swarupananda saraswati
-
రుషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో కలిసి మంత్రులు అమర్నాథ్, రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అమర్నాథ్, రోజా మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై 9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్టుల స్థానంలో ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. అత్యంత సుందరమైన విశాఖ నగరానికి తగ్గట్లుగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాలు సాగాయని తెలిపారు. పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ అనేక కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తిస్థాయి అనుమతులతో పూర్తిచేశామని వారు వివరించారు. విశాఖపట్నం రాజధానిగా చేయాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని ఆ కమిటీ సూచించిందని మంత్రి రోజా అన్నారు. అయితే, ఈ భవనాల్ని పూర్తిగా పర్యాటకం కోసం వినియోగించాలా? లేదా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ డా.ఎ. వరప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్మన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కె.రవిబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.రజత్‌భార్గవ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, జేసీ కె.మయూర్ అశోక్, పర్యాటక శాఖ ఆర్.డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వివరాలివీ.. ♦ నూతన రిసార్ట్స్ని 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చ.అడుగుల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా నిర్మించారు. ♦ అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజీ, నీటిసరఫరా, వీధిదీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ♦ 2021లో సీఆర్‌జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు. ♦ వేంగి–ఏ, బీ, కళింగ, గజపతి, విజయనగర ఏ, బీ, సీ బ్లాకులుగా మొత్తం ఏడు బ్లాక్‌లు నిర్మించారు. వీటిల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్‌రూమ్‌లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్‌ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారు. ♦ నీటి సరఫరా సౌకర్యం కోసం 150 కేఎల్, ఫైర్ సంప్, పైప్ నెట్‌వర్క్‌తో పాటు 100 కేఎల్ డొమెస్టిక్ సంప్ ఏర్పాటుచేశారు. ♦ వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం 100 కేఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా నిర్మించారు. ♦ 1,000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 2, 1010 కేవీఏ జనరేటర్లు 3, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ పనులు, వీధిదీపాలు ఏర్పాటుచేశారు. ♦ రిసార్ట్ అభివృద్ధికి స్థలం చదును చేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాలు.. ఇలా మొత్తం ప్రాజెక్టుకు రూ.365.24 కోట్లు ఖర్చుచేశారు. ♦ వేంగి–ఏ బ్లాక్‌లో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, సూట్ రూమ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నాయి. ♦ వేంగి–బీ బ్లాక్‌లో అతిథి గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్‌తో కూడిన బిజినెస్ హోటల్ ఉంది. ♦ కళింగ బ్లాక్‌లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, లగ్జరీ సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ♦ గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, వ్యాపార కేంద్రాలున్నాయి. ♦ విజయనగరం–ఏ, బీ, సీ బ్లాక్‌లలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లా సూట్స్, స్పా, ఫిట్నెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్స్ ఏర్పాటుచేశారు. -
గిరిజనులకు అండగా.. విశాఖ శ్రీ శారదా పీఠం
-
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన మహోత్సవం
-
చందానగర్‌లో ముగిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవాలు
-
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’
సాక్షి, విశాఖపట్నం: బాబ్రీ మసీదు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకమన్నారు. ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేశారు. 28 ఏళ్ళ నిరీక్షణకు తెరపడటం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ తీర్పుతో బాబ్రీ మసీదు వివాదానికి పూర్తిగా తెరపడిందని అభిప్రాయపడ్డారు. కేసులో ఉన్నవారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తరపున అభినందనలు తెలియజేశారు. చదవండి: బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే -
మహాపిరమిడ్ పిలుస్తోంది!
సాక్షి, కడ్తాల్(రంగారెడ్డి): మహేశ్వర మహాపిరమిడ్ .. మహిళా ధ్యాన మహాచక్రాలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం మహా పిరమిడ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడ్తాల్ –ఆన్మాస్పల్లి గ్రామాల సమీపంలో ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిర్మితమైన అద్భుత కట్టడం ఇది. ధ్యాన జనులకు స్వర్గ ధామంగా పిలవబడుతున్న మహా పిరమిడ్‌లో ఈసారి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహా చక్రాలను నిర్వహిస్తున్నారు. ఈ మహా పిరమిడ్‌లో ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ధ్యాన చక్రాలను నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం దేశ విదేశాల్లోని ధ్యానులు అంతా కలిసి ఒకే చోట ధ్యానం నిర్వహించే కార్యక్రమమే ధ్యాన మహాచక్రాలు అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది జనుల మధ్య వైభవంగా ధ్యాన సంబరాలు నిర్వహిసుంటారు. ఈ సంవత్సరం ది ఇండియన్ పిరమిడ్ స్ప్రిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు మహాపిరమిడ్‌లో మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక వసతి, వైద్యం, రవాణా సౌకర్యం, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం.. 32,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 113.6 మీటర్ల ఎత్తుగా, 6 వేలకు పైగా ధ్యానులు ఒకే సారి ధ్యానం చేసేందుకు వీలుగా బండరాళ్లు, ఇనుముతో నిర్మించారు. పిరమిడ్ నలువైపులా పచ్చని చెట్లతో అందంగా ముస్తాబైంది. ఈ నిర్మాణం ఒక అద్భుతమని ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ వారు గతంలోనే గుర్తించి రికార్డును అందజేశారు. ఆదే విధంగా పిరమిడ్ మధ్యలో కింగ్ చాంబర్ పాటు క్వీన్ చాంబర్ ఉన్నాయి. కింగ్ చాంబర్‌పై 500 మంది వరకు, క్వీన్ చాంబర్‌పై 250 మంది వరకు ధ్యానం చేయవచ్చు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే ప్రాణ శక్తి మూడురెట్లు అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ధ్యానులు నమ్మకం. వలంటీర్ల నియామకం ధ్యానులకు సేవలందించేందుకు వలంటీర్లను నియమించారు. పిరమిడ్ పరిసరాలలో వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం బాలకేంద్రంతో పాటు అఖంఢ ధ్యాన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు వసతి గృహాలు, కుటీరాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల మంది ధ్యానం చేసేందుకు వీలుగా భారి ప్రాంగాణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక తయారు చేశారు. సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల రాక.. ధ్యాన మహా చక్రాలకు విశాఖ శారదా పీఠాధి పతి, స్వరూపానంద సరస్వతీ, సత్యసాయి ధ్యాన మండలి గురూజీ భిక్షమయ్య, కుండలిని యోగి శేష్బట్టర్, సుదర్శనాచార్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద్, సిద్ధయోగి అంతర్ముఖానందా, స్వరయోగి మహామాతాజీ రుషికేశ్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజూ జరిగే కార్యక్రమాలివే.. రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణుగాన సంగీతం, అనంతరం సాముహిక ధ్యానం, సందేశం, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పాటు, ధ్యాన గురువుల, ఆధ్యాత్మిక, ధ్యాన సందేశాలు 11 రోజులపాటు జరుగుతాయి. ముమ్మర ఏర్పాట్లు మహిళా ధ్యాన మహాచక్రాల కోసం మహేశ్వర పిరమిడ్ వద్ద ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. దేశం నలువైపులా నుంచే కాక విదేశాల నుంచి ధ్యానులు రానుండటంతో, వారికి కావలసిన వసతులు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజూ వేలాదిగా ధ్యానులు పాల్గొననుండటంతో వారికి ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. -
‘తెలుగుతో పాటు ఆంగ్లం కూడా ముఖ్యమే’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలోనూ న్యాయం కోసం ఎంత పోరాటానికైనా వెనకాడని పీఠంగా శీ శారదా పీఠం ఉందని సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుతో పాటు తుని ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రభుత్వ వీప్ దాడిశెట్టి రాజాలు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వీప్, తదితరులు స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. -
శ్రీ శారదా పీఠాధిపతి జన్మదిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్యెల్యేలు కరణం ధర్మశ్రీ, మల్లాది విష్ణు, కోన రఘుపతి, భూమన కరుణాకర్ రెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ స్వామి వారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదం పొందారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా కానున్నారు. ఈ సందర్భంగా చినముషిడివాడలో భక్తులు విశేష ఏర్పాట్లు చేశారు. ఏటా నాగుల చవితి పర్వదినాన స్వామీజీ జన్మదినోత్సవాన్ని జరపడం ఆనవాయితీ. స్వధర్మ సంరక్షణే లక్ష్యంగా.. భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు కృషిచేస్తున్న నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను ధర్మపరిరక్షణ దినోత్సవంగా, భారతీయ పునర్వైభవ పర్వదినంగా జరపనున్నట్లు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెల్లడించారు. పీఠం కేంద్రంగా విశాఖపట్నం, హైదరాబాద్, న్యూఢిల్లీ తదితర నగరాలతో పాటు.. దేశంలోని పలుచోట్ల స్వామి భక్తులు ఉచిత వైద్యశిబిరాలు, అన్నదానం, వస్త్రాల వితరణ తదితర సేవాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. శ్రీ శారదాపీఠం చారిటబుల్ ట్రస్టు, భక్తులు సంయుక్తంగా భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. -
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి)కు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో జరిగిన ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు. (చదవండి: అధర్మం ఓడిపోతుందని ఆనాడే చెప్పాం) ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ మహోత్సవానికి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి.. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి పుష్పాభిషేకం చేశారు. సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడురోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిగింది. -
భగీరథ విలక్షణమైన రచయిత
‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు. ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు. -
అందరం భగవంతుడి సేవ చేద్దాం – మోహన్‌బాబు
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరే.. నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్‌ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయాలకు చైర్మన్లుగా రాజకీయ నిరుద్యోగులా?
పెందుర్తి: టీటీడీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు వ్యాపార కేంద్రాలుగా మారిపో యాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం రాజకీయ నిరు ద్యోగులను దేవాలయాలకు చైర్మన్లను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ లోని శారదాపీఠంలో ఎంపీ టి.సుబ్బరామి రెడ్డి సౌజన్యంతో తలపెట్టిన అతిరుద్ర, మహా చండీయాగానికి గురువారం స్వామీ జీ అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ దేశ శ్రేయస్సును కాంక్షించి ఈ మహా క్రతువులను తలపెట్టా మన్నారు. అరాచకాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు కనువిప్పు కలగడం లేదని ఆక్షేపించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను 33 ఏళ్లు, 99 ఏళ్లు అని లీజులకు ఇవ్వడం శోచనీయ మన్నారు. ఐదేళ్లు పదవిలోఉండే రాజకీయ నాయకులకు ఆ భూములపై పెత్తనం ఏమిటని.. ఆ భూములేమైనా వారి అబ్బ సొత్తా? అని ఘాటుగా ప్రశ్నించారు. యాగకర్త టి.సుబ్బరామిరెడ్డి, ఉత్తర పీఠాధి పతి బాలస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
'ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవు'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆధ్యాత్మిక విషయాలలో పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించకుండా, పక్కన పెట్టడం శోచనీయమని ఆయన అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందనే.. ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు.