్మని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలం టీడీపీ కార్యాలయానికి ఇస్తారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు, భూ బకాసురుల్లా వ్యవహరిస్తున్నారు. జీవోలు అన్ని టీడీపీకి అనుకూలంగా, క్యాబినేట్ సమావేశాలు అన్ని భూ పంపిణీకి ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రతి దాంట్లో స్టేలు తెచ్చుకోవడం పని, ఐటీ రైడ్లకు ఎందుకు భయపడుతున్నారు. మేము అధికారంలోకి రాగానే అన్నిటిపై విచారణ జరిపిస్తాం’’అని అన్నారు. ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు విపరీతంగా పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు తన సొంత ఆస్తుల్లా ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున 100 కోట్ల భూమిని ఏడాదికి 1000 రూపాయలకు కట్టబెడతారా! అంటూ మండిపడ్డారు. ఇరిగేషన్ భూమిని మీ ఇష్టం వచ్చినట్టు తీసుకునే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో భూ కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు లూటీలు, దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలకు ఇచ్చిన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పేదలకు ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలపై ఆయనే స్వచ్ఛందంగా విచారణ జరిపించుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వరాజ్యమైదానాన్ని కొట్టేయడానికి చంద్రబాబు కుట్ర
విజయవాడ సిటీ: పులిచింతల కాంట్రాక్టర్ బొలినేని శ్రీనయ్య కంపెనీకి స్వరాజ్య మైదానాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ నియోజకర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి అదనపు పనులు చేపట్టామని, అందుకు సంబంధించి డబ్బు చెల్లించలేదని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లితే... సకాలంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించకపోవడం చంద్రబాబు కుట్రలో భాగమేనన్నారు. ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, దినేష్‌కుమార్ మచిలీపట్నం ఇచ్చిన కోర్టుపై హైకోర్టుకు అప్పీలకు వెళ్లదామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్య కోసం ఇదంతా జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంతో పాటు పులిచింతల ప్రాజెక్టుకు చెందిన 48 ఎకరాల భూమి, ఇరిగేషన్ క్వార్టర్స్‌ను దక్కించుకోవాలని చంద్రబాబు కుట్రపన్నారన్నారు. స్వరాజ్యమైదానం, 48 ఎకరాలు, ఇరిగేషన్ క్వార్టర్స్ విలువలను తెలియజేయాలని కోర్టు ఆదేశించే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే ఉద్దేశంతో అందుకు కావాల్సిన నిధుల సేకరించేందుకు కాంట్రాక్టర్‌తో కుమ్మకై ఈ కుట్రపన్నారని విమర్శించారు. స్వరాజ్య మైదాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ న్యాయపోరాటం చేస్తుందని నేతలిద్దరూ స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాకు వరప్రదాయని అయిన పులిచింతల ప్రాజెక్టును 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతింటున్న చంద్రబాబు... విజయమాల్యా, నీరవ్ మోదీలా పారిపోయేందుకే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఇంద్ర భవనంలాంటి ఇల్లు, సింగపూర్‌లో హోటల్ కట్టుకున్నారని గుర్తు చేశారు. ఆయన భార్య నారా భువనేశ్వరి దేశంలోని ధనవంతుళ్లలో ఒకరిగా, రాష్ట్రంలో టాప్ టెన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత ఆస్తి ఈ నాలుగేళ్లల్లో ఎలా సంపాదించారో తెలియజేస్తే ప్రజలు కూడా ఆ విధంగా వ్యాపారం చేస్తారని హితవుపలికారు. -
చంద్రబాబు పార్టీ డ్రామాల పార్టీ
-
దుర్గగుడిలో తాంత్రిక పూజలు: తెరవెనుక టీడీపీ ఎమ్మెల్సీ!
సాక్షి, విజయవాడ: కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో బుద్ధా వెంకన్న తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే అమ్మవారి అభరణాలు చోరీకి గురయ్యాయని అన్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. గుడి పవిత్రతను టీడీపీ నేతలే దెబ్బతీస్తున్నారని, హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. దుర్గగుడే కాదు.. అన్ని ప్రధాన ఆలయాల సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అమ్మవారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా దుర్గగుడిలో శాంతిపూజలు జరిపించాలని ప్రభుత్వానికి సూచించారు. పులివెందులలో సీఎం చంద్రబాబు సభ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి చేతిలోని మైక్ లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన తప్పు ఏంటి, నిజాలు మాట్లాడితే తట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఒక ఎంపీపై రౌడీషీటర్లతో దాడికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అన్నారు. -
టీడీపీ నేతలకు అంత భయమెందుకు?
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుకు లోబడే వైఎస్ జగన్ పాదయాత్ర ఉంటుందని, నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట రాదని, డిప్యూటీ సీఎం చినరాజప్ప ముందే ఎలా చెప్పారు?. చినరాజప్ప వ్యాఖ్యలను సీబీఐ కోర్టు సుమెటోగా స్వీకరించాలి. వైఎస్ జగన్ పాదయాత్ర అంటే టీడీపీ నేతలకు భయమెందుకు?. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు. తెలంగాణలో ఫోన్‌కాల్ ఆధారంగా మాజీమంత్రి శ్రీధర్ బాబుపై కేసుపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబుపై కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు?. రేవంత్ రెడ్డి ఆరోపణలపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్‌ను విమర్శించడమే టీడీపీ నేతలకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారింది. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేయకూడదా?. టీడీపీ నేతలు తమ స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.’ అని వారు హెచ్చరించారు. -
టీడీపీ నేతలకు అంత భయమెందుకు?
-
'మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు విఫలం'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు నాయుడు సర్కారు విఫలం అయ్యిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జాతీయ మహిళ పార్లమెంటరీ సదస్సు పేరుతో హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
'కాల్‌మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి'
విజయవాడ: కాల్‌మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారిద్దరూ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ కేసుల పేరుతో పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాల్‌మనీ కేసులపై అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. -
'ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం అనైతికం'
విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీల్లో చేరవచ్చునని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారన్నారు. వైఎస్ జగన్ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేను రాజీనామా చేయించకుండా టీడీపీలోకి చేర్చుకోవడం అనైతికమని వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు.