
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్‌లు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మాజీలు భూ కబ్జాలకు పాల్పడి.. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజం చెబితే చంద్రబాబుకు శాపం కాబోలు అన్నీ అబద్దాలే చెబుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ దుయ్యబట్టారు (చదవండి:పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక ఎన్నికలు)
25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు: విజయసాయిరెడ్డి
ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదన్నారు. ఒడిశా అనుమతి ఇచ్చినా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు (చదవండి: పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి)