సాక్షి, విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్యెల్యేలు కరణం ధర్మశ్రీ, మల్లాది విష్ణు, కోన రఘుపతి, భూమన కరుణాకర్ రెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ స్వామి వారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదం పొందారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా కానున్నారు.
ఈ సందర్భంగా చినముషిడివాడలో భక్తులు విశేష ఏర్పాట్లు చేశారు. ఏటా నాగుల చవితి పర్వదినాన స్వామీజీ జన్మదినోత్సవాన్ని జరపడం ఆనవాయితీ. స్వధర్మ సంరక్షణే లక్ష్యంగా.. భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు కృషిచేస్తున్న నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను ధర్మపరిరక్షణ దినోత్సవంగా, భారతీయ పునర్‌వైభవ పర్వదినంగా జరపనున్నట్లు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెల్లడించారు. పీఠం కేంద్రంగా విశాఖపట్నం, హైదరాబాద్, న్యూఢిల్లీ తదితర నగరాలతో పాటు.. దేశంలోని పలుచోట్ల స్వామి భక్తులు ఉచిత వైద్యశిబిరాలు, అన్నదానం, వస్త్రాల వితరణ తదితర సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. శ్రీ శారదాపీఠం చారిటబుల్ ట్రస్టు, భక్తులు సంయుక్తంగా భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment