bauxite Mines
-
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..
వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి బొల్లికొండ ఫణికుమార్: అది రక్షిత అటవీ ప్రాంతం. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. దాని పైనే ఉంది చిన్న గిరిజన గ్రామం వంతాడ. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేది. ఇప్పుడు ఆ కొండపై ప్రతి చోటా లోయలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వందల మీటర్ల లోతుకు తవ్వి వదిలేసిన ఎర్రమట్టి లోయలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మెరిసే మట్టే అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం. అక్కడే లేటరైట్ కూడా ఉంది. వాటిపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. అంతే అడవి స్వరూపమే మారిపోయింది. ఐదేళ్లలో ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖనిజాన్ని తవ్వేశారు. లేటరైట్‌తోపాటు దాని పేరు చెప్పి వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అమ్మేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్టులోని గిరిజనాపురం, లింగంపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ తవ్వకాలు జరిగాయి. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. టీడీపీ హయాం.. అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగం 2013లో కేంద్రం నుంచి అండ్రు మినరల్స్ సంస్థ వంతాడ పరిసరాల్లోని 200 ఎకరాల డిఫారెస్టేషన్కి అనుమతి సంపాదించింది. అదే సంవత్సరం డిసెంబర్ 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విడగొట్టి 8 లేటరైట్ లీజులు మంజూరు చేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో టీడీపీ అధినేతకు తెరచాటు సంబంధాలు ఉండడంతో ఈ డిఫారెస్టేషన్ ప్రక్రియ సాధ్యమైంది. లీజుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే వాటిని ఇచ్చేశారు. అనంతరం కొద్ది కాలానికే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ అడవిని ఊహించని స్థాయిలో కొల్లగొట్టేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగంలా నడిచింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో సన్నిహితంగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయారు. పరిధి దాటి అడవిని కబళించినా, గిరిజనుల కడుపు కొట్టినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఒకే కుటుంబంలో 8 మందికి ఎడాపెడా లీజులు ఒక కుటుంబంలో పది మంది ఉంటే ప్రభుత్వం ద్వారా ఎంత మందికి లబ్ధి ఉంటుంది. ఉంటే ఒకరో, ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ పథకాలు వర్తిస్తాయా? అర్హత ఉన్నా అందరికీ లబ్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. పేదల కోసం అమలు చేసే పథకాలు, ఉపాధి కల్పించే ఉద్యోగాలకే బోలెడు నిబంధనలుంటాయి. అలాంటిది ఒకే కుటుంబంలో 8 మందికి మైనింగ్ లీజులు ఇస్తే.. అదీ అత్యంత విలువైన లేటరైట్ లీజులు.. బరితెగించి ఇలా లీజులు ఇప్పించింది చంద్రబాబే. అండ్రు మినరల్స్ యజమాని అండ్రు రమేష్‌బాబు. ఆయన పేరుతో ఒక లీజు మంజూరు చేశారు. ఆయన భార్య అండ్రు సుజాత పేరుతో మరో లీజు. రమేష్‌బాబు దగ్గరి సోదరుడు (పెదనాన్న కుమారుడు) శ్రీనివాస్ పేరుతో మరో లీజు. శ్రీనివాస్ తల్లి సత్యవతి, భార్య ఉషారాణి పేరుతో రెండు లీజులు. వీరి దగ్గరి బంధువులైన మన్యం వెంకటేశ్వరరావు, మన్యం వెంకట రజని, వెంపాటి వీర్రాజులకు మరో మూడు లీజులు. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఎడాపెడా లేటరైట్ లీజులు ఇచ్చేశారు. ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా లీజులు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. గనుల శాఖలో వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక కుటుంబానికి అన్ని లీజులు మంజూరు చేయడంలోనే కుమ్మక్కు స్పష్టమవుతోంది. ఐదు రెట్లు ఎక్కువ ఖనిజం అక్రమంగా తరలించారు! అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వినట్లు రికార్డుల్లో చూపింది అండ్రు మినరల్స్. దానికి రూ.88.30 కోట్ల సీనరేజి ఫీజు కట్టింది. నిజానికి దాని కంటే నాలుగైదు రెట్ల ఎక్కువ ఖనిజాన్ని అనధికారికంగా తవ్వి తరలించినట్లు భావిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చూసిన మైనింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ఎ గ్రేడ్ (మెటలర్జికల్) లేటరైట్ మెట్రిక్ టన్ను రూ.200, బి గ్రేడ్ (నాన్–మెటలర్జికల్) లేటరైట్ టన్ను రూ.100కిపైగానే ఉంది. ఎ గ్రేడ్ లేటరైట్‌ను 30 శాతం, బి గ్రేడ్ లేటరైట్‌ను 70 శాతం తరలించారు. దీని విలువ వందల కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దోచేసింది వేల కోట్లు ! పైకి లేటరైట్ అని చూపిస్తున్నా అదంతా బాక్సైట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టింది. అండ్రు మినరల్స్ చేసిన ఎగుమతుల్ని బట్టి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వేదాంత లిమిటెడ్ (ఒడిశా)కు ఐదేళ్లలో 32 లక్షల టన్నుల ఖనిజాన్ని సరఫరా చేసినట్లు ఈ కంపెనీ రికార్డుల్లో చూపింది. వాస్తవానికి ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అండ్రు కంపెనీ లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వేసి అమ్మేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే చైనాకు ఎగుమతి చేసిన 4.5 లక్షల టన్నుల ఖనిజం కూడా బాక్సైట్ అని భావిస్తున్నారు. బాక్సైట్ టన్ను రేటు మార్కెట్లో రూ.500 నుంచి వెయ్యి వరకు ఉంటుంది. ఈ లెక్కన అండ్రు మినరల్స్ లేటరైట్ ముసుగులో బాౖMð్సట్‌ను అమ్మి రూ. వేల కోట్లను అక్రమంగా సంపాదించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గనుల్లో తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో రెండు స్టాక్ యార్డ్లు నిర్వహించారు. అందులో రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే క్రషింగ్ యూనిట్లు పెట్టారు. అక్కడే లేటరైట్‌ను ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి అమ్ముకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వేశారు.. అవి కనపడకుండా పూడ్చి మొక్కలు నాటారు.. కేటాయించిన లీజు ప్రాంతం 200 ఎకరాలే అయినా దాన్ని దాటి తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బ్లాకులో (మొత్తం 8 బ్లాకులు) 25 ఎకరాలే వాళ్ల పరిధి. ఆ మార్కింగ్ లోపే తవ్వకాలు జరపాలి. కానీ దాన్ని దాటి అదనంగా ప్రతి బ్లాకులో 5 నుంచి 10 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్లాకులతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల విడిగా కూడా తవ్వేశారు. ఇలా 50 ఎకరాల కంటే ఎక్కువ అడవిని తొలిచేశారు. ఈ అక్రమ తవ్వకాలు బయటపడకుండా గొప్ప పన్నాగమే పన్నింది అండ్రు కంపెనీ. తవ్వేశాక మిగిలిన పనికిరాని రాళ్లు, మట్టితో ఆ గోతులను పూడ్చేశారు. తవ్వకాల పరిమాణం తెలియకుండా నాటిన నీలగిరి చెట్లు వాటిపై మళ్లీ మొక్కలు నాటేశారు. దీంతో అనధికారికంగా తవ్వకాలు జరిపిన చోట్ల ప్రస్తుతం మొక్కలే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎంత పరిమాణంలో అక్రమ తవ్వకాలు జరిగాయో కనిపెట్టడం అధికారులకు సాధ్యం కావడంలేదు. మైనింగ్ శాఖ నిర్వహించే సాధారణ డీజీపీఎస్, ఈటీఎస్ సర్వేలతో ఎంత తవ్వారో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్ తవ్వకాల్లో ఇదో కొత్త టెక్నిక్‌గా అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల తనిఖీలు చేసినా అక్రమాలు బయటపడకుండా ఉండేలా అండ్రు మినరల్స్ తన పలుకుబడిని, ఆర్థిక బలాన్ని ఉపయోగించింది. అధిక లోడుతో లారీల తరలింపు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ప్రతిరోజు వందలాది లారీల్లో ఖనిజాన్ని తరలించారు. తవ్విన చోటు నుంచి స్టాక్ యార్డుకు ఒక్కో లారీ ప్రతిరోజూ 25 నుంచి 30 ట్రిప్పులు తిరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఒక లారీలో 12 టన్నుల ఖనిజాన్ని తరలించడానికే అనుమతి ఉంది. కానీ దానికి రెట్టింపు ఖనిజాన్ని లారీలో వేసేవారు. ఒకోసారి 30 టన్నులు కూడా లారీలో ఉండేదని సమాచారం. ఎప్పుడైనా మైనింగ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రం 12 టన్నులే వేసేవారు. ఆ తర్వాత మామూలే. మైనింగ్ నిబంధనల ప్రకారం తవ్విన ఖనిజాన్ని తరలించే లారీకి పర్మిట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ లారీలో ఎంత పరిమాణం ఉందనేది చూడరు. దీన్ని ఆసరాగా తీసుకుని అండ్రు కంపెనీ పరిమితికి మించి ఇష్టానుసారం ఖనిజాన్ని తవ్వేసి తరలించేసింది. ఇప్పటికే స్టాక్ యార్డుల్లో రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు జరిమానా వసూలు చేయాల్సివుంది. అటవీ శాఖకు యూజర్ చార్జీలు ఎగనామం తవ్వకాలు జరిపిన ప్రాంతం అంతా రిజర్వు ఫారెస్టు. అటవీ భూమిని మైనింగ్ కోసం కన్వర్ట్ చేసుకున్నారు. ఇలా చేసిన అటవీ భూమిలో తవ్విన ఖనిజానికి టన్నుకు రూ.10 అటవీ శాఖకు యూజర్ చార్జీగా చెల్లించాలి. 2013లో జీఓ నంబర్ 63 ప్రకారం ఈ యూజర్ చార్జీలు కచ్చితంగా కట్టాల్సిందే. అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్ తవ్వారు. దానిపై యూజర్ చార్జీల కింద రూ.8.3 కోట్లకుపైగా అటవీ శాఖకు చెల్లించాల్సి వుంది. కానీ ఆ చార్జీలను కూడా అండ్రు మినరల్స్ కట్టలేదు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అటవీ శాఖాధికారులు కూడా దీనిపై నోరు మెదపలేకపోయారు. అండ్రు మినరల్స్ తవ్విన ఖనిజాన్ని నిల్వ చేసే స్టాక్ యార్డ్ టీడీపీ మళ్లీ వస్తే ఇంకా కుమ్మేయడానికి స్కెచ్ ఐదేళ్లలో అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసిన అండ్రు కుటుంబం టీడీపీ పెద్దల దన్నుతో అడవిని ఇంకా తవ్వేయడానికి ప్రణాళిక రూపొందించింది. 2019 ఎన్నికల్లోను మళ్లీ టీడీపీ గెలుస్తుందని అప్పుడు ఇంకా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో అదే ప్రాంతంలో మరిన్ని లీజులకు దరఖాస్తు చేసుకుంది. ఈసారి వంతాడ గ్రామం వెనుక ఉన్న అడవిని సర్వే చేసి హద్దులు కూడా నిర్ణయించింది. సుమారు 600 ఎకరాలను లీజుకు తీసుకునేందుకు మైనింగ్ శాఖకు దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుమతులు కూడా తెచ్చుకుని య«థేచ్ఛగా తవ్వకాలు చేసేవారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. మైనింగ్ కోసం వంతాడ కొండపై రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. మైనింగ్‌కు అనుమతి ఉన్నా రోడ్డు వేయడానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రోడ్డు కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా అది అధికారులను ప్రలోభపెట్టి తీసుకున్నట్లు చెబుతున్నారు. రిజర్వు ఫారెస్టులో అండ్రు సంస్థ నిర్మించిన రోడ్డు రక్షణ చర్యలూ లేవు మైనింగ్ ప్రాంతంలో పెద్దగా రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ చేసే చోట, స్టాక్ యార్డుల్లో సుమారు 500 మంది పనిచేసేవారు. ఖనిజాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాల సిబ్బంది వందల సంఖ్యలో ఉండేవారు. వారికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పని చేయించుకున్నారు. రాత్రి సమయాల్లో వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని చెబుతున్నారు. పనిచేసే వారిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అధికారం అండతో మైనింగ్ చేసే చోట తీసుకోవాల్సిన కనీస చర్యల్ని అండ్రు కంపెనీ తీసుకోలేదని చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి ఇవ్వలేదు.. అక్కడి రోడ్లను నాశనం చేశారు మరోవైపు మైనింగ్ జరిగే ప్రాంతంలో ఉన్న వంతాడ గ్రామవాసులకు పెద్దగా ఉపాధి కల్పించలేదు. అతికొద్ది మందికి మాత్రమే చిన్నచిన్న పనులు ఇచ్చినా ఎక్కువ మందిని బయట ప్రాంతం నుంచే తీసుకువచ్చారు. దీంతో వందల కోట్ల విలువైన ఖనిజాన్ని ఆ ప్రాంతం నుంచి తరలించుకుపోయినా అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఐదేళ్లపాటు ఓవర్ లోడు వాహనాలను నిరంతరాయంగా నడపడంతో ఆ ప్రాంతంలో రోడ్లు నాశనమయ్యాయి. స్టాక్ యార్డులో నిల్వ ఉన్న ఖనిజం లంపకలోవ–ప్రత్తిపాడు రోడ్డు చిద్రమైపోయింది. చివరికి ఖనిజాన్ని తరలించే టిప్పర్లు కూడా వెళ్లడం కష్టంగా మారడంతో అండ్రు కంపెనీ కోసం టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.12 కోట్లతో రోడ్డు మంజూరు చేసి నిర్మించింది. అనుమతి లేకుండా పెదశంకర్లపూడి వద్ద ఏలేరు ఎడమ కాలువ గట్టును మైనింగ్ వాహనాల రాకపోకలకు వినియోగించింది. దీనివల్ల కాలువ గట్టు ధ్వంసమై కుంగిపోయింది. పెద శంకర్లపూడి వద్ద ఏలేరు కాలువపై ఉన్న వంతెన అండ్రు లారీల రాకపోకలతో కుంగిపోయింది. మైనింగ్ తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్యంతో గిరిజనులు సాగు చేసే తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటలు, సీతాఫలం దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు మైనింగ్ కోసం ఈ ప్రాంతంలో నీటి వనరులను అండ్రు సంస్థ పెద్దఎత్తున వినియోగించింది. బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేసింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. అండ్రు మినరల్స్ జరిపిన ఖనిజ తవ్వకాలు.. వృత్తంలో అక్కడే వదిలేసిన యంత్రాలు ఎవరీ అండ్రు.. అండ్రు మినరల్స్ యజమాని రమేష్‌బాబు. తన ఇంటి పేరుతోనే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. గతంలో అక్కడ స్టోన్ క్వారీలు ఉండేవి. క్రషర్లు నిర్వహించేవారు. క్రషర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2013లో తన కుటుంబ సభ్యుల పేరు మీదే లేటరైట్ లీజులు తీసుకున్నారు. పూర్తిగా లేటరైట్ మైనింగ్‌పైనే దృష్టి పెట్టారు. రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం పెట్టారు. టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తో సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. చిన్న క్రషర్ యజమాని ఇప్పుడు మైనింగ్ ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లు మైనింగ్ రంగంలో ఉన్న పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేశ్ అండతోనే. టీడీపీ హయాంలో స్వయంగా లోకేశ్ ఈ లీజుల్లో తవ్వకాలను పర్యవేక్షించేవారని సమాచారం. స్థానిక టీడీపీ నేతలు, కొందరు మంత్రులకు ఈ తవ్వకాల్లో భాగమున్నట్లు చెబుతున్నారు. లారీలు తిరుగుతూనే ఉండేవి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వేవాళ్లు. పెద్ద టిప్పర్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఆ క్వారీలు లేకముందు అంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి గోతులున్నాయి. ఆ క్వారీల వల్ల మా పిల్లలకు ఏమైనా ఉద్యోగాలిప్పిస్తారనుకున్నాం. అది కూడా లేదు. పెద్ద మిషన్లతో తవ్వుతుంటే మట్టితో మా తోటలు పాడైపోయేవి. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండిపోయాం. – మాతే బాలమ్మ, వంతాడ ఇక్కడ ఖనిజం తవ్వుకున్నారు.. ఇక్కడ ఉద్యోగాలివ్వలేదు మా కొండపై ఐదేళ్లు ఎర్రమట్టి తవ్వుకుని వెళ్లారు. దానికి చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. మా ఏరియా మట్టితో కోట్లు సంపాదించినోళ్లు మా ఊర్లో పది మందికి కూడా ఉద్యోగాలివ్వలేదు. గట్టిగా మాట్లాడిన నలుగురైదుగురిని సూపర్వైజర్లుగా పెట్టుకున్నారు. క్వారీలు రాకముందు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది జరగలేదు. మా పంటలు పాడైపోయాయి. ఉపాధి తగ్గిపోయింది. – కుడే రాంబాబు, వంతాడ ఇష్టానుసారం తవ్వుకున్నారు మా ప్రాంతంలో ఖనిజాన్ని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లారు. కానీ మా ప్రాంతాలను పట్టించుకోలేదు. అండ్రు కంపెనీ లారీల వల్ల మా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వంతెనలు కుంగిపోయాయి. ఆ లారీల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పాడైన రోడ్లు బాగు చేస్తామన్నారు కానీ చేయలేదు. – అన్నిక సత్తిబాబు, ఇ.గోకవరం, ప్రత్తిపాడు మండలం ప్రాథమికంగా అక్రమాలు బయటపడ్డాయి.. అండ్రు మినరల్స్ తవ్వకాలపై చాలా ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణకు ఆదేశించాం. అందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. స్టాక్ యార్డులో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం లెక్కకు మించి ఉంది. దీంతో ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాం. తవ్విన చోట మళ్లీ పూడ్చి మొక్కలు నాటారు. దీంతో అసలు ఎంత తవ్వారో తెలియడంలేదు. అందుకే త్రీ డైమెన్షన్లో డ్రోన్ సర్వే చేయాలని నిర్ణయించాం. ఈ కంపెనీ తవ్వకాలు జరపకముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు శాటిలైట్ చిత్రాలను తెప్పిస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ డైరెక్టర్ ఇవీ చదవండి: Andhra Pradesh: పోలవరం.. శరవేగం ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
ఆండ్రూ మినరల్స్ తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్‌లో ఆండ్రూ మినరల్స్ జరిపిన లేటరైట్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. తవ్విన లేటరైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పారు. తమ శాఖలోని 5 విజిలెన్స్ బృందాలు ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో అక్రమాలు బయటపడినట్లు చెప్పారు. దీంతో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించినట్లు తేలిందన్నారు. వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే.. ఆండ్రూ మినరల్స్‌కు 2013లో రిజర్వు ఫారెస్టులో గిరిజనాపురం, లింగంపర్తి పరిధిలో ఆండ్రు శ్రీనివాస్ ఇతరుల పేరు మీద ఎనిమిది లేటరైట్ లీజులు మంజూరయ్యాయి. అక్కడ తవ్విన ఖనిజం కోసం తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో స్టాక్ యార్డ్లు నిర్వహిస్తున్నారు. అక్కడ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి అల్యూమినియం, సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని యార్డులలో నిల్వ చేసినట్లు తనిఖీ బృందాలు నిర్ధారించాయి. ఈ ఖనిజాన్ని ఒడిశాలోని కలహండి జిల్లా లింజిఘడ్లోని వేదాంత లిమిటెడ్, సెసా స్టెరిలైట్ లిమిటెడ్ కంపెనీలకు అలూమినియస్ (మెటలర్జికల్ గ్రేడ్)ను ఆండ్రూ మినరల్స్ సరఫరా చేసింది. ఫెర్రూజినియస్ (నాన్ మెటలర్జికల్ గ్రేడ్) లేటరైట్‌ను కూడా కొన్ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసింది. 30:70 నిష్పత్తిలో మెటలర్జికల్, నాన్ మెటలర్జికల్ గ్రేడ్ లేటరైట్‌ను సరఫరా చేశారు. స్టాక్ యార్డుల్లో గుర్తించిన 2 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్‌లో 60 వేల టన్నులు మెటలార్జికల్ గ్రేడ్, మిగతాది నాన్ మెటలార్జికల్ గ్రేడ్ ఉంది. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు చెల్లించాలి. వేదాంతకు 32.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి వేదంత లిమిటెడ్ (ఒడిశా)కు 2014–15 నుంచి 2018–19 జనవరి వరకు ఆండ్రూ మినరల్స్ 32,75,815 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను సరఫరా చేసింది. ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ ఖనిజాన్ని వినియోగిస్తారు తప్ప లేటరైట్‌ను కాదు. లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని ఆండ్రూ మినరల్స్ సరఫరా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. చైనాకు 4,65,342 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఎగుమతి చేశారు. చైనాకు ఎగుమతి చేసింది లేటరైటా లేక ఆ పేరుతో బాక్సైట్‌ను పంపిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లేటరైట్, బాక్సైట్ మధ్య చాలా స్వల్ప తేడా ఉంటుంది. సిలికా కంటెంట్ 38%లోపు ఉంటే లేటరైట్, అంతకంటే ఎక్కువ ఉంటే బాక్సైట్‌గా నిర్ధారిస్తారు. ప్రాథమిక తనిఖీల్లోనే ఆండ్రూ మినరల్స్ గ్రూప్ మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ అయింది. అందుకే ఆ సంస్థ మైనింగ్ కార్యక్రమాలన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఈటీఎస్ లేదా డీజీపీఎస్తోపాటు డ్రోన్లతో సర్వే చేయిస్తాం. తద్వారా ఆ కంపెనీకి నిర్దేశించిన ప్రాంతంలోనే మైనింగ్ చేశారా లేక సరిహద్దులను అతిక్రమించి మైనింగ్ చేశారా అన్నది తేలుస్తాం. మైనింగ్ ప్రదేశంలో భద్రత, రక్షణ నిబంధనలు, పేలుడు పదార్థాల లైసెన్స్‌లను పరిశీలిస్తాం. అన్ని క్లియరెన్స్‌లు ఉన్నాయా, పర్యావరణ విభాగం అనుమతించిన మైనింగ్ ప్రణాళిక ప్రకారమే పనులు చేస్తున్నారా, అన్ని అకౌంట్లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా? వంటి విషయాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేదు రాష్ట్రంలో ఇసుక కొరత లేదని ద్వివేది చెప్పారు. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో 60 లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు. డిపోల వారీగా రవాణా చార్జీల్లో స్వల్ప మార్పులు చేస్తామని, ఆ వివరాలను త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెడతామని తెలిపారు. డీజిల్ రేటు పెరిగితే స్వల్పంగా రేటు పెరుగుతుందని, తగ్గితే రేటు తగ్గుతుందన్నారు. 30›% స్టాక్ యార్డుల్లోనే రేటు స్వల్పంగా పెరుగుతుందన్నారు. -
తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 2010 నుంచి 2014 వరకు లేటరైట్‌కు ఆరు లీజులిచ్చారని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 5 మెట్రిక్ టన్నుల మైనింగ్ చేస్తే రూ.15వేల కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది?. తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం. జగనన్న కాలనీలకు ఎక్కడా ఇసుక కొరత లేదు. రోజూ 2లక్షల టన్నుల ఇసుక ఉత్పత్తి చేస్తున్నాం. 40 కి.మీ.లోపల ఉన్నవారు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు’’ అని అన్నారు. -
‘ఉనికి కోసమే టీడీపీ దుష్ప్రచారం’
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్‌లు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మాజీలు భూ కబ్జాలకు పాల్పడి.. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజం చెబితే చంద్రబాబుకు శాపం కాబోలు అన్నీ అబద్దాలే చెబుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ దుయ్యబట్టారు (చదవండి:పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక ఎన్నికలు) 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు: విజయసాయిరెడ్డి ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదన్నారు. ఒడిశా అనుమతి ఇచ్చినా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు (చదవండి: పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి) -
‘చంద్రబాబుకు పిచ్చిపట్టింది’
సాక్షి, తిరుపతి: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది తామేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు కోవడం సిగ్గుచేటని ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదు జీవోలు ద్వారా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు చేసిన తప్పు వలన ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతుల్లో చనిపోయారని చెప్పారు. చంద్రబాబు అండ్‌కోకు పిచ్చి బాగా ముదిరిపోయిందని.. మెంటల్ ఆసుప్రతుల్లో చేర్పించాలని ఎద్దేవా చేశారు. (చదవండి: బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ) -
బాక్సైట్ తవ్వకాలకు సర్కారు నో
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో జరిపే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి తేల్చి చెప్పింది. బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ నడుస్తున్నందున లండన్ ఆర్బిట్రేషన్‌ను (మధ్యవర్తిత్వం) నిలుపుదల చేయించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని రాష్ట్ర గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతినిధి బృందం ఈ మేరకు పీఎంవోకు విజ్ఞప్తి చేసింది. విశాఖపట్నం ఏజెన్సీలో మైనింగ్ లీజులు, ఇతర అనుమతులన్నీ లభిస్తే అక్కడ తవ్వే ఖనిజాన్ని సరఫరా చేస్తామంటూ ఏపీఎండీసీ గతంలో ఆన్‌రాక్ జాయింట్ వెంచర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారడం, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండ్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఏపీఎండీసీ రద్దు చేసుకుంది. ఈ మేరకు ఏపీఎండీసీ, ఆన్‌రాక్, రస్ ఆల్ ఖైమా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ఆన్‌రాక్ సంస్థ హైకోర్టులో సవాల్ చేయగా, విచారణ కొనసాగుతోంది. మరోవైపు దుబాయ్‌కు చెందిన ఆన్‌రాక్ భాగస్వామ్య సంస్థ రస్ ఆల్ ఖైమా సంస్థ లండన్ కోర్టులో ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. బాక్సైట్ ఖనిజం సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల తాము నష్టపోయామని, అందుకు భారత ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. దీనిపై ఏడాదిగా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో పీఎంవో రాష్ట్ర అధికారులను పిలిపించి వివరాలు కోరింది. ఆగస్టు 5న లండన్‌లో ఆర్బిట్రేషన్‌కు రావాలని లండన్ కోర్టు నుంచి ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ అందిన నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడం కోసం పీఎంవో అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పిలిపించారు. ‘ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు, అందుకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనకు సంబంధించి సమగ్ర పత్రాలు పంపించండి’ అని ప్రధాని కార్యాలయం రాష్ట్ర అధికారులకు సూచించింది. ‘మైనింగ్ లీజులతోపాటు అన్ని అనుమతులు లభిస్తే ఖనిజాన్ని తవ్వి ఆన్‌రాక్, రస్ ఆల్ ఖైమాకు సరఫరా చేస్తామని ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. అయితే, కొన్ని అనుమతులు రాలేదు. దీనివల్ల లీజులు ల్యాప్స్ అయ్యాయి. అందువల్ల ఖనిజాన్ని సరఫరా చేయలేకపోయినందుకు ఏపీఎండీసీ నష్టపరిహారం చెల్లించాల్సిన పనిలేదు’అని సీఎస్ వివరించారు. దీనిని బలపరిచేలా ఆధారాలు పంపాలని పీఎంవో అధికారులు సూచించారు. -
బై.. బై! బాక్సైట్
సాక్షి, అరకులోయ/పాడేరు: తమ బతుకులను నాశనం చేసే బాక్సైజ్ తవ్వకాలు వద్దంటూ మన్యం ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా గత పాలకులు పట్టించుకోలేదు. గిరిపుత్రుల గోడును ఆలకించలేదు. టీడీపీ సర్కార్ ఏకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో 97ను సైతం జారీ చేసింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాక్సైట్ తవ్వకాలకు గుడ్‌బై చెబుతూ..సంబంధిత జీవోను రద్దు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. దీంతో గిరిపుత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. తమకు మంచి రోజులు వచ్చినట్లేనని మురిసిపోతున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అపారమైన బాక్సైట్ ఖనిజ సంపదను దోపిడీ చేసేందుకు 1970 నుంచి పాలకులు అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గిరిజనులంతా బాక్సైట్ తవ్వకాల చర్యలను నిరసిస్తూ గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గిరిజనుల ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కూడా గత పదేళ్ల నుంచి గిరిజనుల పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్‌కు అనుకూల జీవో నంబర్97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ సంబంధిత జీవో 97ను మాత్రం రద్దు చేయలేకపోయింది. దీంతో గిరిజనులు, గిరిజన సంఘాలు ఉద్యమం చేశాయి. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని పోరుబాట పట్టాయి. వారి పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత హోదాలో జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలో వైఎస్సార్సీపీ నాయకులు కూడా బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.2015 డిసెంబర్ 10వ తేదీన జరిగిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి, గిరిజనులకు మేలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తక్కువ రోజుల్లోనే తమ ప్రభుత్వం గిరిజనుల పక్షాన ఉందని నిరూపించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. దీంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్మోహన్రెడ్డికి గిరిజనులంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 75 కోట్ల టన్నుల బాక్సైట్ నిక్షేపాలు విశాఖ ఏజెన్సీలోని అరకులోయ మండలం గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్ల, తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తెడు అటవీ ప్రాంతాలలో 75 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో 27 బాక్సైట్ కొండలను గుర్తించారు. ఈ కొండలల్లో బాక్సైట్ తవ్వకాలు జరిపితే 270 గ్రామాల గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లోని అటవీ సంపద అంతా నాశనమవుతుందని, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఏజెన్సీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే ఒడిశాలోని దమన్‌జోడి ప్రాంతంలో నాల్కో సంస్థ గత పదేళ్ల నుంచి 48 లక్షల టన్నుల బాక్సైట్ ఖనిజ సంపదను తవ్వి తీయడంతో సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగవ్వగా.. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణ వేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని బాక్సైట్ ఖనిజ సంపదను తవ్వే చర్యలను తప్పుపట్టారు. గిరిజనులు కూడా ఉద్ధృతంగా పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించింది. బాక్సైట్ తవ్వకాల కోసం గత టీడీపీ సర్కార్ జారీ చేసిన జీవో 97ను వైఎస్ఆర్సీపీ సర్కార్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఆదివాసీ బిడ్డలను రక్షించే శక్తి జగన్ పెందుర్తి: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం గత ప్రభుత్వం కుట్రపూరితంగా జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు అన్నారు. ఆదివాసీ బిడ్డల జీవీతాలతో పాటు ఏజెన్సీలో పర్యావరణాన్ని రక్షించే శక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్ల విలువైన బాక్సైట్ తవ్వకాల కోసం తహతహలాడాయని గుర్తు చేశారు. కానీ ఆదివాసీ బిడ్డలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాల ఆటలు సాగలేదన్నారు. తొలినుంచీ బాక్సైట్ తవ్వకాల కోసం కుట్ర చేస్తున్న చంద్రబాబు 2000 మే 24న హైదారాబాద్‌లో నిర్వహించాల్సిన గిరిజన మండలి సమావేశాన్ని విశాఖలో నిర్వహించి ఏజెన్సీలో మైనింగ్ ఎవరైనా చేసుకోచ్చన్న తీర్మాణం చేయించడంతో పాటు ఎమ్మెల్యేలందిరితో బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. ఇలాంటి పరిణామాల మధ్యలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు ప్రకటన గిరిజన బిడ్డల గుండెల్లో హత్తుకుందన్నారు. బాక్సైట్ జీవో రద్దు ప్రకటన హర్షణీయం ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం మంచి పరిణామమని ఏయూ తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అన్నారు. గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ నిర్ణయం నిలుస్తోందన్నారు. 2015 నవంబరులో చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను విడుదల చేసిందని..దీని ద్వారా గిరిజన ప్రాంతంలో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయించారని అన్నారు. దీనిని నాటి నుంచి అనేక మంది గిరిజనులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేసిం దని, ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే 2015 నవంబరు 15న బాక్సైట్ వ్యతిరేకంగా ఆదివాసీ శాసన సభ్యులతో సమావేశం పెట్టినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు. జీవోకు వ్యతిరేకంగా తెడబారికి సురేష్‌కుమార్, సుర్ల లోవరాజు ఆమరణ నిరాహార దీక్షలకు సైతం దిగారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బాక్సైట్ జీవోను రద్దుచేస్తానని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సైతం ఆదివాసీల సంరక్షణ, భద్రతకు ప్రభుత్వ పెద్దపీట వేస్తుందని భావిస్తున్నామన్నారు. -
బాక్సైట్ లూటీకి సర్కారు ఎత్తుగడ!
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకుండా నాన్చిన ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ నేతలతో మండలిని నింపేయడంపై గిరిజన సంఘాల నేతలు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజన సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబడుతున్నారు. మూడేళ్లుగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సలహా మండలి ఊసెత్తని ప్రభుత్వం ఇప్పుడు తనవారిని మండలిలో నియమించడం స్వప్రయోజనాల కోసమేనని మండిపడుతున్నారు. విశాఖ మన్యంలో లక్షల కోట్ల విలువైన బాక్సైట్‌ను, గిరిజన ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని అంటున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్దేశించిన సలహామండలిలో గిరిజనేతరులను, టీడీపీ వారిని నియమించడాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తప్పుబట్టారు. దీనిపై కేంద్ర గిరిజన సంక్షేమ మండలికి ఫిర్యాదు చేస్తానని శర్మ చెప్పారు. బాక్సైట్ కోసం ఆనవాయితీకి విరుద్ధంగా రాష్ట్ర అత్యున్నత చట్టసభల్లో సభ్యులుగా ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధులను టీఏసీలో సభ్యులుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా, గిరిజన ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమిస్తూ 2009, 2012లో కూడా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటే గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో వారిని నియమించడం సాధారణంగా జరుగుతూ వస్తోంది. అడవిలో ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా గిరిజన సలహా మండలి తీర్మానం తప్పనిసరి. గతంలోలా గిరిజన ఎమ్మెల్యేలను మాత్రమే టీఏసీ సభ్యులుగా నియమిస్తే ప్రభుత్వం మాట చెల్లదు. ఎందుకంటే శాసనసభలో మెజారిటీ గిరిజన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందినవారు. వీరు సభ్యులుగా ఉంటే ప్రభుత్వం గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుకాదు. నిజానికి గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేకమార్లు డిమాండ్ చేశారు. గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం కూడా సమర్పించారు. జగన్ పోరాటం, కోర్టు జోక్యంతో మూడేళ్ల తర్వాత విధిలేక టీఏసీని ఏర్పాటు చేసింది. గిరిజన ఎమ్మెల్యేలకు అదనంగా... ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా ఆరుగురు వైఎస్సార్సీపీ వారే. వీరిలో అరకు ఎమ్మెల్యే కె. సర్వేశ్వరరావును టీడీపీ ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకుంది. టీడీపీ నుంచి ముడియం శ్రీనివాసరావు(పోలవరం) మాత్రమే ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నాన్ అఫిషియల్ సభ్యులు(లెజిస్లేటివ్ అసెంబ్లీ) కింద టీఏసీలో స్థానం కల్పించింది. అయితే వీరితో పాటు మరో ఎనిమిది మంది టీడీపీ ప్రతినిధులను నామినేటెడ్ సభ్యులుగా చేర్చింది. ఇందులో గుమ్మడి సంధ్యారాణి మాత్రం అధికార పక్ష ఎమ్మెల్సీగా ఉన్నారు. మిగిలిన ఏడుగురు (నిమ్మక జయకృష్ణ, జనార్దన్ థాట్రాజ్, మత్సరాస మణికుమారి, కేపీఆర్‌కే ఫణీశ్వరి, మునావత్ ధౠరు నాయక్, ఎం.జీవుల నాయక్, వేలూరు రంగారావు) టీడీపీ వారే. వాస్తవానికి జనార్దన్ థాట్రాజ్ ఎస్టీ కాదని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది. అయినా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఆయన్ను గిరిజన సలహా మండలిలో నియమించింది. -
బాక్సైట్ గనులపై బాబు గురి!
-
బాక్సైట్ గనులపై బాబు గురి!
కార్యాచరణ వేగవంతం చేసిన ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేకత బేఖాతరు అస్మదీయులతోనే గ్రామసభల ఏర్పాటుకు వ్యూహం బాక్సైట్ తవ్వకాలకు అనుమతులే అసలు లక్ష్యం ఒడిశా ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలతో ఏటా 3,600 కోట్ల ఆదాయం కానీ అందులో సర్కారుకు దక్కేది రూ.75కోట్ల రాయల్టీ మాత్రమే విశాఖ ఏజెన్సీలో మూడు గ్రూపుల కింద అరకు, చింతపల్లి ప్రాంతాల్లో 3,561 హెక్టార్లలో దాదాపు 564.9మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. విశాఖ ఏజెన్సీలో తవ్వకాలు చేపట్టిన కంపెనీకి ఏడాదికి 3,600 కోట్ల రూపాయల నికరలాభం వస్తుందని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) అంచనా. కానీ దీనిలో ప్రభుత్వానికి ఏడాదికి 75 కోట్ల రూపాయల రాయల్టీ మాత్రమే వస్తుంది. బాక్సైట్ ఖనిజాన్ని అల్యూమినియం ఉత్పత్తిలో వాడతారు. ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తి చేయాలంటే 5.6 టన్నుల బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అల్యూమినియం ఉత్పత్తి క్రమంలో 1.2 టన్నుల అత్యంత విషపూరితమైన రెడ్‌మడ్ కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనిపై గిరిజనులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది... గిరిజన ప్రాంతాలు, గిరిజనుల హక్కుల పరిరక్షణకోసం పీసా చట్టం ఉంటే మాత్రం లెక్కేముంది... గిరిజనులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గిరిజనుల చేతివేళ్లతోనే వారి కళ్లు పొడిచేందుకు ఆగమేఘాలమీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడూ ఈ గ్రామసభల గురించి పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. ఐటీడీఏ, ఏపీఎండీసీ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుపుతామని చెబుతున్నప్పటికీ, ఆ పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమే లక్ష్యమని తెలుస్తోంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో నెలరోజుల్లోనే గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఈ నెల 8, 9 తేదీలలో విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీంతో పాడేరు ఐటీడీయే అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌ను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 564.9 మిలియన్ టన్నులు విశాఖ ఏజెన్సీలో 564.9 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 75 సంవత్సరాలు తవ్వుకోవచ్చు. పీసా చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదం లేకుండా తవ్వకాలు సాధ్యంకాదు. దీంతో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులతోనే గ్రామ సభలను ఏర్పాటు చేసి, అనంతరం ఆ సభల ద్వారా తవ్వకాలకు ఆమోదం పొందేలా సర్కారు అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీలతోపాటు నాతవరం మండలంలోని నాలుగు పంచాయతీల పరిధిలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ పరిధిలో 3 నుంచి 7 వరకు గ్రామాలు ఉన్నాయి. అందుకే మొత్తం 288 పంచాయతీలలో సగటున పంచాయతీకి 3 చొప్పున దాదాపు 776 గ్రామసభలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆగస్టు 16న ఈ ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబర్ 9నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశారు. గతంలో బోల్తాపడ్డ ఒడిశా ప్రభుత్వం ఒడిశాలోని నియోమగిరి పర్వతాల్లో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాల తవ్వకాల కోసం ఒడిశా ప్రభుత్వం కూడా గ్రామసభలను మేనేజ్ చేసింది. తమ పార్టీ సానుభూతిపరులతో ఏర్పాటు చేసిన గ్రామసభల ఆమోదాన్ని పొంది వేదాంత సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చేసింది. కానీ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన గిరిజనులు సుప్రీంకోర్డును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో మళ్లీ గ్రామసభలు నిర్వహించగా అసలు వ్యవహారం బట్టబయలైంది. దాంతో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి వచ్చింది. మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ వేస్తే అలాంటి పరిణామమే పునరావృతమవుతుందని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయమూర్తి సమక్షంలోనే పారదర్శకంగా గ్రామసభలు తీర్మానం చేసేలా తాము ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నాయి. ఆనాడే చంద్రబాబు దొంగాట కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పరిశీలిస్తున్న సమయంలో గిరిజనులు, ప్రజాసంఘాలు ఉద్యమించాయి. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ ప్రజాసంఘాల నేతకు ఫోన్ చేసి తాను బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో కలసి పనిచేస్తానని చెప్పారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘‘మీరు అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు చేపట్టమని హామీ ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని మాతో ఉద్యమంలో కలుపుకుని వెళతాం’’అని ఆయన షరతు విధించారు. ఆ వెంటనే చంద్రబాబు మాటమార్చేసి అంతటితో ఆ ఫోన్ సంభాషణను అర్ధంతరంగా ముగించేశారు. ఆ ఉదంతాన్నే ఆ సామాజిక కార్యకర్త చెబుతూ చంద్రబాబు వైఖరి మొదటి నుంచీ అంతేనని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఒడిశాలో మాదిరిగానే ఇక్కడ కూడా తాము న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేస్తామని చెప్పారు. పీసా చట్టం ఏం చెప్తోంది? కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 1996లో పంచాయతీ(షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరీకరణ) చట్టాన్ని రూపొందించింది. దీన్నే పీసా చట్టం అంటారు. అందుకు అనుగుణంగా 1998లో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ (సవరణ) చట్టం చేసింది. ఆ ప్రకారం గ్రామసభలకు విశేష అధికారాలు అప్పగించింది. తదనుగుణంగా 2011లో ప్రభుత్వం ఈ విషయాన్ని గెజిట్‌లో కూడా పొందుపరిచింది. ఈ పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సంబంధిత పంచాయతీ సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కొందరు సభ్యులు ఉంటారు. గ్రామానికి ఒకరుచొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలపై ఈ గ్రామసభలకే విశేష అధికారాలు ఇచ్చారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజికవనరులు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం-విక్రయం తదితర అన్నింటిపైనా గ్రామసభలదే అంతిమ నిర్ణయం. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల పనితీరు, మద్యం దుకాణాల ఏర్పాటు, గనుల తవ్వకాలు, భూసేకరణ తదితర అన్నింటిపైనా నిర్ణయాధికారం గ్రామసభలదే. ఈ గ్రామసభల అనుమతి లేకుండా ఏదీ చేయడానికి వీల్లేదు.